బ్రహ్మముడి Nov 18th, 2025 మంగళవారం ఎపిసోడ్: కుటుంబాన్ని పూర్తిగా నమ్మిస్తున్న రాహుల్ … !!! కావ్య కోసం మరో అవకాశం ఇస్తాను అన్న రాజ్ … !!!
ఎపిసోడ్ ప్రారంభంలో ఇంట్లో సుభాష్ రాహుల్ డబ్బును సేఫ్‌గా తీసుకువచ్చాడని దాని కోసం చాలా కష్టపడ్డాడు అని చెప్పగానే, స్వప్న కోపంగా ఇంట్లో వాళ్ళ గురించి “ఇంకా నా భర్త మీ కళ్లకి దొంగలాగా, నేరస్తుడిలాగా కనిపిస్తున్నాడా?” అని ప్రశ్నిస్తుంది. సుభాష్ అంకుల్ చెప్పింది నాటకమా అని నిలదీస్తుంది.
ధాన్యలక్ష్మీ కూడా, 20 లక్షల నగదుతో టెండర్ ఆఫీస్ కి వెళ్లాల్సిన రాహుల్ టైంకి రాలేదంటే అనుమానం రావడం సహజమే కదా అని అంటుంది. కానీ స్వప్న మాత్రం మారిపోయిన మనిషిని గుర్తించకుండా అతని పాత తప్పులు దృష్టిలో పెట్టుకుని నిందలు వేస్తే అది తప్పని చెబుతుంది.

ఈ మాటలతో రుద్రాణి గట్టిగా ఫైర్ అవుతుంది. తన కొడుకుని అవమానించడం అందరికీ అలవాటు అయిపోయిందని, వాడు గతంలో చేసిన తప్పులు మాత్రమే అందరికీ కనిపిస్తున్నాయని అంటుంది. కానీ ఈ రోజు ఆ దొంగల దగ్గర తన ప్రాణాలు పణంగా పెట్టి డబ్బు కాపాడాడనే విషయం ఎవరికీ కనిపించడం లేదని బాధపడుతున్నట్టు చెబుతుంది.
రాహుల్ రుద్రాణిని ఆపుతూ ఇంట్లో వాళ్ళ తప్పు ఎం లేదని తాను గతంలో చేసిన పాపాలు అలాంటివి, అంత తొందరగా నాలో మార్పుని గుర్తించడం ఎవరికైనా అసాధ్యం అందుకే అందరూ నమ్మడం కష్టం అని అంగీకరిస్తాడు. కానీ రాజ్ ఇచ్చిన అవకాశం తన దురదృష్టం వల్ల ఇలా తిరగబడ్డదని అంటాడు. “నేను డబ్బు తీసుకురాకపోతే దొంగల చేతిలో పది ఉంటే ఇంట్లో నా పరిస్థితి ఏంటో? అని వణికిపోయాను” అని చెబుతాడు. అదృష్టం తోడైంది కాబట్టి డబ్బు తెచ్చానని చెబుతాడు.

అపర్ణ రాహుల్ తో “డబ్బు తెచ్చినా కాంట్రాక్ట్ పోయింది కదా?” అని అంటుంది. ధాన్యం కూడా “నువ్వు జాగ్రత్తగా ఉంటే కాంట్రాక్టు మిస్ అయ్యేది కాదు కదా” అని అంటుంది. దానికి రాహుల్ అదే నా బాధ కూడా డబ్బు తెచ్చిన కాంట్రాక్టు మిస్ అయ్యింది నా వల్ల అని రాజ్ కి సారీ చెప్తాడు.
కానీ రాజ్ కాంట్రాక్ట్ మిస్ కాలేదని, అది మనకే వచ్చిందని చెప్తాడు. అందరు షాక్ అవుతారు. రాజ్ ముందే ప్లాన్ చేసి, రాహుల్ తప్పు చేస్తే కాంట్రాక్ట్ పోకుండా ఉండటానికి ప్లాన్ B గా తన బాబాయికి డబ్బు అందేలా చూసుకున్నాడని అందరికీ చెబుతాడు. కళావతి చెప్పడంతో రాహుల్ కు ఒక ఛాన్స్ ఇచ్చానని, కానీ ఆ ఛాన్స్ వృధా కావొద్దని ముందే జాగ్రత్తలు తీసుకున్నానని వివరిస్తాడు.
ఈ విషయం విన్న రాహుల్ “నేను కాంట్రాక్ట్ రాలేదని బాధపడ్డా. కానీ నీ ప్లాన్ వల్ల కాంట్రాక్ట్ మనకే వచ్చింది” అని రాజ్‌కు థ్యాంక్స్ చెప్పి డబ్బులు ఇచ్చేసి వెళ్తాడు.
స్వప్న రాహుల్ కి తగిలిన గాయాలకు మందు వేస్తూ, “20 లక్షల కోసం ప్రాణాలు పెడతావా? నీకు ఏమైనా అయితే నేను పాపా ఎం అవ్వాలి” అని కోపంతో, ప్రేమతో అడుగుతుంది. దానికి రాహుల్ “20 లక్షలు కాదు తన కుటుంబం డబ్బు 20 రూపాయలు కూడా నా వల్ల పోకూడదు. అవసరమైతే నా ప్రాణాలు కూడా లెక్క చేయను” అని చెబుతుంది. స్వప్న “డబ్బు పోతే సంపాదించుకోవచ్చు. ప్రాణం పోతే సంపాదించుకోలేము కదా” అని చెప్తుంది.

