చిన్ని Nov 4th, 2025 మంగళవారం ఎపిసోడ్ : మధుని సేవ్ చేసిన మ్యాడీ … హెల్ప్ చేసిన దేవా…!!!
ఈ ఎపిసోడ్లో మొదట దేవేంద్ర వర్మ నాగవల్లితో హాఫ్ టికెట్ బాలరాజు దగ్గరకు రావడం గురించి అలానే వాళ్ళు చిన్ని గురించి మాట్లాడటం గురించి చెప్తాడు. చిన్ని గురించి తెలిసిందా అని నాగవల్లి అడుగుతుంది. చిన్ని విషయం ఇంకా బయట పెట్టలేదు, తొందర్లోనే చెప్తాడు చెప్పకపోతే వదిలిపెట్టను అని దేవేంద్ర వర్మ అంటాడు. అతను “మన సమయం నడుస్తుంది, అన్నీ మనం అనుకున్నట్లుగానే జరుగుతాయి” అని విశ్వాసంగా చెబుతాడు.
ఇక మధు స్కామ్‌లో ఇరుక్కుపోయి బాధపడుతూ ఏడుస్తుంది. చందు, మ్యాడీ ఆమె దగ్గర కూర్చుని ఆమెకు ధైర్యం చెబుతారు. మ్యాడీ మధుతో “నువ్వు ఏ తప్పు చేయలేదు, నేను అది నిరూపిస్తాను” అని చెబుతాడు. కానీ మధు “నువ్వు నిరూపించకపోతే నాకు హాల్‌టికెట్ ఇవ్వరు, అందరూ నన్ను దొంగలా చూస్తారు” అని ఆందోళన చెందుతుంది.

మ్యాడీ ఆమె ఫోన్ తీసుకొని డబ్బు వచ్చిన నెంబరుకి కాల్ చేయడానికి ప్రయత్నిస్తాడు, కానీ ఆ నంబర్ స్విచ్ ఆఫ్ ఉంటుంది. తరువాత మధుని అడిగి “నీ ఫోన్ ఎవరికైనా ఇచ్చావా?” అని తెలుసుకుంటాడు. మధు గుర్తు చేసుకుంటుంది — ఒక వ్యక్తి అత్యవసరంగా కాల్ చేయాలి అని చెబుతూ ఆమె ఫోన్ తీసుకున్నాడని చెబుతుంది. అప్పుడే మ్యాడీకి అది హ్యాకింగ్‌కు సంబంధించినదని అర్థమవుతుంది.
మధు ఫోన్లో ఆ వ్యక్తి నంబర్ డిలీట్ అయి ఉందని గుర్తిస్తుంది. అప్పుడు మ్యాడీ బుక్‌స్టాల్ దగ్గరకు వెళ్లి సీసీటీవీ ఫుటేజ్ తీసుకొని ఆ వ్యక్తి ఫోటో తీస్తాడు. ఆ ఫోటోతో వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయమని ఫ్రెండ్స్‌కి చెబుతాడు. అలాగే పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తాడు.
దేవేంద్ర వర్మ, నాగవల్లి కూడా ఆ వీడియోను చూస్తారు. దేవా “మ్యాడీ మధు కోసం ఎంతగా తపిస్తున్నాడో చూశావా, ఆమెను చూస్తే స్కాం చేసే అమ్మాయిలా అనిపించడం లేదు ఎవరో ఇరికించారు అనిపిస్తుంది ” అని అంటాడు. కానీ నాగవల్లి “ఏది ఏమైనా చేసిన పనికి శిక్ష అనుభవించాలి” అని అంటుంది.

దేవా పోలీస్‌లకు కాల్ చేస్తే వారు “ఆ ఫ్రాడ్‌ని పట్టుకుంటాం, మ్యాడీ కూడా కంప్లైంట్ చేసాడు” అని చెబుతారు. దేవా మ్యాడీ పోలీసులును వాడుకుంటున్నాడని అనుకుంటాడు. ఇదే సమయంలో నాగవల్లి తన పీఏకి ఆ ఫ్రాడ్ వ్యక్తిని దాచమని చెబుతుంది, ఎందుకంటే మ్యాడీ వెతుకుతున్నాడని ఆమెకు తెలుసు.
చందు విద్యార్థులందరికీ హాల్‌టికెట్లు ఇస్తాడు. లోహితకి కూడా తానే హాల్ టికెట్ ఇస్తాడు. మధు మాత్రం బాధగా నిలబడుతుంది. చందుతో తన బాధ పంచుకుంటుంది. ఇంతలో మహి ఆ వ్యక్తిని వెతుకుతూనే ఉంటాడు. ఒక వ్యక్తి కాల్ చేసి ఆ ఫ్రాడ్‌ని ఎక్కడ చూశానో చెబుతాడు. మ్యాడీ వెంటనే వెళ్లి ఆ వ్యక్తిని పట్టుకుంటాడు. మధు ప్రిన్సిపాల్ ని హాల్ టికెట్ కోసం రిక్వెస్ట్ చేస్తున్న సమయంలో అతనిని కాలేజీకి తీసుకువచ్చి ప్రిన్సిపాల్ ముందు నిజం చెప్పేలా చేస్తాడు.

ఆ వ్యక్తి నిజం చెబుతాడు — “మధు తప్పు లేదు, నేను డబ్బు కోసం ఆమె అకౌంట్ వాడుకున్నాను” అని ఒప్పుకుంటాడు. దాంతో ప్రిన్సిపాల్ మధుకి క్షమాపణ చెబుతూ హాల్‌టికెట్ ఇవ్వమని చందుతో చెబుతాడు. చందు పోలీసులకు సమాచారం ఇస్తాడు.
మధు హాల్‌టికెట్ తీసుకున్న తరువాత చాలా సంతోషంగా మ్యాడీని హగ్ చేసుకుని థ్యాంక్స్ చెబుతుంది. పోలిసుల ద్వారా దేవా కూడా వాళ్ళకి సహాయం చేసినట్టు అర్ధమవుతుంది. దేవేంద్ర వర్మకి కూడా థ్యాంక్స్ చెప్పాలని ఇద్దరూ వెళ్తారు. దేవా కూడా తన పక్షం నుండి సహాయం చేసినట్టు వెల్లడవుతుంది.

ఇదే సమయంలో చందు లోహిత దగ్గరకు వెళ్లి “నువ్వు ఇంటి నుంచి వెళ్లిపోయావు, మేము ఎంతగా టెన్షన్లో ఉన్నామో తెలుసా” అని అడుగుతాడు. “నీ ఫీజులు కూడా నీ ఫ్రెండ్స్ ఇచ్చారు, అమ్మ కూడా బాధపడుతోంది” అని అంటాడు. లోహిత “పరీక్షలు పూర్తయ్యే వరకు ఇంటికి రాను” అని చెబుతుంది. కానీ చందు “ఇకపై ఇంట్లోనే ఉండాలి” అని నిర్ణయంగా చెబుతాడు. వాళ్ళు మాట్లాడుకోవడం శ్రేయ చూస్తుంది.
ఈ సంఘటనతో ఎపిసోడ్ ముగుస్తుంది.
Source inspiration: Original story from “చిన్ని” (JioHotstar). This is a personal written recap and interpretation.
