చిన్ని Nov 5th, 2025 బుధవారం ఎపిసోడ్ : మధు పైన దేవా, నాగవల్లి ల కుట్ర….. తానే చిన్ని అని నిజం బయటపడుతుందా … ???
చందు గురించి లోహితను ప్రశ్నించిన శ్రేయ
లోహిత చందుతో మాట్లాడుతుండగా, దాన్ని శ్రేయ దూరం నుండి చూస్తుంది. శ్రేయ, లోహిత దగ్గరకు వెళ్లి అతను నీతో ఎందుకు మాట్లాడుతున్నాడు అని ప్రశ్నిస్తుంది. లోహిత, శ్రేయతో చందు సార్ తనకు తెలిసినవాడని, తాను మధు ఇంట్లో ఉంటుందని, అందుకే ఇంటికి వెళ్లమని చెప్పాడని వివరిస్తుంది. అంతలో శ్రేయ లోహిత మేడలో తాళిబొట్టు కనిపించకుండా దాచుకోమని చెప్తుంది. చందు సర్ చూసి మీ ఇంట్లో చెప్తే ప్రాబ్లెమ్ అవుతుంది కదా అని అంటుంది.

శ్రేయ, లోహితను చూసి మన కాలేజ్ స్టాఫ్ ఇలా స్టూడెంట్‌పై అరవడం ఏంటి అని అడుగుతుంది. దానికి లోహిత, అతను తనకు తెలిసిన వ్యక్తి అని, అందుకే అలా మాట్లాడాడని చెబుతుంది. శ్రేయ, లోహితను మీరు అంత రిచ్ కదా, కానీ చందు సార్ మిడిల్ క్లాస్లా ఉన్నారు, మీకు వాళ్లకు ఎలా రిలేషన్ ఉందని అడుగుతుంది. లోహిత సమాధానమిస్తూ చందు సార్ తండ్రి మా కంపెనీలో పనిచేస్తారని, అలా చందు సర్ అప్పుడప్పుడు మా ఇంటికి వస్తారని, అలా ఫ్రెండ్స్ అయ్యారని చెబుతుంది.
దేవాని కలిసిన మధు, మ్యాడీ
ఇదే సమయంలో మధు, మ్యాడీ ఇద్దరూ దేవాని కలవడానికి వెళ్తారు. మ్యాడీ, దేవాకి కాల్ చేసి డాడీ మీతో అర్జెంటుగా మాట్లాడాలి, ఎక్కడ ఉన్నారు అని అడుగుతాడు. దేవా, పార్టీ ఆఫీస్‌లో ఉన్నానని చెబుతాడు. మ్యాడీ, నేను కూడా దగ్గర్లోనే ఉన్నాను వస్తున్నాను అని చెప్పి కాల్ కట్ చేస్తాడు.

మ్యాడీ, మధు ఇద్దరూ స్కూటీపై పార్టీ ఆఫీస్‌కి బయలుదేరుతారు. వారిని చూసిన దేవా తనలోనే మ్యాడీ ఖరీదైన కార్లలో తిరగాల్సినవాడు, ఇలా ఎండలో స్కూటీ మీద తిరుగుతున్నాడా అని అనుకుంటాడు.
దేవాకి కృతజ్ఞతలు చెప్పిన మధు
మధు, మ్యాడీ దేవాని కలవడానికి వెళ్తారు. మ్యాడీ దేవాకి థాంక్స్ చెప్తాడు. దేవా నువ్ నాకు థాంక్స్ చెప్పడం ఏంటి అని అడుగుతాడు. దానికి మధు ముందుకు వచ్చి మ్యాడీ కాదు అంకుల్ నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి అని చెబుతుంది. ఆ సమస్యలో మీరు, మీ కొడుకు నాకు సాయం చేయకపోతే నాకు హాల్ టికెట్ వచ్చేది కాదు అని చెబుతుంది. ఆమె చాలా కృతజ్ఞతతో థ్యాంక్స్ చెబుతుంది.
దేవా, సోషల్ మీడియాలో వైరల్ వీడియో చూసి స్టేషన్‌కి కాల్ చేశానని చెబుతాడు. తన కొడుకు ఫ్రెండ్ ప్రాబ్లమ్‌లో ఉంటే చూస్తూ ఊరుకుంటానా అని కూడా చెబుతాడు. మధు, దేవా వైపు చూస్తూ మీకు నాపై చాలా కోపం ఉన్నా, అయినా నన్ను కాపాడారు, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను అని చెబుతుంది. దేవా, అది నా ఫ్యామిలీకి సంబంధించిన మేటర్, ఇది నీ లైఫ్‌కి సంబంధించిన మేటర్, అందుకే దానిని కలపకూడదని, నీ మీద కోపాన్ని పక్కన పెట్టి నీకు సాయం చేశానని చెబుతాడు.

