బ్రహ్మముడి Nov 19th, 2025 బుధవారం ఎపిసోడ్: రాజ్ ప్లేస్ లో ఆఫీసులో రాహుల్ … !!! ఇంట్లో అపర్ణ, సుభాష్ ల పెళ్లి రోజు వేడుకలు … !!!
ఎపిసోడ్ ప్రారంభంలో రాజ్, రాహుల్‌కి చాలా స్పష్టంగా “ఇకపై నువ్వు తలదించుకునే పరిస్థితి రాకూడదు. ఇంక నువ్వు బాధ్యత తీసుకోవాలి” అని చెప్తాడు . అప్పుడే కావ్య వెళ్లి ఒక కవర్ తీసుకొని వచ్చి రాహుల్ చేతికి ఇస్తుంది. అది జాయినింగ్ లెటర్. రాజ్ “రేపటి నుంచి నువ్వు ఆఫీస్‌కు వెళ్లాలి నేను ఆఫీస్‌కు రావడానికి కొంత సమయం పడుతుంది. అప్పటి వరకు కంపెనీ వ్యవహారాలన్నీ నువ్వే చూసుకోవాలి” అని చెబుతాడు.

దాంతో దుగ్గిరాల కుటుంబం మొత్తం షాక్ అవుతుంది. రాజ్ “కంపెనీ బాధ్యతలు నీకే… రేపే వెళ్లి జాయిన్ అవ్వాలి” అని చెప్పడంతో రాహుల్ ఆశ్చర్యంతో “లేదు, రాజ్. నాకు ఇంత పెద్ద బాధ్యతలు వద్దు. 20 లక్షల రూపాయల బాధ్యత ఇచ్చినప్పుడు ఫెయిల్ అయ్యాను. ఇప్పుడు అంత పెద్ద కంపెనీ బాధ్యత నాపైన పెడితే ఎలా? ఇంట్లో వాళ్ళు కూడా అంగీకరించారు. వాళ్ల ఇష్టం లేకుంటే నేను ఆఫీస్ కు వెళ్లలేను” అని చెబుతాడు.
అప్పుడు కావ్య ముందుకు వచ్చి “నువ్వు 20 లక్షల విషయంలో ఫెయిల్ కాలేదు. నీ నిజాయితీని నిరూపించుకున్నావు” అని గుర్తు చేస్తుంది. రాజ్ కూడా “నాకు నీ మీద కంటే కావ్య మీదే నమ్మకం ఎక్కువ. అందుకే నీకు ఈ అవకాశం ఇస్తున్నాము. నువ్వు మా నమ్మకాన్ని నిలబెట్టుకుంటావని నమ్ముతున్నాను” అని అంటాడు. దీనికి రాహుల్ భావోద్వేగంతో “ఇది మీరు నాకు ఇస్తున్న చివరి అవకాశం. రాత్రింబవళ్లు కష్టపడతాను, థ్యాంక్స్ రాజ్” అని చెబుతాడు.

ఇది చూస్తూ ఉన్న ధాన్యం, రుద్రాణిని చూస్తూ “ఇపుడు ఎం అంటావు రుద్రాణి. తప్పు చేసినప్పుడు ఎలా నిలదీస్తామో అలానే రాహుల్ భవిష్యత్తు కోసం రాజ్ చేసిన పని సరైంది కాబట్టే అందరం సపోర్ట్ చేశాం. ఎవరు అడ్డు చెప్పలేదు” అని చెప్పుతుంది. రుద్రాణి మాత్రం “ఇది రాజ్ ఆలోచన. రాజ్ నా కొడుకుని నమ్మి ఈ అవకాశం ఇచ్చాడు. నువ్వు ఎదో చేసినట్లు మాట్లాడొద్దు” అని కోపంగా అంటుంది. రాహుల్ మాత్రం రుద్రాణిని చూస్తూ “ఈ కుటుంబంలో అందరం ఒకటే. నువ్వూ అది అర్థం చేసుకుంటే మంచిది” అని బుద్ధి చెప్పినట్టు మాట్లాడతాడు.
కొద్ది సేపటికి రుద్రాణి రాహుల్ దగ్గరకు వచ్చి “రాజ్ ఇలా నిన్ను నమ్మి కంపెనీ బాధ్యతలు ఇస్తాడని అనుకోలేదు” అని అంటుంది. రాహుల్ “రాజ్ ఇప్పటికీ నన్ను నమ్మలేదు. స్వప్న కోసమే కావ్య ఇలా చేసింది” అని అంటాడు. రుద్రాణి ఆశ్చర్యపడుతూ “స్వప్న నాలుగు కన్నీటి బొట్లు రాలిస్తే కావ్య కరిగిపోయిందా?” అని ప్రశ్నిస్తుంది.
అప్పుడు రాహుల్ “మన శత్రువే అయినా సరే కావ్య గొప్పదనాన్ని మెచ్చుకోవాలి. మనం ఇన్ని మోసాలు చేసినా అక్క కాపురం నిలబెట్టడానికి కావ్య ఈ రిస్క్ తీసుకుంది. తను నిజంగా గ్రేట్” అంటాడు. రుద్రాణి మాత్రం “అందులో అంతా గొప్ప ఏముంది. 100 కోట్లు ఉంటే 10లక్షలు విరాళం ఇచ్చినట్టు ఎదో చేసారు. సర్లే ఆ కావ్య గురించి ఆపి ముందు ఎం చేయాలో అది ఆలోచించు” అని అంటుంది. తరువాత రాహుల్ గర్వంగా “రేపే కంపెనీ బాధ్యతలు తీసుకుంటాను. రాజ్ కుర్చీలో కూర్చుంటాను” అని చెబుతాడు.

