గుండె నిండా గుడి గంటలు Nov 6th, 2025 గురువారం ఎపిసోడ్ : సుశీలమ్మ పుట్టినరోజు వేడుకలు … !!!బామ్మ కోసం కోపాన్ని అణుచుకుంటున్న బాలు …. !!!!
కోపంతో ఇంటికి చేరిన బాలు మీనా
ఎపిసోడ్ ప్రారంభంలో బాలు, మీనా ఇంటికి వస్తారు. వారిని చూసి ప్రభావతి, మనోజ్ ఒక్కసారిగా సడన్గా వణికిపోతారు. మీనా బాలును ఇంట్లోకి తీసుకువెళ్తూ తనకి ఇచ్చిన మాటను గుర్తు చేస్తు “మీ అమ్మమ్మ వెళ్ళేంత వరకు మీరు ఎవరితో గొడవపడకూడదు అని మాట ఇచ్చారు. దయచేసి కోపాన్ని తగ్గించుకోండి.” అని అంటుంది.
బాలు తనలో కోపాన్ని దాచుకోలేక “నేను ప్రశాంతంగా ఉండలేను మీనా… అగ్ని పర్వతం మీద అల్యూమినియం మూత పెట్టినట్టు ఉంది ఇపుడు నాకు. కానీ బామ్మ గురించి ఆలోచించి తనని సంతోషంగా ఉంచాలని ఆగుతున్నాను” అని స్పష్టంగా చెబుతాడు. మీనా మళ్లీ ఇంకొకసారి “రెండు రోజులు నోరు తెరవకండి, ఎలాంటి గొడవ వద్దు” అని చెబుతుంది.

అయినా బాలు ఆగలేక “రెండు రోజుల్లో వీళ్ళ సంగతి చెబుతాను” అని అంటాడు.
అత్త మీద విరుచుకుపడిన మీనా
ఇంట్లోకి రాగానే ప్రభావతి వంట చేయకుండా ఎక్కడ తిరుగుతున్నావు అని మీనా మీద అరుస్తుంది. మీనా ఏ మాత్రం ఆలోచించకుండా ప్రభావతిని మాటలతోనే కడిగి పారేస్తోంది. మీనా ప్రభావతితో ” నా ఇష్టం. మా ఆయనతో నేను ఎక్కడికి అయినా వెళ్తాను. మీకు ఎందుకు? అయినా నేను చేయకపోతే మీకు వంట రాదా? చేతులు లెవా? వండలేరా? అయినా నేను పుట్టాక వంట పుట్టిందా ? మీరు అంతక ముందు అంత హోటల్ నుండి తెచ్చుకుని తిన్నారా” అని ఇష్టం వచ్చినట్టు అనేస్తుంది. బాలు కూడా వాళ్ళకి అసలు విషయం చెప్పకుండానే రెండు రోజుల్లో వాళ్ళ సంగతి తేలుస్తాను అనేలా మాట్లాడతాడు. అది చూసి ప్రభావతి, మనోజ్ షాక్ అవుతారు.
మీనా బాలు ని కాఫీ కావాలా అని అడగగా బాలు ” అగ్ని పర్వతాన్ని చెంచాడు నీళ్లతో ఆర్పలేవు” అని అంటాడు. ఇంట్లో వాళ్ళకి అర్ధం కాక ఏమైంది బాలు కి అని అడుగుతారు. బాగా ఆకలిగా ఉంది అంట అదే చెప్తున్నారు అని సర్ది చెప్తుంది.

