బ్రహ్మముడి Nov 7th, 2025 శుక్రవారం ఎపిసోడ్: బుద్ధి తెచ్చుకున్న రాహుల్ … !!! చివరి అవకాశం ఇచ్చిన స్వప్న ….!!!!
రాజ్, కావ్య, రాహుల్‌తో మాట్లాడుతారు. వారు రాహుల్‌కు కుయిలి గురించి చెబుతూ ఆమె వద్ద డబ్బు లేనని, రాహుల్ ఆస్తిని పొందాలనే ప్రయత్నంలో ఉందని అంటారు. ఇంకా రాజ్ కుయిలీ గురించి కొంచెం దారుణంగా మాట్లాడుతుంటే ఆ మాటలు వినలేక కళావతి చెవులు మూసుకుంటుంది. రాజ్ రాహుల్ వైపు తిరిగి “ఇలాంటి మహిళకు నా ఆస్తి ఇవ్వను, నువ్వు ఆమెను పెళ్లి చేసుకుంటే నువ్వు కూడా సుఖపడలేవు” అని చెబుతాడు. అనంతరం కావ్యతో కలిసి వెళ్లిపోతాడు.
గోల్డ్ బాబు కూడా అక్కడి నుంచి వెళ్లిపోతూ, కుయిలిని చూసి కొంచెం సిగ్గుతో నవ్వుతాడు. రాజ్ అతన్ని పిలుస్తూ బయటికి తీసుకెళ్తాడు. వారందరూ బయటికి వెళ్లిన తరువాత రాహుల్, కుయిలి ఇద్దరే అక్కడ మిగిలిపోతారు.

బయటకు వెళ్లిన రాజ్, కావ్య, గోల్డ్ బాబు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ప్లాన్ సక్సెస్ అయిందని సంతోషపడతారు. “రాహుల్ ఇక అక్కడ ఉండడు, కచ్చితంగా వెనక్కి వస్తాడు” అని రాజ్ చెబుతాడు. కానీ వారి మాటలన్నీ అక్కడ దగ్గరలో ఉన్న రంజిత్ వింటాడు. రాజ్, కావ్య విగ్‌లు తీసేసి మాట్లాడటం కూడా రంజిత్ చూసేస్తాడు. అతనికి వీరంతా ఒక నాటకం ఆడుతున్నారని అర్థమవుతుంది.
రంజిత్ తనలో తాను “వీళ్లంతా రాహుల్‌ను తీసుకు వెళ్ళడానికి డ్రామా ఆడారా? మరి కుయిలి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో?” అని అనుకుంటాడు. ఆ ఆలోచనతో లోపలికి వెళ్తాడు. లోపలికి వచ్చిన రంజిత్ కుయిలి మరియు రాహుల్ మధ్య గొడవ జరుగుతుండటం చూస్తాడు.

రాహుల్ కుయిలిపై కోపంగా మాట్లాడుతూ “నేనంటే ఇష్టం అంటే నమ్మాను. నా భార్యకు విడాకులు ఇవ్వమన్నావ్, ఇచ్చేశాను. కానీ నాకంటే మించినవాడు దొరకగానే వెళ్ళిపోయావు. నువ్వు బజారుదానికంటే హీనం” అని చెబుతాడు. కుయిలి కూడా వెనుకడుగు వేయకుండా “నువ్వే డబ్బు కోసం నా వెంట పడ్డావు, నన్ను బజారుదానిని అన్నావ్, నిన్ను ఏం అనాలి?” అని సమాధానమిస్తుంది.
రాహుల్ కోపంగా “నేను నీలా కాదే. నా భార్యకు విడాకులు ఇచ్చి నిన్ను పెళ్లి చేసుకుందామనుకున్నాను. కానీ నువ్వు మొగుడ్ని పక్కనే పెట్టుకుని వాడిని ‘మావయ్యా’ అని పిలుస్తూ డ్రామా ఆడావ్” అని చెబుతాడు. కుయిలి “అవును, నిన్ను ట్రాప్ చెయ్యాలనుకున్నాను. కానీ నువ్వే నాకు గోల్డ్ బాబుని పరిచయం చేసావ్, వాడినే పడగొట్టాను. నీలాంటి వాళ్లు నా చేతిలో చాలామంది అవుట్ అయ్యారు” అని అహంకారంగా చెబుతుంది.

