బ్రహ్మముడి Nov 4th, 2025 మంగళవారం ఎపిసోడ్ : గోల్డ్ బాబు ఎంట్రీతో కొత్త గోల – రాజ్, కావ్యల ప్లాన్‌కి రుద్రాణీ కౌంటర్
గోల్డ్ బాబు ప్రవేశం – కొత్త డ్రామాకు తెర
ఎపిసోడ్ ప్రారంభంలో కావ్య కుయిలీతో దగ్గరుండి వంట చేయిస్తూ కష్ట పెడుతుంది. ఇంటి పని, వంట పని చేసి అలిసిపోయి చిరాగ్గా ఉన్న కుయిలీని చూసి రాహుల్ ఏంటి ఇంత చెండాలంగా ఉన్నావు అని అంటాడు. వంట చేస్తే అలానే మార్పు వస్తుందిలే అని అంటుంది కావ్య, అంతలో రాజ్, కావ్యలు కొత్త డ్రామా మొదలుపెడతారు. “గోల్డ్ బాబు” పేరుతో కొత్త పాత్రను సృష్టించి, అతడే విదేశాల నుంచి వచ్చిన పెద్ద వ్యాపారవేత్త అని చూపించడానికి ప్రయత్నిస్తారు. గోల్డ్ బాబు వచ్చేసరికి కుయిలీ ఆశ్చర్యంతో నిలబడిపోతుంది. అతడు “దుబాయ్‌లో కోట్లు సంపాదించాను, ఇక ఇండియాలోనే సెటిల్ అవుతాను. నా డబ్బును పెట్టుబడి పెట్టడానికి కంపెనీలు, వాటిని మేనేజ్ చేసే వాళ్లు కావాలి” అని చెబుతాడు.

ఇదంతా విన్న కుయిలీ ముచ్చటతో మురిసిపోతుంది. పైగా అతను “నేను రాహుల్‌కి అన్నయ్యను” అని చెప్పడంతో ఆమె మరింత ఆకర్షితురాలవుతుంది. వెంటనే “బావగారు, మీరు మా కంపెనీలో పెట్టుబడులు పెట్టండి, అలాగే మీ కంపెనీని మాకు అప్పగించండి” అని చెబుతుంది. రాజ్ నెమ్మదిగా “ పెట్టు పెట్టు ఆర్పేస్తారు” అని చెప్పడంతో గోల్డ్ బాబు ఆశ్చర్యపడతాడు. వెంటనే కావ్య ఆ మాటను కవర్ చేస్తూ “అదే పెట్టుబడి పెడితే అభివృద్ధి చేస్తారు అంటున్నారు” అని సర్దుబాటు చేస్తుంది. గోల్డ్ బాబు కూడా కావాలి అని కుయిలీతో దగ్గరగా ఉంటూ తనని పొగుడుతూ ఉంటాడు.
రాహుల్ అభ్యంతరం – కుయిలీ ఒత్తిడి
గోల్డ్ బాబు “మీరు అడిగితే ఓకే, కానీ రాహుల్ ఒప్పుకుంటాడా?” అని అడుగుతాడు. రాహుల్ వెంటనే “నేను ఒప్పుకోను” అంటాడు. కుయిలీ మాత్రం అతని పక్కన కూర్చుని భుజంపై చెయ్యి వేసి ఒప్పించడానికి ప్రయత్నిస్తుంది. చివరకు రాహుల్ సరేనంటాడు. దాంతో కుయిలీ ఆనందంగా “చూశారా బావగారు, రాహుల్ ఒప్పుకున్నాడు” అని చెబుతుంది. గోల్డ్ బాబు “మీ మావయ్య నా కంపెనీని మేనేజ్ చేయగలడా?” అని సందేహం వ్యక్తం చేస్తాడు. రంజిత్ వెంటనే “చేస్తాను చేస్తాను, రెండు మూడు కోట్లు అయినా చేస్తాను” అని గట్టిగా చెబుతాడు. అప్పుడే రాజ్ “వాడు సంపాదించింది ఒకటి రెండు కోట్లు కాదు వెయ్యి కోట్లు” అంటాడు. కళావతి కూడా “పెట్టబడి పెట్టేది ఐదువందల కోట్లు” అని చెబుతుంది. ఈ మాటలతో రంజిత్, కుయిలీ షాక్ అయిపోతారు.
కుయిలీకి ఒక్కటి ఇచ్చిన గోల్డ్ బాబు

గోల్డ్ బాబు కావాలనే కుయిలీని తన అందాన్ని పొగుడుతూ దుబాయిలో తన స్టేటస్ గురించి బాగా బిల్డుప్ ఇస్తాడు. అవి అన్ని నిజం అనుకుని కుయిలీ గోల్డ్ బాబుతో చనువుగా ఉంటుంది. కుయిలీ గోల్డ్ బాబును “మీ గది చూపిస్తాను బావ గారు” అంటూ గదికి తీసుకువెళ్తుంది. అక్కడ అతడు “నేను నిన్ను తీసుకుపోవడానికి వచ్చాను” అంటాడు. కుయిలీ “నాకు సిగ్గేస్తుంది బావా” అంటుంది. ఆ తరువాత గోల్డ్ బాబు తన సూట్‌కేస్ ఓపెన్ చేసి చార్జర్ వెతుకుతాడు. అప్పుడు గోల్డ్ బిస్కెట్లు కనిపిస్తాయి. కుయిలీ ఆశ్చర్యంతో “ఇవి నిజంగా గోల్డ్ బిస్కెట్సా?” అని అడుగుతుంది. అతడు “ఇవి తక్కువే, దుబాయ్‌లో కట్టలు కట్టల్లో ఉన్నాయి” అని చెప్పడంతో ఆమె సంబరపడిపోతుంది.
కుయిలీ “ఒకటి ఇవ్వండి బావా” అంటే గోల్డ్ బాబు ఆమె అడిగిందేమిటో అర్థం కాక ఆమెకు ఒక కొట్టిస్తాడు. ఆమె “నేను గోల్డ్ బిస్కెట్ అడిగాను” అని అంటుంది. గోల్డ్ బాబు వెంటనే “అయ్యో, ఇవన్నీ నీకే ఇవ్వడానికి తెచ్చాను. నాతో దుబాయ్ వస్తే గోల్డ్ వాటర్‌తో స్నానం చేస్తావు” అని చెబుతూ ఆమెను బయటకు పంపేస్తాడు. తాను మాత్రం “డాల్డా బిస్కెట్‌ని గోల్డ్ బిస్కెట్ అనుకుంటుంది పిచ్చిది మన బుట్టలో పడింది” అని అనుకుంటాడు.
రాహుల్ – రుద్రాణీ ఫోన్ సంభాషణ

