ఇల్లు ఇల్లాలు పిల్లలు Nov 5th, 2025 బుధవారం ఎపిసోడ్ : నర్మద అధికార ప్రతాపం …. తాగి బెదిరించిన సేనాపతి … !!!
సేనాపతి – నర్మద మధ్య తగాదా
ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో, సేనాపతి నర్మదతో మాట్లాడుతాడు. ఆమె తన అధికారంతో ఒక నిర్ణయం తీసుకున్నందుకు, సేనాపతి కోపంగా “ఇది అంతా మీ మామ చేయిస్తున్నాడు” అని వ్యాఖ్యానిస్తాడు. నర్మద శాంతంగా, కానీ ధైర్యంగా స్పందిస్తూ, “ఇది నా డ్యూటీకి సంబంధించిన విషయం. చట్టం ప్రకారం నేను తీసుకున్న చర్య. కుటుంబ విషయాలను ఇందులోకి లాగొద్దు” అని చెబుతుంది. సేనాపతి ఆగ్రహంతో ముందుకు వస్తూ “ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు?” అని బిగ్గరగా అరిచి, నర్మద దగ్గరికి వస్తాడు.
నర్మద వెంటనే తన అధికారబలం చూపిస్తూ, “మిస్టర్ సేనాపతి, మీరు డ్యూటీలో ఉన్న ఒక ప్రభుత్వ అధికారితో మాట్లాడుతున్నారు. గుర్తుంచుకోండి — మీ మాట అదుపులో పెట్టుకోండి. అదుపు తప్పితే పోలీసులు మిమ్మల్ని అదుపులోకి తీసుకోవాల్సి వస్తుంది” అని గట్టిగా హెచ్చరిస్తుంది.

నర్మద చిటికె వేయగానే పోలీసులు వెంటనే సేనాపతిని చుట్టుముట్టుతారు. ఆమె “ఇంకా మాట తప్పితే, విధులకు భంగం కలిగించినందుకు కేసులు నమోదు చేయాల్సి వస్తుంది” అని సీరియస్గా చెబుతుంది. సేనాపతి మాత్రం వెనక్కి తగ్గకుండా, “ఏంటే, మమ్మల్ని బెదిరిస్తున్నావా? మా మీద చర్యలు తీసుకుంటావా? నీకంత ధైర్యం ఉంటే తీసుకో చూద్దాం” అని సవాలు చేస్తాడు. పోలీసుల చేతితో నెట్టడంతో వెనక్కి పడిపోతాడు.
నర్మద ధైర్యంగా “తీసుకెళ్లండి పక్కకి” అని పోలీసులకు చెబుతుంది. ఆ వెంటనే భద్రావతి పేరుతో ఉన్న బోర్డులు పీకించమని ఆదేశిస్తుంది. బోర్డులు తీయగానే, నర్మద ఆవైపు తిరిగి చూసి భద్రావతిని గమనిస్తుంది — అది చూసి భద్రావతి పగతో రగిలిపోతుంది.
అమ్మ నాన్న లని తిట్ల దండకంతో సన్మానించిన వల్లి

నిద్రపోతున్న సమయంలో తలుపు చప్పుడు అవడంతో లేచి తలుపు తీసి వల్లిని చూసి ఆనందిస్తారు ఆమె తల్లిదండ్రులు.అనుకోని సమయంలో రావడంతో ఇబ్బంది ఏమైనా ఉంది ఏమో అని అడుగుతారు. అలా అడగగానే చాలా కష్టపడి నా పెళ్లి చేసారు కదా అందుకే మీకు సన్మానం చేద్దాం అని దండలతో వచ్చాను అని అంటుంది. అది నిజమే అనుకుని వాళ్ళు పొంగిపోయి వల్లి ని పొగుడుతారు. అంతలో వాళ్ళు అబద్దాలు చెప్పి మోసం చేసి ఇలా పెళ్లి చేయడం వల్ల, డబ్బు కోసం భద్రావతి తో డీల్ కుదుర్చుకోవడం వల్ల తనకి ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయో చెప్తుంది.
ఉదయం విశ్వ అడగడంతో అమూల్యని గుడికి తీసుకు వెళ్లడం, అక్కడ విశ్వ అమూల్య కి ప్రపోజ్ చేయడం, అమూల్య కోపంతో విశ్వని తిట్టి రామరాజుకి చెప్పడానికి వెళ్లడం ఇలా అన్ని విషయాలు వివరిస్తుంది. రామరాజుకి అమూల్య జరిగింది అంత చెప్తే గుడికి తీసుకు వెళ్లినందుకు తననే తిడతారు అని తాను కాపురం పడు అవుతుంది అని భయాన్ని వెలిబుచ్చుతుంది. అలా భయంతో బ్రతకడానికి కారణం మీరే అని కోపంగా వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టేసి వెళ్ళిపోతుంది.
సేనాపతి మద్యం మత్తులో గొడవ

