గుండె నిండా గుడిగంటలు – Oct 29, 2025 బుధవారం ఎపిసోడ్ : రిస్క్ లో పడిన మనోజ్ !!!! బాలు కి దొరుకుతాడా????
ఎపిసోడ్ ప్రారంభంలో ప్రభావతి ఇంట్లో గందరగోళం నెలకొంది. రవి, శృతి అన్యోన్యంగా ఉండటం ప్రభావతికి నచ్చదు. ఆమె కోపంగా మగాడి చేత కాళ్లు పట్టించుకోవడం ఏంట్రా ఇది? అంటూ గదిలోకి దూసుకెళ్తుంది. రవి మాత్రం నిశ్శబ్దంగా ఉంటాడు. శృతి ఆగకుండా అడుగుతుంది ఏంటి అత్తయ్య ఇలా ఆవేశంగా? దానికి ప్రభావతి తిరిగి నా సంగతి తర్వాత, ముందు చెప్పు మొగాడిని కాళ్లు పట్టమని అడిగావా? అని ప్రశ్నిస్తుంది. శృతి నవ్వుతూ స్టూడియోలో రోజు మొత్తం నిల్చున్నా కాళ్లు నొప్పిగా ఉన్నాయి. అందుకే రవి కాస్తా మసాజ్ చేశాడు, అని చెబుతుంది.
అప్పుడు ప్రభావతి మరింత మండిపడి అయినా భర్తతో ఇలాంటివి చేయించుకుంటావా? అంటుంది.
శృతి వెనకడుగు వేయకుండా ఏ మాటకు ఆ మాటే అత్తయ్య రవి చాలా బాగా మసాజ్ చేశాడు. పైగా నెయిల్ పాలిష్ కూడా బాగానే పెడతాడు, అని సరదాగా అంటుంది. ప్రభావతి ఆశ్చర్యంతో, ఇవి చేయించుకోవడం సిగ్గు కాదా? అని రవిని ప్రశ్నిస్తుంది. శృతి వెంటనే అత్తయ్య, మీరు ఎప్పుడూ అంకుల్‌తో ఇలాంటివి చేయించుకోలేదా? అందులో తప్పేంటి? అని కౌంటర్ ఇస్తుంది.
దాంతో ప్రభావతి రవిని మందలిస్తూ నువ్వైనా చెప్పాలి కదా, అని అంటుంది. రవి మృదువుగా రోజంతా కష్టపడి వచ్చింది, పాపం, అని చెబుతాడు. అప్పుడు ప్రభావతి కోపంగా పాపం అంటావా? నీకే పాపం దక్కుతుంది! అని కేక వేస్తుంది.
శృతి మధ్యలోకి వచ్చి అత్తయ్య, ఇప్పుడు కాలం మారిపోయింది. గౌరవం అనేది భయంతో కాదు, ప్రేమతో ఉండాలి, అని గట్టిగా అంటుంది. దానికి ప్రభావతి, మీరు చెబుతున్న గౌరవం ప్రిన్సిపల్‌కి చూపేది, భర్తకి కాదు! అని సమాధానమిస్తుంది. శృతి చిరునవ్వుతో ఇదిగో అత్తయ్య, అంకుల్‌తో పెట్టించుకోండి అప్పుడు మీకే అర్థమవుతుంది, అంటూ నెయిల్ పాలిష్ బాటిల్ ఇచ్చేస్తుంది.
ఈ సన్నివేశాన్ని బాలు మొత్తం గమనిస్తాడు. తర్వాత ప్రశ్నిస్తాడు అమ్మ, ఎందుకింత నెగిటివ్‌గా ఆలోచిస్తున్నారు? దానికి ప్రభావతి, మగాడి చేత కాళ్లు పట్టించుకుంటే మనం బతకడం ఎందుకు? అని సమాధానమిస్తుంది.

బాలు సూటిగా చెబుతాడు అమ్మా, భార్యాభర్తల మధ్య ప్రేమ కనిపించగానే నీకు ఎందుకింత అసూయ?
తరువాత రవి బయటకు వచ్చి ఏమైంది అన్నయ్య? అమ్మ కోపంగా ఉంది కదా? అని అడుగుతాడు.
బాలు నవ్వుతూ మీ అన్యోన్యత చూసి కడుపు నిండిపోయిందట! అంటాడు. రవి కూడా నవ్వుతూ అదేం లేదు అన్నయ్య, నేను శృతికి నెయిల్ పాలిష్ పెడుతుంటే అమ్మ చూసి ఆగ్రహించింది, అని వివరిస్తాడు.
బాలు సరదాగా ఈ రోజులలో ఇవన్నీ కామన్మ్మా, అమ్మను పట్టించుకోకు, అని చెబుతాడు.
