కార్తీక దీపం Nov 13th, 2025 గురువారం ఎపిసోడ్: జ్యోత్స్న ని ఇంట్లో నుండి వెళ్ళిపోమన్న శివన్నారాయణ … !!!! బెదిరిపోయి సైలెంట్ అయినా జ్యోత్స్న …. !!! కాంచన, శ్రీధర్ ని కలపాలని శివన్నారాయణ … !!!
ఎపిసోడ్ ప్రారంభంలో సీఈఓ పోస్ట్ పోవడంపై జ్యోత్స్న మాత్రం అవమానాన్ని భరించలేకపోతుంది. ఇంట్లోకి వెళ్లి లగేజ్ సర్దుకుని ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి అనుకుంటున్నా అని చెప్తుంది. ఆమె వెళ్లిపోవాలనుకుంటున్న విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆమెను ఆపడానికి ప్రయత్నిస్తారు.
అంతలో శ్రీధర్ ముందుకు వచ్చి “నేను ఇక్కడికి వచ్చింది ప్రసంసల కోసం కాదు మీ ప్రేమ కోసం. నాకు మీ ప్రేమ ఇలా దక్కడం సంతోషంగా ఉంది. నేను ఇపుడు వచ్చింది నీ కోసమే జ్యోత్స్న. నువ్వు కంపెనీలో ఉండాలి. మా టీం లో ఉండాలి” అని చెబుతాడు. కానీ జ్యోత్స్న మాత్రం మీకు అసిస్టెంట్ గా ఉండాలా అని కోపంగా మాట్లాడుతుంది. “బావ, దీపలు వెనకేసుకుని చేసుకుంటూ పోతుంటే మీరు అనాల్సింది ఏం ఉంటుందని?” అని ప్రశ్నిస్తుంది.

దీప దగ్గర ఉండి “ఇప్పుడు మీ కోపం ఎవరి మీద?” అని అడుగుతుంది. దానికి జ్యోత్స్న “అది నీకు చెప్పినా అర్థం కాదు. చేతులు కట్టుకుని నిలబడ్డ జీవితాలకు ఒక చోటిస్తే ఎగిరి గెంతేస్తాయి. కానీ శాసించే స్థాయిలో ఉన్నవారికి చిన్న అవమానం కూడా అడవిలో నిప్పు రవ్వ లాంటిది. అది ఒక చెట్టునే కాదు, మొత్తం అడవినే తగలబెడుతుంది” అని చెబుతుంది.
ఆ తర్వాత ఆమె “నాకు జరిగిన అవమానం చాలు, ఈ క్షణమే ఇంట్లోనుండి వెళ్లిపోతాను ఎవరికి ఇష్టం ఉన్న లేకపోయినా” అని చెబుతుంది. అందరూ ఆమె మాటలు విని షాక్ అవుతారు. వెంటనే శివన్నారాయణ గట్టిగా “వెళ్ళిపో!” అని అరుస్తాడు. ఆ ఒక్క మాటతో అక్కడ నిశ్శబ్దం నెలకొంటుంది.
శివన్నారాయణ “వెనుకా ముందు ఆలోచించని తొందరపాటే నీ చేత మరో తప్పు చేయిస్తోంది. మేం ఎవ్వరూ నీకు అవసరం లేని సమయంలో నువ్వు ఎక్కడ ఉన్నా అదే పరిస్థితి” అని అంటాడు.

పారిజాతం సీరియస్‌గా “ఇలా బాధలో ఉన్నప్పుడు కూడా అలా మాట్లాడతారా?” అని అంటుంది. దానికి శివన్నారాయణ “నేను బాధలోనే కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను. జ్యోత్స్న భవిష్యత్తు ఏమవుతుందో అనేది సుమిత్రకు ఉన్న ఆందోళన” అని చెబుతాడు.
దశరథ ముందుకు వచ్చి “ఈ విషయం నాన్న ముందే నాకు చెప్పాడు. జ్యోత్స్న బిజినెస్ లో విఫలమైందని, పర్సనల్ లైఫ్ కూడా సరిగాలేదని సుమిత్ర నాన్న దగ్గర బాధ పడింది. అందుకే నాన్న జ్యోత్స్న బాధ పడుతుంది అని తెలిసిన ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాడు” అని చెబుతాడు.
కార్తీక్ సుమిత్రని చూస్తూ “అత్త నీ సంతోషాన్ని మించి మేం ఏమీ కోరుకోవడం లేదు. నీకు కావాలంటే తాతగారిని ఒప్పిస్తాను. నీ కోసం ఏమైనా వదులుకోవడానికి సిద్ధమే. మా నాన్న సీఈఓ అయ్యారని నీకు నీ కూతురు దూరం అవుతుంది అంటే నేను ఇపుడే జ్యోత్స్న ని సీఈఓ చేయమని తాత ని అడుగుతాను” అని అంటాడు. కానీ సుమిత్ర మాత్రం “నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు. జ్యోత్స్న ఇలా నిరంతరం బాధ్యతలతో పరుగులు తీయడం నాకిష్టం లేదు” అని అంటుంది.

