ఇంటింటి రామాయణం Nov 8th, 2025 శనివారం ఎపిసోడ్: మీనాక్షిని చంపాలని ప్రయత్నించిన చక్రధర్ …. !!! చక్రధరే తన తండ్రి అని తెలుసుకున్న అవని … !!!
మీనాక్షి అవని దగ్గరే ఉందని విషయం చక్రధర్‌కు పల్లవి ద్వారా తెలుస్తుంది. అదే సమయంలో పల్లవి తన తండ్రి ఫొటో చూపించడంతో, ఆ ఫొటోలో చక్రధర్నే కనిపించడం చూసి మీనాక్షి ఒక్కసారిగా షాక్‌కి గురవుతుంది. ఆమెకు గుండెల్లో బరువుగా అనిపించి, కళ్లు తిరిగి పడిపోతుంది. ఆ దృశ్యం చూసిన అవని భయంతో పరుగెత్తుకుంటూ వస్తుంది, ఎంత పిలిచినా స్పందించకపోవడంతో వెంటనే మీనాక్షిని హాస్పిటల్‌కి తీసుకెళ్తుంది.
హాస్పిటల్లో డాక్టర్లు పరీక్షించి “ఏ ఇబ్బంది లేదు, టెన్షన్ వల్లే బీపీ పెరిగింది” అని చెబుతారు. ఆ మాట విని అవని ఊపిరి పీల్చుకుంటుంది. తల్లి మంచం పక్కనే కూర్చుని ఉండిపోతుంది. అంతలో అవని అత్త మామలు ఫోన్ చేసి మీనాక్షికి ఎలా ఉంది అని అడుగుతారు. పర్లేదు అని చెప్తుంది మీనాక్షి. అదే సమయంలో చక్రధర్ దగ్గర పనిచేసే వ్యక్తి తన భార్యను అదే హాస్పిటల్‌కి తీసుకుని వస్తాడు. మీనాక్షి ఆ వ్యక్తి కంట పడుతుంది. వెంటనే అతను చక్రధర్‌కి ఫోన్ చేసి “మీ భార్య ఇక్కడ హాస్పిటల్లో ఉంది” అని చెబుతాడు. దానికి చక్రధర్ “నేను వస్తున్నా, ఆమె ఎక్కడికీ వెళ్లకుండా చూసుకో” అని చెబుతాడు.

అంతలో కమల్, అక్షయ్, పల్లవి, శ్రీకర్ , శ్రేయ అందరు ఇంటికి చేరతారు. ఇంటికి రాగానే విషయం తెలిసి అవని ఒంటరిగా వెళ్ళింది అని తెలుసుకుని అక్షయ్, కమల్ టెన్షన్ పడతారు. శ్రేయ అక్షయ్ తో ” ఎందుకు టెన్షన్. పెద్దావిడ కదా ఊరికే కళ్ళు తిరిగి ఉంటాయి. ఎదో హార్ట్ అటాక్ వచ్చినట్టు ఎందుకు అంతా కంగారు? అయిన మీరు మొన్నటి వరకు అవని అక్క చేసిన తప్పులకి తనని దూరం పెట్టారు. ఇపుడు ఏంటి అన్ని మర్చిపోయి తన మీద అంతా ప్రేమ చూపిస్తున్నారు? అవని వల్ల అమ్మ వచ్చాక మరి ఎక్కువ చూపిస్తున్నారు ” అని తప్పు పడుతుంది. పల్లవి కూడా శ్రేయ మాటలకు వంత పాడుతూ ” అవని అక్క ఏం చేసిన బాగానే ఉంటుంది. ఎన్ని తప్పులు చేసిన ఏం అన్నారు.మనల్ని మాత్రం అన్నిటికి తప్పు పాడుతూ ఉంటారు” అని అంటూంది.
