చిన్ని Nov 3rd, 2025 సోమవారం ఎపిసోడ్ : నాగవల్లి పన్నిన వలలో మధు … మ్యాడీ మధుని కాపాడతాడా?
ఇవాళ్టి ఎపిసోడ్లో మధు మరియు స్వప్న పరీక్షలకు అవసరమైన పెన్నులు కొంటూ ఉంటారు. అప్పుడే ఓ అపరిచిత యువకుడు వచ్చి, “నాన్న హాస్పిటల్లో ఉన్నారు, అమ్మతో మాట్లాడాలి, అర్జెంట్ విషయం” అంటూ మధు ఫోన్ తీసుకుంటాడు. ఆ ఫోన్‌తో ఓ నంబర్ డయల్ చేసి వెంటనే డిలీట్ చేస్తాడు.
తర్వాత కాలేజీలో నాగవల్లి వచ్చి శ్రేయకు లంచ్ బాక్స్ ఇస్తుంది — “ఇది మ్యాడీ కోసం తీసుకొచ్చా, వాడు తినకపోతే నేను తినను అని చెప్పు” అంటుంది. శ్రేయ నవ్వుతూ, “ఇంత ప్రేమగా తీసుకొస్తే బావ ఎట్లా తినడు అత్తయ్యా!” అని సరదాగా చెబుతుంది. ఈ సన్నివేశం తర్వాత మధు నాగవల్లిని చూసి దగ్గరికి వెళ్తుంది. టీవీలో వచ్చిన వార్తల వల్ల ఆమెకు, అంకుల్‌కి బాధ కలిగిందని క్షమాపణలు చెబుతుంది. కానీ నాగవల్లి కోపంతో మధు పట్ల తీవ్రమైన మాటలు మాట్లాడుతుంది.

“మేము నీకు ఏం ద్రోహం చేశామో చెప్పు! నువ్వు మా జీవితంలోకి వచ్చి మా కుటుంబాన్ని నాశనం చేస్తున్నావ్,” అని నాగవల్లి విరుచుకుపడుతుంది. మధు తన వైపు నుంచి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది — “మ్యాడీని మీతో కలపాలన్నదే నా ఉద్దేశం, మీడియా వస్తుందని నాకు తెలియదు” అంటుంది. కానీ నాగవల్లి నమ్మదు. “మ్యాడీ మొండితనానికి నువ్వే కారణం. నా జీవితంలో ఉన్న అతి పెద్ద శత్రువు నువ్వే! త్వరలో నీ అహంకారాన్ని మట్టి కరిపిస్తా” అంటూ స్పష్టమైన హెచ్చరిక ఇస్తుంది.
ఇక అదే సమయంలో, మధు ఫోన్ వాడిన అబ్బాయి నాగవల్లి పీఏకి కాల్ చేసి, “మధు నంబర్ తీసుకున్నా, ఇప్పుడు మీరు మీ పని చేయొచ్చు” అంటాడు. ఆ తర్వాత మధు, మ్యాడీతో కలిసి హాల్‌టికెట్ తీసుకోవడానికి వెళ్తుంది. వారితో పాటు లోహిత కూడా వస్తుంది. ముగ్గురూ కలిసి ఫీజు కట్టడానికి కౌంటర్‌కి వెళ్తారు. అక్కడ చందు ఫీజులు స్వీకరిస్తూ ఉంటాడు. లోహిత తన అన్న చందును చూసి షాక్ అవుతుంది. తను చందు ముందు ముఖం కనిపించకుండా బుక్ అడ్డంగా పెట్టుకుంటుంటుంది. చందు లోహిత సంతకం చూసి మాట్లాడాలి అనుకుంటాడు, కానీ ఆమె అంతక ముందు తనతో “కాలేజీలో మనం అన్న చెల్లెలు అని ఎవరికి చెప్పొద్దు” అన్న మాట గుర్తు చేసుకొని చందు మౌనంగా బాధ పడతాడు.

తర్వాత మధు, మ్యాడీలు గ్రౌండ్లో ఉన్నప్పుడు ప్యూన్ వచ్చి “ప్రిన్సిపల్ సార్ పిలుస్తున్నారు, చాలా సీరియస్‌గా ఉన్నారు” అని చెబుతాడు. మధు భయంతో వణుకుతుంది. మ్యాడీ ధైర్యం చెబుతూ ఆమెను ప్రిన్సిపల్ రూమ్‌కు తీసుకెళ్తాడు. అక్కడ ప్రిన్సిపల్ కోపంతో, “నిన్ను మంచి స్టూడెంట్‌గా అనుకున్నా, కానీ కాలేజ్ పేరును పాడుచేసావు!” అని మండిపడతాడు. అప్పుడు ఆయన మధు ఫోన్లోని మెసేజ్‌లు చూపిస్తూ, “నీ అకౌంట్లో ఇన్ని లక్షలు జమ అయ్యాయి — ఇది ఏమిటి?” అని ప్రశ్నిస్తాడు.
మధు పూర్తిగా షాక్ అవుతుంది. “సార్, నాకు ఏమాత్రం తెలియదు” అని ఏడుస్తుంది. కానీ ప్రిన్సిపల్ చెబుతాడు — “మధు సెమిస్టర్లో మంచి మార్కులు వేయిస్తా అని విద్యార్థుల దగ్గర నుంచి డబ్బు తీసుకుంది, తల్లిదండ్రులు కూడా కంప్లైంట్ ఇచ్చారు. యూనివర్సిటీకి కూడా సమాచారం ఇచ్చాం” అని. మధు ఏడుస్తూ బయటికి వెళ్తుంది. అక్కడ సంజు మధుని బాధ పెట్టేలా మాట్లాడుతుంటే మ్యాడీ వచ్చి సాయంత్రంలోపు మధు ఏ తప్పు చేయలేదు అని నిరూపిస్తా అప్పటి వరకు మధుని ఏమైనా అంటే ఊరుకోను అని వార్నింగ్ ఇస్తాడు.

ఈ విషయం తెలుసుకున్న సంజు వెంటనే లోహిత, శ్రేయలకు చెబుతాడు. వారు హ్యాపీగా ఫీలవుతారు. నాగవల్లికి కూడా ఈ వార్త చెబుతారు. శ్రేయ దేవుడు న్యాయం చేసాడు అని అంటుంది. నాగవల్లి సంతోషంతో, “ఇది మధు చేసిన దానికి నేను వేసిన శిక్ష, ఇంకా నేను పెట్టే టార్చర్ నువ్ తట్టుకోలేవు మధు” అని అనుకుంటుంది.
ఇక చివర్లో, దేవా ఇంటికి వస్తాడు. అతని చేతికి గాయం కనిపించి నాగవల్లి అడుగుతుంది — “ఏమైంది?” దేవా చెబుతాడు — “హాఫ్ టికెట్ బాలరాజ్ దగ్గరకి వచ్చాడు”. ఇది విన్న నాగవల్లి షాక్ అవుతుంది. హాఫ్ టికెట్ ని చంపేసావా అని అడుగుతుంది. లేదు కట్టిపడేసాను అని జరిగింది అంతా దేవా నాగవల్లితో చెప్తాడు. చిన్ని గురించి త్వరలోనే తెలుసుకోవాలని ఇద్దరు అనుకుంటారు.
ఈ సన్నివేశంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
Source inspiration: Original story from “చిన్ని” (JioHotstar). This is a personal written recap and interpretation.
