కార్తీక దీపం Nov 5th, 2025 బుధవారం ఎపిసోడ్ : దీప నిజాయితీపై సుమిత్ర అనుమానం – అత్త మనసు మార్చే పనిలో కార్తీక్
దీప నిజాయితి గురించి సుమిత్ర అభిప్రాయం
ఎపిసోడ్ ప్రారంభంలో సుమిత్ర, దీప దగ్గరకు వచ్చి “దీపా, నేను నీతో మాట్లాడాలి” అని అంటుంది. దీప మర్యాదగా “చెప్పండమ్మా” అని స్పందిస్తుంది. సుమిత్ర “ఏం చేస్తున్నావ్ దీపా?” అని అడుగుతుంది. దీప చిరునవ్వుతో “చపాతీలు చేస్తున్నా అమ్మా. నేను త్వరగా వెళ్లినా మీకు వేడి చేసుకుని తినేలా సిద్ధం చేస్తున్నా, కూరలు కూడా ఉన్నాయ్ వండే పని లేదు” అని సమాధానమిస్తుంది.
దాంతో సుమిత్ర ఆలోచనలో పడుతుంది. “ఇదే నాకు అర్థం కావడం లేదు దీపా. నువ్వు చేసే ఏ పని నటించినట్లు కనిపించడం లేదు. కొన్నిసార్లు పరిస్థితులు మనల్ని నటించేట్టు చేస్తాయి. నేను కూడా అలా చేశాను. నీకు కార్తీక్‌తో పెళ్లి ఆగిపోవాలని, తాళి దాచిపెట్టాను. కానీ బయటకు మాత్రం నవ్వుతూ ఉన్నాను. లోపల తప్పుడు భావం ఉన్నా, బయట నిజాయితీగా నటించాను. ఆ తేడా నాకు తెలుసు,” అంటుంది.

దీప ప్రశాంతంగా “మరి నేను నటించడం లేదు, నిజాయితీగానే ఉన్నాను అని మీరు అంటున్నారు కదా?” అని అడుగుతుంది. సుమిత్ర అనుమానంగా “అన్ని విషయాల్లోనూ నువ్వు నిజాయితీగా ఉన్నావా దీపా?” అని ప్రశ్నిస్తుంది. దీప సుతిమెత్తగా “నేను ఏ విషయంలో నిజాయితీగా లేను అనిపిస్తోందో, మీరు చెప్పండి అమ్మా” అని సమాధానమిస్తుంది.
సుమిత్ర ఆలోచనతో నిండిన స్వరంలో “అదే ఆలోచిస్తున్నాను దీపా. నాకు అవసరమైన వాళ్లు నేను వెళ్లడం చూసి కూడా ఆపలేదు. కానీ నీకు అవసరం లేకపోయినా నువ్వు నా కోసం వెతికావ్, నా కోసం సేవ చేసావ్, మాటలు పడ్డావ్. పోలీస్ స్టేషన్‌కి కూడా వెళ్లావ్. అపుడు నేను ఎక్కడా నటన చూడలేదు. కానీ నాకు తెలిసిన దీప వేరు, ఇప్పుడు చూస్తున్న దీప వేరు. నువ్వు ఆ రోజు ‘మీరు మా అమ్మ’ అన్నావు. కాని నువ్వు అన్నంత మాత్రాన నేను నీకు అమ్మవుతానా? అయినా నన్ను ఇంత ప్రేమతో చూసుకుంటున్నావ్. ఇదంతా ఎందుకు దీపా? కార్తీక్ కోసమా?” అంటుంది.
కార్తీక్ ఎంట్రీ – “ఇది రుణానుబంధం అత్త”