దానికి అక్షయ్ ఆవేశంతో “మీకు అలా అనడానికి కొంచము అయిన సిగ్గు ఉండ? మీరు ఏం ఏం తప్పులు చేసారో మీకు తెలీదా ? పల్లవి నిన్ను ఎందుకు కమల్ ఇంట్లో నుండి పంపేశాడు? శ్రేయ ఇలాంటి పరిస్థితిలో కూడా నువ్వు నీ గురించి తప్ప ఇంట్లో వాళ్ల గురించి ఎపుడైనా ఆలోచించావా? అవని గురించి మాట్లాడే హక్కు మీకు లీవుడ్. తాను తప్పు చేసింది అనుకున్న కానీ తాను ఎలాంటి తప్పు చేయదు అని ఇపుడు నేను తెలుసుకున్న. ఒక భర్తగా భార్య మీద ప్రేమ చూపించడం కూడా తప్పు అయినట్టు మాట్లాడుతున్నారు. ఇంకో సరి అవని గురించి మాట్లాడితే మర్యాదగా ఉండదు” అని ఇద్దరికీ గట్టిగా బుద్ధి చెవుతాడు. కమల్ కూడా ఇది ముందే చేసి ఉంటే ఇవాళ వీళ్ళు ఇలా రెచ్చిపోయే వాళ్ళు కాదు, నువ్వు ఇపుడు అయిన వదినని అర్ధం చేసుకున్నందుకు నాకు సంతోషంగా ఉంది అని అంటాడు.

ఇంతలో మీనాక్షి సృహలోకి వస్తుంది. “నేను ఇక్కడ ఎందుకున్నా? ఏమైంది నాకు?” అని ఆశ్చర్యంగా అడుగుతుంది. అవని “ఏం కాలేదు అమ్మా, కళ్లు తిరిగాయి అంతే” అని చెబుతుంది. డాక్టర్లు కూడా అదే చెబుతారు — “బీపీ పెరగడం వల్ల కళ్లు తిరిగాయి, ఎక్కువగా ఆలోచించవద్దు” అని సూచిస్తారు.
అవని తల్లికి ధైర్యం చెబుతూ “ఏమిటమ్మా, నీకు ఏదైనా సమస్య ఉందా? ఎందుకు అంతగా టెన్షన్ పడుతున్నావ్? నాతో చెప్పవా. నాకు తెలియకూడని విషయం ఏదీ ఉండదు కదా” అని అడుగుతుంది. కానీ మీనాక్షి మాత్రం ఏమీ చెప్పకుండా మౌనంగా ఉంటుంది.
ఇంతలో అవనిని టాబ్లెట్స్ తెమ్మని నర్స్ చెప్పడంతో అవని బయటికి వెళ్తుంది. అపుడే అక్షయ్ ఫోన్ చేస్తాడు. అవని ఫోన్ తీసుకుని “అమ్మ ఇప్పుడే సృహలోకి వచ్చింది” అని చెబుతుంది. అక్షయ్ “నేను వస్తున్నా” అని చెబుతాడు. దానికి అవని “వద్దండి, నేను అమ్మను తీసుకువచ్చేస్తా, మీరు కంగారు పడొద్దు” అని సమాధానం ఇస్తుంది. అక్షయ్ “సరే, త్వరగా రా” అని చెబుతాడు.
అవని మందులు కోసం బయటకు వెళ్లడంతో హాస్పిటల్లో ఒంటరిగా ఉన్న మీనాక్షి గతం గుర్తుచేసుకుంటూ, చక్రధర్ పేరు విన్నప్పటి నుంచి ఎందుకంత భయపడిందో ఆలోచిస్తూ ఉంటుంది. అవని కూడా బయటికి వెళ్లి ఆలోచిస్తుంది — “అమ్మ చక్రధర్ పేరు విన్న వెంటనే కళ్లు తిరిగి పడిపోయింది. బాబాయ్ ఫొటో చూసి కూడా భయపడింది. అమ్మకి ఆయన గురించి ఏమైనా తెలుసా? వీళ్లిద్దరి మధ్య ఏమైనా సంబంధం ఉందా?” అని.
మందులు తీసుకోవడానికి అవని మెడికల్ స్టోర్‌కి వెళ్తుంది. అదే సమయంలో చక్రధర్ హాస్పిటల్‌కి చేరుకుంటాడు. మీనాక్షి ఉన్న గది ఎక్కడుందో అడిగి తెలుసుకొని నేరుగా ఆ రూమ్‌కి వెళ్తాడు. తలుపులు వేసేసి నెమ్మదిగా లోపలికి వెళ్తాడు.

