బ్రహ్మముడి Nov 17th, 2025 సోమవారం ఎపిసోడ్: రాహుల్ ని పూర్తిగా నమ్ముతున్న దుగ్గిరాల కుటుంబం … !!!
ఎపిసోడ్ ప్రారంభంలో స్వప్న కొత్తగా కట్టుకున్న చీరను చూసి ధాన్యలక్ష్మీ కోపంగా మండిపడుతుంది. “ఇంత చీప్ చీర కట్టుకుంటే మన ఇంటి పరువు ఏమౌతుంది?” అని తిడుతుంటే, స్వప్న బాధగా “ఈ చీర నా భర్త రాహుల్ కష్టపడి సంపాదించిన డబ్బుతో నా కోసం కొన్నది. నాకు ఇది చాలా ప్రత్యేకం,” అని చెబుతుంది.

అదే సమయంలో రాహుల్ కూడా “నేను ముందే చెప్పాను కదా. ఇలాంటి సమస్య వస్తుందని నాకు తెలుసు,” అని అంటాడు. స్వప్న మాత్రం మొండిగా “ఎవరు ఏం అనుకున్నా నువ్వు నా కోసం తెచ్చావు. నేను నిన్ను డిజప్పాయింట్ చేయను. చీర మార్చను,” అని అంటుంది. అప్పూ అక్కకి సపోర్ట్‌గా “అక్కకి ఈ చీర బాగానే ఉంది ఇంక ఈ టాపిక్ వదిలేద్దాం” అని చెప్తుంది.
అంతలో రాజ్ వచ్చి రాహుల్‌కి చెక్ ఇస్తూ “ఈరోజు 11 గంటలకు టెండర్ ఉంది. 20 లక్షల రూపాయలు డిపాజిట్ కట్టాలి. నువ్వే బ్యాంక్‌కి వెళ్లి డబ్బు డ్రా చేసి, టైంకి టెండర్ ఆఫీస్‌కి వెళ్లాలి.ఇలాంటి పనులు చూసుకుంటే నీకు కూడా హెల్ప్ అవుతుంది” అని చెప్తాడు. ఇంట్లో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.

ఇంట్లో అందరూ కోపంగా “ఆఫీస్ పనులు ఇతను చూసుకోవాలా? 20 లక్షలు ఇతని చేతిలో పెడతావా?” అని మండిపడతారు. రాజ్ మాత్రం శాంతంగా “ప్రతి మనిషికి ఒక ఛాన్స్ ఇవ్వాలి అని కావ్య చెప్పింది. అందుకే నీకు ఈ ఛాన్స్ ఇస్తున్నాను. నువ్వు కరెక్ట్ గా టైం కి వెళ్లి మనీ కట్టేయాలి. ఈ టెండర్ మనకి చాల ముఖ్యం” అని చెబుతాడు. రాహుల్ ఈ ఛాన్స్ ఇచ్చినందుకు రాజ్ కి థాంక్స్ చెప్పి తాను ఎలా అయినా ఈ పనిని కరెక్టుగా చేసి నేను ఏంటో నిరూపించుకుంటాను అని అంటాడు.
స్వప్న కృతజ్ఞతతో కావ్య చేతులు పట్టుకుని “నువ్వే రాహుల్‌కి ఈ అవకాశం ఇప్పించావు. రాహుల్ మారతాడని నువ్వు నమ్మావు. నేను కూడా రాహుల్ మారాలని కోరుకున్నా. కానీ ఇంట్లో ఎవ్వర్నీ ఎలా ఒప్పించాలో తెలియలేదు. నువ్వు నా మనసు అర్థం చేసుకున్నావు. నేను నా స్వార్ధంతో డబ్బున్న వాడిని చేసుకుని వెళ్ళిపోయాను. కానీ నువ్వు అమ్మానాన్నల కోసం ఈ ఇంటికి వచ్చావు… నా కోసం నీ చదువుని త్యాగం చేశావు. నేను నిన్ను ఎంతోసార్లు బాధపెట్టా. నువ్వు చేసిన మంచే నీకు తిరిగి వచ్చింది అందుకే దేవుడు నీకు మంచి భర్త ఇచ్చాడు. నిన్ను అప్పుని చూసి నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది కానీ నా లైఫ్ మాత్రం ఇలా ఎందుకు అయిందో అని బాధగ ఉండేది. రాహుల్ మారాలి అని చాలా ఎదురు చూసాను. ఇప్పటికి ఆరోజు వచ్చింది ” అని తన బాధ చెప్పుకుంటుంది.

