బ్రహ్మముడి Nov 21st, 2025 శుక్రవారం ఎపిసోడ్: ఇంట్లో అపర్ణ, సుభాష్ పెళ్లి చూపుల కోలాహలం …!!! రాహుల్ ని నమ్మి కావ్య, రాజ్ ని నిలదీసిన స్వప్న …!!!
ఎపిసోడ్ ప్రారంభంలో అపర్ణ–సుభాష్ పెళ్లిచూపులు సరదాగా జరుగుతాయి. అందరు సరదాగా గడుపుతుండగా రుద్రాణి మాత్రం ఈ సందర్భాన్ని ఆటగా తీసుకుని, అపర్ణను నడువు, పాడు, అది చెయ్ ఇది చెయ్ అంటూ అల్లరి చేస్తూ కొంచెం ఇబ్బందిపెడుతుంది. అపర్ణ సైలెంట్‌గా ఉండటంతో ధాన్యం మాత్రం “ఎప్పుడూ మా అమ్మాయి గురించేనా? మీ అబ్బాయి గురించి కూడా మేం తెలుసుకోవాలి కదా” అని ప్రశ్నిస్తుంది. దాంతో వరుడు సుభాష్ మీదే అందరి దృష్టి పడుతుంది. రాజ్, ప్రకాశం ఇద్దరూ అతనిని అత్యుత్సాహంగా పొగుడుతున్నట్టుగా, అతని ఒంట్లో ఉన్న బీపీ, షుగర్ , కొలెస్టరాల్ గురించి చెప్తుంటారు. అపర్ణ చిన్నగా నవ్వుతూ, “అబ్బాయి పేషెంట్ అయినా కూడా డీసెంట్ గానే ఉన్నాడు. అందుకే నాకు నచ్చదు” అని చెప్పగానే సుభాష్ తనకు ఆమెతో ఒంటరిగా మాట్లాడాలని ఉందని చెప్తాడు.

సీతారామయ్య వెంటనే “పెళ్లి కాకముందు అబ్బాయి–అమ్మాయి వ్యక్తిగతంగా మాట్లాడటం మా ఇంట్లో ఆచారం కాదు” అని ఆపేస్తాడు. రాజ్ “అయితే పెళ్లిచూపుల్లో అబ్బాయిని ప్రశ్నించి, పరీక్షించడం మాత్రం ఆచారమా?” అని అడుగుతాడు. ధాన్యం మాట్లాడుతూ “మా అమ్మాయిని కూడా పాడు, నడువు, కూర్చో అని అడిగారుగా. అబ్బాయి గురించి ప్రశ్నించడం మాత్రం ఎందుకు తప్పు?” అని అనటంతో కావ్య మాట్లాడుతూ “ఎప్పటినుంచో పెళ్లిచూపులలో అమ్మాయినే ఎందుకు ప్రశ్నలు వేస్తారు” అని అడుగుతుంది.
ఇందిరా మాట్లాడుతూ, పాతకాలపు పెళ్లిచూపులు ఎలా ఉండేవో, రెండు కుటుంబాలు కలిసే ఉద్దేశ్యమే ఆ వ్యవస్థ వెనుక ఉన్నదని చెబుతూ, “పెళ్లి అనేది ఇద్దరి జీవితాలకే కాదు, రెండు కుటుంబాల భవిష్యత్తుకూ సారథ్యం. అందుకే అబ్బాయి తరపు వాళ్ళు వచ్చి అమ్మాయిని తన కుటుంబాన్ని బాగా పరిశీలించి వారి కుటుంబానికి అమ్మాయి సరిపోతుంది అనుకుంటేనే పెళ్లి ఖాయం చేసుకునేవారు. ఎందుకు అంటే పెళ్లితో ఆకుటుంబాల మధ్య స్నేహం ప్రేమ బంధుత్వం అన్ని ఏర్పడతాయి. సుఖ దుఃఖాలలో ఒకరికి ఒకరు సాయంగా కూడా ఉండాలి కదా ” అని అందంగా వివరిస్తుంది. ఆమె చెప్పిన మాటలు అక్కడ ఉన్నవాళ్లందరికీ నచ్చి, ప్రశంసలతో, చప్పట్లతో అక్కడి వాతావరణం కోలాహలంగా ఉంటుంది.

