చిన్ని Nov 6th, 2025 గురువారం ఎపిసోడ్ : మధు పై చేయి చేసుకున్న మ్యాడీ….!!!
మ్యాడీ, వరుణ్ ల ముందు లోహిత నటన
ఎపిసోడ్ ప్రారంభంలో లోహిత కళ్లలో నీరుతో తన తల్లి గురించి మాట్లాడుతుంది. లోహిత తన తల్లి గురించి చెప్తూ తనపై కోపంతో ఉన్న తల్లి ఇప్పుడు ఆహారం తీసుకోవడం మానేసిందని, మందులు వేసుకోవడం ఆపేసింది అని, రక్తపోటు ఎక్కువ అయింది అని, దాని వాళ్ళ కళ్ళు తిరిగి కిందపడిపోయిందని, తన తల్లి ఇప్పుడు శారీరకంగా బలహీనంగా ఉందని ఆవేదనతో చెబుతుంది.
తన అన్నయ్య బిజినెస్ పనులు అన్ని మానేసి విదేశీ పర్యటనలను రద్దు చేసుకుని అమ్మతోనే ఉన్నాడు అని చెబుతూ లోహిత బాధతో “నాకు అమ్మను చూడాలని ఉంది, ఆమె దగ్గరకు వెళ్లాలని ఉంది” అని చెప్పుతుంది.

దానికి వరుణ్ ఆమెకు ధైర్యం చెబుతూ — “అయితే వెళ్లి ఒకసారి కలవొచ్చు కదా” అని సమాధానం ఇస్తాడు. కానీ లోహిత భయపడుతూ, “ఇప్పుడు వెళ్తే, నాకు పెళ్లయిందని తెలిసిపోతుంది. నన్ను ఇంకా తిరిగి పంపించరు. అమ్మ గుండె ఆగిపోతుంది” అని ఆందోళన వ్యక్తం చేస్తుంది.
మ్యాడీ హామీ – ఒక వారంలో సమస్య పరిష్కారం
మ్యాడీ ఆమెను నచ్చచెప్తూ “ఈ విషయంపై ఇక ఆలోచించకు. ఒక వారంలో మా నాన్నని ఒప్పిస్తాను. మనం మా ఇంటికి వెళ్ళిపోతాము. ఆ తర్వాత మనం నీ ఇంటికి వెళదాము. మీ అమ్మ, మీ అన్నకు మొత్తం విషయం నేను చెబుతాను” అని హామీ ఇస్తాడు.
ఆ మాట విని లోహిత కళ్లలో ఆశతో “నిజంగానా? వారం రోజుల్లో అన్నీ సర్దుకుంటాయా?” అని అడుగుతుంది. మ్యాడీ “అవును, ఇది నా ప్రామిస్” అని చెబుతాడు.
లోహిత ఆనందంతో “థాంక్స్ , మ్యాడీ” అని అంటుంది. మ్యాడీ సున్నితంగా నవ్వుతూ “పర్వాలేదు” అని సమాధానం ఇస్తాడు. లోహిత తన మనసులో “వారం రోజుల్లో నా కోరిక నెరవేరుతుంది. నేను పెద్ద ఇంట్లో నా భర్తతో కలిసి ఉండబోతున్నాను” అని ఆనందంగా అనుకుంటుంది.
అంతలో మ్యాడీ మధు కోసం ఇంట్లో వెతుకుతుండగా మధు ఇంట్లో లేదు అని మ్యాడీకి తెలుస్తుంది. చెప్పకుండా వెళ్ళింది అంటే మల్లి మా ఇంటికి వెళ్ళింది ఏమో అక్కడ ఏం అవుతుందో అని మ్యాడీ టెన్షన్ పడుతుంటాడు.వెంటనే మధుకి ఫోన్ చేస్తాడు — కానీ నెట్వర్క్ అందుబాటులో లేదు. అసహనంతో “పాపం, నెట్వర్క్ కూడా లేదు” అని అసహనంగా అనుకుంటాడు. చివరికి బైక్ తీసుకొని స్వయంగా బయల్దేరిపోతాడు.
దేవతో కలిసి మ్యాడీ ఇంటికి వెళ్లిన మధు

