బ్రహ్మముడి Nov 15th, 2025 శనివారం ఎపిసోడ్: సర్వర్ గా రాహుల్ … !!! రౌడీలు నుండి కావ్య ని కాపాడిన రాజ్ … !!!
రాజ్ కావ్యకు సర్ప్రైజ్ ఇవ్వడానికి రాత్రి క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేస్తాడు. అక్కడ కూర్చున్న వెంటనే రాజ్, “నీకేం కావాలో చెప్పు కళావతి” అని అడుగుతాడు. కావ్య మాత్రం చిరాకు పడుతూ, ఎవర్ని అడగకుండానే తనకు ఇష్టమేదో ఊహించి ఆర్డర్ పెట్టాలి కదా అని అంటుంది.
రాజ్ అందుకు ఆశ్చర్యపోతూ, ఒక్క క్షణం కూడా ఊపిరి విడిచే అవకాశం ఇవ్వడం లేదని అనుకుంటాడు. కావ్య మరోసారి, తనకు ఏమి ఇష్టమో నీకు తెలియదా అని రాజ్ ని ప్రశ్నిస్తుంది. రాజ్ మాత్రం తాను అలా అనలేదని చెబుతాడు. అప్పుడు కావ్య, తనకిష్టమైనవి అతడే ఆర్డర్ చేయాలని చెబుతుంది.

రాజ్ బేరర్‌ను పిలిచి కొన్ని వంటకాలు చెప్తాడు. కానీ కావ్య వెంటనే అవి రాజ్‌కి నచ్చినవే అని గుర్తుచేస్తుంది. రాజ్ ఆశ్చర్యంగా చూస్తుంటే, కావ్య బేరర్ని పిలిచి రాజ్‌కి ఇష్టమైన మెను మొత్తం ఆర్డర్ చేస్తుంది. రాజ్ ఇంట్లో గరిటె కావ్య చేతుల్లో ఉండడం వల్ల తన ఇష్టాలు ఆమెకి తెలుసని చెబుతాడు. కావ్య మాత్రం ఇంట్లో గరిటె మాత్రమే తన చేతిలో ఉంటుందని, తాను రాజ్ చేతుల్లో ఉంటానని… అయినా తన ఇష్టాలు అతడు అర్థం చేసుకోలేదని అలుగుతుంది.
ఇంతలో కావ్య దాహం వేస్తుందని చెప్పడంతో రాజ్ వాటర్ బాటిల్ తీసుకురమ్మని బేరర్ని పిలుస్తాడు. వారి ముందు వచ్చిన బేరర్‌ను చూసి ఇద్దరూ ఒక్కసారిగా షాక్ అవుతారు — ఎందుకంటే అది రాహుల్.
కావ్య, రాహుల్‌ను ఇక్కడ బేరర్‌గా పనిచేస్తున్నావా అని అడుగుతుంది. రాహుల్, మనిషి అన్నాక ఏదో ఒక్క పని చేయాలని చెబుతాడు. రాజ్ మాత్రం ఇలాంటి పని చేసి ఇంటి పరువు తీయకూడదని అంటాడు. రాహుల్ తనపైన ఉన్న అపనమ్మకం, గతంలో చేసిన తప్పులు, ఇప్పుడు వచ్చిన మార్పు గురించి చెబుతాడు. ఆర్థికంగా నిలబడడానికి ఈ పని తప్ప తనకి వేరే మార్గం లేదని అంటాడు.

రాజ్, రాహుల్ ఇలాంటి పని చేయాల్సిన అవసరం లేదని, తాము ఉన్నామని చెప్పినా రాహుల్ అంగీకరించడు. తన భార్యా బిడ్డలకు నిజాయితీగా అన్నం పెట్టడం తన లక్ష్యం అని చెబుతాడు. ఇక్కడ తనను మేడమ్ అని పిలవకూడదని కావ్య చెప్పినా, రూల్ ప్రకారం కస్టమర్‌కి రిస్పెక్ట్ ఇవ్వాల్సిందే అని రాహుల్ చెబుతాడు. ఇక్కడ మీకు నాకు ఏ సంబంధం ఉందని తెలియకుండా, ఇప్పుడు మీరు ఇక్కడ కస్టమర్స్‌లా ఉండాలని చెబుతాడు.
రాహుల్‌లో వచ్చిన మార్పు నిజమని కావ్య చెబుతుంది. రాజ్ మాత్రం పూర్తిగా నమ్మడం లేదని చెప్పేస్తాడు.
కావ్య వాష్‌రూమ్‌కి వెళ్లేలోపు ముగ్గురు రౌడీలు ఆమెపై కామెంట్ చేస్తారు. కావ్య మొదట రాజ్ పెట్టిన నటులు అనుకుంటుంది. కానీ వాళ్లు చెప్పే మాటలు గంభీరంగా, అసభ్యంగా ఉండడంతో ఆమె షాక్ అవుతుంది. వాళ్లు బలవంతంగా ఆమెను రూమ్‌కి లాక్కెళ్లాలని ప్రయత్నిస్తారు.