అదే సమయంలో కార్తీక్ అక్కడికి వస్తాడు. అత్త అడిగిన మాటలు విని కార్తీక్ సమాధానంగా “కాదు అత్త. మీ ఇద్దరి మధ్య ఉన్నది రుణానుబంధమే. దీప ఎప్పుడూ స్వార్థం కోసం ఏం చేయలేదు,” అని ప్రారంభిస్తాడు.
సుమిత్ర మెల్లగా “కానీ నేను దీపను ఒక్క విషయంలో నమ్మలేకపోతున్నాను,” అని అంటుంది. కార్తీక్ “అది ఏ విషయంలోనో నాకు తెలుసు అత్త. కానీ మీరు చూసినదే నిజం అనుకుంటున్నారు. ప్రతిదానికీ సాక్ష్యాలు ఉండవు. దీప చిన్నప్పటి నుంచి ఒకేలా ఉంది. నేను కోనేటిలో పడిపోతే, నన్ను కాపాడింది. ఆ తర్వాత మిమ్మల్ని రక్షించినప్పుడు కూడా ఆమెకు ఏ స్వార్థం లేదు. దశరథ్ మామయ్య విషయములో కూడా దీప తప్పు లేదు,” అని నమ్మకంగా చెబుతాడు.
నిరూపించమని అడిగిన సుమిత్ర
సుమిత్రకు ఆ మాటలు వింటూ పాత ఘటనలు గుర్తొస్తాయి. “ఆ రోజు ఏం జరిగిందో నువ్వు నిరూపించగలవా కార్తీక్? దీప చేతిలో గన్ పేలింది. నా భర్తకు తగిలింది. నా భర్త రక్తంతో పడిపోయాడు. ఆ సన్నివేశం నా మనసులో ఎప్పటికీ ఉంది. దీపపై నా ఆలోచన మార్చు” అని చెప్పి, కన్నీటి కళ్లతో చూస్తుంది.
కార్తీక్ ధైర్యంగా “మారుస్తాను అత్త. దీప మీద మీకు ఉన్న ఈ అభిప్రాయాన్ని తప్పకుండా మార్చుతాను. అంతేకాదు, ఆ తర్వాత మీకు ఒక సర్ప్రైజ్ ఇస్తాను,” అంటాడు. సుమిత్ర ఆశ్చర్యంతో చూస్తుంది. “మీ మేనల్లుడిగా ఇచ్చే కానుక, అది మీరు జీవితాంతం గుర్తుంచుకుంటారు.” అని నవ్వుతూ చెబుతాడు కార్తీక్.
సుమిత్ర “నీ మాటలు నిజం కావాలని కోరుకుంటున్నాను,” అని చెప్పి వెళ్లిపోతుంది.
దీప, కార్తీక్ మధ్య సరదా సంభాషణ

సుమిత్ర వెళ్లగానే కార్తీక్, దీప దగ్గరికి వచ్చి “త్వరగా రా దీపా, మనం వెళ్దాం” అంటాడు. దీప చపాతీ పిండి కలుపుతూ ౧౦ నిమిషాల్లో వస్తాను అని చెబుతుంది. కార్తీక్ సరదాగా “అయినా ఈరోజు నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు కదా. మీ అమ్మానాన్న కలిసిపోయారు. నిన్ను మధ్యలో కూర్చోబెట్టుకుని భోజనం చేసారు. పొరమారితే నీళ్లు కూడా పట్టించారు. పైగా తాత బట్టలు కూడా పెట్టాడు,” అని వెటకారంగా నవ్వుతాడు. దీప చిరునవ్వుతో “అవును బావ, అంతా నీవల్లే జరిగింది” అని అంటుంది. కార్తీక్ కొంచెం అలిగి “అందుకే థ్యాంక్స్ చెప్పావు కదా” అని అంటాడు. దీప నవ్వుతూ “అయ్యో సారీ బావా, మర్చిపోయాను థ్యాంక్స్ బావా,” అంటుంది.
కార్తీక్ మరింత సరదాగా “ఇలా థ్యాంక్స్ అంటే ఎవరికీ గుర్తు ఉండదు అమ్మా. బావకు ఒక మరదలు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలుసా? గట్టిగా పట్టుకుని, కళ్లల్లోకి చూసి, కన్నుకొట్టి, ‘థ్యాంక్స్ బావా’ అని చెప్పాలి. అప్పుడు కిక్కే వేరుగా ఉంటుంది,” అని అంటాడు. దీప చిరునవ్వుతో “అవునా?” అని అడుగుతుంది.
“ఊహ్,” అంటాడు కార్తీక్ సిగ్గుపడుతూ. అప్పుడు దీప ఒక్కసారిగా ముందుకు వచ్చి కార్తీక్‌ని గట్టిగా కౌగిలించుకుంటుంది. కార్తీక్ ఒక్కసారిగా షాక్ అయ్యి పెద్ద కళ్లతో చూస్తాడు. దీప కళ్లల్లోకి చూస్తూ కొంటెగా నవ్వి “థ్యాంక్స్ బావా,” అని చెబుతుంది. కార్తీక్ ఆనందంతో “ఇది మా మాస్ మరదలు స్టైల్,” అని చెబుతాడు.
జ్యోత్స్న – పారిజాతం సీన్