అది విన్న రుద్రాణి “కూర్చోవడమే కాదు రాజ్ లా మారాలి. కావ్యకి డెలివరీ అయ్యే వరకు రాజ్ ఆఫీసుకు రాడు. ఈ ఆరు నెలలు నీ గోల్డెన్ టైమ్. వాళ్ళు చేసిన తప్పు వాళ్ళకి తెలిసేలా చేయాలి. నిన్ను ఆఫీసు నుంచి ఎలా గెంటేశారో నువ్వూ రాజ్–కావ్యలను అలాగే గెంటేయాలి” అని విషం పోస్తుంది. ఇంకా “ఇన్నేళ్లు వాళ్లు మనల్ని ఎలా కాళ్ల దగ్గర పడేసుకున్నారో వాళ్ళు కూడా నీ కాళ్ల మీద పడేలా చేయాలి” అని అంటుంది.
రాహుల్ మరింత క్రూరంగా “ఇక నేను కేవలం రాహుల్ కాదు మొత్తం స్వరాజ్ గ్రూప్ నా చేతుల్లోకి తెచ్చుకుంటాను. నన్నెవరూ టచ్ చేయలేని రేంజ్ కి వెళ్తాను” అని చెబుతాడు. రుద్రాణి కూడా “నాకు అదే కావాలి. అప్పుడు నేను ఈ ఇంట్లో కూర్చొని వీళ్లను నా బానిసల్ని చేసుకుంటాను” అని అంటుంది.
ఇక రాజ్—కావ్య ఇద్దరూ రొమాంటిక్‌గా మాట్లాడుకుంటూ ఉండగా, రాజ్ కావ్యతో “ఇపుడు నువ్వు హ్యాపీ నా? రాహుల్ కి జాబ్ ఇవ్వమని చెప్పావుగా. నీ కోసమే అవకాశం ఇచ్చాను” అని అంటాడు. కావ్య “స్వప్న అక్క, రాహుల్ హ్యాపీగా ఉన్నారు” అంటుంది. రాజ్ వెంటనే “అయితే నా కళావతి కూడా హ్యాపీ” అంటూ దగ్గరికి వస్తుండగా కావ్య ఆపేసి తన బకెట్ లిస్ట్ లో ఉన్న మరో కోరిక గురించి చెబుతుంది.

రాజ్ షాక్ అయ్యి ఇంకానా అని అడుగుతాడు. కావ్య వెంటనే “ఎల్లుండి అత్తయ్య–మావయ్యల 30వ పెళ్లి రోజు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేద్దాం” అని అంటుంది. రాజ్ “రిసార్ట్ బుక్ చేయనా?” అని అడిగితే—కావ్య “అందరి ముందే ఇంట్లోనే చేద్దాం. ఇన్ని రోజులు నా వల్ల అందరూ బాధపడ్డారు కాబట్టి ఇపుడు వాళ్లను సంతోషపరచాలి” అని చెబుతుంది. రాజ్ కూడా ఆమెను మెచ్చుకుంటాడు. రాజ్ “నేను మర్చిపోయాను అమ్మ నాన్న ల పెళ్లి రోజు. మీ ఆడవాళ్లు ఇవి అన్ని ఎలా గుర్తు పెట్టుకుంటారు” అని అడుగుతాడు.
దానికి కావ్య “మీరు టెండర్లు, డీల్స్, అకౌంట్స్ ఇంకా డిజైన్లు అన్ని గుర్తుంచుకుంటారు. అది మీ పని. మీ అబ్బాయిలకి ఫోన్ మెమరీ మాత్రమే ఉంటుంది. మా అమ్మాయిలకి హార్డ్ డిస్క్ కూడా ఉంటుంది. అందుకే నాకు మా అత్త మామల పెళ్లి రోజు కూడా గుర్తుంది” అని సెటైర్ వేస్తుంది.
అటు ఉదయం రాహుల్ ఆఫీసుకు రావడం చూసి శృతి షాక్ అవుతుంది. మేనేజర్ ని అడగడంతో అతను “రాజ్ సార్ కొన్ని రోజులు ఆఫీసు కి రానని చెప్పారు. అందుకే ఆయన ప్లేస్ లో రాహుల్ సర్ వస్తున్నారు” అని చెప్పడంతో శృతి టెన్షన్ పడుతుంది. మేనేజర్ రాహుల్ దగ్గరికి వెళ్లి కంగ్రాట్స్ చెప్పి ఆఫీసుకి ఆహ్వానిస్తాడు. రాహుల్ శృతితో “నేను మళ్లీ ఆఫీసుకి రానని ఫిక్స్ అయ్యావా?” అని అడుగుతాడు. శృతి “లేదు సర్, కానీ మీరు ఇలా వస్తారని నేను ఊహించలేదు. అంతే” అంటుంది.

