బ్రహ్మముడి Nov 8th, 2025 శనివారం ఎపిసోడ్: కుయిలీ హత్య కేసులో అరెస్ట్ అయిన రాహుల్ … రాజ్, కావ్య లు కాపాడగలరా …. ????
ఉదయం ఇంట్లో అందరూ మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో రాహుల్ కిందికి వస్తాడు. రాజ్ అతనిని చూసి, “నిన్న జరిగిన విషయాలు ఇంకా మరిచిపోలేదా?” అని అడుగుతాడు. దానికి స్వప్న “జరిగినవి మరిచిపోకపోతేనే భవిష్యత్తు గురించి జాగ్రత్తగా ఉండగలం” అని చెబుతుంది. కిచెన్‌లో కావ్య వంట చేస్తూ ఉండగా రాజ్ సరదాగా ఆమె దగ్గరకు వెళ్లి “నీ పెదవులు తాకిన కప్పులో కాఫీ కావాలి” అని అంటాడు. కావ్య మాత్రం “కాఫీ కావాలంటే హాల్లో నుంచే అడగొచ్చు కదా, ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంటి?” అని అంటుంది.

ఇంతలో హాల్లో కూర్చుని ఉన్న రాహుల్‌ను చూసిన ఇందిరా దేవి “రాహుల్, ఇలా ఖాళీగా కూర్చోవడం మానేసి ఆఫీస్‌కి వెళ్లి ఏదైనా పని చేసుకో” అని సూచిస్తుంది. సుభాష్ వ్యంగ్యంగా “వాడు ఆఫీస్‌కి వెళ్తే పనులు జరిగినట్టే” అని అంటాడు. రుద్రాణీ “వాడికి ఏ పని ఇస్తే సరిగ్గా చేయగలడో అర్థం కావడం లేదు” అని వ్యాఖ్యానిస్తుంది. అపర్ణా దేవి నవ్వుతూ “వాడు ఏ పని చేసినా చెయ్యకపోయినా నిన్న ఫాలో అవ్వకుండా ఉంటే చాలు” అని అంటుంది. రుద్రాణీకి కోపం వస్తుంది. ఇంట్లో ఉన్నవాళ్లు అంతా నవ్వుతారు.
అంతలో ఇంటి ముందు ఒక పోలీస్ వ్యాన్ ఆగుతుంది. పోలీసులు లోపలికి రావడంతో అందరూ ఆశ్చర్యపోతారు. రాజ్, కావ్యలు కూడా కిచెన్ నుంచి హాల్లోకి వస్తారు. ఎస్ఐ “ఇక్కడ రాహుల్ ఎవరు?” అని అడుగుతాడు. రాహుల్ “నేనే సార్” అని చెబుతాడు. వెంటనే ఎస్ఐ కానిస్టేబుల్స్‌కి “అతడ్ని అరెస్ట్ చెయ్యండి” అని ఆదేశిస్తాడు.

ఆ మాట విని అందరూ షాక్ అవుతారు. రాజ్ “మా రాహుల్ ఏం చేశాడు?” అని ప్రశ్నిస్తాడు. ఎస్ఐ “మీ రాహుల్ ఒక అమ్మాయిని హత్య చేశాడు. కుయిలి అనే అమ్మాయిని కొట్టడం వల్ల ఆమె చనిపోయింది. ఆమె భర్త రంజిత్ ఫిర్యాదు చేశాడు” అని చెబుతాడు. అందరూ ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెందుతారు. రుద్రాణీకి కన్నీళ్లు వస్తాయి.
రాజ్ వెంటనే “ఎక్కడో ఏదో పొరబాటు జరిగి ఉంటుంది సార్, మా రాహుల్ అలాంటి వాడు కాదు” అని చెబుతాడు. కానీ ఎస్ఐ “మాకు ఆధారాలు ఉన్నాయి” అని చెప్పి రాహుల్ వైపు తిరిగి “నీకు కుయిలి అనే అమ్మాయి తెలుసా?” అని అడుగుతాడు. రాహుల్ కాస్త తడబడుతూ “తెలుసు” అని చెబుతాడు. “నిన్న ఆమెతో గొడవ జరిగిందా?” అని అడుగుతాడు ఎస్ఐ. రాహుల్ “జరిగింది సార్” అని సమాధానం ఇస్తాడు.

