చిన్ని Nov 1st, 2025 శనివారం ఎపిసోడ్ : మ్యాడీని ఆట పట్టిస్తున్న చిన్ని …!!! హాఫ్ టికెట్ బాలరాజు ని దేవా చెర నుండి కాపాడతాడా…????
లోహితను చూసిన శ్రేయ కన్నీళ్లు తుడుచుకుంటూ వెళ్లి ఆమెను హత్తుకుంటుంది. ఇద్దరూ కాసేపు ఎమోషనల్ అవుతారు. శ్రేయ “ఎలా ఉన్నావ్ లోహీ?” అని అడిగితే, లోహిత “నువ్వు మా పెళ్లికి సపోర్ట్ చేస్తావనుకున్నా శ్రేయా… కానీ నువ్వు కూడా ఏమీ చేయలేకపోయావ్. ఇప్పుడు చూడు, నేను, వరుణ్ ఇద్దరం రోడ్డుపై పడ్డాం” అని బాధగా చెబుతుంది.
శ్రేయ నిస్సహాయంగా “లోహీ, నువ్వు ముందు చెప్పి ఉంటే నేనేమైనా చేయగలిగేదాన్ని. కానీ మధు నీ పెళ్లి చేసేసరికి అందరి జీవితాలు తారుమారైపోయాయి. నీకు, నాకు, వరుణ్‌కి, బావకి కూడా ఇబ్బందే అయింది. మనందరం దూరమైపోయాం…” అని విచారంగా అంటుంది.

అంతలో చందు అక్కడకు వస్తుంటే, లోహిత అతన్ని చూసి ఒక్కసారిగా దాక్కుంటుంది. శ్రేయ ఆశ్చర్యపడి “అతను మన స్టాఫ్ మెంబర్ కదా, దాక్కోవడానికి ఏం ఉంది?” అని అడుగుతుంది. లోహిత తడబడుతూ “అతను మా ఫ్యామిలీకి దగ్గర వ్యక్తి… అంటే మా ఇంటి పనులు చూసుకునేవాడు” అని కవర్ చేస్తుంది.
లోహిత తర్వాత “శ్రేయా, మధు మ్యాడీని తన వలలో వేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. నువ్వు జాగ్రత్తగా ఉండు, ఆమెను కంట్రోల్ చేయ్” అని హెచ్చరిస్తుంది. దానికి శ్రేయ “మధుని కంట్రోల్ చేయాలంటే సంజయ్‌నే సరిగ్గా చేస్తాడు” అంటుంది.
ఇక మ్యాడీ వైపు సీన్ మారుతుంది. అతను చిన్ని గుడిలో కలుసుకోలేకపోయినందుకు బాధపడుతుంటాడు. తన ఫ్రెండ్ రాహుల్ తో చిన్ని గుడికి వచ్చింది అని నిమ్మకాయం దీపం పెట్టింది అని చెప్తాడు కానీ ఇద్దరం గుడిలో కలవలేకపోయాం అని అంటాడు. కానీ తొందర్లోనే కలుస్తాను చిన్ని ని అని నమ్మకంగా అంటాడు.
ఇక మ్యాడీ లైబ్రరీలో ఉంటాడు. ఆ సమయాన మధు కొత్త నంబర్ నుంచి కాల్ చేస్తుంది. “మీరు ఎంత బిజీగా ఉన్నా నా కాల్ లిఫ్ట్ చేసారు” అని మధు చిన్మయి పేరుతో మాట్లాడుతుంది. మొదట మ్యాడీకి ఆమె ఎవరో తెలియదు. చిన్ని తనను అభిమానిగా చెప్పుకుంటుంది. మ్యాడీ తికమక పడుతాడు. చిన్ని “మీ పుట్టినరోజు పండుగలా జరుపుతాను, బ్లడ్ కూడా డొనేట్ చేస్తాం” అని చెబుతుంది. మ్యాడీకి చిరాకు వస్తుంది. ఆమెతో మాట్లాడకుండా ఫోన్ కట్ చేస్తాడు.

చిన్ని “ఇలా అభిమానులను బాధపెట్టకూడదు” అని కోపంగా మాట్లాడుతుంది. “మీ డ్రెస్సు కాంబినేషన్ బాగోలేదు” అని చెబుతుంది. మ్యాడీ ఆశ్చర్యపడి “నువ్వు ఎలా తెలుసుకున్నావు నేను ఏం వేసుకున్నానో?” అని అడుగుతాడు. మధు “ఎవరినైనా మనస్ఫూర్తిగా ఇష్టపడితే అన్నీ తెలిసిపోతాయి” అని చెబుతుంది.
మ్యాడీ ఆమె తనని కాలేజ్‌లోనే గమనిస్తోందేమో అని అనుకుంటాడు. నువ్వు కాలేజ్ లోనే ఉన్నావా అని అడుగుతాడు. వెంటనే మధు ఫోన్ కట్ చేసి సిమ్ తీసేస్తుంది. తర్వాత మధు మ్యాడీ దగ్గరకు వచ్చి “ఏంటి, హలో హలో అని అరుస్తున్నావ్?” అంటుంది. మ్యాడీ మధుతో “ఒక అమ్మాయి ఫోన్ చేసింది” అని అంటాడు.దానికి మధు మ్యాడీతో “నిన్ను లవ్ చేస్తుందేమో” అని అంటుంది. వెంటనే మ్యాడీ “నాకు చిన్ని తప్ప ఇంకెవ్వరూ లవర్‌గా రారు” అని చెప్తాడు.

ఇక బాలరాజు సీన్ వస్తుంది. అతన్ని రౌడీలు ఒక గదిలో కట్టి ఉంచుతారు. హాఫ్ టికెట్ మరొక వ్యక్తి కలిసి టీ, సిగరెట్ పట్టుకొని రౌడీల దగ్గరకు వెళ్తారు. వాళ్లను బయటకు రప్పించి, లోపలికి వెళ్లి బాలరాజు కట్లును విప్పుతాడు. “చిన్ని ఈ ఊరిలోనే ఉంది” అని చెబుతాడు. ఇద్దరూ బయటకు వెళ్లబోతుంటే, దేవా అక్కడికి చేరి హాఫ్ టికెట్‌ని కొడతాడు. “చిన్ని ఎక్కడుందో చెప్పు, లేదంటే చంపేస్తా” అని బెదిరిస్తాడు. కానీ హాఫ్ టికెట్ “నన్ను చంపినా చెప్పను” అంటాడు. హాఫ్ టికెట్ ని కూడా కట్టేస్తారు.
చివరగా మరో సీన్లో ఒక వ్యక్తి మధు దగ్గరికి వచ్చి “మేడమ్, నా ఫోన్ ఛార్జ్ అయిపోయింది. మా నాన్న ఆసుపత్రిలో ఉన్నారు. ఫోన్ చేయాలి. మీ ఫోన్ ఇవ్వండి ప్లీజ్ ” అని అడుగుతాడు. మధు సానుభూతిగా అతనికి ఫోన్ ఇస్తుంది
అంతటితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది.
Source inspiration: Original story from “చిన్ని” (JioHotstar). This is a personal written recap and interpretation.
