బ్రహ్మముడి Nov 14th, 2025 శుక్రవారం ఎపిసోడ్: ధాన్యం చేతిలో తన్నులు తిన్న ప్రకాశం….!!! కావ్యను చూస్తూ మైమరిచిపోయిన రాజ్ … !!!
ఎపిసోడ్ ప్రారంభంలో సుభాష్, రాజ్‌ల రాసిన ప్రేమలేఖలు చూసి కావ్య, అపర్ణ ఇద్దరూ వాళ్లపై కోపంగా ఉంటారు. వాళ్లు రాసిన లెటర్లలో ఉన్న అలంకారపు మాటలకే కాకుండా, ఆ అర్థంలేని రొమాంటిక్ లైన్లకూ ఇద్దరూ అసహనం వ్యక్తం చేస్తారు.
అదే సమయంలో ప్రకాశం కూడా తన చిన్నప్పటి కవిత్వాన్ని గుర్తు చేసుకుంటూ ఒక ప్రేమలేఖ రాసి ధాన్యలక్ష్మికి ఇచ్చి చదివిస్తాడు. మొదట్లో ధాన్యం అతను రాసిన మాటల్లో తనను పొగుడుతుండటంతో సంతోషంగా చదువుతుంది. కానీ చివర్లో “లత” అనే పేరు రావడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది.

ఆమె వెంటనే ప్రకాశం వైపు తిరిగి “ఈ లత ఎవరు?” అని ప్రశ్నిస్తుంది. అంత కవిత్వం రాస్తున్నావంటే నాకోసమే అనుకున్నాను, కానీ ఇది ఇంకొకరికి అంటూ… ధాన్యం వెంటనే చీపురుకట్ట తీసుకొని ప్రకాశాన్ని కొడుతుంది.
ప్రకాశం భయపడుతూ “అది చిన్నప్పటి కథ… చిన్నగా ఉన్నప్పుడు రాసిన లెటర్” అని చెబుతాడు.
అదే వినగానే ధాన్యలక్ష్మి “చిన్నప్పుడే ఇంత ప్రేమకథ నడిపావా?” అని మరింత మండిపడుతుంది. ఈ సీన్ మొత్తాన్ని రాజ్, కావ్య, సుభాష్, అపర్ణ పక్కనుండి చూసి నవ్వుకుంటారు.
ఇక ఉదయం రాహుల్ రెడీ అయి బయటకు వెళ్తుంటాడు. రుద్రాణి అతన్ని ఆపి “ఇప్పుడే ఎక్కడికి?” అని అడుగుతుంది. రాహుల్ శాంతంగా “పనికి వెళ్తున్నాను” అని సమాధానమిస్తాడు. పెద్ద ఉద్యోగాలు నాకు దొరకవు కానీ చిన్న చిన్న పనులు చేస్తూ అయినా సంపాదించి ఇంట్లో నమ్మకం తెచ్చుకోవాలి అనేది తన ప్లాన్ అని చెబుతాడు. అది విన్న రుద్రాణి “ఇంత చీప్ జాబ్స్ చేయడం ఎందుకు? నటించినా చాలు కదా… కష్టపడ్డట్లు నటించి డబ్బు తెచ్చానని చెబితే సరిపోతుంది” అని సలహా ఇస్తుంది.

కానీ రాహుల్ మాత్రం “మోసం చేసినా నిజాయితీగా చేయాలి… ఇంట్లో అందరి చూపు నాపైనే ఉంది. చాన్స్ తీసుకుని పెద్ద స్థాయికి వెళ్లాలి. చివరికి నేను రాజ్ ప్లేస్‌లో కూర్చోవాలి” అని చెబుతాడు. రుద్రాణి కొడుకు మాటలు విని మురిసిపోతూ “చాలా మారిపోయావ్… నీ ప్లానింగ్ సూపర్” అని మెచ్చుకుంటుంది.
బయటికెళ్తున్న రాహుల్‌కు స్వప్న ఎదురవుతుంది. ఆమె అతన్ని “ఇంత ఉదయాన్నే ఎక్కడికి?” అని అడిగితే రాహుల్ ప్రేమగా “ఇప్పటి వరకు నా గురించే ఆలోచించాను… ఇక నుంచి నీ గురించి ఆలోచించాలి అని నిర్ణయించుకున్న. నువ్వు నన్ను నమ్మావు… ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను” అని చెబుతాడు. ఈవెనింగ్ ఆమెకి సర్ప్రైజ్ ఉందని కూడా చెబుతాడు.
అప్పుడు ఇందిర వచ్చి రాహుల్‌ను ఉద్దేశించి “ఎక్కడికి వెళ్తున్నాడు? ఏమి చేస్తున్నాడు?” అని స్వప్నని అడుగుతుంది. స్వప్న రాహుల్‌లో మార్పు వచ్చింది, అందుకే సపోర్ట్ చేయాలని అనిపిస్తుంది అని చెబుతుంది. కానీ ఇందిర “అడవిలో ఏ పులి, సింహంతోనైనా స్నేహం చేయచ్చు… కానీ నక్కతో మాత్రం చేయకూడదు. నీ భర్తని నక్కతో పోల్చాను అని బాధ పడకు. కానీ రాహుల్ రక్తంలోనే మోసం ఉంది. జాగ్రత్తగా ఉండు” అని హెచ్చరిస్తుంది.