అప్పుడే స్వప్న ఆగ్రహంతో ఇంట్లోకి అడుగుపెడుతుంది. ముఖంలో ఆవేదన, గొంతులో కోపంతో ఇల్లు నవ్వులతో నిండిపోయింది అని వెటకారంగా మాట్లాడుతుంది. అయితే అది గమనించిన కావ్య ఏమైంది అని అడగ్గా ఆమె రాజ్, కావ్యలను చూస్తూ, “మీరు యజమానులు కావచ్చు కానీ మా కడుపు నింపేవాళ్లు కాదు కదా. ఆఫీసులో రాహుల్‌కు ఇచ్చిన పదవికి గౌరవం లేదు, అధికారమూ లేదు, మాటకు విలువ లేదు. ఆఫీసులో ఆదేశాలు ఇవ్వకూడదట, సంతకం చేయడమే చాలట. ఇదేనా ఉద్యోగం?” అని ఆమె నిలదీస్తుంది. “మీరు ఇంట్లో నుంచే ఆఫీస్ నడపాలనుకుంటే నా భర్తను అక్కడికెందుకు పంపారు?” అనే గట్టిగ నిలదీస్తుంది.

వెంటనే రుద్రాణి కూడా “కేవలం అందరి ముందు వాడిని ఉద్ధరిస్తున్నారు అని చూపించుకోవడానికే ఇలా చేస్తున్నారు మీరు. స్వప్నకి, స్వప్న బిడ్డకి జీవితం ఇచ్చినట్టు నటిస్తున్నారు. మీరు రాహుల్‌ను రబ్బర్ స్టాంప్‌లా మార్చేసారు. అయినా మీరంతా ఈ ఇంట్లో నాకు నా కొడుక్కి ఎపుడు మర్యాద, గౌరవం ఇచ్చారని” అంటుంది. అదే సమయంలో రాహుల్ ఇంట్లోకి వచ్చి గట్టిగా, “రాజ్ నీ, కావ్యనీ ఇంకో మాట అంటే అమ్మవని కూడా చూడను” అని హెచ్చరిస్తాడు.

రాహుల్ మాట్లాడుతూ “వాళ్ళు నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇవ్వడమే గొప్ప. అయినా ఇది మన కంపెనీ. పని చేసే చోట గౌరవం కూడా ఉంటుంది, అవమానం కూడా ఉంటుంది. భరించడం మన బాధ్యత” అని చెబుతూ స్వప్న వైపు తిరిగి, కోపం ఎన్నో నష్టాలకు దారితీస్తుందని అర్థం చేసుకోమని అడుగుతాడు. తన గౌరవం తిరిగి సంపాదించుకోవాలంటే తొందరపాట్లు కాకుండా అవకాశాలు అందిపుచ్చుకోవాలి అని చెబుతాడు. చివరగా “రాజ్, కావ్య నాకు అవకాశం మాత్రమే ఇవ్వలేదు నన్ను మార్చి నీకు జీవితం ఇచ్చారు. అది మర్చిపోకు” అని అంటాడు. రుద్రాణి మాత్రం ఇది అంత చూస్తూ తన కొడుకు బాగా నటిస్తున్నాడు అని లోపల నవ్వుకుంటుంది. స్వప్న అక్కడ నుండి వెళ్ళిపోతుంది.

స్వప్న తన దగగ్రికి వచ్చిన రాహుల్ ని చూస్తూ “నువ్వు ఇంతగా మారిపోయిన అది ఇంట్లో వాళ్ళకి ఎందుకు తెలియడం లేదు. అవకాశం ఇచ్చారు అని నా భర్తని అవమానిస్తుంటే నేను ఎలా చూస్తూ ఉండగలను” అని అడుగుతుంది. రాహుల్ “నీ కోసం, మన బిడ్డ కోసం నేను ఎన్ని అవమానాలు అయినా భరిస్తాను. అవసరం అయితే నేను ఏదయినా హోటల్ లో ప్లేట్లు కడగగలను, ఎక్కడ అయినా డ్రైవర్‌గా కూడా పని చేయగలను. కానీ ఆఫీసుకి వెళ్లింది నువ్వు చెప్పావు కాబట్టి. పోయిన దగ్గరే గౌరవాన్ని నేనే తిరిగి తెచ్చుకుంటా” అని బాధ పడుతూ చెప్తాడు.

అది చూసి స్వప్న “ఇంట్లో కావ్య ఎం చెప్పిన వింటారు. అప్పుని కూడా మర్యాదగా చూస్తారు. కానీ నేను అంటే జాలి చూపిస్తారు కానీ ఈ విలువ లేదు” అని బాధపడుతుంది. దానికి రాహుల్ “తప్పు నాదే. నేను చేసిన తప్పులు వల్లనే నీకు ఈ పరిస్థితి వచ్చింది. అది నేను మారుస్తాను. మనకి పోయిన గౌరవం కూడా నేనే తిరిగి తీసుకొస్తాను” అని అంటాడు. ఈ మాటలకి స్వప్న పూర్తిగా పడిపోతుంది.
అక్కడితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది.
Source inspiration: Original story from “బ్రహ్మముడి” (JioHotstar). This is a personal written recap and interpretation.

