బ్రహ్మముడి Nov 3rd, 2025 సోమవారం ఎపిసోడ్ : కుయిలీ భరతం పట్టిన రాజ్, కావ్య … !!!
ఇవాళ్టి ఎపిసోడ్ లో భోజన సమయానికి రాజ్ మరియు కావ్య రాహుల్, కుయిలీ దగ్గరకు వస్తారు. వారు తినడానికి కూర్చుంటారు కానీ వడ్డించడానికి ఎవరూ లేరా అని రాజ్ ప్రశ్నిస్తాడు. వెంటనే కుయిలీ “ఎవరు లేరు తాతగారు” అని అలా చెబుతుంది. కావ్య మాత్రం ఆ మాటను విని, “ఇంట్లో పని వాళ్లు లేని ఈ ఇంటి పిల్ల మన మనవడికి సరిపోదు పెనిమిటి” అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతుంది. రాజ్ కూడా అవును అంటాడు.
రంజిత్ వెంటనే సమాధానం ఇస్తూ “పని వాళ్లు కంపెనీ రహస్యాలు బయటకు చెబుతున్నారు అందుకే తీసేశాం బామ్మ” అంటాడు. కావ్య ఆశ్చర్యపడి “మరి మాకు ఎవరు వడ్డిస్తారు?” అని అడుగుతుంది. రంజిత్ “మా కుయిలీ వడ్డిస్తుంది” అంటాడు. కుయిలీ కూడా సంతోషం నటిస్తూ వడ్డించడానికి లేస్తుంది.

కానీ కుయిలీ వడ్డించిన భోజనం తిన్నట్టు నటించి రాజ్, కావ్య ఇద్దరూ ఆ తిండి బయటకు ఊసేస్తారు. రాజ్ అనుమానం వ్యక్తం చేస్తూ “ఇది ఎక్కడి నుంచి తెచ్చారు? కాకా హోటల్ నుంచి తెప్పించారా?” అని అడుగుతాడు. కావ్య కూడా “ఈ పిల్లకి వంట కూడా రాదా? ఇలాంటిదాన్ని చేసుకుని మన మనవడు ఎలా సుఖపడతాడు?” అంటుంది.
రాజ్, కావ్య ఇద్దరూ రాహుల్‌ని తీసుకెళ్లిపోవాలని అనుకుంటారు. కుయిలీ వేడుకుంటూ “తాతగారు, బామ్మగారు ఆగండి. రేపు మీకోసం ఇంకా పెద్ద హోటల్ నుంచి ఫుడ్ తెప్పిస్తాను” అంటుంది. ఈ మాట విని రాజ్, కావ్య ఇద్దరూ ఆమెను ఎగతాళి చేస్తారు. రంజిత్ మాత్రం పరిస్థితిని చక్కదిద్దేందుకు “ఫైవ్ స్టార్ హోటల్ నుంచే తెప్పిద్దాం” అంటాడు.
అయితే కావ్య కోపంగా “మొత్తం హోటల్ తిండి పెట్టి నా మనవడిని చంపాలనుకుంటున్నారా?” అంటుంది. రాజ్ కూడా “ఇలాంటి దాన్ని చేసుకుని నా మనవడు ఎలా సుఖపడతాడు? ఇక రాహుల్ వెళ్దాం పద” అని అంటాడు. కుయిలీ ఆగమని అడిగి “నేను వంట నేర్చుకుంటాను బామ్మ దగ్గర నేర్చుకుంటాను” అంటుంది. రాజ్ మాత్రం “తట్టుకోగలవా” అని వ్యంగ్యంగా అంటాడు.

తర్వాత కుయిలీ, రంజిత్ ఇద్దరూ వంటగదిలో మాట్లాడుకుంటారు. కుయిలీ ” వద్దు వద్దు అంటూనే అంతా తినేశారు. అసలు వేళ్ళు ముసలి వాళ్లేనా” అని అంటుంది. రంజిత్ “వీళ్లు ఒక్కరోజు తిండికి 30 వేల బిల్లు చేశారు. ఇలా అయితే మనం లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది” అంటాడు. కుయిలీ మాత్రం ఆశగా “పర్లేదు లే , వాళ్ళు నాలుగు రోజులు ఉండి వెళ్తాము అని అంటున్నారు కదా. ఈ నాలుగు రోజులు నటిస్తే, తర్వాత వాళ్ల దగ్గర ఉన్న కోట్ల ఆస్థి మనం కొట్టేయొచ్చు. ఇంకా రాహుల్ ని పెళ్లి చేసుకుని వాడి ఆస్థి కూడా రాయించుకుని అందరిని బయటికి తోసేద్దాం” అని అంటుంది. రంజిత్ కూడా కొంత నమ్మకంతో అంగీకరిస్తాడు. కానీ ఈ మాటలన్నీ రాజ్, కావ్య వింటారు.
వీళ్లిద్దరూ కుయిలీ, రంజిత్‌కి బుద్ధి చెప్పాలని డిసైడ్ అవుతారు. కావ్య రాహుల్ కి నిజం చూపడం అంటే వాడు ఇపుడు మన మాట నమ్మే స్థితిలో లేదు అని రాజ్ అంటాడు. రాహుల్ కళ్ళు తెరుచుకోవడానికి తన ఫ్రెండ్ గోల్డ్ బాబును పిలిపించాలి అని రాజ్ ప్లాన్ చేస్తాడు. కావ్య కూడా అంగీకరిస్తుంది.

కావ్య కుయిలీ, రంజిత్ దగ్గరికి వెళ్లి కావాలి అని వాళ్ళ బంధం గురించి అనుమానం వచ్చినట్టు నటిస్తుంది. తర్వాత కావ్య కుయిలీని వంట నేర్పుతానని టార్చర్ చేస్తుంది. వంట నేర్చుకోవాలి అంటే ముందు ఇల్లు శుభ్రం చేయాలి అంటూ కుయిలీతో ఇల్లు అంతా శుభ్రం చేయిస్తుంది. ఇంటి పనులు చేయిస్తూనే మళ్లీ ఇంట్లో చెత్త వేస్తూ రాజ్, కావ్య కుయిలినీ ఏడిపిస్తూ నవ్వుకుంటారు. కుయిలీ మాత్రం భయంతో అంగీకరిస్తూ అన్నీ చేస్తుంది.
అంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది,
మరుసటి రోజు ఎపిసోడ్ ప్రోమోలో గోల్డ్ బాబు అనే రాజ్ ఫ్రెండ్ ఎంట్రీ ఇస్తాడు. అతడు “దుబాయ్ నుంచి వచ్చిన గోల్డ్ బాబు”గా వచ్చి కామెడీ సీన్ క్రియేట్ చేస్తాడు.
Source inspiration: Original story from “బ్రహ్మముడి” (JioHotstar). This is a personal written recap and interpretation.