టెండర్ ఆఫీస్‌లో మేనేజర్ ప్రకాశంతో “రాహుల్ ఇంకా రాలేదు” అని చెప్తాడు. ప్రకాశం “రాహుల్ డబ్బు తీసుకుని వచ్చేలోపు మనం మిగిలిన ఫార్మాలిటీస్ చేసుకుందాం” అని చెప్తాడు. అదే సమయంలో బ్యాంక్ నుండి డబ్బు తీసుకుని బయటకు వచ్చిన రాహుల్‌పై దొంగలు దాడి చేసి బ్యాగ్ దొంగిలిస్తారు. రాహుల్ గాయాలనీ తట్టుకుని వాళ్లను వెంబడిస్తాడు. సూట్‌కేస్ కోసం ప్రాణంగా పోరాడుతాడు.
అంతలో రాజ్ ఇంట్లో కావ్యతో బైక్ నడపాలి అన్నావు కదా స్కూటీ తెచ్చాను అని చెప్తాడు. కావ్య స్కూటీ కాదు బులెట్ కావాలి అని అడుగుతుంది. అందరు షాక్ అవుతారు. అంతలో ప్రకాశం ఫోన్ చేసి రాజ్ తో రాహుల్ ఇంక డబ్బు తీసుకుని రాలేదు అని చెప్తాడు. రాజ్ టెన్షన్ పడతాడు. విషయం తెలిసి ఇంట్లో వాళ్లందరూ “ముందే అనుకున్నాం ఇదే జరుగుతుందని” అంటూ రాహుల్‌ను తప్పుపడతారు. ధాన్యం ముందుకు వచ్చి “అతను ఆ 20 లక్షలతో పబ్బుల్లో, క్లబ్బుల్లో జల్సా చేస్తూ ఉంటాడు!” అని అన్న వెంటనే స్వప్న కన్నీళ్లు పెట్టుకుంటుంది. ధాన్యం స్వప్నతో “రాహుల్ ని నువ్వు నమ్ముతావు ఏమో కానీ మేము నమ్మము” అని చెప్తుంది.

ఇదంతా రాహుల్ కారులో నుంచే వింటాడు. చివరికి ప్లాన్ ప్రకారం ఇంట్లోకి వస్తాడు. ఇంట్లో అందరూ రాహుల్‌నే తప్పుపడుతున్న సమయంలో రాహుల్ గాయపడిన శరీరంతో లోపలికి వస్తాడు. రాజ్ వెంటనే “ఏం జరిగిందిరా రాహుల్?” అని అడుగుతాడు. రాహుల్ నిట్టూరుస్తూ “సమయానికి డబ్బు కట్టలేకపోయాను బ్యాంక్ నుండి వస్తుండగా దొంగలు దాడి చేశారు కానీ నేను వదిలిపెట్టలేదు వాళ్లను వెంబడించి డబ్బు తిరిగి తెచ్చాను” అని సూట్‌కేస్‌ను రాజ్ చేతిలో పెడతాడు.
ధాన్యం వెంటనే “ఇది మొత్తం నాటకం!” అని అరుస్తుంది. అప్పుడే బయట నుంచి సుభాష్ వచ్చి చెబుతాడు “నాటకం కాదు. రాహుల్ నిజం చెబుతున్నాడు. నేను దొంగలు దాడి చేసినది కూడా చూశాను
రాహుల్ వాళ్లను వెంబడించినదీ చూశాను.” ఇంట్లో అందరూ రాహుల్ నిజంగా మారుతున్నాడని అనుకోవడం మొదలుపెడతారు. రాహుల్ అలసిపోయి సోఫాలో కూర్చుంటాడు. స్వప్న కన్నీళ్లు ఆపుకోలేక అతణ్ని పట్టుకుంటుంది.

ఎపిసోడ్ ఇక్కడే ముగుస్తుంది.
Source inspiration: Original story from “బ్రహ్మముడి” (JioHotstar). This is a personal written recap and interpretation.

