బ్రహ్మముడి Nov 5th, 2025 బుధవారం ఎపిసోడ్ : గోల్డ్ బాబు ఎంట్రీ తో రాహుల్ కి హ్యాండ్ ఇస్తున్న కుయిలీ… ??? ఫ్లాప్ అయిన రుద్రాణి ప్లాన్…!!!
ఫైల్ మిస్ అవడంతో ఆందోళనలో దుగ్గిరాల కుటుంబం
ఎపిసోడ్ ప్రారంభంలో ఆఫీస్ నుండి శ్రుతి సుభాష్‌కి ఫోన్ చేస్తుంది. ఆమె ఆందోళనగా, మనం డీలింగ్‌కి పంపాల్సిన ఫైల్ కనిపించడం లేదని, అది లేకపోతే కోట్ల రూపాయల నష్టం వస్తుందని చెబుతుంది. సుభాష్‌తో పాటు మొత్తం కుటుంబం ఈ వార్తను స్పీకర్లో విని దిగులుపడుతుంది. రాజ్, కావ్యలు రాహుల్ దగ్గర ఉండటం రుద్రాణీకి ఇష్టం ఉండదు. ఆమె తెలివిగా మాట్లాడుతూ రాజ్, కావ్యలను వెంటనే ఆఫీస్‌కి రప్పించాలని సూచిస్తుంది. అక్కడ వాళ్లు దొరికితే సమస్యలు వస్తాయని కూడా చెబుతుంది.
ఇదే సమయంలో ఇందిరా దేవి, అపర్ణా దేవి, సుభాష్ ముగ్గురూ కూడా రాజ్ లేకపోతే పెద్ద నష్టం వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తారు. స్వప్న మాత్రం వెంటనే రాజ్, కావ్యను రమ్మని చెప్పమని సూచిస్తుంది. తాను తమ నష్టానికి కారణం కావాలనుకోవడం లేదని చెబుతుంది.

రాజ్, కావ్య చర్యలు – ఫైల్ రికవరీ
సుభాష్ వెంటనే రాజ్‌కి కాల్ చేస్తాడు. ఆవేశంగా, “రాజ్ నువ్వు వెంటనే కావ్యను తీసుకుని రా, లేదంటే కోట్ల నష్టం వస్తుంది. నువ్వు తయారుచేసిన ఫైల్ డిలీట్ అయ్యింది” అని చెబుతాడు. రాజ్ ఆందోళనగా వెంటనే బయలుదేరతానని చెబుతాడు. రుద్రాణీ ఈ విషయం విని సంతోషంతో పని అయిపోయిందని అనుకుంటుంది.
అయితే రాజ్ కావ్యతో ఈ విషయం చెప్పినప్పుడు, కావ్య ప్రశాంతంగా స్పందిస్తుంది. “ఆ ఫైల్ కరెక్షన్ కోసం నాకు పంపించారు అదే కదా,” అని అడుగుతుంది. రాజ్ ఆశ్చర్యంతో “అవును కానీ నా దగ్గర ఇంకో కాపీ లేదు” అని సమాధానమిస్తుంది. కావ్య ధైర్యంగా “నా సిస్టమ్‌లో ఉంది. పాస్వర్డ్ చెప్పి ఫైల్ తీసుకోమంటే సమస్య లేదు” అని చెబుతుంది.