రాత్రి అయ్యాక, అవమానం తట్టుకోలేక సేనాపతి బాగా తాగి రామరాజు ఇంటికి వస్తాడు. గట్టిగా అరిస్తూ “రామరాజూ! రా బయటకు! ఈరోజు నువ్వో నేనో తేలిపోవాలి!” అని గర్జిస్తాడు. అతని శబ్దం విని రామరాజు ఇంట్లో ఉన్నవారు ఆందోళన చెందుతారు. రామరాజు ఇంట్లో లేకపోవడంతో , కేవలం వేదవతి మరియు ఆమె కొడుకులు మాత్రమే బయటకు వస్తారు.
సేనాపతి వారిని చూసి “ఏమిట్రా, మీరు వచ్చారు కానీ ఆ పిరికిపంద రామరాజు లోపల దాక్కున్నాడా? మగాడైతే రా బయటకు!” అని అరుస్తాడు. ముగ్గురు కొడుకులు అతని దగ్గరికి వచ్చి “ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావ్?” అని అరుస్తారు. వేదవతి వారిని ఆపుతూ, “ఆగండ్రా! మీ నాన్న ఊర్లో లేరు. ఆయన లేనప్పుడు గొడవ జరిగితే ఆయనకి బాధ కలుగుతుంది” అని చెబుతుంది.

ధీరజ్ ఆగ్రహంగా “ఇంకోసారి ఇలా మా ఇంటికి తాగొచ్చి గొడవ చేస్తే భయపడేలా చేస్తాను” అని అంటాడు. సేనాపతి వ్యంగ్యంగా “దమ్ముంటే రా, నీ తండ్రి లోపల కూర్చుని కొడుకులను పంపుతున్నాడు” అని చెబుతాడు. ముగ్గురు కొడుకులు ఒక్కసారిగా దూసుకొచ్చి అతనిపైకి వెళ్తారు. వారి మధ్య తగాదా జరుగుతుంది. వేదవతి వారిని ఆపుతూ “ఎవరైనా అడుగు ముందుకేస్తే నా మీద ఒట్టు” అని చెబుతుంది.
తరువాత గేట్లు మూసేసి సేనాపతిని ఎదుర్కొంటూ, “మా బతుకేమిటో మేం బతుకుతున్నాం. మా జోలికి రాకుండా ఉంటే మాకు సంతోషం. తాగి మా ఇంటికి వచ్చి గొడవ చేయడం ఎందుకు?” అని ప్రశ్నిస్తుంది. సేనాపతి కోపంగా “మీరు మా జోలికి రావడం లేదా? నీ రెండో కోడలి ద్వారా నా ఆస్తిని సీజ్ చేయించావు కదా?” అని ప్రశ్నిస్తాడు. ఆ మాటకు వేదవతి కుటుంబం ఒకరినొకరు ఆశ్చర్యంగా చూస్తారు.
నర్మద, సేనాపతి మధ్య మాటల యుద్ధం

అప్పుడు నర్మద బయటకు వస్తుంది. “మీరు ప్రభుత్వ భూమిని కబ్జా చేసి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. రూల్స్ ప్రకారం నేను సీజ్ చేశాను. ఇది నా డ్యూటీ. మీరు తాగి ఇళ్లపైకి వస్తే, నేను చట్టబద్ధంగా యాక్షన్ తీసుకుంటాను” అని చెబుతుంది. సేనాపతి ఆగ్రహంతో “ఏంటే, లీగల్గా యాక్షన్ తీసుకుంటావా? కేసు వేస్తావా? నిన్ను ఎవరు ఇలా మాట్లాడిస్తున్నారో, నీ వెనుక ఎవరు ఉన్నారో నాకు తెలుసు. నీ మామ రామరాజే నీ అధికారాన్ని వాడుకుని మాపై పగ తీర్చుకుంటున్నాడు!” అని అంటాడు.
నర్మద స్పష్టంగా “ఇది నా డ్యూటీకి సంబంధించిన విషయం, మా మామయ్యకి ఎలాంటి సంబంధం లేదు” అని చెబుతుంది. సేనాపతి వ్యంగ్యంగా “రామరాజు నీ వెనుక ఉన్నాడని నాకు తెలియదనుకుంటున్నావా? నేను అమాయకుడిని కాదు!” అని అంటాడు. దానికి నర్మద “మీరు అమాయకులు కాదు, మూర్ఖులు కూడా. అందుకే ఎంత చెప్పినా అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు” అని సమాధానమిస్తుంది.