దానికి ఈ రాహుల్ ఎలా వస్తాడో ఎవరూ ఊహించలేరు అని బిల్డప్ ఇచ్చి “పెండింగ్‌లో ఉన్న ఫైల్స్ , ఇంకా నేను సంతకం చేయాల్సిన అన్ని ఫైల్స్ ని తీసుకొని వెంటనే నా క్యాబిన్‌కి రా” అని చెప్పి వెళ్తాడు. తరువాత శృతి మనసులో ” అతను ఎలాంటి వాడితో చూస్తేనే తెలుస్తుంది. ఇక్కడికి వచ్చి చాచాడు. నేను ఇరుక్కుపోయాను. ఆఫీసులో ఏం ఇబ్బందులు మొదలుపెడతాడో” అని అనుకుంటుంది.
ఇక ఇంట్లోకి కొత్త బట్టలు తీసుకువచ్చిన డెలివరీ బాయ్‌ను చూసి అందరూ ఎవరు ఆర్డర్ పెట్టారో అని ఆశ్చర్యపోతారు. రాజ్ వచ్చి “నేనే ఆర్డర్ పెట్టాను” అని చెబుతాడు. అపర్ణ “షాపింగ్ చేస్తే సరిపోతుంది కదా?” అని అడగగా – కావ్య “అంతా సమయం లేదు అత్తయ్య. రేపే కదా పండగ” అని అంటుంది. ధాన్యం “ఏ పండగ?” అని అడిగితే—రాజ్ “మా అమ్మానాన్నల పెళ్లి రోజుకంటే పెద్ద పండగ ఏది?” అని చెబుతాడు.

అందరు సంతోషిస్తారు. కళావతే రేపు పెళ్లిరోజు అని గుర్తుపెట్టుకుని బట్టలు ఆర్డర్ పెట్టిందని రాజ్ చెబుతాడు. అప్పుడే కావ్య, అపర్ణ–సుభాష్‌ల పాత పెళ్లి జ్ఞాపకాల గురించి అడుగుతూ పెళ్లి చూపులు ఎలా జరిగాయో చెప్పమని అంటుంది.అపర్ణ “అసలు పెళ్లిచూపులు లేవు. పెద్దలు చెప్పినట్లు జరిగిపోయింది” అని అంటుంది. సుభాష్ “మా నాన్న మీ అమ్మ వాళ్ళ నాన్న మాట్లాడుకున్నారు. పెళ్లి చేసుకోమని చెప్పారు అంతే. మీ అమ్మను మొదటిసారి పెళ్లి పీటల మీదే చూశా” అని నవ్వుతాడు. అపర్ణ “నేను అయితే పెళ్ళిలో కూడా సరిగా చూడలేదు” అని అంటుంది.
కావ్య వెంటనే “అయితే అత్తయ్య–మావయ్యలకు మళ్లీ పెళ్లిచూపులు పెడదాం!” అని అంటుంది. అందరూ నవ్వుతూ ఒప్పుకుంటారు. అపర్ణ సిగ్గుతో వద్దు అంటుంది. కానీ ఇంట్లో అందరు బలవంతం చేయడంతో సరే అని ఒప్పుకుంటుంది. అలా అపర్ణ–సుభాష్‌లను పెళ్లికొడుకు–పెళ్లికూతురులా రెడీ చేస్తూ ఉంటారు.
అంతటితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది.
Source inspiration: Original story from “బ్రహ్మముడి” (JioHotstar). This is a personal written recap and interpretation.