మధు, ఆయనకు మీరు చాలా గ్రేట్ అంకుల్, చాలా థ్యాంక్స్ అని చెబుతుంది. దేవా, చిరునవ్వుతో తల ఊపుతాడు.
మాటామాటకు దిగిన మ్యాడీ, దేవా
మ్యాడీ, తన తండ్రిని చూసి మీరు మధు మీద కోపం పక్కన పెట్టినట్లే వరుణ్ బావ మీద కోపం పక్కన పెట్టొచ్చు కదా అని అంటాడు. దేవా, వాడు నా మేనల్లుడు, వాడు ఈ అమ్మాయి ఒకటేనా అని కోపంగా అంటాడు. అయినా వాళ్లు బాధ పెడితే తట్టుకోలేం అని చెబుతాడు. తర్వాత మీటింగ్ టైమ్ అయిందని వారిని వెళ్లమని చెప్పేస్తాడు.
మధు కూడా దేవా మాటలతో ఏకీభవిస్తున్న అని మ్యాడీ తో చెప్తుంది. మధు, దేవా మాటలు గుర్తు చేసుకుని ఆలోచనలో పడుతుంది. ఆమె మనసులో దేవా ఎంత మంచివాడో అని అనుకుంటుంది.
మ్యాడీ – మధు మధ్య చిలిపి సంభాషణ
మ్యాడీ, మధు మూడ్ డల్ గా ఉన్నదని గమనించి ఆమెను నవ్వించడానికి ఏదో ఒకటి చేయాలని అనుకుంటాడు. మధు ఫోన్ రింగ్ అవుతుంది అంటూ, మ్యాడీ అగ్గిపెట్టెలకు దారం కట్టి ఫోన్లా చూపిస్తూ మధు ముందుకు తీసుకొస్తాడు. నేను, చిన్ని చిన్నప్పుడు ఇలానే మాట్లాడుకునేవాళ్లం, ఇప్పుడు మనిద్దరం కూడా మాట్లాడుకుందాం అని చెబుతాడు.

మధు నవ్వుతూ సరే అని అంటుంది. మ్యాడీ ఫోన్లో “మధు బాగున్నావా?” అని అడుగుతాడు.
మధు “బాగున్నాను మ్యాడీ, నువ్వు ఎలా ఉన్నావు?” అని అంటుంది. మ్యాడీ, “నువ్వు ఇప్పుడు కాలేజీలో సూపర్ స్టార్ అయిపోయావ్” అని చెబుతాడు. దానికి మధు, “నేను కాదు, మీరు మీ డాడీ సూపర్ స్టార్స్. మీరు సాయం చేయకపోతే ఇపుడు నేను ఇలా ఉండేదాన్ని కాదు నా లైఫ్ ఏం అయిపోయేదో ” అని అంటుంది.
మ్యాడీ ఎన్ని సార్లు అదే మాట్లాడుతావ్ అని ఇంకా ఏదయినా మాట్లాడు అని అడగ్గా మధు, మ్యాడీని చిన్ని గురించి చెప్పమని అడుగుతుంది. మ్యాడీ సంతోషంగా చెప్తానని చిన్నపుడు విషయాలన్నీ వివరించి చెప్తుంటే మధు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మధు, “చిన్ని గురించి నువ్వు చెప్తుంటే అంతా నా కళ్ల ముందే జరిగినట్లు అనిపిస్తుంది, చాలా బాగా చెప్పావ్” అని అంటుంది.
మ్యాడీ మధు నవ్వింది అని హమ్మయ్య అనుకుంటూ ఒక కాల్ చేయాలి అని అక్కడి నుండి వెళ్లిపోతాడు. మధు తనలోనే “చిన్నప్పటి విషయాలు ఒక్కటీ కూడా మర్చిపోలేదు నా మహి” అని అనుకుంటుంది.
మధు పైన దేవా కుట్ర

దేవా, చిన్ని గురించి త్వరగా తెలుసుకుంటేనే మ్యాడీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని అనుకుంటాడు. అతను రౌడీలకు కాల్ చేసి హాఫ్ టికెట్ నిజం చెప్పాడా అని అడుగుతాడు. రౌడీలు “ఇంకా చెప్పలేదు” అంటే దేవా “చావు భయం చూపించండి అప్పుడు చెబుతాడు” అని అంటాడు. తర్వాత దేవా, మధు చెప్పిన మాటలు గుర్తు చేసుకుని ఆలోచిస్తుంటాడు. అప్పుడే నాగవల్లి వచ్చి ఏమి ఆలోచిస్తున్నావ్ బావా చిన్ని గురించా అని అడుగుతుంది. దేవా, “మధు గురించి” అని చెబుతాడు. దానికి నాగవల్లి మధు గురించి ఎందుకు ముందు చిన్ని గురించి తెలుసుకుని దాన్ని ఇక్కడికి తీసుకు రావాలి అపుడే మన మ్యాడీ ఇంటికి వస్తాడు అని అంటుంది.
దేవా మాట్లాడుతు మ్యాడీ ఇప్పుడు మన మాట కంటే మధు మాట ఎక్కువ వింటున్నాడు. మధు హాల్ టికెట్ రాదేమో, పరీక్షలు రాయలేదేమో అని మ్యాడీ చాలా కంగారు పడ్డాడని చెబుతాడు. అతను మధు స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తున్నాడు, దానిని మనం వాడుకొని మన పని పూర్తి చేసుకోవాలి అని చెబుతాడు. దేవా, మధుని అడ్డుపెట్టుకొని మన ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తానని చెబుతాడు. నాగవల్లి ఎలా చేస్తావు ఏం చేస్తావు అని అడుగుతుంది. ఏం చేస్తానో ఎలా చేస్తానో చెప్పను కానీ ప్రాబ్లమ్ మాత్రం సాల్వ్ చేస్తాను అని చెబుతాడు.
దేవాని నమ్మి వెళ్లిన మధు