మీనాక్షి కళ్లెత్తి చూసిన వెంటనే భయంతో గట్టిగా ఉలిక్కిపడుతుంది. లేచి బయటకు వెళ్లాలని చూస్తుంది. కానీ చక్రధర్ ఆమెను వెనక్కి నెట్టేస్తాడు. “లేవకు, సిటీకి ఎందుకు వచ్చావ్?” అని కఠినంగా అడుగుతాడు. మీనాక్షి “నేను మీకోసం రాలేదు” అని చెబుతుండగా, చక్రధర్ మధ్యలోనే అడ్డుకుంటూ “నువ్వు వచ్చిందీ అందరికీ నేను నీ భర్తని చెప్పడానికి కదా? నీకు ముందే చెప్పాను కదా — నా కంటికి కనిపిస్తే చంపేస్తానని. అయినా వచ్చావంటే నీకు చావంటే భయం లేదా?” అని గట్టిగా అంటాడు.
అతను ఇంకా కోపంగా మాట్లాడుతూ “నువ్వు బతికి ఉన్నంత కాలం నాకు ప్రమాదమే. అందుకే నిన్ను నీ కొడుకునీ చంపేయాలని అనుకున్నాను. కానీ ఆ రోజు తప్పించుకున్నావ్. ఈసారి ఆ తప్పు జరగదు. నా పరువు కాపాడుకోవాలంటే నువ్వు చావాలి” అని చెబుతూ దిండుతో మీనాక్షిని నొక్కి చంపే ప్రయత్నం చేస్తాడు.
మీనాక్షి భయంతో “వద్దూ, నన్నేం చేయొద్దు” అని వేడుకుంటుంది. కానీ చక్రధర్ ఆగడు. అదే సమయంలో అవని గదిలోకి వస్తుంది. ఆ దృశ్యం చూసి షాక్ అవుతుంది. “రేయ్, మా అమ్మని వదిలెయ్యి!” అని పరుగెత్తుకుంటూ వస్తుంది. చక్రధర్‌ని పట్టుకుని లాగేసరికి అతని ముఖం స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె ఆశ్చర్యంతో “నువ్వా మా అమ్మని చంపడానికి చూస్తున్నావు?” అని అరిచి ఆగిపోతుంది.
చక్రధర్ అవనిని దూరంగా నెడుతాడు. మళ్లీ మీనాక్షిని చంపేయడానికి ప్రయత్నిస్తాడు. అవని పక్కనే ఉన్న సెలైన్ స్టాండ్‌ను పట్టుకుని అతనిపైకి విసరబోతుంది. “ఇంకో అడుగు వేస్తే చంపేస్తా” అని కోపంగా అరిచేస్తుంది.

ఆ సమయంలో మీనాక్షి “ఆగమ్మా” అని అడ్డుకుంటుంది. అవని ఆశ్చర్యంగా “అమ్మా, నిన్ను చంపబోయే వాడిని కాపాడమంటావా?” అని అడుగుతుంది. మీనాక్షి కన్నీళ్లతో “నువ్వు ఎవర్ని చంపబోతున్నావో తెలుసా? ఇతనే నీ తండ్రి. ఈ దుర్మార్గుడే నా భర్త, నీకు నాన్న” అని చెబుతుంది.
అంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
మరుసటి రోజు ఎపిసోడ్ ప్రోమోలో అవని మీనాక్షిని హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకు వస్తుంది. అక్కడే హాల్ లో ఉన్న పల్లవితో అవని నేను నీకు సొంత అక్క లాంటి దాన్ని అని చెప్తుంది. పల్లవి తోడికోడలు కాబట్టి నిన్ను అక్క అంటున్న లేదంటే తండ్రి ఎవరో చెప్పలేని ఈవిడ కూతురుని నాకు అక్క అని ఎలా అనుకుంటాను అని అవని పుట్టుక గురించి తప్పుగా మాట్లాడటంతో మీనాక్షికి కోపం వచ్చి పల్లవిని చెంపదెబ్బ కొడుతుంది.
Source inspiration: Original story from “ఇంటింటి రామాయణం” (JioHotstar). This is a personal written recap and interpretation.

