చిన్ని Oct 31st, 2025 శుక్రవారం ఎపిసోడ్ : మధు పై ప్రతీకారం కోసం నాగవల్లి ప్లాన్ …!!!!
ఎపిసోడ్ ప్రారంభంలో మధు, లోహిత మధ్య సంభాషణ జరుగుతుంది. మధు, “నేనే మీకు ఇబ్బంది పెడుతున్నానని మ్యాడీతో ఎందుకన్నావు ?” అని లోహితను అడుగుతుంది. దానికి లోహిత, “అవును నేను ఆ ఇంటికి వెళ్తే రాజభోగాలు అనుభవిస్తానేమో అని భయంతో నువ్వు నన్ను ఇబ్బంది పెడుతున్నావు” అని సమాధానం ఇస్తుంది.
మధు కొంచెం కోపంగా, “నీకు బుద్ధి ఉందా? నువ్వు వరుణ్ ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు. మీరు ఆ ఇంటికి ఎలా వెళ్ళాలో ప్రయత్నిస్తుంటే, నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు?” అని ప్రశ్నిస్తుంది. తర్వాత మధు, “మొదటి నుంచి నీకు నా మీద కోపమే. ఇప్పటికైనా మనసు మార్చుకో” అని చెబుతుంది.

ఇక మరో సీన్లో, ఆఫ్ టికెట్ పంపిన వ్యక్తి బాలరాజును చూశానని చెబుతాడు. బాలరాజు పరిస్థితి గురించి మాట్లాడుతూ, “దేవా సార్ చాలా దుర్మార్గుడు. బాలరాజును దారుణంగా కొడుతున్నాడు” అని చెబుతాడు. ఆఫ్ టికెట్ బాలరాజును తప్పించాలని నిర్ణయం తీసుకుంటాడు.
మరోవైపు, మహి మరియు చిన్ని కాలేజీకి బయల్దేరుతారు. లోహిత, తన అన్నయ్య ఉంటాడు అని కాలేజీకి వెళ్లకుండా ఉండాలనుకుంటుంది. తలనొప్పి కారణంగా వెళ్లలేనని చెబుతుంది. కానీ మధు, మ్యాడీ ఆమెను “పరీక్షలు దగ్గరలో ఉన్నాయి, హాల్ టికెట్ తీసుకోవాలి కదా” అని ఒప్పిస్తారు. చివరికి లోహిత వెళ్ళడానికి అంగీకరిస్తుంది.
లోహిత, “నేను మ్యాడీ స్కూటీలో వస్తాను, నువ్వు బస్సులో రా” అని మధుతో చెబుతుంది. మధు మనసులో “మ్యాడీతో నేను వెళ్లకూడదనుకునేలా అలా చెబుతోంది” అని అనుకుంటుంది. అందుకే మధు, “నేను మ్యాడీతో స్కూటీలో వెళ్తాను. నీ కోసం వేరే ఏర్పాటు చేశాను” అని చెబుతుంది. వెంటనే తన స్నేహితుడిని పిలిచి కారు తెప్పిస్తుంది. లోహిత మనసులో “మ్యాడీతో నేను స్కూటీలో రాకూడదనుకొని నాకోసం కారు ఏర్పాటు చేసిందా?” అని అనుకుంటుంది. ఆమె కారులో వెళ్ళిపోతుంది. మధు, మ్యాడీ స్కూటీలో బయల్దేరుతారు. మధ్యలో ఆగి మధు మ్యాడీకి చాక్లెట్ ఇస్తుంది. ఇద్దరూ కొబ్బరి నీళ్లు తాగుతారు. మధు, మ్యాడీ తిన్న చాక్లెట్ రాపర్ మరియు తాగిన స్ట్రాను దాచుకుంటుంది — మ్యాడీకి తెలియకుండా.
ఇక ఇంట్లో నాగవల్లి జరిగిన గొడవను తలుచుకొని బాధపడుతుంది. వసంత ఆమెను ఓదార్చే ప్రయత్నం చేస్తుంది. శ్రేయతో “మన ఇంట్లో మన వాడు కాలేజీలో ఉన్నాడనే ధైర్యం ఉండేది. ఇప్పుడు అది లేదు” అని వసంత బాధతో చెబుతుంది. అపుడు శ్రేయ ఇంట్లో లేకపోతే ఏంటి కాలేజీలో ఉన్నాడుగా అంటుంది. దానికి నాగవల్లి, “అతను కాలేజీకి వస్తే సరిపోదు, ఇంటికీ రావాలి, మనతో ఉండాలి. అప్పుడు కాని నాకు సాంత్వన ఉండదు” అని అంటుంది. ప్రమీల, వసంత ఇద్దరూ నాగవల్లిని ఓదార్చుతారు. మధుపై కోపంతో ఉన్న నాగవల్లి, ఆమె పరీక్షలు రాయకుండా చేయాలని నిర్ణయిస్తుంది. తన పీఏని పిలిచి ఒక ప్లాన్ చెబుతుంది. అతను ఎవరో వ్యక్తికి ఫోన్లో “ఆమెకు హాల్ టికెట్ రాకుండా చూడాలి” అని చెబుతాడు.

ఇక మధు, మ్యాడీ కాలేజీకి చేరుతారు. మధు లోహిత దగ్గరకు వెళ్లి, “మ్యాడీ నీతో మాట్లాడాలి అంటున్నాడు” అని చెబుతుంది. లోహితను తీసుకెళ్తుంది. శ్రేయ వారిని చూసి “ఇద్దరు ఎపుడు కొట్టుకునే వాళ్ళు కదా, ఇప్పుడు కలిసి ఎందుకు వస్తున్నారు?” అని అనుకుంటుంది.
మ్యాడీ, లోహితతో మాట్లాడుతాడు. “నీ పెళ్లి విషయం ఎక్కడా తెలీకూడదు. ముఖ్యంగా సంజు బ్యాచ్‌కి అస్సలు చెప్పొద్దు” అని చెబుతాడు. లోహి “నాకు తెలుసు, జాగ్రత్తగా ఉంటాను” అని చెబుతుంది
ఇక సంజు, మధు వెళ్ళిపోతుండగా అడ్డుకుంటాడు. “పరీక్షలకు బాగా ప్రిపేర్ అయ్యావా? అవసరమైతే నేనే సాయం చేస్తాను” అని చెబుతాడు. మధు, “నీలాంటి వాళ్లకి వంద మందికి నేనే సాయం చేయగలను” అని సమాధానం ఇచ్చి వెళ్తుంది. సంజు ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. అదే సమయంలో మ్యాడీ వచ్చి అతన్ని ఆపేస్తాడు. “చదువు మీద ఫోకస్ పెట్టు” అని సీరియస్‌గా చెబుతాడు.
తర్వాత మధు, మ్యాడీతో “నన్ను ఎవరో ఇబ్బంది పెడితేనే ఇంతలా ఫీలవుతున్నావు, మరి నీ చిన్నిని చేస్తే?” అని అడుగుతుంది. దానికి మ్యాడీ కోపంగా “అలా జరిగితే నరికేస్తా” అని చెబుతాడు.
ఎపిసోడ్ చివరలో శ్రేయ, లోహిత కలుసుకొని హగ్ చేసుకుంటారు. అలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
Source inspiration: Original story from “చిన్ని” (JioHotstar). This is a personal written recap and interpretation.