ఇంతలో దేవేంద్రవర్మ ఇంట్లో మధు దేవాతో కలిసి కనిపిస్తుంది. దేవా ఆమెను తీసుకురావడంతో నాగవల్లి, శ్రేయ ఇద్దరూ ఆశ్చర్యపోతారు. మధు చిరునవ్వుతో నమస్కరిస్తుంది. దేవా, ఆమెను ఆహ్వానించి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోమంటాడు.
నాగవల్లి కాస్త కోపంగా “ఇది మన అతిథి కాదు, దీన్ని ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారు?” అని అడుగుతుంది. దేవా ప్రశాంతంగా “నేను మధుకి ఆ స్కాం కేసులో సహాయం చేశాను కదా. దానికి మధు, మ్యాడీ థాంక్స్ చెప్పడానికి వచ్చారు” అని చెబుతాడు. ఇంకా చెప్తూ “ఇపుడు కూడా నాతో ఎదో మాట్లాడాలి అని పార్క్ దగ్గరికి వచ్చింది. నేను కూడా నీకు చెప్పాను కదా మధు ని అడ్డం పెట్టుకుని మ్యాడీని ఇంటికి రప్పిస్తాను అని” అని అంటాడు.
దేవా “పద ఇప్పుడు టిఫిన్ చేద్దాం” అని చెబుతాడు. నాగవల్లి మౌనం చెరిపి “ఆమెతో కలిసి తినడం నాకు ఇష్టం లేదు” అని వెళ్లిపోతుంది.
మ్యాడీని క్షమించమని దేవాని రిక్వెస్ట్ చేసిన మధు
డైనింగ్ టేబుల్ దగ్గర దేవా స్వయంగా మధుకి వడ్డిస్తాడు. ఆమె కంగారుగా “మీరు నాకు వడ్డించడం ఎందుకు అంకుల్?” అని అడుగుతుంది. దేవా చిరునవ్వుతో “రేపు నేను మీ ఇంటికి వస్తే, నువ్వే వడ్డిస్తావు కదా” అని సమాధానం ఇస్తాడు. తరువాత దేవా మధుని సున్నితంగా ప్రశ్నిస్తాడు “ఏదో మాట్లాడాలని అనుకున్నావు కదా, ఏమిటది?” అని.
మధు కాస్త తడబడుతూ చెబుతుంది “నేను కష్టంలో ఉంటే మీరు సహాయం చేసారు. ఇప్పుడు మ్యాడీ కూడా కష్టాల్లో ఉన్నాడు. తల్లిదండ్రులు లేక దూరంగా ఉండటం ఎవరికైనా కష్టం కదా అంకుల్. మీరు ఒకసారి మ్యాడీ గురించి ఆలోచించండి. మ్యాడీ రోజూ మిమ్మల్నే తలచుకుంటున్నాడు, బాధపడుతున్నాడు” అని వివరిస్తుంది.

ఆమె మరింతగా చెబుతుంది — “మ్యాడీ పెద్ద కుటుంబంలో పెరిగి అన్ని సౌకర్యాలకు అలవాటు పడినవాడు. ఇప్పుడు ఏ సౌకర్యం లేని మా ఇంట్లో ఉంటున్నాడు. అది బయటికి చెప్పకపోయినా చాలా కష్టం. ఆయన వరుణ్, లోహిలతో కలిసి ఈ ఇంట్లోకి రావాలనుకుంటున్నాడంటే, వాళ్లకు కూడా మీ ప్రేమ దక్కాలని కోరుకుంటున్నాడు” అని చెబుతుంది.
చివరగా ఆమె అభ్యర్థనగా “ఒక్కసారి మ్యాడీతో ప్రశాంతంగా మాట్లాడండి. తన మనసు మీకు అర్థమవుతుంది” అని అంటుంది. దేవా కొద్దిసేపు ఆలోచించి “సరే, మాట్లాడుతాను” అని చెబుతాడు. మధు ఆనందంతో “థాంక్స్, అంకుల్” అని కృతజ్ఞతలు తెలుపుతుంది.
శ్రేయ – లోహిత కుట్ర
దేవా, మధు నవ్వుతూ మాట్లాడుతుండగా, పక్కనే నిలబడి ఉన్న శ్రేయ వారి ఫోటోలు తీస్తుంది. కొద్దిసేపటికి ఆ ఫోటోలు లోహితకు పంపుతుంది. లోహిత వాటిని చూసి షాక్ అవుతుంది. వెంటనే శ్రేయకి కాల్ చేస్తుంది. శ్రేయ భయంతో “మా మామయ్య ఆమెను కారులో తీసుకువచ్చాడు, డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి టిఫిన్ చేశాడు” అని చెబుతుంది.

