బ్రహ్మముడి Nov 20th, 2025 గురువారం ఎపిసోడ్: స్వప్నని రెచ్చగొట్టి రాహుల్, కావ్య ల మీదకి ఉసిగొల్పుతున్న రాహుల్…!!!! రాహుల్ మోసాన్ని కావ్య, రాజ్ కనిపెట్టగలరా …. ????
ఎపిసోడ్ ప్రారంభంలో శృతి కంపెనీకి సంబంధించిన అన్ని ఫైల్స్ తీసుకొచ్చి రాహుల్ ముందుంచుతుంది. “సార్ ఇవన్నీ రాజ్ సార్ చెక్ చేశారు. మీరు సంతకం చేస్తే చాలని చెప్పారు,” అని చెప్పగానే రాహుల్ మండిపడతాడు. “అంటే నేను ఏ ఫైల్ స్టడీ చేయాల్సిన అవసరం లేదా?” అని ప్రశ్నిస్తాడు. శృతి అదే మాటను తిరిగి చెప్తూ “అవును సార్. మీరు ఏమి చూసే పని లేదు. సంతకం చేస్తే చాలు” అని అంటుంది.

సంతకం చేస్తుండగా శృతి నవ్వడం రాహుల్‌కు మరింత కోపం తెప్పిస్తుంది. వెంటనే మేనేజర్ దగ్గరకు వెళ్లి, “నేను డిజైన్స్‌లో కొన్ని కరెక్షన్స్ చెప్పాను కదా? ఏమైంది వాటి సంగతి?” అని అడుగుతాడు. మేనేజర్ “మీరు చెప్పకముందే కావ్య మేడం డిజైన్లు చూశారు. అలాగే ఉంచమని చెప్పారు. క్లయింట్స్‌కి కూడా అవే నచ్చాయి. తయారీకి పంపించాం సర్,” అని అంటాడు.
రాహుల్ అవాక్కై, “అంటే నేను చూడక్కర్లేదు, నేను కరెక్షన్స్ చెప్పకర్లేదు. కావ్య మేడం ఫైనల్ చేస్తే చాలు అంతేనా?” అని ప్రశ్నిస్తాడు. మేనేజర్ చల్లగా, “అదే సార్. మీరంతగా చూడాల్సిన పని లేదు. మేడం చూసుకుంటారు” అని చెబుతాడు.

ఈ మాటలు విన్న రాహుల్ కోపంతో “ఇంట్లో అందరి ముందు నాకు ఎదో పెద్ద జాబ్ ఇచ్చినట్లు చెప్పి గొప్పగా చూపించారు. కానీ పవర్స్ అన్ని వాళ్ల దగ్గరే పెట్టుకుని, ఈ పనికిరాని కుర్చీ మాత్రం నాకు ఇచ్చారు. ఇలా ఉంటే నేను ఆఫీస్‌లో ఉన్నా, రోడ్డుమీద ఉన్నా తేడా ఏముంది” అని రగిలిపోతాడు. ఇదంతా మార్చాలంటే, “పవర్స్ అన్నీ నా చేతుల్లోకి రావాలి. దానికి స్వప్నని రంగంలోకి దింపాలి” అని తన ప్లాన్ వేసుకుంటాడు.
తక్షణమే స్వప్నకి ఫోన్ చేస్తాడు. స్వప్న “ఏం చేస్తున్నావు రాహుల్?” అని అడుగుతుంది. రాహుల్ నటిస్తూ, “ఆఫీసులో అన్నింటిపై ఒక ఐడియా తెచ్చుకుంటున్నా” అని చెప్తాడు. స్వప్న వెంటనే పని మీద దృష్టి పెడితే తొందరలోనే పైకి వస్తావు అని సపోర్ట్ చేస్తుంది. దానికి రాహుల్ “స్వప్న నీ కోసం, మన పాప కోసం పగలు రాత్రి కష్టపడతా. మిమ్మల్ని బాగా చూసుకుంటాను” అని అంటాడు. స్వప్న ప్రేమగా, “నువ్వు భోజనం చేశావా?” అని అడుగుతుంది.