రాహుల్, “డబ్బు పోతే సంపాదించుకోవచ్చు కానీ నమ్మకం పోతే తిరిగి సంపాదించుకోలేం. రాజ్ నన్ను నమ్మి డబ్బు ఇచ్చినందుకే అంత కష్టపడ్డాను” అని చెబుతాడు. ఇంక మాట్లాడుతూ “నేను రెండు గంటలు కనిపించకుండా పోయినప్పుడు, అందరూ అనుమానించారు కదా. వాళ్ళ మాటలు విని నీకు కూడా నా మీద అనుమానం వచ్చిందా? నిజంగా భయపడ్డావా?” అని స్వప్నని అడుగుతాడు. స్వప్న అవును అన్నట్టు తలూపుతుంది.
దానికి రాహుల్ “నేను ఏమి దానికి తప్పు పట్టాను స్వప్న. నేను ఎంత దరిద్రుడిని అయినా ఇవాళ అదృష్టం నావైపు ఉంది కాబట్టే దొంగలతో పోరాడి డబ్బు తెచ్చాను అని ఈ రోజు తెలిసింది” అని చెబుతూ కొంచెం గర్వపడతాడు. స్వప్న అతనితో “ఇకపై నీ నిజాయితీని నిరూపించుకోవాల్సిన పని లేదు. నేను, పాప నిన్ను నమ్ముతాము. నువ్వు నిజంగా మారిపోయావు” అని ధైర్యం ఇస్తుంది. అప్పుడు రాహుల్, “నీ లాంటి దేవత నా వెనకాల ఉంటే నాకు ఇంకేం కావాలి” అని ప్రేమగా చెబుతాడు.

కావ్య రాజ్ దగ్గరకి వెళ్లి, రాహుల్ ప్రాణాలకు తెగించి డబ్బు కాపాడాడని అలాంటి మనిషికి ఇంకో ఛాన్స్ ఇవ్వాలని చెబుతుంది. కానీ రాజ్ రాహుల్ ని నమ్మకుండా “రాహుల్ అవకాశాన్ని వాడుకునే వ్యక్తి కాదు, దానితో ఆడుకునే టైప్” అని రాజ్ అంటాడు. కానీ కావ్య “ముందు చేసిన తప్పులు చూసి అలానే ఉండకూడదు కదా తనకి ఒక అవకాశం ఇస్తేనే కదా తన నిజాయితీ నిజామా కాదా అని తెలిసేది. మీరు ఇవాళ లానే తనని గమనిస్తూ మరొక్క అవకాశం ఇచ్చి చూడండి” అని అంటుంది. రాజ్ కావ్యతో “ఎందుకు నీకు అతని గురించి అంత ఆలోచన? తన మీద నీకు ఎందుకు అంత నమ్మకం” అని అడుగుతాడు.
కావ్య “మా అక్క (స్వప్న) ఆనందం కోసం. గతంలో తప్పులు చేసిన మనిషిని కూడా మార్చవచ్చని నేను నమ్ముతున్నాను. అందుకే రాహుల్ కి ఒక బాధ్యత ఇవ్వమని అడుగుతున్నాను. రాహుల్ నిజంగా మారితే మా అక్క కూడా నేను అప్పులాగా సంతోషంగా ఉంటుంది” అని చెప్తుంది. చివరికి రాజ్ “నీకోసం ఒప్పుకుంటున్నా” అని చెబుతూ రాహుల్ కి మరో అవకాశం ఇచ్చేందుకు అంగీకరిస్తాడు.