తర్వాత రాహుల్ బయటకు వెళ్లి రుద్రాణీకి కాల్ చేస్తాడు. “రాజ్, కావ్యలు నేను కుయిలీ దగ్గర ఇచ్చిన బిల్డుప్ గురించి తనకి చెప్పేస్తాము అని బెదిరిస్తున్నారు. కుయిలీతో పెళ్లి చెడగొట్టేలా ఉన్నారు, ఇక్కడ నుండి వాళ్ళని పంపడానికి ఏదైనా ప్లాన్ చేయాలి” అని చెబుతాడు. రుద్రాణీ “నా దగ్గర ప్లాన్ ఉంది — రాజ్ కంపెనీకి సంబంధించిన ఒక ముఖ్యమైన ఫైల్ని మాయం చేయిస్తాను. ఆర్కే కంపెనీకి ఇవ్వాల్సిన కోట్ల రూపాయల కొటేషన్ ఫైల్ అతని సిస్టమ్‌లో ఉంది. అది డిలీట్ అయితే భారీ నష్టం వస్తుంది. అప్పుడు తప్పనిసరిగా రాజ్ ఆఫీసుకి రావాల్సిందే” అని చెబుతుంది.
ఆమె తన మనుషుల ద్వారా ఆ ఫైల్ని డిలీట్ చేయడానికి ఫోన్ లో ప్లాన్ చేస్తుంది. “గంటలో వారిని ఇంటి నుంచి ఆఫీసుకి వచ్చేలా చేస్తాను” అని చెబుతుంది.
రాజ్, కావ్య , గోల్డ్ బాబు ల ప్లాన్
అంతలో రాజ్, కావ్య గోల్డ్ బాబు గదికి వచ్చి తనతో మాట్లాడతారు. గోల్డ్ బాబు తనకి క్యారెక్టర్ నచ్చింది అని తనకి ఇక్కడ అంత క్లారిటీ ఉందని చెప్తాడు. అసలు రాహుల్ కుయిలీకి ఎలా పడ్డాడో తెలియడం లేదు అంటాడు. మా బాధ కూడా అదే అని రాజ్, కావ్య అంటారు. ఇపుడు నే దగ్గర బాగా ఆస్తి ఉంది అని ఆ కుయిలీ నీతో చనువుగా ఉంటుంది. అది రాహుల్ కి అర్ధం అయ్యేలా చేసి మళ్లీ లైఫ్ లో రాహుల్ ఆ కుయిలీ వెంట పడకుండా చేయాలి అని అంటారు.
ఫైల్ డిలీట్ – రాజ్‌కి కొత్త కష్టం

సీన్ కట్ అవుతుండగా రాజ్ పి.ఏ. అయిన శ్రుతి ఆ ఫైల్ని సిస్టమ్‌లో వెతికితే కనిపించదు. ఆమె “ఫైల్ లేదు, ప్రమాదంలో పడ్డాం, కోట్ల నష్టం వస్తుంది” అని సుభాష్‌కి కాల్ చేస్తుంది. ఇదే సమయంలో రుద్రాణీ దిగివచ్చి “అసలు అలాంటి ఇంటికి రాజ్, కావ్య ఎందుకు వెళ్లాలి? ఇప్పుడు చూడండి, ఎంత పెద్ద సమస్య వచ్చింది” అని చెబుతూ వారిని తిరిగి రప్పించాలన్న ఉద్దేశ్యంతో మాటలు కలుపుతుంది. కానీ ఇంట్లో అందరు వాళ్ళు అక్కడ ఇంటి గౌరవం కోసం ఉన్నారు. రాహుల్ కి బుద్ది చెప్పి స్వప్న జీవితం కాపాడటం కోసం వెళ్లారు అని వాళ్ళకి సపోర్ట్ గా మాట్లాడతారు.
అంతటితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది.
రేపటి ఎపిసోడ్ ప్రోమో లో కుయిలీని గోల్డ్ బాబు ని ఒకే గదిలో చూడకూడని స్థితిలో చూస్తారు రాహుల్, రాజ్ ఇంకా కావ్య. రాజ్ అపుడు కుయిలీ కి రంజిత్ కి ఎం ఆస్థి లేదు అని వల్ల కేర్ ఆఫ్ ఫుట్ పాత్ అని అంటుంటే రాహుల్ షాక్ అవుతాడు. అది నిజం అవుతుందో లేదో చూద్దాం.
Source inspiration: Original story from “బ్రహ్మముడి” (JioHotstar). This is a personal written recap and interpretation.