రాహుల్ నటిస్తూ, “నేను ఆఫీస్ ఫుడ్ తినను. ఇక్కడికి ఆర్డర్ కూడా పెట్టుకోలేము. ఇంటికి వచ్చాక తింటాను,” అని చెప్తాడు. అదంతా విన్న స్వప్న వెంటనే తానే క్యారియర్ తీసుకుని వస్తానని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. రాహుల్ నవ్వుతూ “నువ్వు ఆఫీసుకు రావాలి స్వప్న. ఇక్కడ ఏమి జరుగుతుందో నీ కళ్లతో నువ్వే చూడాలి. అప్పుడు నువ్వే ఇక్కడ జరిగేది మారుస్తావు” అని తనలో తాను అనుకుంటాడు.
మరోవైపు దుగ్గిరాల ఇంటిలో అపర్ణ, సుభాష్‌ల పెళ్లి రోజు సందర్భంగా వారికీ పెళ్లిచూపుల ఏర్పాట్లు జరుగుతుంటాయి. ఆటపాటలు, నవ్వులు, షరా మామూలుగా ఇంట్లో పండగ వాతావరణం ఉంటుంది. ఇంటి సభ్యులు అంతా కలిసి వధువు , వరుడు రెండు వైపులా రెండు కుటుంబాలుగా ఉంది పెళ్లి చూపుల్లో సరదా సంభాషణలతో బాగా కామెడీ చేస్తుంటారు.

ఇంట్లో ఇలా జరుగుతుండగా, స్వప్న క్యారియర్‌తో రాహుల్ ఆఫీసుకు వస్తుంది. రాహుల్ ప్రేమగా, “ఇలాంటి అదృష్టం మళ్లీ వస్తుందని అనుకోలేదు స్వప్న” అని చెప్తాడు. స్వప్న సున్నితంగా, “నువ్వు ఆకలితో ఉంటే చూస్తూ ఉండలేను రాహుల్. నేను ఉన్నది నీకోసమే,” అంటుంది. ఫోన్లో ఎందుకు బాధగా మాట్లాడావని రాహుల్ అడుగుతాడు. స్వప్న చిరునవ్వుతో, “అది బాధ కాదు, సంతోషం. చాలాకాలం తర్వాత నువ్వు నన్ను ‘భోజనం చేశావా?’ అని అడిగావు. ఆ మాట వినగానే నా మనసు సంతోషంతో నిండిపోయింది,” అని అంటుంది.
స్వప్న మాట్లాడుతుండగా ఆమె కళ్లలో నిజమైన ప్రేమ కనిపిస్తుంది. “ఇన్నాళ్లు నువ్వు మారతావని ఎదురు చూశా. అందరూ నిన్ను అవమానించినప్పుడు నేను బాధపడ్డాను. ఇప్పుడు నిన్ను ఇలా చూస్తుంటే నా బాధంతా పోయింది,” అని అంటుంది.

ఆ సమయంలో శృతి మరో ఫైల్‌తో “సార్ మీ సంతకం కావాలి,” అని అంటూ లోపలికి వస్తుంది. రాహుల్ భోజనం చేస్తుండటం చూసి శృతి మళ్లీ వస్తాను సర్ అని తిరిగి వెళ్తుండగా రాహుల్ ఆపి “ముందు పని ముఖ్యం, భోజనం కాదు శృతి. సంతకం సరే కానీ ఈ ఫైల్ కూడా నేను చూడక్కర్లేదా?” అని ప్రశ్నిస్తాడు. శృతి “అదే సార్. మీరు చూడాల్సిన పని లేదు. అన్ని ఫైల్స్ రాజ్ సార్ చూసి అప్రూవ్ చేశారు. మీరు సంతకం చేస్తే చాలు,” అంటుంది.
ఈ మాటలు విన్న స్వప్న షాక్ అవుతుంది. రాహుల్ గట్టిగా, “అదేంటి శృతి? నేను ఈ కంపెనీ ఓనర్ కాదు కానీ రాజ్ నాకు ఒక మంచి పోస్ట్ ఇచ్చాడు కదా. చూడకుండా సంతకం పెడితే రేపు ఏదైనా పొరపాటు జరిగితే రాజ్‌కి, కావ్యకి నేను ఏం సమాధానం చెప్పాలి?” అని అడుగుతాడు. శృతి కొంచం నిర్లక్ష్యంగా, “ఆ టెన్షన్ ఎం వద్దు సర్. రాజ్ సార్ ఇంట్లో నుంచే ఫైల్స్ చెక్ చేస్తున్నారు. మీరు ఆఫీసుకి వచ్చి టైంపాస్ చేయండి సార్. మేము చెప్పిన చోట సంతకం చేస్తే చాలు” అని అంటుంది.