ఇందిరా దేవి వెళ్ళగానే స్వప్న మనసులో “మీరు అంత కూడా రాహుల్ ని నమ్మే రోజు వస్తుంది అమ్మమ్మ ” అని అనుకుంటుంది.
ఇక మరోవైపు రాజ్ కావ్యను రెస్టారంట్ కి తీసుకు వెళ్లడానికి రెడీ అవుతుంటే కావ్య మాత్రం పాప్‌కార్న్ తింటూ ఉంటుంది. రాజ్ కోపంగా “రెస్టారెంట్‌కి వెళ్లాలని నువ్వే అన్నావు… ఇంత వరకు రెడీ కాలేదేంటి?” అని అడుగుతాడు.
కావ్య “నేను చీరలోనే వస్తా” అని అంటుంది. రాజ్ నవ్వుతూ “నువ్వు ఎప్పుడూ చీరలోనే ఉంటావు కదా… అలాగే రా” అని చెబుతాడు. కానీ కావ్య “చీర నేను కట్టుకొని” అంటే దానికి రాజ్ “నన్ను కట్టుకోమంటావా ? అలంటి ప్లాన్ మాత్రం చేయకు తల్లి” అంటదు సరదగా. కావ్య వెంటనే “చీర నేను కట్టుకోవడం కాదు… మీరు నాకు చీర కట్టాలి” అని చెబుతుంది.

రాజ్ అవాక్కవుతూ “నేను నీకు చీర కట్టాలా?” అని ఆశ్చర్యపడతాడు. కావ్య “ఇది నా బకెట్ లిస్ట్‌లో ఉంది… మీరు మర్చిపోయారా?” అని గట్టిగా చెబుతుంది. రాజ్ ఇబ్బంది పడుతుంటే కావ్య “పెళ్లానికి చీర కట్టమంటే చతికిలపడతారు కానీ నెక్లెస్ డిజైన్ చేయమంటే అందంగా చేస్తారు” అని బుజ్జగిస్తుంది.
ఇక రాజ్ చీర కట్టబోయే సమయంలో కాస్త రొమాంటిక్ అయిపోయి కావ్యకు ముద్దు పెట్టబోతుంటే కావ్య అడ్డుకుంటుంది. చిరు కోపంతో రాజ్ ఇష్టం వచ్చినట్టు చుట్టేస్తాడు చీరని. చీర సరిగా కట్టకపోవడంతో కావ్య “ఇది చీర కట్టడమా? పరుపుని మడత పెట్టడమా?” అని కామెంట్ చేస్తుంది. దాంతో రాజ్ “అయితే నువ్వే కట్టుకో… నేను చూస్తూ నేర్చుకుంటా” అని అంటాడు.
ధాన్యం కొట్టిన దెబ్బలు వల్ల ప్రకాశం బాధ పడుతుంటే వాటికీ మందు రాస్తుంది. పక్కనే కళ్యాణ్ – అప్పూలు నవ్వుకుంటారు. ప్రకాశం చిన్నప్పటి లవ్ లెటర్ రాశానని గుర్తు చేసుకొని చెబుతుంటే అప్పు వెంటనే “మీ చిన్నప్పటి గర్ల్‌ఫ్రెండ్ పేరు ఎలా గుర్తుంది?” అని ప్రశ్నిస్తుంది. అది విని ధాన్యం ఇంకా కోపమ్ తెచ్చుకుంటుంది.

ఆమె “మీరు ఇంకా టచ్‌లో ఉన్నారు కదా?” అని అనుమానిస్తుంది. ప్రకాశం భయపడుతూ “లత కెనడాలో ఉంది… నేను ఎలా కలుస్తాను?” అని చెప్పినా, ధాన్యం నమ్మదు. అయితే ధాన్యం “ఆమెతో వీడియో కాల్ చేయించాలి… నిజం చెప్పాలి” అని ఆర్డర్ ఇస్తుంది.
ఇంకా కారులో రాజ్ – కావ్య ప్రయాణిస్తుంటే కావ్య తరువాత కోరిక గురించి మాట్లాడుతుంది. తనను రౌడీలు ఎత్తుకుపోతే రాజ్ హీరోలా వచ్చి వాళ్లతో ఫైట్ చేస్తూ తనను రక్షించాలి అని తన డ్రీమ్ చెప్పుతుంది. రాజ్ నిజంగా నేను రౌడీలతో ఫైట్ చేస్తే చప్పట్లు కాదు నా ముందు డప్పులు కొడతారు అంటాడు. అది విని కావ్య నవ్వుతుంది. అయితే నా కోరిక తీర్చరా అని అడుగుతుంది. రాజ్ కావ్యతో “నేను కొంతమంది డమ్మీ రౌడీలను సెట్ చేశాను. వాళ్లు నిన్ను కామెంట్ చేస్తారు. నువ్వు టెన్షన్ పడేలోపు నేను వచ్చి కొట్టి భయపెడతా” అని చెబుతాడు. అది విని కావ్య సరే అంటుంది.

తర్వాత హోటల్లో రాజ్ కావ్య కోసం అందంగా క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేస్తాడు. ఆ సడన్ సర్ప్రైజ్ చూస్తూ కావ్య ఆనందంతో మురిసిపోతుంది.
ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.
Source inspiration: Original story from “బ్రహ్మముడి” (JioHotstar). This is a personal written recap and interpretation.