అప్పుడే రాజ్ అక్కడికి చేరి వాళ్లను అడ్డుకుంటాడు. వారిని నానా తిట్లు పడుతూ కొట్టేస్తాడు. రౌడీలు “నువ్వెవరు, ఎందుకు కొడుతున్నావ్?” అని అడిగితే రాజ్ తను పేమెంట్ ఇచ్చిన వ్యక్తికి ఫోన్ చేస్తాడు. అవతలివాడు రాకపోవడానికి టైర్ పంక్చర్ అయ్యిందని చెబుతాడు. అప్పుడు రాజ్, దేవుడే నీ కోరిక నిజం చేయడానికి ఈ ఫైట్ సెట్ చేసినట్టు ఉందని చెప్తాడు.
అతడు రౌడీలందరినీ కొట్టి, ఇక మీదట కళావతి జోలికి వస్తే వదిలిపెట్టనని చెబుతాడు. రౌడీలు భయపడి కావ్యకు క్షమాపణలు చెబుతారు.
ఇంటికి వస్తూ ఇద్దరూ రాహుల్ గురించి మాట్లాడుతారు. రాహుల్ ఇలాంటి పని చేయడం బాగోలేదని కావ్య చెబుతుంది. రాజ్ మాత్రం గతంలో చేసిన తప్పులే రాహుల్ ఈ స్థితికి రావడానికి కారణమని గుర్తుచేస్తాడు. రాహుల్‌కి ఒక పని అప్పగిస్తే అతను బాధ్యతగా చేస్తాడని, దాంతో రాజ్ నిర్ణయం తీసుకోవాలని కావ్య కోరుతుంది. రాజ్ మాత్రం రాహుల్ ఈజీగా మారిపోడని అనుమానిస్తాడు. కావ్య తనకోసం రాహుల్ కి ఒక అవకాశం ఇవ్వమని రాజ్‌ను ఒప్పిస్తుంది.

రాహుల్ ఇంటికి వచ్చాక స్వప్నకు ఒక చీర ఇస్తాడు. అది తన కష్టార్జితం అని చెబుతాడు. స్వప్న ఆశ్చర్యంగా నువ్వు పని చేసావా అని అడుగుతుంది. రాహుల్ ఒక రెస్టారెంట్లో బేరర్‌గా జాయిన్ అయ్యానని చెబుతాడు. తన తప్పులకు తానే బాధ్యత తీసుకోవాలని, తన భార్యపై ఆధారపడకుండా నిజాయితీగా సంపాదించాలని చెప్పుకొస్తాడు.
నిజమైన మార్పు చూపడానికి ఇదే మార్గమని, మొదటి జీతంతో చీర కొన్నానని చెబుతాడు. స్వప్న చీర ధర విలువ గురించి ఆలోచించకుండా, అతడు తన కోసం ఆలోచించడం తనకు ముఖ్యమని చెబుతుంది. రాహుల్‌లో వచ్చిన మార్పు స్పష్టంగా కనిపిస్తుందని ఆమె అంగీకరిస్తుంది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నిన్నే నమ్ముతానని స్వప్న చెబుతుంది. రాహుల్ తన ప్లాన్ సక్సెస్ అయ్యిందని మనసులో ఆనందపడతాడు.

ఉదయం ఇందిరకి అప్పు కాఫీ ఇస్తుంది. ధాన్యం నువ్వు ఎందుకు ఈ పనులు చేస్తున్నావని అడుగుతుంది. ఇందిర మాత్రం “నాకు కాఫీ ఇస్తే నీ కోడలు అరిగిపోతుందా?” అని అంటుంది. అప్పుడే స్వప్న చాలా తక్కువ ధరలో ఉన్న చీర కట్టుకుని వస్తుంది. ధాన్యం ఆశ్చర్యపడుతుంది.స్వప్నతో ఏంటి ఇలాంటి చీర కట్టుకున్నావు ఎం బాగోలేదు అని అంటుంది. స్వప్న మాత్రం “మీకు నచ్చకపోతే ఏమిటీ? నాకు నచ్చింది” అని ధైర్యంగా చెబుతుంది.
ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
Source inspiration: Original story from “బ్రహ్మముడి” (JioHotstar). This is a personal written recap and interpretation.