వెంటనే ఆమె ప్రకాశ్‌కు కాల్ చేసి, “నా సిస్టమ్‌లో ఫైల్ ఉంది, దాన్ని తీసుకుని వాళ్లకు పంపించండి” అని సూచిస్తుంది. ఆ కాల్ స్పీకర్లో ఉండడంతో రుద్రాణీ విని కోపంతో రగిలిపోతుంది. మిగతావారు మాత్రం కళావతిని పొగుడుతూ ఫైల్ సేవ్ చేయడం వల్ల పెద్ద నష్టం తప్పిందని చెబుతారు. ఇందిరా దేవి “నా మనవరాలా మజాకా” అని గర్వంగా అంటుంది.
రాహుల్‌కి దూరంగా రాజ్, కావ్యలను రప్పించే తన ప్రణాళిక విఫలమవడంతో రుద్రాణీ నిరాశ చెందుతుంది. కానీ మిగతా కుటుంబ సభ్యులు మాత్రం ఈ ఫలితంతో సంతోషపడతారు.
గోల్డ్ బాబు ఎంట్రీతో కుయిలీ వైఖరిలో మార్పు
గోల్డ్ బాబు ఇంటికి వచ్చిన తరువాత, కుయిలీ ప్రవర్తనలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. గోల్డ్ బాబు వైపు ఆకర్షణ పెరుగుతూ, ఆమె ప్రాధాన్యత ఇప్పుడు పూర్తిగా అతనిపైనే ఉంటుంది. రాజ్, కళావతి ఇద్దరూ లింగరాజు మరియు మంగతాయారు పాత్రలలో కుయిలీని గోల్డ్ బాబుతో పరిచయం చేసి వదిలేస్తారు. గోల్డ్ బాబు తన దగ్గర ఉన్న గోల్డ్ బిస్కెట్లను చూపించగానే కుయిలీ మనసు మారిపోతుంది. అవి నిజమైన బంగారమని నమ్మి సగం కరిగిపోతుంది. అవి మాములు డాల్డా బిస్కెట్లు అని తెలియక రాహుల్ కంటే గోల్డ్ బాబు బెటర్ అని అనుకుంటుంది.
గోల్డ్ బాబు, కుయిలీ మధ్య సాన్నిహిత్యం

ఇదే సమయంలో గోల్డ్ బాబు ఖాళీగా సోఫాలో ఒక్కడే కూర్చుని ఉంటాడు. కుయిలీ కాఫీ తీసుకుని వస్తూ “కాఫీ తీసుకోండి బావగారు” అని కాఫీ చేతికి అందిస్తుంది. గోల్డ్ బాబు చిరునవ్వుతో, “ఈ టైమ్‌లో కాఫీ ఏంటి, చీకటి పడుతోంది. నేను పబ్‌కి వెళ్లాలి అనుకుంటున్నా. నా ఫ్రెండ్ ఒకడు ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడదామన్నాడు. వెళ్తే ఎంజాయ్ కూడా చేయొచ్చు అనుకుంటున్నా” అని అంటాడు.
కుయిలీ వెంటనే అతని పక్కనే కూర్చుని చేతి మీద చెయ్యి వేసి, “అయ్యో బావగారు, నేను ఉండగా మీకు ఎంటర్టైన్మెంట్కి కొదవా? మీకు పబ్ వాతావరణం కావాలి కదా, నేను సెట్ చేస్తాను. మీరు ఎంజాయ్ చేసేలా నేనే చేస్తాను” అని అంటుంది. గోల్డ్ బాబు కాస్త సిగ్గుతో తల ఊపుతాడు.
రాజ్, కావ్య – గోల్డ్ బాబుతో చేసిన ప్లాన్
ఆ సమయానికి రాజ్, కావ్య ఆ గదికి వస్తారు. “గోల్డ్ బాబు ఈరోజు మన ప్లాన్ సక్సెస్ చేస్తావు కదా?” అని రాజ్ అడుగుతాడు. గోల్డ్ బాబు నమ్మకంగా “అవును, మీరు ధీమాగా ఉండండి. అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది” అని చెబుతాడు.

అదే సమయంలో రంజిత్ ఫోన్ లో సేటుని డబ్బు తొందర్లోనే తిరిగి ఇష్టము అని మేనేజ్ చేస్తుంటాడు. అపుడే కుయిలీ అక్కడికి వచ్చి నాకు ఒక లక్ష కావాలి అని అడుగుతుంది. రంజిత్ షాక్ అయ్యి వాళళ్ పరిస్థితి గురించి చెప్తాడు. కుయిలీ గోల్డ్ బాబు కి పార్టీ ఏర్పాటు చేయాలి అని దానికి డబ్బు కావాలి అని అంటుంది. పార్టీ అయ్యే లోపు గోల్డ్ బాబు దగ్గర ఉన్నది అంత లాగేసాను అని నమ్మకంగా చెప్తుంది. రంజిత్ రాహుల్ ని ట్రాప్ చేద్దాం ఖర్చు ఉండదు అని చెప్పిన రాహుల్ కంటే రంజిత్ దగ్గర ఎక్కువ ఆస్థి ఉంది అని నేను నా ప్లాన్ ని ఫాలో అవుతాను నువ్వు మనీ ఏర్పాటు చేయాలి అని చెప్పి వెళ్తుంది.
స్వప్న కోసం కుటుంబం వీడియో కాల్
తర్వాత రాజ్, కావ్య తమ గదిలో ఉండగా వారికి ఇందిరా దేవి, అపర్ణా స్వప్న కోసం వీడియో కాల్ చేస్తారు. రాజ్, కావ్య ముసలి వేషాలు వేయడం చూసి వాళ్ళని సరదాగా ఏడిపిస్తారు. అయితే రాజ్, కావ్య స్వప్నకు ధైర్యం చెప్పి ఓదారుస్తూ, “రాత్రికి పార్టీ ఉంది, రాహుల్‌ని లైన్లోకి తీసుకొచ్చేస్తాం. నీ విలువ తెలిసి వాడు తిరిగి వస్తాడు” అని చెబుతారు. స్వప్న కొంత ఆత్మవిశ్వాసంతో తల ఊపుతుంది. వాళ్లు ఫోన్ పెట్టాక స్వప్నకు ఇందిరా దేవి, అపర్ణ మరలా ధైర్యం చెప్తారు.

