ఇంటింటి రామాయణం Nov 15th, 2025 శనివారం ఎపిసోడ్: పల్లవికి షాక్ ఇచ్చిన చక్రధర్ … !!!! అందరి ముందు బుక్ అయిన పల్లవి … !!!
అక్షయ్ ఉదయం అవనితో మాట్లాడుతున్నప్పుడు, అవనిని మోసం చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు తానే ప్రయత్నం చేస్తున్నానని చెబుతాడు. అతడు ఆ వ్యక్తి ఇంటికే వెళ్లినా, ఇంటికి తాళం వేసి ఉందని, మరో రెండు రోజుల్లో వస్తాడని తెలిసిందని చెబుతాడు. వాడు రాగానే నిజం కక్కిస్తానని, అవనిని మోసం చేసిన వాళ్లను వదలబోనని, తాను అవనికి తోడుగా ఉన్నాను అని భరోసా ఇస్తాడు. ఈ మాటలు వింటూ అవని భావోద్వేగానికి లోనై అక్షయ్ గుండెలపై వాలిపోతుంది.

మరోవైపు, పల్లవి మాత్రం మీనాక్షిని ఇంటి నుంచి పంపించే ప్లాన్లో గట్టిగానే ఉంటుంది. తాను అనుకున్నట్లు మామ్-డాడ్ కూడా సపోర్ట్ చేయలేదని గుర్తుచేసుకుని తనతోనే సారీ చెప్పించారని కోపంతో మీనాక్షి మీద ఏదైనా పెద్ద ప్లాన్ చేయాలని నిర్ణయం తీసుకుంటుంది. చివరికి చక్రధర్కు కాల్ చేసి, రేపటికి మీనాక్షి సిగ్గుతో తలదించుకొని వెళ్లిపోయే పరిస్థితి తీసుకువస్తానని, డాడ్ రేపు గుడ్న్యూస్ వింటారు మీరు అని చెబుతుంది. ఏమి చేయబోతుందో మాత్రం రేపే తెలుస్తుందని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. ఈ మాటలు విని చక్రధర్ టెన్షన్ పడతాడు — పల్లవి మీనాక్షి గురించి ఏమి ప్లాన్ చేస్తోంది అని.
తెల్లారగానే ఒక వ్యక్తి అవని ఇంట్లోకి వచ్చి, తనను మీనాక్షి భర్తగా పరిచయం చేసుకుంటాడు. పల్లవి వెంటనే అతడిని చూసి షాక్ అయినట్లు నటిస్తూ, “అంటే మీరు అవని అక్క నాన్నగారా!” అని హంగామా చేస్తుంది. అందరూ మీనాక్షి భర్త ఎవరా అనుకుంటున్న సమయంలో మీరు రావడం సంతోషంగా ఉందని చెబుతుంది.

మీనాక్షిని చూసి పల్లవి, భర్త వచ్చాక మీరు ఏం మాట్లాడరు ఏంటి అని అడుగుతుంది. కానీ మీనాక్షి వెంటనే ఆ వ్యక్తి తన భర్త కాదని, ఇతనెవరో కూడా తెలియదని సూటిగా చెబుతుంది. అందరూ ఆశ్చర్యపోతారు.
అది విని పల్లవి, ఒకవైపు ఆ వ్యక్తి తనే ఆమె భర్త అని చెప్తున్నాడని, మరోవైపు మీనాక్షి తెలీదని అంటోందని, విషయం క్లియర్ కాకుండా ఉందని నటిస్తుంది. ఆ వ్యక్తి మాత్రం భార్యాభర్తల మధ్య గొడవలు కామన్ అని, వాటి వల్ల ఇద్దరూ వేరైపోయారని, కోపంతో మీనాక్షి తను ఎవరో తెలియనట్టు చెప్తుందని అంటాడు. ఇద్దరూ భార్యాభర్తలేనని చెప్తూ ఫోటో చూపిస్తాడు.
ఫోటో చూడగానే పల్లవి, మీరే నిజం చెబుతున్నట్లు కనిపిస్తోందని అంటుంది.
ఆ వ్యక్తి, జరిగిన గొడవలు మరిచి మీనాక్షిని తీసుకెళ్లేందుకు వచ్చానని చెబుతాడు. పల్లవి, మీ భర్త మనసు మార్చుకుని వచ్చారు కాబట్టి మీరు కూడా క్షమించండి అని మాట్లాడుతుంది. రాజేంద్ర, పార్వతి, భానుమతి, శ్రేయ అందరూ కలిసి మీనాక్షిని ఒత్తిడికి గురిచేస్తారు.

