గుండె నిండా గుడిగంటలు – Oct 30, 2025 గురువారం ఎపిసోడ్ : ప్రభావతి కాళ్ళ మీద పడిన మనోజ్ !!!! బాలుకి తెలియకుండా ఆపుతుందా?????
మీనా, బాలు ఇద్దరూ తమ గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. మీనా సరదాగా “ఈరోజు నీకు రెండు ఇస్తాను” అంటుంది. బాలు ఆశ్చర్యంగా “ఏమి ఇస్తావు ?” అంటాడు. మీనా నవ్వుతూ “మీరు ఏది ఇస్తే అది ఇస్తాను, మీ అడుగు జాడల్లోనే నడవాలి కదా” అంటుంది. బాలు సరదాగా “ఎందుకు, నీ చెప్పులు తెగిపోయాయా?” అని అడుగుతాడు. మీనా తన రోజు వ్యాపారం గురించి చెబుతుంది – పూలతో కొంత లాభం వచ్చిందని, ఖర్చు లేకుండా ఆదా చేస్తున్నామంటూ సంతోషిస్తుంది. అప్పుడు బాలు “నాకు కాళ్ళు నొప్పిగా ఉన్నాయ్” అని చెబుతాడు.
మీనా వేడి నీళ్లు తెచ్చి బాలుకి కాపడం పెడుతూ, “నేను చూసుకుంటాను” అని ప్రేమగా చెబుతుంది. బాలు మాత్రం “నువ్వు ఎందుకు ఇంతగా కష్టపడుతున్నావు?” అని అంటాడు. కానీ మీనా అతనికి మసాజ్ చేస్తూ “ఇంకొంచెం చేస్తే నొప్పి తగ్గిపోతుంది” అని చెబుతుంది. ఆ ప్రేమ సన్నివేశాన్ని బయట ప్రభావతి చూడటం మొదలుపెడుతుంది.

ప్రభావతి మొదట అసహనంగా “నా వంశం గౌరవం అంతా పోయింది” అని అనుకుంటుంది, కానీ బాలు తన భార్యతో ఇలా సేవ చేయించుకోవడం చూసి మనసు కాస్త సాంత్వన చెందుతుంది. “హమ్మయ్యా, కనీసం నా కుటుంబం గౌరవం కొంతైనా నిలిచింది” అనుకుంటూ సంతోషంగా నవ్వుతుంది.
ఆ తరువాత ప్రభావతి రవి దగ్గరకు వెళ్లి “నీ భార్య ఎక్కడ?” అని అడుగుతుంది. రవి “డబ్బింగ్‌కి వెళ్లింది” అంటాడు. ప్రభావతి వెంటనే “రా, నీకు పెళ్లాంతో ఎలా ఉండాలో చూపిస్తాను” అంటూ బాలు గది ముందు తీసుకెళ్తుంది. అప్పటికి బాలు మీనా చేతులు నొక్కుతూ, ఆమె చేతులు కందిపోయి ఉంటాయని చెబుతాడు. ప్రభావతి రవిని కాస్త చీదరించుతూ “చూడు, భార్య భర్తని ఎలా గౌరవించాలో నేర్చుకో” అంటుంది. రవి “మీరు చూసి చెప్పండి” అని సరదాగా అంటాడు.
ప్రభావతి కళ్ళు నులముకుంటూ చూస్తుంది, బాలు మీనాకు సేవ చేస్తుంటాడు. ఆ సీన్ మొత్తం కామెడీగా సాగుతుంది. బాలు, మీనా మధ్య ఉన్న చిన్న ప్రేమా జంటపోటీ సన్నివేశాలు చక్కగా ఉంటాయి.