సుమిత్ర దగ్గరకు వెళ్లి జ్యోత్స్న చేతిని పట్టుకుంటూ “నీ తాత, నీ నాన్న నీకో మంచి సంబంధం చూస్తారు. పెళ్లి చేసుకో. తల్లిగా నేను ఇంతకుమించి ఏమీ కోరుకోవడం లేదు” అని చెప్తూ జ్యోత్స్న లగేజ్‌ని లోపలికి తీసుకెళ్తుంది.
ఆ తర్వాత శ్రీధర్ “రేపటి నుండి నువ్వు నాతో పాటు ఆఫీస్‌కి వస్తావు. కంపెనీ లావాదేవీలు, లాభనష్టాలు అన్నీ నాకు నువ్వే చెప్పాలి” అని చెబుతాడు. కార్తీక్ కూడా “నువ్వు అసిస్టెంట్ గా కాదు, ఛైర్మన్‌గారి మనవరాలివి. నీకు ఇచ్చే రెస్పెక్ట్ నీకు ఇస్తారు” అని చెబుతాడు.
అయితే పారిజాతం మాత్రం సెటైర్లు వేస్తూ “వెనక నుంచి అన్నీ నడిపించేది నువ్వే. ఇంకో మూడు ‘క’లను — కాంచన, కావేరీ, కాశీని తీసుకువచ్చి వాళ్లకీ పోస్టులు ఇవ్వండి. అపుడు మేము మీ ఇంట్లో ఉంటున్నట్టే ఉంటుంది” అని అంటుంది.
దానికి శివన్నారాయణ కోపంగా “నువ్వు మళ్లీ మొదలు పెట్టకు పారిజాతం. ఎన్ని సార్లు చెప్పాలి మీకు ” అని అంటాడు. పారు కూడా ఆగకుండా “శ్రీధర్ ని సీఈఓ చేసింది కార్తీక్ చెప్తేనే కదా” అని అడుగుతుంది. శివన్నారాయణ మాట్లాడుతూ “సీఈవో నియామకం పూర్తిగా నా నిర్ణయం. నేను లాభనష్టాలు గురించి మాత్రమే మాట్లాడతా” అని అంటాడు. కానీ పారు తక్షణమే “అది ఒకటే మాట్లాడతారు. ఏం తప్పు చేయకుండానే నా మనవరాలిని బాధ పెడుతున్నారు” అని అంటుంది.

దానికి శ్రీధర్ సూటిగా మాట్లాడుతూ “అలాగైతే నా కొడుకుతో అగ్రిమెంట్ రాయించుకోవడం కూడా తప్పే కదా? నా కొడుకును ఇలా బంధించి ఉంచారు కాబట్టే జ్యోత్స్న రెస్టారెంట్ ఇంకా ఉంది. లేదంటే నా కొడుకు స్పీడ్‌కి సత్యరాజ్ రెస్టారెంట్ మరో నాలుగు బ్రాంచ్‌లు తెరిచేవాడు” అని చెబుతాడు.
పారిజాతం మాటల మధ్యలోనే “అంటే జ్యోత్స్న తెలివితేటల వల్లే ఈ కంపెనీ నిలబడింది కదా. అంటే శివన్నారాయణ మనవరాలు తన తెలివితేటలతో కంపెనీ నిలబెట్టింది అంటే ఈ ఒక్క కారణం చాలు తనని సీఈఓ చేయడానికి” అని అంటుంది. దీన్ని విన్న దీప కౌంటర్ ఇస్తూ “చావుబతుకుల మధ్య ఉన్న మనిషిని నిలబెట్టి అగ్రిమెంట్ మీద సంతకం చేయించుకోవడం తెలివితేటలు కాదు, అది స్వార్థం. నిజమైన తెలివి అనేది మానవత్వం చూపడమే. మేరుపర్వతం లాంటి మా బావ అలాంటి అగ్రిమెంట్ కి కూడా కట్టుబడి చిన్న రాళ్ల గుట్ట ముందు చేతులు కట్టుకుని నిలబడుతున్నారు. అలాంటి మా బావ గొప్పతనం గురించి నా దగ్గర పదాలు లేవు” అని గట్టిగా చెప్పేసి కిచెన్ లోకి వెళ్తుంది. శ్రీధర్ కూడా బయలుదేరుతాడు