అది విన్నాక స్వప్న రగిలిపోతుంది. “ఈ కంపెనీ బాధ్యతలు రాహుల్‌కి అప్పగించారు. నిర్ణయాలు కూడా రాహులే తీసుకోవాలి” అని అంటుంది. శృతి కొంచం భయంతో “మాది ఏమి లేదు మేడం. ఇక్కడ నిర్ణయం తీసుకునేది రాజ్ సర్!” అని సమాధానం ఇస్తుంది. రాహుల్ స్వప్నని ఆపేసి శృతి దగ్గర ఫైల్ తీసుకుని సంతకం చేసి పంపిస్తాడు.
శృతి వెళ్ళగానే స్వప్న రాహుల్ ని ఏంటి ఇది అంతా అని అడుగుతుంది. రాహుల్ వినయంగా “నేను కొత్త కదా. అందులో ఎలాంటి తప్పు జరగకుండా పవర్ వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. నన్ను ఇక్కడ కూర్చోపెట్టారు. ” అని నిస్సహాయంగా అంటాడు. స్వప్న కొంచం ఆవేశంగా “అలా అయితే కేవలం ఒక సంతకం కోసం నువ్వు ఆఫీసుకి రావడం ఎందుకు రాహుల్. నీకు ఇక్కడ ఎవరు మర్యాద ఇస్తారు. ఇలా అయితే నువ్వు ఎలా నీ టాలెంట్ ని నిరూపించుకుంటావు?” అని వాదిస్తుంది.
ఇంతలో మేనేజర్ లోపలి వస్తాడు. రాహుల్ “డిజైన్స్ విషయంలో మార్పులు చెప్పను కదా” అని అడగ్గా మేనేజర్ “అన్ని డిజైన్స్ కావ్య మేడం ఫైనల్ చేశారు సార్. మీరు చివర్లో ఒక సైన్ చేస్తే చాలు” అని అంటాడు. దానికి రాహుల్ “వేరే డిజైన్స్ ఉన్నాయి కదా” అని గుర్తు చేస్తుండగా మేనేజర్ “అవి అన్ని కావ్య మేడం చూస్తారు. మేకింగ్ కి వెళ్లే ముందు మీరు ఒక సైన్ చేస్తే సరిపోతుంది” అని అంటాడు. ఇంకా రాహుల్ మేనేజర్ ని పంపించేస్తాడు.

రాహుల్ స్వప్నతో “నువ్వు ఇవి అన్ని పట్టించుకోకు. కంపెనీలో ఇవి అన్ని సాధారణం. నన్ను నమ్ము. కొన్ని నెలలు కష్టపడితే అంతా బాగా అయిపోతుంది” అని అంటాడు. అది విన్న స్వప్న “కుర్చీ ఇవ్వడం గొప్ప కాదు రాహుల్. నీ మాటకి, నీ నిర్ణయానికి విలువ ఇవ్వాలి. లేదంటే నువ్వు అవమానపడుతూనే ఉంటావు. ఇది నేను ఎక్కడ తేల్చుకోవాలో అక్కడే తేల్చుకుంటాను” అంటూ కోపంతో అరిచి అక్కడినుంచి వెళ్లిపోతుంది. రాహుల్ నవ్వుకుంటూ “నాకు ఇదే కావాలి. వెళ్లు” అని అనుకుంటాడు.
ఇంట్లో అపర్ణ–సుభాష్‌ల పెళ్లిచూపులు హుషారుగా సాగుతాయి. వరుడు–వధువు, వాళ్ల కుటుంబాలు సరదాగా జోకులు పేలుస్తూ, నవ్వులు పూయిస్తూ ఉంటారు. ఇల్లంతా పండగ వాతావరణంతో కోలాహలంగా ఉంటుంది.
అంతటితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది.
Source inspiration: Original story from “బ్రహ్మముడి” (JioHotstar). This is a personal written recap and interpretation.