ఎస్ఐ “ఆ గొడవలో ఆమెను కొట్టావా?” అని అడుగుతాడు. రాహుల్ భయంతో “జస్ట్ తోశాను అంతే, అంత మాత్రానికే ఎలా చనిపోతుంది?” అని చెబుతాడు. కానీ ఎస్ఐ కఠినంగా “ఇంకా మిగిలింది కోర్టులో చెప్పుకో” అని చెబుతాడు. రుద్రాణీ రాహుల్ వైపు పరుగెత్తి “వాడికి ఏం తెలియదు సార్, వాడిని వదిలేయండి” అని వేడుకుంటుంది. అయినప్పటికీ పోలీసులు రాహుల్‌ను లాక్కుపోతారు.
రాహుల్‌ను పోలీసులు తీసుకెళ్తుండగా రుద్రాణీ ఏడుస్తూ “ఎవరూ ఆపరా?” అని అరిచేస్తుంది. సుభాష్ మాత్రం “ఎస్ఐ అడిగిన ప్రతి ప్రశ్నకు వాడు ‘అవును’ అన్నాడు, ఇక ఎలా ఆపగలం?” అని అంటాడు. ఇందిరా దేవి, అపర్ణా దేవి ఇద్దరూ “వాడు మారిపోయాడని అనుకున్నాం, కానీ ఒక ప్రాణం తీస్తాడని ఊహించలేదు” అని విచారిస్తారు.
స్వప్న ఏడుస్తూ పైకి వెళ్లిపోతుంది. రాజ్, కావ్య ఆమె వద్దకు వెళ్లి ఓదారుస్తారు. స్వప్న “మీరు అవకాశం ఇవ్వమన్నందుకే ఇచ్చాను, కానీ రాహుల్ మారలేదని నిరూపించాడు” అని చెబుతుంది. కావ్య మాత్రం “రాహుల్ అలాంటివాడు కాదు, ఎక్కడో పొరబాటు జరిగి ఉంటుంది” అని నమ్మకంగా చెబుతుంది.

ఇంతలో రంజిత్ రుద్రాణికి ఫోన్ చేస్తాడు. “నీ కొడుకు కుయిలిని చంపాడు. నా దగ్గర ఆ వీడియో సాక్ష్యం ఉంది. మీరు రెండు కోట్లు ఇస్తే ఆ వీడియోని పోలీసులకు ఇవ్వను, లేకపోతే కోర్టులో చూపిస్తాను” అని చెబుతాడు. రుద్రాణీ షాక్ అవుతుంది. వెంటనే కిందికి వచ్చి ఇంట్లో అందరికీ ఈ విషయం చెబుతుంది.
రాజ్ “రాహుల్ నిర్దోషి, మనం డబ్బులు ఇవ్వనవసరం లేదు” అని చెబుతాడు. కానీ రుద్రాణీ కోపంగా “నేను ఈ ఇంటి బిడ్డను కాదు కాబట్టే మీరు నన్ను, నా కొడుకుని పట్టించుకోవడం లేదు. నా కొడుకును నేనే కాపాడుకుంటాను” అని చెప్పి ఇంట్లోంచి వెళ్లిపోతుంది.
రుద్రాణి వెళ్లిన తర్వాత రాజ్ అందరికీ చెబుతాడు — “రాహుల్‌ని కాపాడే అవకాశం మన దగ్గర ఉంది. ఆ రోజే కళావతి ఆ ఇంట్లో సీక్రెట్ కెమెరా పెట్టింది. దాన్ని తీసుకుంటే నిజం బయటపడుతుంది. అందుకే అత్తకి డబ్బులు ఇవ్వనని అన్నాను” అని వివరిస్తాడు.

ఇందిరా దేవి, అపర్ణా దేవి కళావతిని ప్రశంసిస్తారు. “నువ్వు కెమెరా ఎందుకు పెట్టావు?” అని అడుగుతారు. కళావతి “కుయిలి ఏం చేస్తున్నదో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో పెట్టాను. మేము లేనప్పుడు ఆమె, రంజిత్ ఏమి మాట్లాడుతున్నారో తెలిసిపోతుందని అనుకున్నాను” అని చెబుతుంది.
అందరూ ఒకే మాటగా “ఇంకా ఆలస్యం ఎందుకు? ఆ కెమెరా తీసుకురండి. దాంతో రాహుల్ తప్పు చేయలేదని నిరూపించవచ్చు” అని చెబుతారు.
ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
Source inspiration: Original story from “బ్రహ్మముడి” (JioHotstar). This is a personal written recap and interpretation.