కుయిలీ పబ్ అరేంజ్మెంట్
తర్వాత కుయిలీ పబ్ డ్రెస్సులో, మోడ్రన్ లుక్‌లో తయారవుతుంది. ఇంట్లోనే పబ్ వాతావరణం సెట్ చేస్తుంది — లైటింగ్, సంగీతం అన్నీ ఏర్పాటుచేస్తుంది. రాహుల్ ఆమెను చూసి ఆశ్చర్యపడతాడు. కుయిలీ నవ్వుతూ “గోల్డ్ బావగారు ఎంటర్టైన్మెంట్ కావాలన్నారు. అందుకే ఇలా రెడీ అయ్యాను” అని చెబుతుంది.
రాజ్, కావ్య వృద్ధుల్లా నటిస్తూ రాహుల్‌కి ఎక్కించేందుకు ప్రయత్నిస్తారు. “చూశావా రాహుల్, ఏరోజైనా నీకోసం ఇంత అందంగా రెడీ అయ్యిందా?” అని చెబుతారు. రాహుల్ అసహనంగా కుయిలీని చూస్తూ ఉండగా, సీన్ అక్కడితో ముగుస్తుంది.

మరుసటి రోజు ఎపిసోడ్ ప్రోమో లో రాహుల్ కుయిలీని వెతుకుతూ గోల్డ్ బాబు గదికి వెళ్తాడు. లింగరాజు, మంగతాయారు వణుకుతున్న స్వరంతో “కుయిలీని ఇందాక గోల్డ్ బాబు గదిలో చూశాం” అని చెబుతారు. రాహుల్ ఆవేశంగా ఆ గదికి వెళ్లి తలుపు తోసేసరికి, గోల్డ్ బాబు గుండెలపై కుయిలీ పడుకుని ఉంటుంది. ఇద్దరూ మత్తులో ఉంటారు. గోల్డ్ బాబు బనియన్ పైన లిప్‌స్టిక్ మరకలు కనిపిస్తాయి. అవి కుయిలీ ముద్దులే అని స్పష్టమవుతుంది. రాహుల్ మనసు కలవరపడుతుంది. రాజ్, కావ్యలు తమ ప్లాన్ సక్సెస్ అయినందుకు సంతోషిస్తారు.
తర్వాత ఇంట్లో పంచాయితీ జరుగుతుంది. రాజ్, కావ్యలు కుయిలీ ముందే రాహుల్‌కి నిజం చెబుతారు. “ఇది నువ్వు అనుకున్నట్టు రిచ్ కాదు రాహుల్. ఇది కేర్ ఆఫ్ ప్లాట్‌ఫామ్. నీ వెనుక ఉన్న డబ్బు కోసమే నీకు దగ్గరైంది” అని రాజ్ (లింగరాజు) అంటాడు. కుయిలీ అవమానంతో మౌనంగా నిలబడుతుంది. పక్కనే గోల్డ్ బాబు తలదించుకుంటాడు.
నిజంగా రాహుల్ కుయిలీ గురించి తెలుసుకున్నాడా లేదో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.
Source inspiration: Original story from “బ్రహ్మముడి” (JioHotstar). This is a personal written recap and interpretation.