విషయం అర్ధం కాకపోయినా ఎదో తేడాగా ఉంది అని మనోజ్, ప్రభావతి భయంతో వణికిపోతారు.
రోహిణికి ఫోన్ చేసిన చింటూ
ఇంతలో మనోజ్ తన గదిలోకి వెళ్ళి అయోమయంగా ఆలోచిస్తూ ఉంటాడు. తరువాత రోహిణీ లోపలికి వచ్చి “ఏమైంది? మీరు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు?” అని అడుగుతుంది. మనోజ్ చమత్కారంగా “రోహిణీ… ఆ బాలు గాడు ఏదైనా నీతో చెప్పాడా?” అని అడుగుతాడు. రోహిణీ ఆశ్చర్యపడి “దేని గురించి?” అని అడుగుతుంది. మనోజ్ “అబ్బే అదేం లేదులే…” అని తప్పించుకుని “నేను ఫ్రెష్ అయ్యి వస్తాను” అంటూ బాత్రూమ్లోకి వెళ్ళిపోతాడు.
రోహిణీ మాత్రం అనుమానంగా “ఇతడు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు?” అని మనసులో అనుకుంటుంది. ఇంతలో రోహిణీ ఫోన్ మోగుతుంది — అది ఆమె తల్లి సుగుణమ్మ నంబర్ నుంచి వచ్చినట్లు ఉంటుంది. ఫోన్ తీసుకున్న రోహిణీ కోపంగా “అమ్మా, ఎప్పుడు పడితే అప్పుడు కాల్ చేయొద్దు అన్నాను కదా!” అని అంటుంది.
కానీ అవతల నుంచి పిల్లవాడి గొంతు వినిపిస్తుంది — “అమ్మా! నేను చింటూని! నువ్వు బాగున్నావా? నేను చాలా బాగున్నాను. నీ వల్లనే బాగా చదువుతున్నాను. ఫస్ట్ వచ్చాను అమ్మా!” అని ఆనందంగా చెబుతాడు. రోహిణీ చిరునవ్వుతో “అవునా బంగారం… గుడ్ రా నా బుజ్జి కన్నా! ఇలానే బాగా చదువుకోవాలి” అని ప్రేమగా స్పందిస్తుంది.

బామ్మ పుట్టినరోజు గిఫ్ట్ చర్చ
ఈ మాటలను బాత్రూమ్ నుంచి బయటకు వచ్చిన మనోజ్ వింటాడు. రోహిణీ వెంటనే ఫోన్ పెట్టేస్తూ “నా ఫ్రెండ్ పేరు బుజ్జి… అందుకే అలా పిలుస్తాం” అని కవర్ చేస్తుంది. మనోజ్ “మరి నన్ను ఎప్పుడూ అలా పిలవలేదు” అని అలుగుతాడు. రోహిణీ దగ్గరగా వచ్చి చిరునవ్వుతో “ఇప్పటి నుండి నిన్ను కూడా బంగారం, మనో అని నాకు నచ్చినట్టు పిలుస్తాను” అని అంటుంది. మనోజ్ నవ్వుతూ “సరే నిన్ను బుజ్జి కన్నా అంటాను” అని అంటాడు.
రోహిణీ “బామ్మ పుట్టినరోజు రేపే కదా, ఏదైనా గిఫ్ట్ కొందామా?” అని అడుగుతుంది. మనోజ్ నిర్లిప్తంగా “ఏమి అవసరం లేదు లే ” అని అంటాడు. రోహిణీ “అలా అనొద్దు… ఇంట్లో ప్రతి ఒక్కరు ఏదైనా ఇస్తున్నారు, మనం కూడా ఇవ్వాలి” అని ఒప్పిస్తుంది. మనోజ్ సరే అని ఎం కొందాము అని అంటాడు. రోహిణి ” ఒక రింగ్ కొందామా” అని అడుగుతుంది. మనోజ్ వెంటనే “ఒక చీర తీసుకుందాం లే… ఎక్కువ ఖర్చు వేస్ట్. బామ్మ నాకంటే ఆ బాలు గాడినే ఎక్కువగా చూసింది” అని అంటాడు. రోహిణీ కూడా సరే అని అంగీకరిస్తుంది.
పార్వతమ్మని ఆహ్వానించిన మీనా, బాలు
ఇక మీనా పార్వతమ్మకు కాల్ చేస్తుంది. “రేపు మా బామ్మ పుట్టిన రోజు” అని చెబుతుంది. పార్వతమ్మ “ఇందాక మీ మావయ్య కాల్ చేశారు, రమ్మని పిలిచారు” అని చెబుతుంది. ఫోన్ స్పీకర్లో ఉంటుంది . పక్కనే సుమతి కూర్చుని ఉంటుంది. ఇంతలో బాలు ఫోన్ తీసుకుని “అత్తయ్యా, సుమతి… మీరు రండి” అని ఆహ్వానిస్తాడు. పార్వతమ్మ “వస్తాం బాబు” అని సమాధానమిస్తుంది.

