గుండె నిండా గుడి గంటలు ఎపిసోడ్ ఏప్రిల్ 22 , 2026 బుధవారం ఎపిసోడ్: ఆది మానవులలా మారిన ప్రభావతి మనోజ్ … రోహిణి కి షాక్ ఇచ్చిన మాణిక్యం … !!!
ఇవాళ ఎపిసోడ్లో ముందుగా రోహిణి ట్రాక్‌తో కథ ప్రారంభమవుతుంది. మాణిక్యం వచ్చి జరిగింది చెప్పడంతో, మీనా తనను చూసిందా అనే భయంతో రోహిణి కంగారు పడుతుంది. అదృష్టవశాత్తూ మీనా తనను చూడలేదని మాణిక్యం చెప్పడంతో ఆమె ఊపిరి పీల్చుకుంటుంది. అయితే మాణిక్యం మాత్రం ఈ నాటకాన్ని ఇక కొనసాగించలేనని స్పష్టంగా చెబుతాడు. తాను నిజాయితీగా జీవించే వ్యక్తినని, రోహిణి కోసం అబద్ధాలు చెప్పాల్సి వస్తుండడం తనకు ఇబ్బందిగా మారిందని చెప్పి, ఇకపై ఈ పరిస్థితి కొనసాగితే నిజం బయటపెడతానని హెచ్చరిస్తాడు.
రోహిణి దీనికి పరిష్కారంగా షాప్ మార్చేయమని చెప్పడం పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చూపిస్తుంది. కానీ మాణిక్యం తన కుటుంబ సంప్రదాయాన్ని వదిలి వెళ్లడానికి సిద్ధంగా లేకపోవడం వల్ల, ఈ సమస్య ఇంకా పెరిగేలా మారుతుంది. చివరికి అతను “మరొకసారి మీనా వస్తే నిజం చెబుతాను” అని వెళ్లిపోవడం రోహిణి పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తుంది. ఆమె ఒంటరిగా తనలో తాను ఆలోచించుకుంటూ, ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండకపోతే పరిస్థితులు చేతికి అందకుండా పోతాయని అర్థం చేసుకుంటుంది. బాలు, మీనా లను ఇంటి నుండి దూరం చేయాలి అనుకున్న తనకి ఇప్పటి పరిస్థితి చూసి పిచ్చి దానిల నవ్వుకుంటుంది.
ఇలా జరుగుతుండగా, బాలు–మీనాల మధ్య మరో ట్రాక్ చాలా హాయిగా సాగుతుంది. బాలు సరదాగా మీనాను కొత్తగా సంభోదిస్తూ, ఆమె ఎదుగుదలపై గర్వపడుతున్నట్టు చెప్తాడు. మీనా తన గతాన్ని గుర్తు చేసుకుంటూ, బాలు తనకు ఎలా సహాయం చేశాడో చెబుతుంది. చిన్న బండి మీద పూలు అమ్ముకుంటున్న తనను ప్రోత్సహించి, ఒక స్థాయికి తీసుకెళ్లింది బాలు అని చెప్పడం ద్వారా వారి బంధం మరింత బలంగా కనిపిస్తుంది.
ఈ సన్నివేశంలో బాలు మీనా వ్యాపారం మరింత పెరగాలని భావించి విసిటింగ్ కార్డ్స్ తయారు చేసి తీసుకురావడం. వ్యాపారం నోటిమాటతో మాత్రమే పరిమితం కాకుండా, మరింత విస్తరించాలంటే ఇలా చేయాలని చెప్పడం ద్వారా మీనా మీద అతని ప్రేమ బయటపడుతుంది. మీనా కూడా ఈ సహాయాన్ని భావోద్వేగంగా స్వీకరిస్తూ, తన ఎదుగుదల కోసం ఇంతగా ఆలోచించే భర్త దొరికినందుకు తన అదృష్టాన్ని బాలుతో పంచుకుని సంతోషపడుతుంది.
మరో వైపు, గుడిలో జరిగే సన్నివేశం పూర్తిగా కామెడీ ట్రాక్‌గా మారుతుంది. మనోజ్, ప్రభావతి ఇద్దరూ వేపాకులు కట్టుకుని, చేతిలో మంట పట్టుకుని తిరుగుతూ ఉండటం చూసి బాలు, మీనా ఆశ్చర్యపోతారు. మొదట ఇది ఏదో వ్రతమని అనుకున్నా, బాలు మాత్రం దీన్ని మూఢనమ్మకంగా ఎగతాళి చేస్తాడు.
ఇలా జరుగుతుండగా, ఇంటికి వచ్చిన తర్వాత బాలు గుడిలో తీసిన వీడియో ఇంట్లో వాళ్ళకి చూపిస్తాడు. సత్యం ప్రశ్నించడంతో షాప్ ముందు పెట్టిన గుడ్ల వల్ల వ్యాపారం దెబ్బతింటుందని నమ్మి, స్వామీజీ చెప్పినట్టు ఈ దీక్ష చేశారు అని మనోజ్ చెబుతాడు. కానీ చివరికి ఆ గుడ్లు ఒక చిన్న పిల్లాడు వేసినవని తెలిసి, మొత్తం వ్యవహారం హాస్యాస్పదంగా మారుతుంది. ఈ సందర్భంలో సత్యం చాలా గట్టిగా స్పందించి, ఇలాంటి మూఢనమ్మకాలు మనుషులను ఎలా మోసం చేస్తాయో చెప్పడం ద్వారా మంచి సందేశం ఇస్తాడు.
ఇంకా మరోవైపు, మీనా జీవితంలో కొత్త సమస్య ప్రారంభమవుతుంది. ఒక అపరిచిత వ్యక్తి ఆమెను ఫాలో అవుతూ, ఆమెను “లక్కీ” అని పిలుస్తూ మాట్లాడడం ఆమెకు అసౌకర్యంగా అనిపిస్తుంది. అతని ప్రవర్తన చూసి మీనా కంగారు పడుతుంది. వెంటనే ఈ విషయాన్ని బాలు కి చెప్పాలని కాల్ చేసి చెప్పడంతో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది.
ఈ ఎపిసోడ్లో కామెడీ, ఎమోషన్ రెండూ బాగా బ్యాలెన్స్ చేశారు. ముఖ్యంగా వేపాకుల సీన్ తరువాత షాప్ ముందు పెట్టిన గుడ్ల గురించి అసలు రహస్యం బాగా నవ్వు తెప్పించేలా ఉంది. అయితే అసలు ఇంట్రెస్ట్ మాత్రం రోహిణి ట్రాక్‌లోనే ఉంది — మాణిక్యం ఇచ్చిన వార్నింగ్ తర్వాత ఏదో పెద్ద ట్విస్ట్ వచ్చేలా కనిపిస్తోంది. అలాగే మీనా దగ్గరకి వచ్చిన ఆ కొత్త వ్యక్తికి ట్రైనింగ్ ఇస్తుంది బాలునే కాబట్టి రేపు బాలు అతను ప్రేమిస్తుంది మీనానే అని కనిపెడతాడో లేదో చూడాలి. కనిపెడితే బాలు ఎలా రియాక్ట్ అవుతాడో?? ఈ విషయం మీనాకి తెలిస్తే మీనా బాలు మధ్య ఎలాంటి పరిస్థితి నెలకొంటుందో రాబోయే ఎపిసోడ్ లో చూడొచ్చు మనం.