మధు దేవా గురించి ఆలోచిస్తూ అంకుల్ చాలా మంచి వాడు అని అనుకుంటుంది. ఆయన నా మీద ఉన్న కోపాన్ని పక్కన పెట్టి నా కోసం అలోచించి నాకు సహాయం చెప్పారు. ఆయన నా గురించి ఇంతగా ఆలోచిస్తే మ్యాడీ, వరుణ్‌ల గురించి ఇంకెంత ఆలోచిస్తారో ఎంత ప్రేమిస్తారో అని అనుకుంటుంది. కానీ ఆయనకు విషయం అర్థమయ్యేలా చెప్పాలి అని నిర్ణయించుకుంటుంది.
కానీ ఇంటికి వెళ్తే నాగవల్లి ఆంటీ నా మాట అసలు వినరు నన్ను మాట్లాడనివ్వరు అని అనుకుంటూ దేవా ఒక్కడే ఉండే సమయంలో కలవాలని అనుకుని పార్క్‌కి వెళ్తుంది. దేవాని చూసి అంకుల్, మీతో ఒక్క పది నిమిషాలు మాట్లాడాలి టైమ్ ఇవ్వండి ప్లీజ్ అని అడుగుతుంది. దేవా, మా ఇంటికి వెళ్లి మాట్లాడుకుందాం అని అంటాడు. మధు, వద్దు అంకుల్, ఇక్కడే మాట్లాడుకుందాం అని చెబుతుంది.
దేవా, అంత ముఖ్యమైన విషయాలు ఇలా బయట మాట్లాడకూడాదు, పర్లేదు మా ఇంటికి వెళ్లి మాట్లాడుకుందాం అని చెప్పి మధుని తనతో తీసుకెళ్తాడు. మధు స్కూటీ తీసుకురమ్మని తన మనిషికి చెప్పడం గమనించి మధు తనలో తాను “అంకుల్ నేను మ్యాడీ ఫ్రెండ్ అని తెలుసుకుని ఇంత బాగా చూసుకుంటున్నారు నేను మహి వెతుకుతున్న చిన్ని అని తెలిస్తే అంకుల్ ఇంకా ఎంత బాగా చూసుకుంటారో” అని అనుకుంటుంది.
మ్యాడీ, వరుణ్ ల ముందు లోహిత నాటకం

ఇంకా లోహిత చందు తనని ఇంట్లోనే ఉండి చదువుకోమని, ఇంటి నుండే వెళ్లి పరీక్షలు రాయాలని చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుని తనలో తనే వరుణ్, మ్యాడీలు తనను తమ ఇంటికి తీసుకెళ్లేలా ప్లాన్ చేయాలి అని అనుకుంటుంది. ఆలోచన ప్రకారం కావాలనే ఫోన్లో మమ్మీ మమ్మీ అని ఏడుస్తూ తన అమ్మ గురించి బాధగా మాట్లాడుతుంది. ఆమె, “మమ్మీ నా మీద బెంగ పెట్టుకోవద్దు, నేను బాగున్నాను” అని పెద్దగా ఏడుస్తుంది.
ఇంతలో వరుణ్, మ్యాడీ ఇద్దరూ ఆమె దగ్గరికి వచ్చి ఏమైంది అని అడుగుతారు. లోహిత ఏడుస్తూ “మా అమ్మ నా మీద బెంగతో అన్నం తినడం మానేసింది, మెడిసిన్ వేసుకోవడం కూడా మానేసింది” అని నటిస్తుంది. వారిద్దరూ ఆమె పరిస్థితి చూసి దిగ్భ్రాంతి చెందుతారు.
ఈ సన్నివేశంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
రేపటి ఎపిసోడ్ లో దేవా మధు నే చిన్ని అనే నిజం తెలుసుకుంటాడా లేదా చూడాలి.
Source inspiration: Original story from “చిన్ని” (JioHotstar). This is a personal written recap and interpretation.