మీనాక్షి మాత్రం స్పష్టంగా, ఇతడు తన భర్త కాదు అని ఘట్టిగా అరిచి చెప్తుంది. కమల్ కూడా అతడిని నిలదీసి అడుగుతూ “మీరు ఎవరో మా అత్తయ్య తెలియదు అంటున్నారు కదా. ఏవారు మీరు అసలు” అని అంటాడు. ఆ వ్యక్తి తన భార్య కోపంతో అబద్ధం చెప్తోందని కథలు చెబుతాడు. అక్షయ్ కూడా అతడిని ప్రశ్నిస్తూ “ఆడది ఈదిన అబద్దం చెప్తుంది కానీ భర్తని కాదు అని అబద్దం చెప్పాడు. మీరు ఎవరో నిజం చెప్పండి” అని అంటాడు. అతను మాట మార్చకుండా అదే మాట మీద గట్టిగా ఉంటాడు.
అప్పుడు అవని ఒక్కసారిగా ఆ వ్యక్తిని నిలదీస్తూ, ఎవర్రా నువ్వు మర్యాదగా నిజం చెప్పు అని ఏడ పెడా వాయించేస్తుంది. అది చూసి పల్లవి మాత్రం భయపడుతుంది—ఇక వాడు నిజం చెబుతాడు అన్న టెన్షన్లో ఉంటుంది. వెంటనే అక్క-అక్క అంటూ సెంటిమెంట్ డైలాగులు వదులుతూ, అవనితో తండ్రిని కొడుతున్నావు అంటూ తప్పు పట్టి, అతడు ఫోటో చూపినందుకు నమ్మాలని అందరినీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది.

ఇంకా మీ భర్త ఎవరో మీరే చెప్పండి అని పల్లవి గట్టిగా ప్రశ్నిస్తూ, సమస్యను పెద్దగా లాగేస్తుంది. శ్రేయ కూడా మద్దతు ఇస్తూ, మీనాక్షిని తన “భర్త”తో పంపించేయాలని చెబుతుంది. ఇంట్లో అందరూ “ఏం జరుగుతోంది?” అన్నట్లుగా అయోమయంలో ఉంటారు.
అందరూ కలకలం పడుతుండగా చక్రధర్ అక్కడికి వస్తాడు. పల్లవి వెంటనే అతడికి విషయం చెబుతుంది—మీనాక్షి భర్త వచ్చాడని, కానీ మీనాక్షి గుర్తించడంలేదని. చక్రధర్ మీనాక్షి, అవనిల వైపు చూస్తాడు. ఆసుపత్రిలో అవని తనను హెచ్చరించిన వీడియో అతడికి గుర్తొస్తుంది. ఇక్కడ ఏం చెప్తే విషయం తన మెడకి చుట్టుకుంటుందని అతడికి అర్థమవుతుంది.
అప్పుడు చక్రధర్ నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ, “ఇతనెవరో నాకు తెలుసు” అని చెబుతాడు. పల్లవి వెంటనే ఉత్కంఠగా—అంటే మీనాక్షి గారి భర్త మీకు ముందే తెలుసా అని అడుగుతుంది.

అప్పుడు చక్రధర్ ఆ వ్యక్తి ఒక ఫ్రాడ్ అతడు చెప్పేది అంతా అబద్ధం అని చెబుతాడు. పల్లవి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అవని అమ్మగారి ఫోటో కూడా అతడి దగ్గరుంది అని పల్లవి నొక్కి చెబుతుంటే, ఫోటోలు ఫోన్లో ఎలాంటి మార్పులు చేయడమైనా సాధ్యమని చక్రధర్ చెబుతాడు. తర్వాత ఆ వ్యక్తిని పట్టుకొని గట్టిగా కొడుతూ, ఎవడు పంపించాడో చెప్పమని డిమాండ్ చేస్తాడు.
ఇక వాడు దెబ్బలు తట్టుకోలేక “పల్లవి డబ్బులు ఇచ్చి నటించమంది” అని ఒప్పుకుంటాడు. అతను పారిపోతాడు. అతడు చెప్పిన మాట విన్న వెంటనే అందరి కళ్ళు పల్లవిపైన పడతాయి.
కమల్ పల్లవిని నిలదీస్తూ, నువ్వే అత్తగారిపై ఇలా డ్రామా చేస్తావా అని ప్రశ్నిస్తాడు. అక్షయ్ కూడా అసలు ఇలాంటి పనులు చేస్తున్నావు అంటే నువ్వు ఆడ పిల్లవా లేక క్రిమినల్ వా అని అడుగుతాడు. ఇంకా భానుమతి, పార్వతి అందరూ ఆమెను తీవ్రంగా మందలిస్తూ ” నీ బుద్ధి మంచిది కాదు అని తెలుసు కానీ మరీ ఇలాంటి పనులు కూడా చేస్తావు అనుకోలేదు” అని అంటారు. రాజేంద్ర కూడా తల్లీకూతుళ్ల కలయికను కూడా పల్లవి అసూయతో చూడలేకపోతున్నదని అంటాడు.

అక్షయ్ చక్రధర్ వైపూ తిరిగి, మీ కుమార్తె చేసిన పనికి మీరు ఏం చెబుతారు అని అడుగుతాడు. చక్రధర్ పల్లవిపై కోపంతో పేలిపోతాడు. ఇలాంటి అతి నీచమైన చర్య చేసినందుకు తీవ్రంగా మందలిస్తాడు. ఆడపిల్ల కాబట్టి ఏం చేయకుండా వదిలేస్తున్నానని హెచ్చరిస్తూ, మళ్లీ ఇలాంటి పనులు చేస్తే చంపేస్తానని చెబుతాడు. మీనాక్షి దగ్గర క్షమాపణలు చెప్పి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.
Source inspiration: Original story from “ఇంటింటి రామాయణం” (JioHotstar). This is a personal written recap and interpretation.