ఈ మాటలన్నీ రంజిత్ కిటికీ చాటున దాక్కుని వీడియోగా రికార్డ్ చేస్తాడు. రాహుల్ “ఇక నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు” అని చెబుతాడు. కుయిలి “పోరా” అని వెటకారంగా అంటుంది. రాహుల్ “నా పెళ్లాం దేవతే, ఆమెను బాధపెట్టి తప్పు చేశాను” అని పశ్చాత్తాపంతో చెబుతాడు. కుయిలి వెటకారంగా “ఇప్పుడే గుర్తొచ్చిందా నీ భార్య? ఆమె కూడా నిన్ను మోసం చేసే పెళ్లి చేసుకుంది కదా” అని అంటుంది.
ఆ మాట విన్న రాహుల్ ఆవేశంతో కుయిలిని కొడతాడు. ఆమె నేలపై పడిపోతుంది, తలకు గాయం అవుతుంది. రంజిత్ వీడియో తీస్తూనే ఉంటాడు. రాహుల్ “ఇంకోసారి నా భార్య గురించి మాట్లాడితే చంపేస్తాను” అని చెప్పి వెళ్లిపోతాడు. రంజిత్ మాత్రం చల్లగా మొత్తం వీడియో రికార్డ్ చేసుకుంటాడు.
కుయిలి రక్తంతో బాధపడుతుంటుంది.

ఇదే సమయంలో దుగ్గిరాల కుటుంబంలో రాజ్, కావ్య లు ఎలా కుయిలీ గుట్టు బయట పెట్టారో చెప్తుంటే అందరు విని సంతోషిస్తుంటారు. రుద్రాణి కూడా వాళ్ళకి మంచి పని చేసారు అని అంటుంది. అంతలో రాహుల్ తన తప్పును గ్రహించి పశ్చాత్తాపంతో ఇంటికి వస్తాడు. గుమ్మం దగ్గర ఆగుతాడు. రాజ్ అతన్ని లోపలికి రావాలని చెబుతాడు. కానీ స్వప్న అతన్ని ఆపి “నీ తప్పులు ఎప్పటిలాగే కొనసాగుతున్నాయి. నీతో జీవించడం న వాళ్ళ కాదు. నువ్వు పుట్టింది తప్పులు చేయడానికి. కూతురు పుట్టిన నువ్వు మారలేదు. నీ లాంటి వాడిని నా కూతురు కి తండ్రి అని నేను చెప్పుకోలేను” అని అంటుంది.
రాహుల్ “నేను మారిపోయాను. ఇంకా ఎపుడు తప్పు చేయను. ఒక్క అవకాశం ఇవ్వు. నీకు నచ్చినట్టే ఉంటాను. ఈసారి తప్పు చేస్తే నువ్ ఏ శిక్ష వేసిన భరిస్తాను” అని బతిమిలాడుతాడు. రాజ్, కావ్య కూడా అతనికి మద్దతు ఇస్తారు. స్వప్న కొంత ఆలోచించి “ఇది నీకు చివరి అవకాశం” అని చెబుతుంది.

రాహుల్ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత రుద్రాణి అతన్ని మందలిస్తుంది. “ఇలాంటివి ఎప్పుడు ఆపుతావ్? నేను ఎంత చెప్పాను బయట ఎవరినో నమ్మడం ఏంటి? వద్దు అని. నా మాట విన్నావా? నా మాట విని ఉంటే ఈపాటికి మనం ఈ ఇంట్లో మన ప్రతాపం చూపించి ఉండే వాళ్ళము” అని తిడుతుంది. రాహుల్ “నాకు తెలిసింది, నేను మారిపోయాను. ఇక మనకు మంచే జరుగుతుంది” అని చెబుతాడు. రుద్రాణి “కుయిలి చేసిన మోసం ఇదేరా. నమ్మిన వాళ్లే ఎక్కువగా మోసం చేస్తారు. అందుకే నేను కూడా ఈ ఇంట్లో అదే చేసి నిన్ను సెటిల్ చేయాలి అని చూస్తున్న” అని చెబుతుంది.
రాహుల్ “నన్ను మనిషిగా గుర్తించారు. నాకు ఇపుడు ఒక అవకాశం ఇచ్చారు. ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వు ఏం చేయాలి అనుకుంటున్నావు మామ్?” అని అడుగుతాడు. రుద్రాణి “ఈ ఇంటికి వారసుడిగా నిన్ను నిలబెట్టాలి. ఇప్పుడు నీకు ఇచ్చిన ఈ అవకాశం వృథా కాకూడదు. నువ్వు నేను చెప్పినట్టు చెయ్ చాలు” అని చెప్పి వెళ్ళిపోతుంది.
అక్కడితో ఈరోజు బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
మరుసటి రోజు ఎపిసోడ్ ప్రోమోలో పోలీసులు వచ్చి రాహుల్‌ను అరెస్ట్ చేస్తారు. వాళ్లు “కుయిలి చనిపోయింది. ఆమెను నువ్వే చంపావ్. వీడియో సాక్ష్యం ఉంది” అని చెబుతారు.
Source inspiration: Original story from “బ్రహ్మముడి” (JioHotstar). This is a personal written recap and interpretation.