సీన్ కట్ అయి జ్యోత్స్న దగ్గరకి మారుతుంది. ఆమె పారిజాతంతో “నేను బావ ని ప్రేమించాను కానీ దీప తన్నుకు పోయింది. ఆస్థి కూడా తాత డాడీ పేరు మీద రాసారు. ఇపుడు ఇంట్లో కూడా నాకు మర్యాద లేదు. దీప ని ఇరికించి అమ్మ నాన్న నా వల్ల కలిసేలా చేయాలి అనుకున్నాను కానీ అది కూడా అవలేదు పైగా దీప ఇంట్లో గొప్పది అయిపోయింది . ఇపుడు సీఈఓ గా పదవి కూడా పోతే ఇంకా ఏం చేయలేను. అందుకే తాతతో నువ్వు మాట్లాడి CEO పదవి పోకుండా చేయమని చెప్పు.” అని అంటుంది. పారిజాతం “నేను పాత పారిజాతం లా మారి, నా టాలెంట్ ఉపయోగించి నీకు సాయం చేస్తాను, CEO పదవి పోకుండా చూసుకుంటాను,” అని మాటిస్తుంది.
మనసు మార్చుకోని కాంచన
తర్వాత సీన్ కట్ అయి కాంచన, శ్రీధర్, కార్తీక్, దీప అందరు కాంచన ఇంట్లో నవ్వులు పంచుకుంటూ ఉంటారు. కాంచన మెల్లగా “మన కుటుంబం ఇలాగే ఐక్యంగా ఉండడం నాకు సంతోషంగా ఉంది. మనం ఎల్లప్పుడూ ఇలానే ఉండాలి” అని చెబుతుంది. కార్తీక్ “మనం ఎపుడు ఇలానే సంతోషంగా ఉంటాము అమ్మ, మనం అంత ఎపుడు ఇలానే కలిసి ఉంటాము” అని అంటాడు. వెంటనే శ్రీధర్ కార్తీక్ తో నువ్వు నిజమే చెప్తున్నావా అని అడుగుతాడు. కార్తీక్ అవును అని సమాధానం ఇస్తాడు. అయితే నేను మీతో ఉండొచ్చా అని అడుగుతాడు శ్రీధర్. మనం ఇపుడు కలిసే ఉన్నాము కాకపోతే ఎవరి కుటుంబాలు వాళ్ళవి అని అంటూ శ్రీధర్ ని ఇంటికి వెళ్ళమని అంటాడు కార్తీక్.
శ్రీధర్ “నేను మీతో ఉండటం నీకు ఇష్టం లేదా ” అని అడుగుతాడు. కార్తీక్ “అది నా తల్లి నిర్ణయం” అని సమాధానం ఇస్తాడు. శ్రీధర్ వెంటనే “కాంచన నువ్వు చెప్పు నేను ఇక్కడ ఉండొచ్చా. నీ కోసమే నేను ఎదురు చూస్తున్న. నీ మనసు మార్చుకోవా” అని అడుగుతాడు.

కాంచన కొంచెం భావోద్వేగంతో “నేను ముందే చెప్పాను కదా నా నిర్ణయము. నేను మిమ్మల్ని కావేరికి ఇచ్చేసాను మళ్లీ తిరిగి తీసుకోలేను” అని చెబుతుంది.
శ్రీధర్ ఆవేదనగా “జీవితం ఇలానే కొనసాగుతుందా కాంచన? ప్రపంచం ఏమనుకుంటుందో మనం ఎందుకు పట్టించుకోవాలి? నువ్వు నా జీవితంలో ఉన్నావంటేనే నా జీవితం పూర్తవుతుంది,” అంటాడు. కాంచన కళ్లలో కన్నీళ్లుతో “ప్రపంచం గురించి నేను పట్టించుకోవడం లేదు. సమాజం మనం ఎం చేసిన మనపై పేర్లు పెడుతుంది. మీరు ఇలా అపుడు అపుడు ఇక్కడికి వస్తుంటే ఇరుగు పొరుగు ఏం అనుకుంటారు. నన్ను రెండవ భార్య అనుకుంటారు. కానీ నాకు అది అంత అనవసరం. అందుకే మిమ్మల్ని ఇక్కడికి రానిస్తున్నాను. ఇపుడు మీరు కావేరి భర్తగా ఉన్నారు. నేను ఆ బంధం మధ్యకు రాలేను,” అంటుంది.
శ్రీధర్ నిశ్శబ్దంగా “నువ్వు చెప్పినది నిజం కావచ్చు, కానీ నన్ను తండ్రిగా పిలిచే హక్కు నా కొడుకు కి కూడా ఉండాలి కదా,” అని అంటాడు. కాంచన “ఇది మీ ఇల్లు కూడా, కార్తీక్‌కు తండ్రిగా రావడానికి హక్కు మీకు ఉంది, కానీ నా జీవితంలో భర్తగా రావడానికి మాత్రం లేదు,” అని స్పష్టంగా చెబుతుంది.

శ్రీధర్ కళ్లలో నిశ్శబ్దం “ నీ మనసు ఏనాటికైనా మారుతుందేమో అనే ఆశతో వెళ్తున్నాను, నన్ను కార్తీక్ కి తండ్రిగా ఇక్కడికి రావొచ్చు అన్నావు కదా అది చాలు ” అని అంటాడు.
దీప, కార్తీక్ ఇద్దరూ నిశ్శబ్దంగా చూస్తూ ఉంటారు. శ్రీధర్ అందరికి చెప్పి బయటకు వెళ్తుండగా కాంచన తలదించుకుంటుంది.
అంతటితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది.
Source inspiration: Original story from “కార్తీక దీపం” (JioHotstar). This is a personal written recap and interpretation.