కొద్దిసేపటికి బాలు, రవిపై జోక్ వేస్తూ ఇకమీ జోలికి రాకుండా చూసుకుంటా, అని చెబుతూ నెయిల్ పాలిష్ తీసుకుని హాల్లోకి దూసుకెళ్తాడు.
మరోవైపు ప్రభావతి కోపంతో సత్యం దగ్గరకి వెళ్లి ఇంట్లో కోడళ్ళు రాక్షసులయ్యారు! అంటూ గోల చేస్తుంది. సత్యం ప్రశాంతంగా అడుగుతాడు అనవసరంగా మీనాను ఎందుకు తిడుతున్నావు?
దానికి ప్రభావతి, మీనా కాదు, రవికోడలు శృతి! అని సమాధానమిస్తుంది. సత్యం ఆశ్చర్యపడి నీకు నచ్చిన కోడలుపై నువ్వు కోపం తెచ్చుకున్నావా? అని అడుగుతాడు. దానికి ప్రభావతి శృతి రవితో నానా చాకిరీ చేయిస్తోంది, గౌరవం లేనట్టుంది, అంటుంది. సత్యం నవ్వుతూ నువ్వేనా భర్తను గౌరవించేది? నువ్వు మాట్లాడతావా? అని కౌంటర్ ఇస్తాడు.
ప్రభావతి సీరియస్‌గా రవి శృతి కాళ్లకు నెయిల్ పాలిష్ పెడుతున్నాడు, అని చెబుతుంది.
సత్యం చమత్కారంగా అది వాళ్ల ప్రేమ. నువ్వు కూడా అలాంటి అనుబంధం ఆస్వాదించు, అని చెబుతాడు. భావతి మాత్రం బాధతో ఇప్పుడు వాళ్లను ఆపకపోతే, దారుణంగా మారిపోతారు, అంటుంది.
ఇంతలో ప్రభావతి హాల్లోకి రాగానే బాలు మీనాను పిలుస్తాడు. మీనా పరుగెత్తుకుంటూ వస్తుంది.
బాలు సరదాగా నీ కాళ్లు తెల్లగా ఉన్నాయి, పాలు తేనెతో కడుగుతావా? అని అడుగుతాడు.
మీనా నవ్వుతూ నీళ్లతోనే కడుగుతాను, అని చెబుతుంది. ఇది విని ప్రభావతి మండిపడి ఇంత మృదువుగా ఉంటే నీ పెళ్లాం కాళ్లు నెత్తిపై పెట్టుకుని ఊరేగు! అంటుంది. బాలు నవ్వుతూ అమ్మవారి అనుమతి వస్తే ఖచ్చితంగా ఊరేగుతా! అని సరదాగా సమాధానమిస్తాడు. ఆ తరువాత బాలు మీనాపై కవితలు చెబుతూ ఆమెను నవ్విస్తాడు. ప్రభావతి సైలెంట్‌గా లేచి వెళ్ళిపోతుంది.
ఇదిలా ఉండగా, ఆఫీసులో మనోజ్ ఫోన్లో రోహిణితో మాట్లాడతాడు
రోహిణి! ఈరోజు నా లైఫ్‌లోనే పెద్ద డీల్ క్లోజ్ అయ్యింది! ఇక మన లైఫ్ సెట్. త్వరలోనే ఇండియాలోనే రిక్వెస్ట్ బిజినెస్‌మాన్ అవుతానమ్మా, అని ఆనందంగా చెబుతాడు. రోహిణి నవ్వుతూ వావ్ మనోజ్! నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఈ సక్సెస్ కోసం ఎంత కష్టపడ్డావో నాకు తెలుసు, అని చెబుతుంది.
మనోజ్ తప్పకుండా సెలబ్రేట్ చేద్దాం. త్వరలో గోవా టూర్ లేక ఫారిన్ ట్రిప్ వెళ్దాం, అని అంటాడు.
రోహిణి శాంతంగా ఇప్పుడేం అవసరం లేదు మనోజ్. టైం వచ్చినప్పుడు వెళ్దాం, అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది.
అప్పుడే ఇద్దరు వ్యక్తులు ఆఫీసర్స్ డ్రెస్‌లో లోపలికి వస్తారు. ఇక్కడ ఓనర్ ఎవరు? అని అడుగుతారు.
మనోజ్ గర్వంగా నేనే ఓనర్ మనోజ్! అని చెబుతాడు. వారు, ఇక్కడ ఎవరైనా పెద్ద మొత్తంలో ఫర్నిచర్ కొనుగోలు చేశారా? అని అడుగుతారు. మనోజ్ ఫర్నిచర్ షాప్‌లో ఫర్నిచర్ కాక ఇంకేమైనా అమ్ముతామా? రోజూ పెద్ద లావాదేవీలు జరుగుతాయి, అని సమాధానం ఇస్తాడు.
