బ్రహ్మముడి Oct 31st, 2025 శుక్రవారం ఎపిసోడ్ : కొత్త వేషాలతో ఎంట్రీ ఇచ్చిన కళావతి, రాజ్ ….ఇక కుయిలీ పని అయినట్టే … !!!!
కుయిలీ తన భర్త రంజిత్‌తో మాట్లాడుతూ, “రాహుల్ ఇవాళ స్వప్నకి విడాకులు ఇస్తానన్నాడు. అది జరిగితే మన ప్లాన్ సగం పూర్తయినట్టే!” అంటుంది. రంజిత్ మాత్రం, “విడాకులు చాలవు కుయిలీ… నువ్వు రాహుల్‌ని పెళ్లి చేసుకోవాలి, అప్పుడు ఆ ఇంట్లో అడుగుపెట్టి ఆస్తి మన చేతిలోకి తెచ్చుకోవాలి” అని చెప్తాడు.
అంతలో రాహుల్ కారు ఆపి కుయిలీ ఇంటి ముందు దిగుతాడు. ఇద్దరూ చూసి ఆశ్చర్యపడతారు. “వీడేంటి విడాకుల పేపర్స్‌తో వస్తాడనుకున్నా, సూట్‌కేస్‌తో వస్తున్నాడు?” అంటుంది కుయిలీ. రాహుల్ దగ్గరికి వచ్చి, “కుయిలీ… వచ్చేశాను! నా భార్యను, ఇంట్లో వాళ్లను అందరినీ వదిలేసి నీ కోసం వచ్చేశాను” అని చెప్తాడు.

కుయిలీ ఒక్కసారిగా షాక్ అవుతుంది. కానీ పైకి నటిస్తూ “ఏంటి రాహుల్! ఇల్లు వదిలి వచ్చేశావా?” అని అడుగుతుంది కానీ మనసులో మాత్రం, ‘వీడు ఇంట్లో లేకపోతే నా ప్లాన్ ఎట్లా కుదురుతుంది?’ అని ఆలోచిస్తుంది. రాహుల్ మాత్రం, “మన ప్రేమని వాళ్లు ఎప్పుడూ అర్థం చేసుకోలేరు, అందుకే వాళ్లను వదిలి వచ్చాను” అని అంటాడు.
కుయిలీ నటిస్తూ, “అయ్యో రాహుల్, పెద్దవాళ్లు కొంచెం కోపపడతారు కానీ ఆగాల్సింది. బంధాలను ఎలా వదిలేస్తావ్? నాకు పెద్ద ఆస్తి ఉన్నా కుటుంబం లేదు… నీ కుటుంబమే నా కుటుంబం అవుతుందని అనుకున్నా!” అంటుంది.
రాహుల్ మమకారంగా, “నాకు నువ్వే చాలవు కుయిలీ” అని చెప్తాడు. కానీ కుయిలీ మనసులో, ‘అడుక్కుని తినడానికి వచ్చేశాడా?’ అని అనుకుంటుంది. రంజిత్ మధ్యలోకి వచ్చి, “ఇప్పుడే రాహుల్ గొడవపడి వచ్చాడు. ఇప్పుడు సపోర్ట్‌గా ఉండాలి” అని చెప్తాడు. రాహుల్ సంతోషంగా, “థాంక్యూ రంజిత్ గారు, నన్ను అర్థం చేసుకున్నారు” అంటాడు.
కానీ రాహుల్ వెళ్లిన వెంటనే కుయిలీ విసుక్కుంటూ, “వీడేంటి ఇలా చేశాడు రంజిత్! ఇంట్లోనే ఉంటే మనం కోట్లను కొట్టేవాళ్లం” అంటుంది. రంజిత్ ప్రశాంతంగా, “అతన్ని కొంచెం కూల్ చేయాలి, టైమ్ చూసి తిరిగి ఇంటికి పంపిద్దాం” అంటాడు. కుయిలీ అనుమానంగా “తిరిగి వెళ్తాడా” అని అడుగుతుంది. రంజిత్ కుయిలీతో “రాహుల్ మనసు మర్చి మనమే పంపించాలి” అని అంటాడు.
ఇక దుగ్గిరాల వారి ఇంట్లో స్వప్న ఏడుస్తూ కూర్చుంటుంది. కావ్య, రాజ్ ఆమెను ఓదారుస్తారు. అప్పు వచ్చి చెబుతుంది — “అక్కా, రాహుల్ ప్రేమిస్తున్న అమ్మాయి పేరు కుయిలీ. బయటకి అమాయకురాలిలా ఉంటుంది కానీ ఏదో ప్లాన్ ఉంది ఆమెకు” అని. కావ్య వెంటనే, “ఆమె అసలు ఉద్దేశం ఏమిటో తెలుసుకోవాలంటే వాళ్ల దగ్గరికి వెళ్లాలి. వాళ్ల లాగే మనం కూడా డ్రామా ఆడాలి” అని చెబుతుంది.

రాజ్ అంగీకరించకపోయినా, కావ్య తన తెలివితో అతన్ని ఒప్పిస్తుంది. ఇంతలో రాహుల్ కుయిలీ ఇంట్లో రిలాక్స్ అవుతూ కూర్చుంటాడు. కుయిలీ కాఫీ ఇచ్చి పక్కన కూర్చుంటుంది. “ఇలా ఆ ఇంటిని వదిలేయడం తగదూ రాహుల్” అని చెబుదామనుకుంటుంది కానీ రాహుల్ ఆమె చేతులు పట్టుకుని ప్రేమగా మాట్లాడతాడు.
అప్పుడు ఆ ఇంటి ముందు రాజ్, కావ్య ముసలి వేషంలో మంగతాయారు, లింగరాజు పేర్లతో వస్తారు. లోపలికి వెళ్లి రాహుల్ బామ్మ తాతలమని నటిస్తారు. కుయిలీ, రంజిత్ వాళ్ల మాటలు నమ్మి వాళ్లకు గది ఇస్తారు.
రాహుల్ మాత్రం మనసులో “వీళ్లు కావ్య, రాజ్లే కచ్చితంగా ఏదో ప్లాన్ చేస్తున్నారు” అని గ్రహిస్తాడు కానీ బయటకు చెప్పడు. ఆస్తి కోసం కుయిలీ, రంజిత్ వారిని నమ్మి ఇంట్లోనే ఉండనిస్తారు.
ఇక తర్వాతి ఎపిసోడ్లో వారు కుయిలీ నిజరూపాన్ని బయటపెడతారా, రాహుల్‌కు నిజం తెలుస్తుందా అనేది చూడాలి!
Source inspiration: Original story from “బ్రహ్మముడి” (JioHotstar). This is a personal written recap and interpretation.