సేనాపతి కోపంతో “ఆ రోజు రామరాజు నా చెల్లెల్ని మాయ చేసాడు. ఇప్పుడు అతని కొడుకు నా కూతుర్ని లేపుకెళ్లాడు. ఇంకా మా పరువు తీయాలని చూస్తున్నారు. మా పరువు జోలికి వస్తే ప్రాణాలు తీయడానికి వెనకాడను” అని అంటాడు. నర్మద “ఏంటీ బెదిరిస్తున్నారా?” అని తిరిగి అడుగుతుంది. సేనాపతి “బెదిరింపు కాదు, వదిలిపెట్టను. నీ భర్తనూ, నిన్నూ వదిలిపెట్టను. ప్రతీకారం తీర్చుకుంటాను” అని హెచ్చరిస్తాడు.
సేనాపతి వెళ్లిపోతూ “త్వరలోనే ప్రతీకారం ఎలా ఉంటుందో చూపిస్తాను” అని చెబుతాడు. నర్మద మాత్రం తల ఎత్తి గర్వంగా నిలబడుతుంది.
ధీరజ్ ని కొట్టిన ప్రేమ
కోపంతో గదిలోకి వచ్చిన ధీరజ ప్రేమ తో వల్ల నాన్న గురించి “మీ నాన్న కి బుద్ది, సిగ్గు లాంటివి ఏం లెవా? మర్యాద అనేది తెలుసా? ఆడవాళ్ళతో తాగి మాట్లాడకూడదు అని తెలీదా? సభ్యత సంస్కారం లేకుండా ఒక పక్క చెల్లి, ఇంకో పక్క కూతురు లాంటి అమ్మాయితో ఇలానే నా మాట్లాడేది ” అని అడుగుతాడు. ప్రేమ తండ్రి చేసిన పనికి సిగ్గుతో ఇపుడు ఆ విషయం గురించి ఇంకా వద్దు వదిలేయ్ అని చెప్తూనే ఉంటుంది.

కానీ ధీరజ్ అవి ఏమి పట్టించుకోకుండా ప్రేమ తండ్రి గురించి, ఆయన చేసిన తప్పులు గురించి తిడుతూనే ఉంటాడు. ఇంకా దసరా రోజు విశ్వతో జరిగిన గొడవ గురించి కూడా మాట్లాడి మీ ఇంట్లో వాళ్ళు అంతే అంతేనా అంటూ దెప్పి పొడుస్తాడు. మా అమ్మ ఆపకపోయి ఉంటే ఈరోజు మీ నాన్నకి తగిన బుద్ధి చెప్పే వాళ్ళము అని అంటాడు. అప్పటికి ప్రేమ ఇపుడు ఇంకా జరిగిఆన్ దాని గురించి వద్దు అని ఎంతగా బ్రతిమిలాడినా పట్టించుకోకుండా తనని కూడా తప్పు పడతాడు. నువ్వు కూడా అదే రక్తం కదా అందుకే తప్పవు చేసిన వల్లనే వెనకేసుకొని వస్తున్నావ్ అని అంటాడు.
దానితో బాగా కోపంగా ఉన్న ప్రేమ ధీరజ్ ని కొరికి బాగా కొట్టి, ధీరజ్ కి దొరకకుండా తప్పించుకుని పరిగెత్తి బయటికి వెళ్ళిపోతుంది.
వేదవతి ఆందోళన
సేనాపతి వెళ్లిపోయాక వేదవతి భయపడుతూ తనలో తాను ఆలోచిస్తుంది. “నా భర్త రామరాజు ఎక్కడున్నాడో, ఆ సేనాపతి ఏం చేస్తాడో తెలియదు” అని భయపడుతుంది. ఆమె రామరాజు ప్రాణాల కోసం ఆందోళన చెందుతుంది.
ఇంతలో నర్మద గదిలోకి వస్తూ “ఇంత టైమ్ అయ్యింది, ఇంకా నిద్రపోలేదేంటీ?” అని అడుగుతుంది.
వేదవతి చల్లగా “నీతో మాట్లాడాలి” అని చెబుతుంది.
ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది.
Source inspiration: Original story from “ఇల్లు ఇల్లాలు పిల్లలు” (JioHotstar). This is a personal written recap and interpretation.