వారు మళ్లీ ప్రశ్నిస్తారు ఆ కస్టమర్లు బిల్ ఎలా పేమెంట్ చేశారు? మనోజ్ నిర్లక్ష్యంగా క్యాష్ ఇచ్చారు. పెద్ద డీల్ కాబట్టి బిల్ ఇవ్వలేదు, అంటాడు. వారు వెంటనే, ఆ క్యాష్ చూపించగలరా? అంటారు. మనోజ్ మీకెందుకు చూపించాలి? నా బిజినెస్ నా ఇష్టం! అని తిప్పికొడతాడు. తర్వాత వారు ఐడీ కార్డులు చూపిస్తూ మేము సీఐడి ఆఫీసర్లు. ఇక్కడ ఫేక్ కరెన్సీ ట్రాన్స్ఫర్ జరిగినట్టు సమాచారం వచ్చింది, అని హెచ్చరిస్తారు.
మనోజ్ షాక్ అయి చెమటలు కారుస్తూ సరే సర్, చూడండి, అంటూ కవర్లలో ఉన్న నోట్లను చూపుతాడు.
వారు కెమికల్ పౌడర్ చల్లి ఇది అసలు కరెన్సీ కాదు, ఫేక్ నోట్స్! అని చెబుతారు. మనోజ్ వణుకుతూ సర్! ఇది ఎలా సాధ్యం? వాళ్లు మంచి కస్టమర్ల్లా వచ్చారు. నేను డీల్ సైన్ చేశాను, అంటాడు. వారు అడుగుతారు వారి వివరాలు ఉన్నాయా? బిల్ ఇచ్చారా? మనోజ్ తలదించుకుని లేదు సర్. పెద్ద డీల్ కాబట్టి బిల్ ఇవ్వలేదు. క్యాష్‌లో తీసుకున్నాను, అంటాడు. వారు గట్టిగా బిల్లు లేకుండా డబ్బు తీసుకోవడం అంటే ప్రభుత్వానికి టాక్స్ ఎగ్గొట్టడమే. నువ్వు ఫ్రాడ్ చేస్తున్నావ్! అంటారు. మనోజ్ వేడుకుంటూ సర్, ఇది నా మొదటి తప్పు. ఇకముందు బిల్లుతో, జీఎస్టీతోనే డీల్ చేస్తా, అంటాడు. వారు సీజ్ చేసిన మనీ తీసుకెళ్లి నీ వస్తువులు స్టేషన్ నుంచి తీసుకెళ్లండి, అని చెబుతారు.
తరువాత మనోజ్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఎస్ఐని కలుస్తాడు. సర్, నాకు ఫర్నిచర్ వస్తువులు కావాలి. నేను బాధితుణ్ణి, అని చెబుతాడు. ఎస్ఐ చిరాకుగా ఇది ఫర్నిచర్ షాపా లేక పోలీస్ స్టేషనా? అని అడుగుతాడు. మనోజ్ సర్, ఫేక్ ఐడీలు చూపించి డబ్బు తీసుకెళ్లారు, అని చెబుతాడు. ఎస్ఐ తిడుతూ డిగ్రీలతో కాదు, కామన్ సెన్స్‌తో బిజినెస్ చేయాలి! అని అంటాడు. మనోజ్ వేడుకుంటాడు ఇది నా మొదటి తప్పు సర్. ఇకపై జాగ్రత్తగా ఉంటా, అని చెబుతాడు. ఎస్ఐ సరే, దొంగలు దొరికినప్పుడు వస్తువులు ఇస్తాం, అని అంటాడు. మనోజ్ బయటకి వచ్చి టెన్షన్‌గా బాలుకి ఈ విషయం తెలిస్తే నన్ను ఉండనివ్వడు, అంటూ అనుకుంటాడు.
ఇక చివరగా, బాలు–మీనా తమ భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటారు. బాలు మొదటి రోజు ₹3000 జమ చేస్తాడు. మీనా కూడా ₹1000 జమ చేస్తుంది. బాలు ఆనందంగా రోజూ ఇలా కొంతకొంతగా పొదుపు చేస్తే ఆరు నెలల్లో మన ఇల్లు కల నెరవేరుతుంది, అంటాడు. మీనా చిరునవ్వుతో ఇల్లు కాదు, మన ప్రేమకు చిరస్థాయిగా నిలిచే గూటి అవుతుంది, అని చెబుతుంది.