లోహిత అది విన్న వెంటనే విస్మయంతో “ఏమిటి శ్రేయ? మధు మీ మామయ్యతో ఎలా?” అని ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఆమె శ్రేయని రెచ్చగొడుతూ “మ్యాడీని ట్రాప్ చేయడానికి ఇదంతా చేస్తోంది. అలా జరిగితే మన ఇద్దరి జీవితాలు నాశనం అవుతాయి” అని అంటుంది. శ్రేయ భయపడి “ఇలా అయితే నా బావ నా దగ్గరకి రాడు” అని భయంతో చెప్తుంది.
లోహిత ధైర్యం చెబుతూ “భయపడకు. నేను మధు ప్లాన్‌ని తిప్పి కొడతాను. ఏదో ఒకటి చేసి తనని మన జీవితాల్లోకి అడ్డం రాకుండా చేస్తాను” అని చెబుతుంది.
మధు మీద చేయి చేసుకున్న మ్యాడీ
ఇంతలో మ్యాడీ కోపంగా వెళ్తుండగా మధు ఎదురవుతుంది. “నువ్వు ఎక్కడికి వెళ్లావు?” అని ప్రశ్నిస్తాడు. మధు ఆనందంగా “నేను మీ ఇంటికి వెళ్లాను” అని చెబుతుంది. మ్యాడీ కోపాన్ని ఆపుకోలేక ఆమెను కొడతాడు. వెంటనే “నేను వెళ్లవద్దని చెప్పినా వెళ్ళావా? వాళ్లు ఒప్పుకోరని తెలిసినా ఎందుకు వెళ్లావు?” అని కోపంతో మాట్లాడుతాడు. మధు మౌనం వహిస్తుంది. మ్యాడీ రియలైజ్ అయ్యి “క్షమించు మధు, కోపంలో నిన్ను కొట్టాను. ఇది మళ్లీ జరగదు” అని చెబుతాడు.

మధు శాంతంగా స్పందిస్తుంది — “ఎందుకు క్షమాపణ? నువ్వు కోపంతో కాదు, బాధతో కొట్టావు. నువ్వు చెప్పినది సరైనదే. నేను తప్పు చేశాను” అని. ఆమె చిరునవ్వుతో “మొన్న నేను నిన్న తిట్టాను, ఈరోజు నువ్వు నన్ను కొట్టావు. అంటే మనిద్దరికీ ఒకరిపై ఒకరికి హక్కు ఉంది కదా” అని చెబుతుంది. మ్యాడీ అడుగుతాడు ” నీకు నా మీద కోపం లేదా ” అని. లేదు సంతోషంగా ఉంది అని మధు సమాధానం ఇస్తుంది.
తర్వాత ఆమె ఉత్సాహంగా చెబుతుంది “నీకు ఒక మంచి వార్త ఉంది. నేను మీ నాన్నతో మాట్లాడాను. ఆయన చాలా ప్రేమగా మాట్లాడారు” అని. మాధవ్ ఆశ్చర్యంతో చూస్తూ నిలబడి ఉంటాడు. మధు నవ్వుతూ “ఇదే మన మొదటి విజయం” అని చెబుతుంది. మ్యాడీ సంతోషంతో మధు ని కౌగిలించుకుంటాడు.
అంతటితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది.
Source inspiration: Original story from “చిన్ని” (JioHotstar). This is a personal written recap and interpretation.