రుద్రాణి రాహుల్ కి తగిలిన దెబ్బలు చూసి “ఏంటిరా ఇది అంతా? వాళ్ళని నమ్మించడానికి ఇంత కష్టపడాలా?” అని రాహుల్ ని మందలిస్తుంది. రాహుల్ ఒక్కసారిగా నవ్వుతూ “అది అంతా నేను వేసిన ప్లాన్ స్వప్నతో పాటు నువ్వు కూడా నమ్మేశావా ” అని అడుగుతాడు. రుద్రాణి షాక్ అవుతూ దొంగతనం అబద్దమా అని అడుగుతుంది. రాహుల్ దొంగలుగా వచ్చిన వారు తాను పెట్టిన మనుషులని చెబుతూ, ఇంట్లో అందరు తనపై జాలి చూపించేలా, రాజ్–కావ్య ముందూ హీరోలా కనిపించేలా ఇది చేశానని అంగీకరిస్తాడు.
దానికి రుద్రాణి అంతా నాటకం ఎందుకు ఆ డబ్బు నువ్వు టైం కి తీసుకు వెళ్తే అందరు నిన్ను నమ్ముతారు కదా అని అడుగుతుంది. రాహుల్ అలా అయితే ఒక నమ్మకమైన పని వాడిలా చూస్తారు కానీ ఇపుడు ప్రాణం పెట్టాను అని నన్ను ఆఫీసులోకి రాణిస్తారు అని చెప్తాడు. అలానే రాజ్ నమ్మకపోయినా కావ్య సెంటిమెంట్ కి పడిపోతుంది తానే మనకి అవకాశం ఇచేలా చేస్తుంది అని నమ్మకంగా చెప్తాడు. దాని కోసం నువ్వు ఇపుడు మరింతగా ఇంట్లో నువ్వు గొడవ పెట్టు, నేను స్వప్నని రెచ్చగొడతాను అని ఎం చేయాలో అని రుద్రాణికి చెబుతాడు.

రాజ్ భోజనానికి రాహుల్ రాలేదని అడిగితే స్వప్న తనకి ఆకలిగా లేదు అని చెప్పాడు అని సమాధానం ఇస్తుంది. అంతలో రుద్రాణి ఫైర్ అవుతుంది. “నా కొడుకుని మీరంతా దొంగలా చూసినప్పుడు, వాడు వచ్చి మీతో ఎలా తింటాడు?” అని నిలదీస్తుంది. ధాన్యం సమాధానము ఇస్తూ “రాహుల్ డబ్బు అయితే తిరిగి తెచ్చాడు కానీ టెండర్ పోయేది కదా రాజ్ జాగ్రత్త పడటం వల్లనే కదా మనకి దక్కింది” అని అంటుంది.
దానికి రుద్రాణి “అంటే ఇంక వాడి నిజాయితీ కి ఏమి విలువ లేదా” అని అడుగుతుంది. వెంటనే ప్రకాశం “అందరు రాహుల్ ని తిట్టింది మునుపు తాను చేసిన పనులు వల్ల. అంతా తొందరగా నమ్మకం ఎలా వస్తుంది” అని గట్టిగా సమాధానం ఇస్తాడు. రుద్రాణి రాహుల్ మారుతున్నాడని చెబుతూ, ఒక అవకాశం ఇవ్వమని కోరుతుంది. దాంతో రాజ్ వెళ్లి రాహుల్ ని తీసుకుని రమ్మని స్వప్నకు చెప్తాడు.
రాహుల్ రాగానే రాజ్ ని విషయం ఏంటి అని అడుగుతాడు. నీతో నీ భవిష్యత్తు, నీ భార్య కూతురు గురించి మాట్లాడాలని పిలిచాను అని రాజ్ అంటాడు.
అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.
Source inspiration: Original story from “బ్రహ్మముడి” (JioHotstar). This is a personal written recap and interpretation.