ఇంతలో కార్తీక్‌ను పక్కకి తీసుకెళ్లి శివన్నారాయణ అతనితో తన అసలు ఉద్దేశం చెప్పుతాడు. “నీ నాన్న సీఈవో కావడం పూర్తిగా నా నిర్ణయమే. నువ్వు సీఈవో అయితే జ్యోత్స్న అడ్డుపడుతుంది అని ముందే తెలిసింది. అనుకోకుండా దీప పేరు వచ్చింది కానీ ఆమె వదిలేసింది. అందుకే ముందు అనుకున్నట్టుగా మీ నాన్నని నియమించాను” అని చెబుతాడు.
తర్వాత ఆయన గతాన్ని గుర్తుచేసుకుంటూ చెబుతాడు — “మీ నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడని నీ అమ్మ ముందు నేను అతనిని కొట్టాను, ఇంటి నుంచి పంపించాను. నేను చేసిన తప్పే నా కూతురు కూడా చేసింది. నేను తొందరపడకుండా ఉంటే మీ అమ్మ భర్త లేని ఆడదానిలా ఉండేది కాదు” అని పశ్చాత్తాపంతో చెబుతాడు.
తన కూతురికి న్యాయం చేయాలంటే ముందుగా ఆమె భర్తను క్షమించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని చెబుతాడు. “మీ నాన్నని సీఈవోని చేసానని తెలిసినప్పుడు మీ అమ్మ ఆలోచిస్తుంది, మళ్లీ వాళ్లు కలిసే అవకాశం వస్తుంది. మనం వాళ్లను కలపడానికి ఏదో చేయాలి” అని అంటాడు. కార్తీక్ ఆలోచిస్తాడు.

తర్వాత ఇంటికి వెళ్లిన కార్తీక్ కాంచనతో “నాన్న సీఈవో అయ్యాడు” అని చెబుతాడు. కాంచన ఆశ్చర్యపోతూ “మా నాన్న ఒప్పుకున్నారంటే ఆశ్చర్యంగా ఉంది” అని అంటుంది. అనసూయ మాట్లాడుతూ “కూతురిని బాధ పెట్టాడని కొట్టాడు. ఇపుడు మారి మంచిగా ఉన్నదని చేయని చేసాడు. పిల్లని ఇచ్చిన మామకి పెట్టే హక్కు ఉంటుంది, కొట్టే హక్కు ఉంటుంది” అని అంటుంది.
కాంచన మాట్లాడుతూ “మా నాన్న నిర్ణయం వెనుక వేరే కారణం ఉండొచ్చు. సాధారణంగా తండ్రి పేరు ని బట్టి మనం పిల్లలకి ఇచ్చే గౌరవం మారుతుంది. కానీ పిల్లల వలన వాళ్ళ తల్లిదండ్రుల గౌరవం పెరుగుతుంది అంటే అలాంటి తల్లిదండ్రులు అదృష్టవంతులు” అని ఉంటుంది .దీప “అలా అయితే నువ్వు మామయ్య అదృష్టవంతులు” అని మెచ్చుకుంటుంది. కానీ కాంచన వెంటనే “ఆ అదృష్టాన్ని ఇద్దరికీ కలిపి అంటకట్టొద్దు. నాకు అది చాల దూరం” అని అంటుంది.

కార్తీక్ “తాత నిన్ను అడిగితే నాన్నని నువ్వు సీఈవో కావాలంటావా? లేదా?” అని అడుగుతాడు. కాంచన దీపని నువ్వు ఎందుకు సీఈఓ పోస్ట్ వద్దు అన్నావు అని అడుగుతుంది. దీప సమాధానంగా “నా భర్త ముందుండాలి. అతని గౌరవం మించిన గౌరవం నాకు అవసరం లేదు అందుకే వద్దు అన్నాను” అని సమాధానం ఇస్తుంది. దాన్ని చూపిస్తూ కాంచన “కలిసి ఉంటే ఇలానే ఉంటుంది. ఇది పూర్తిగా మా నాన్న నిర్ణయమే” అని స్పష్టం చేస్తుంది.
ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది.
Source inspiration: Original story from “కార్తీక దీపం” (JioHotstar). This is a personal written recap and interpretation.