పార్వతమ్మ మీనాతో “మీ బామ్మ కోసం ఏం కొనమంటావు” అని అడుగుతుంది. బాలు “అవి ఏం వద్దు అత్తయ్య. మీరు వస్తే చాలు” అని అంటాడు. మీనా “ఏదైనా తీసుకురండి అమ్మా, లేదంటే మా అత్తగారు ఊరుకోరు” అని అంటుంది. పార్వతమ్మ “సరే” అని అంగీకరిస్తుంది.
ఫోన్ పెట్టిన తర్వాత సుమతి “అమ్మా, శివ రాను అన్నాడు… మనమే వెళ్దాం లే” అంటుంది. పార్వతమ్మ “వాడు రాకపోవడమే మంచిది, లేకపోతే మళ్లీ గొడవ” అని అంటుంది.
తర్వాత బాలు మీనా దగ్గర మనోజ్ మీద కోపం చూపిస్తాడు. అతనే నగలు మాయం చేసాడు అని మనకి తెలీదు కదా అని అంటుంది మీనా. బాలు వెంటనే “ఇలాంటి పనులు చేసేది వాడే నాకు తెలుసు. ఇపుడు వాడి వల్ల మనం ఏమి ఇవ్వలేకపోతున్నాము కదా షీలా డార్లింగ్ కి ” అని అంటాడు. మీనా కూడా అంగీకరిస్తూ ” గిఫ్ట్ గా ఏదయినా వస్తువు ఇస్తే ఇచ్చినపుడు కాసేపు సంతోషంగా ఉంటారు. మీరు కోపం పక్కన పెట్టి మంచిగా ఆలోచించండి. ఆలోచించి అమ్మమ్మ ఎప్పుడూ సంతోషంగా ఉండేది ఏదయినా ఇద్దాం” అని అంటుంది. బాలు కూడా అంగీకరిస్తాడు.
షీలా డార్లింగ్ పుట్టినరోజు వేడుక
తరువాత బాలు సుశీలమ్మను పుట్టినరోజు రోజున ఇంటికి తీసుకు వస్తాడు. ప్రభావతి మీనాని పక్కన పెట్టి రోహిణి, శృతిని సుశీలమ్మకి హారతి ఇవ్వమని చెప్తుంది. బామ్మ మీనా గురించి అడుగుతుంది. బాలు బామ్మతో ” మీనాని మా అమ్మ పక్కన పెట్టేసి ఉంటుంది. ఈ హారతి పళ్లెం కూడా మీనానే ప్రిపేర్ చేసి ఉంటుంది” అని అంటాడు. సుశీలమ్మ కూడా నాకు తెలుసులేరా మీ అమ్మ కంటే ముందు పుట్టాను మీ అమ్మ లాంటి అత్తలని చాలా మందిని చూసాను అని అంటుంది.

అంతలో సత్యం మీనాని కూడా పిలిచి ముగ్గురు కోడళ్ళని కలిసి హారతి ఇవ్వమని చెప్తాడు. ముగ్గురు కలిసి ఆమెకు హారతి ఇస్తారు, ఆహ్వానిస్తారు. అందరూ 75వ పుట్టినరోజు ప్లెక్సీ ఏర్పాటు చేసి, సుశీలను కళ్లుమూసి అక్కడికి తీసుకువస్తారు. ఆమె కళ్లు తెరచి, అందరూ “పుట్టినరోజు శుభాకాంక్షలు బామ్మా!” అని చెబుతారు. సుశీలా ఆనందంగా నవ్వుతూ “అందరికి థాంక్స్, మీరు అందరూ ఎపుడు ఇలాగే సంతోషంగా ఉండాలి” అని ఆశీర్వదిస్తుంది.
ప్రభావతి ఆవేశంగా “అత్తయ్య, ఇది అంతా నేనే ఏర్పాటుచేశాను” అని చెబుతుంది. సుశీలా చిరునవ్వుతో “అలా అయితే ఈరోజు తప్పకుండా వర్షం పడుతుంది” అని సరదాగా అంటుంది. అందరూ నవ్వుతారు.
అంతటితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది.
మరుసటి రోజు ఎపిసోడ్ లో బామ్మ ఇంట్లో అందరికి నాకు ఎవరైతే మనసుకి నచ్చిన బహుమతి ఇస్తారో వాళ్ళకి నేను ఒక బహుమతి ఇస్తాను అంటుంది. ఇంకా ఇంట్లో అందరు బామ్మ కి ఏం ఇష్టమో అది ఇద్దాము అని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. మీనా వచ్చి అమ్మమ్మకి ఏం ఇష్టం అని మీకే బాగా తెలుసు అని బాలుతో అంటుంది.
Source inspiration: Original story from “గుండె నిండా గుడి గంటలు” (JioHotstar). This is a personal written recap and interpretation.
