బ్రహ్మముడి Oct 30th, 2025 గురువారం ఎపిసోడ్ : కుయిలీ కోసం స్వప్నకి అన్యాయం చేస్తున్న రాహుల్ …!!!
స్వప్న ఎందుకు బాధ పడుతుంది అని అడిగిన రాజ్ కి రాహుల్ ఇంకో అమ్మాయి వెంట తిరుగుతున్న విషయం చెప్తుంది కావ్య. ఆ మాటలు విన్న రాజ్ అనుమానంగా అడుగుతాడు — రాహుల్ ఎందుకు ఇలాగా ప్రవర్తిస్తున్నాడు? సాధారణంగా అయితే స్వప్న నాలుగు కొట్టి లైన్లోకి తెచ్చేసేది కదా. కావ్య నిట్టూరుస్తూ చెబుతుంది — పాప పుట్టిన తర్వాత అక్క చాలా మారిపోయింది, భవిష్యత్తు గురించి ఆలోచిస్తోంది, ఏ పెద్ద నిర్ణయం తీసుకోవడానికి ధైర్యం లేదు. రాజ్ ఆమెను ఓదారుస్తూ రాహుల్ గురించి నేను చూసుకుంటాను అని నువ్వు ముందు తిను అని చెప్పి, తన చేతులతో తినిపిస్తాడు.

తర్వాత సీన్ లో స్వప్న బాధగా ఒంటరిగా కూర్చుంటుంది. ఆ సమయంలో రాహుల్ ఆమె దగ్గరకి విడాకుల పత్రాలు తీసుకుని వస్తాడు. ఇక మన మధ్య ఏమీలేదు, ఇవే విడాకుల పేపర్లు అని గట్టిగా అంటాడు. స్వప్న సంతకం చేయకుండా నిరాకరిస్తుంది, కానీ రాహుల్ స్వప్నని సంతకం చేయమని బలవంతం చేస్తాడు. కన్నీళ్లతో స్వప్న కిందకి వచ్చి అందరి ముందు, రుద్రాణి సహా, ఆ పత్రాలు చూపిస్తుంది. రాహుల్ చేసిన పనులన్నీ బయటపెడుతుంది. కావ్య, రాజ్, కవి, అప్పు అక్కడకి చేరుతారు. అందరూ ఆశ్చర్యంతో నిలబడిపోతారు. రుద్రాణి కూడా షాక్ అవుతుంది.
ఇంతలో రాహుల్ అహంకారంగా లోపలకి వస్తాడు. రాజ్ ఆపి కోపంగా అడుగుతాడు — ఏమిటి రాహుల్, స్వప్నకి విడాకులు ఇస్తావా? రాహుల్ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తూ చెబుతాడు — ఆమె వచ్చి ఏడుస్తూ మీకు చెప్పిందా? అని. నాకు ఆమెతో ఇక సంబంధం లేదు అని అహంకారంగా చెబుతాడు. ఇందిరాదేవి, అపర్ణాదేవి ఇద్దరూ అతనిని తీవ్రంగా మందలిస్తారు. రుద్రాణినీ తిడతారు — ఇదేనా నీ పెంపకం అని. రుద్రాణి ఏం చెప్పలేక షాక్ లో నిశ్శబ్దంగా నిలబడిపోతుంది.
నాకు స్వప్న నచ్చడం లేదు అని రాహుల్ అన్న వెంటనే కళావతి మండిపడుతుంది. నువ్వే ఆమెను వెంటపడి పెళ్లి చేసుకున్నావు కదా, పెళ్లి మండపం దగ్గర నుండి తీసుకెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు ఎలా అంటావు నచ్చడం లేదని అని అంటుంది. అందరూ రాహుల్పై కోపం చూపిస్తారు. కానీ రాహుల్ అరిచి చెబుతాడు — నాకు భార్యా, పిల్లా ఎవరూ వద్దు. నాకు విడాకులే కావాలి. నా బ్రతుకు ఏదో నా చావు ఏదో నేను చూసుకుంటాను అని చెప్పి పైకి వెళ్తాడు.

రుద్రాణి షాక్లో ఉండగా ఇందిరాదేవి, అపర్ణాదేవి ఆమె మీద అరుస్తారు — ఇదేనా నీ పెంపకం, నీకు కుటుంబ గౌరవం లేదా అని అడుగుతారు. కోపంతో రుద్రాణి నేనే వెళ్లి రాహుల్ని కనుక్కుంటాను అని పైకి వెళ్తుంది. అక్కడ రాహుల్ బట్టలు సర్దుకుంటూ ఉంటాడు. రుద్రాణి అడుగుతుంది — నీకు ఏమైంది రా, ఇక్కడ ఉంటే ఆస్తిలో భాగం వస్తుంది, మరి ఈ విడాకుల మాటలేంటి అని. రాహుల్ శాంతంగా చెబుతాడు — అమ్మా, నేను కుయిలిని పెళ్లి చేసుకుంటే ఇక్కడ ఉన్న దానికంటే వంద రెట్లు వస్తాయి. తర్వాత నిన్ను కూడా తీసుకెళ్తాను, కుయిలి చాలా ధనవంతురాలు అని. ఆ మాట విన్న రుద్రాణి మనసు మార్చుకుంటుంది, కొడుకుకి మద్దతుగా నిలుస్తుంది. రాహుల్ లగేజ్ తీసుకుని బయలుదేరుతాడు.
ఇక కావ్య, రాజ్ తమ గదిలో రాహుల్ ప్రవర్తన గురించి మాట్లాడుతారు. కళావతి చెబుతుంది — కుయిలి అంత ధనవంతురాలు అయితే ఇప్పటికే పెళ్లైన, పిల్లలున్న రాహుల్ని ఎందుకు పెళ్లి చేసుకోవాలి అని. రాజ్ కూడా దానికి — నిజమే, ఇందులో ఏదో అనుమానం ఉంది అని అంటాడు. కావ్య చెబుతుంది — మనం కుయిలి గురించి అన్నీ తెలుసుకోవాలి అని. అంతటితో ఇవాళ ఎపిసోడ్ అయిపోతుంది.
కమింగ్ అప్ ఎపిసోడ్ సీన్లో రాహుల్ కుయిలి దగ్గర బాధగా కూర్చుని చెబుతాడు — నేను నీకోసం అందరినీ వదిలేశాను అని. ఆస్థి కోసం ప్రేమ నటిస్తున్న కుయిలీ, ఒక్కసారిగా షాక్ అవుతుంది. నువ్వు వాళ్లని వదిలి వచ్చావు కానీ వాళ్లు నీకోసం వస్తారు రాహుల్, నువ్వు తప్పు చేశావు అని అంటుంది. రాహుల్ కూల్ గా చెబుతాడు — ఎవరూ రారు కుయిలి అని. అదే సమయంలో కళావతి, రాజ్ వేషం వేసుకుని ముసలి వాళ్ళలా కుయిలి ఇంటికి వస్తారు. ఈ అమ్మాయి నిజం బయటపెడదాం అని అనుకుంటారు. వారు లోపలకి వెళ్తారు. రాహుల్ కుయిలిని చూస్తూ నాకు నువ్వే ఉన్నావు అంటుంటే, వెనక నుంచి రాజ్ చెబుతాడు — మేమున్నాం రా బుద్ధిలేని వాడా అని.
రేపటి ఎపిసోడ్ లో చూడాలి కావ్య రాజ్ కలిసి కుయిలీ నిజం బయట పెడతారా?? రాహుల్ కి బుద్ది చెప్పి స్వప్న జీవితం కాపాడతారా అని.