ఇంతలో సత్యం ఇంటికి వస్తాడు. తన చేతిలో మూడు కోతి బొమ్మలు ఉంటాయి – “చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు” అని సూచించే బొమ్మలు. ప్రభావతి ముందుకు వచ్చి “ఇంట్లో భార్యాభర్తలు ఇలా ఉంటే నాకు అసహనం వస్తుంది” అని అంటుంది. సత్యం నవ్వుతూ “ఇదే నీకు సరైన మందు” అని ఆ బొమ్మలు ఆమె చేతిలో పెడతాడు. “ఇప్పుడు వీటి అర్థం ఏమిటో తెలుసా? ఇతరుల గురించి చెడుగా మాట్లాడకూడదు, సంబంధం లేని విషయాల్లో మునిగిపోకూడదు” అని శాంతిగా చెప్పి, ఆమెను సమాధానపరుస్తాడు.
ఇదంతా జరుగుతుండగా, మరోవైపు మనోజ్ ప్రభావతి గదిలోకి పరుగెత్తుకుంటూ వస్తాడు. అతను వణుకుతూ “అమ్మా! నేను పెద్ద పొరపాటు చేశాను” అంటాడు. “ఏమైంది?” అని అడిగిన ప్రభావతి ముందు మోకాళ్లపై కూర్చుంటాడు. మనోజ్ కన్నీళ్ళతో చెబుతాడు – “నకిలీ నోట్లతో మోసపోయాను, 4 లక్షల రూపాయలు పోయాయి, నువ్వే నాకు సాయం చేయాలి, రోహిణికి తెలిసిపోతే ఆమె నన్ను వదిలేస్తుంది” అని.

ప్రభావతి షాక్ అవుతుంది. “నువ్వు ఎంత చదువుకున్నావు, ఇది నీకు తెలియదా? నీ డీగ్రీలే నిన్ను పాడు చేశాయిరా ” అంటూ తిట్టిపోస్తుంది. కానీ మనోజ్ వేడుకుంటాడు – “అమ్మా, దయచేసి ఏదైనా చేయి, నాకు ఇప్పుడు డబ్బు అవసరం.”
ప్రభావతి నిరాకరిస్తుంది. “నా దగ్గర 4 లక్షలు లేవు” అంటుంది. మనోజ్ “అయితే ఇంటి పత్రాలు ఇవ్వు” అంటాడు. ప్రభావతి కోపంతో “ఇంటి సంగతి మర్చిపో!” అంటుంది. మనోజ్ చివరకు “బంగారం తీసుకెళ్లి తాకట్టుపెడతాను” అని చెబుతాడు. అయితే ప్రభావతి ఏం ఉంది బంగారం నా దగ్గర మీనా బంగారం ఒకటే ఉంది అని చెప్తుంది. అదే ఇవ్వమని అడుగుతాడు మనోజ్. అది ఇస్తే బాలు మన ఇద్దరినీ బజారులో అమ్మేస్తాడురా అంటుంది. ఎవరికీ తెలియక ముందే తెచ్చేస్తాను అమ్మ అని చెప్తాడు మనోజ్. మొదట ప్రభావతి నిరాకరిస్తుంది కానీ చివరికి తన కొడుకుపై ప్రేమతో ఆలోచన మార్చుకుంటుంది. “నాకు దొంగతనం చేయడం తప్ప దారి లేదు” అని తన మనసులో అనుకుంటుంది.
అదే రాత్రి బీరువా తలుపు తెరిచి, మీనా బంగారం ఉన్న కవర్ తీసుకుంటుంది. దాన్ని దాచుకొని వెనక్కి తిరుగుతుండగా, సత్యం ఎదురుపడతాడు. చేతిలో బంగారం ప్యాకెట్ చూసి సత్యం “ఇంకా నువ్వు మారలేదా?” అని ప్రశ్నిస్తాడు. వణుకుతూ ప్రభావతి నిలబడిపోతుంది. ఆ క్షణంలో ఆమె ముఖంలో భయం, పశ్చాత్తాపం, గిల్టీ అన్నీ కలిసిపోతాయి.
ఇక్కడితో ఆ ఎపిసోడ్ ముగుస్తుంది.
తరువాయి భాగంలో ప్రభావతి దొంగతనం బయటపడుతుందా, సత్యం ఏమి చేస్తాడు అనే అంశాలు తెలుస్తాయి.
