గుండె నిండా గుడి గంటలు Nov 13th, 2025 గురువారం ఎపిసోడ్: ప్రభావతి మాటలకు దుమ్మెత్తిపోసిన ఇంటి సభ్యులు … !!! మీనా నగలను గిల్ట్ నగలు అన్న శృతి తల్లి … !!!
ఎపిసోడ్ ప్రారంభంలో ఇల్లు అంతా దీపాలతో, బెలూన్లతో, సందడితో నిండిపోయి ఉంటుంది. సుశీలమ్మ జన్మదినం సందర్భంగా అందరూ సంతోషంగా ఏర్పాట్లు చేస్తున్నారు. బంధువులు, స్నేహితులు అందరూ వచ్చి కేక్ కటింగ్‌కు సిద్ధమవుతారు. ఇదే సమయంలో మీనా తల్లి పార్వతి, చెల్లెలు సుమతితో కలిసి అక్కడికి చేరుకుంటారు.
అపుడే సుశీలమ్మ సంతోషంగా సుమతిని ఆశీర్వదిస్తూ, “నువ్వు త్వరగా మంచి సంబంధం చూసి పెళ్లి చేసుకో” అని దీవిస్తుంది. సుమతి నవ్వుతూ “ముందు ఉద్యోగం చేసి నా కాళ్లపై నిలబడతాను” అని సమాధానమిస్తుంది. ఆ మాట విన్న శ్రుతి వెంటనే “అది చాలా మంచి ఆలోచన” అని ప్రశంసిస్తుంది.

ఇలా అందరూ సంతోషంగా మాట్లాడుకుంటుంటే ప్రభావతి మాత్రం చిన్నగా “మీ పెద్దమ్మాయిలా చిన్నమ్మాయికి పెళ్లి కావాలంటే ఎవరో ఒకరికి యాక్సిడెంట్ జరగాలి” అని అనవసరంగా మాట వదిలేస్తుంది.
అది విన్నవాళ్లందరూ ఒక్కసారిగా తిరిగి చూస్తారు. అందరు ఒకరి తర్వాత ఒకరు వరుసగా “ఇవి ఏం మాటలు? అన్నం తింటున్నావా లేక గడ్డి తింటున్నావా? నీకు ఏ సంస్కారం లేదు? నోటికి హద్దు తెలియదా? ఆడపిల్ల పెళ్లి గురించి ఇలానే నా మాట్లాడేది? అసలు నిన్ను ఇలా ఎలా పెంచారు మీ అమ్మ నాన్న ” అని సుశీలమ్మ, సత్యం, ప్రభావతి కొడుకులు, కూతురు, కోడళ్ళు ఇంకా కామాక్షి కూడా ఒకేసారి మందలిస్తారు.

సత్యం “పుట్టినరోజు వేడుక జరుగుతున్న సమయంలో చావు గురించి మాట్లాడతావా?” అని ప్రశ్నిస్తాడు. ప్రభావతి “నేను తప్పుగా మాట్లాడానా?” అని అడుగుతే, కామాక్షి “పెళ్లి గురించి మాట్లాడుతుంటే చావు గురించి మాట్లాడటం తప్పే కదా” అని సమాధానం ఇస్తుంది. ప్రభావతి “సరే తెలియకుండా అనేశాను. వదిలేయండి” అని చిన్నగా అంటుంది. సత్యం కోపంతో “ఎపుడో వదిలేయాల్సింది నిన్ను. పిల్లలు పుట్టారు అని ఆగాను” అని అంటాడు. అంతటితో ప్రభావతి సైలెంట్‌గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
పార్వతి, సుమతి వైపు తిరిగి సుశీలమ్మ “అమ్మా, ఆమె మాటలు పట్టించుకోవద్దు. ఆమె స్వభావం అంతే” అని చెబుతుంది. తర్వాత సత్యం అందరినీ చూస్తూ “ఇప్పుడు అందరికీ చల్లగా రోజ్మిల్క్ చేసిపెట్టు” అని సుమతిని అడుగుతాడు. అప్పుడే ప్రభావతి పక్కనుండి “నాక్కూడా ఇస్తావా?” అని అడుగుతుంది. సుమతి “మీకు ఇవ్వకుండా ఉంటానా అత్తయ్యా” అని మర్యాదగా గ్లాస్ అందిస్తుంది.

సత్యం “ఆమె మాటలు పట్టించుకోవద్దు. మంచి సంబంధం కోసం నేను కూడా చూస్తాను. ఉంటే చెప్తాను” అని అంటాడు పార్వతితో. మీనా మాట్లాడుతూ “సుమతి చెప్పింది కరెక్ట్. ముందు తాను జాబ్ చేయాలి. లేదంటే నాలా మాటలు పడాలి” అని అంటుంది. సుశీలమ్మ అందరు మీ అత్తలా ఉండరు అమ్మ అని అంటుంది. వెంటనే మౌనిక “అవును, మా అత్తగారు దేవత” అని అంటుంది. ప్రభావతి “అంటే నేను దెయ్యన్నా? ” అని వ్యంగ్యంగా అంటుంది. మౌనిక “నువ్వు అలా నోరు వేసుకుని పడిపోతే దెయ్యం అనే అనుకుంటారు” అని అంటుంది. దాంతో అందరూ నవ్వుతారు.
ఇంతలో శ్రుతి తల్లి ఇంట్లోకి వస్తుంది. అందరి ఆనందం చూసి బయటకి నవ్వుతున్నా, లోపల మాత్రం అసహనం పెరుగుతుంది. “ఇంత సంతోషంగా ఉన్న ఈ ఇంట్లో ఏదో ఒక గొడవ చేయాలి” అని మనసులో అనుకుంటుంది. వెంటనే “హ్యాపీ బర్త్‌డే” అంటూ సుశీలమ్మను అభినందిస్తుంది. “మాలాంటి వాళ్ల ఇళ్లలోనే పెద్దవాళ్ల వేడుకలు చేస్తాం అనుకున్నా, మీరు కూడా బాగానే చేస్తున్నారు” అని చెబుతుంది. సత్యం బదులిస్తూ “వేడుకలు అంటే అందరిని పిలిచి చేసుకునేది ఏముంటుంది అయినా వాళ్ళతో సంతోషంగా గడిపితే సరిపోతుంది కదా” అని అంటాడు. “అవును ఖర్చు లేని పని కదా ” అని శృతి తల్లి వ్యంగ్యంగా అంటుంది.

శోభన మౌనిక వైపు తిరిగి ” మీ ఆయన నిన్ను పంపించాడా? నిన్ను బాగానే చూసుకుంటున్నాడా” అని అనుమానంగా అడుగుతుంది. అప్పుడు కామాక్షి సరదాగా “మీ ఆయన నిన్ను బాగా చూసుకుంటున్నారా?” అని అడుగుతుంది. దానికి శ్రుతి తల్లి “ఇదేం ప్రశ్న?” అని అసహనంగా అడుగుతుంది. కామాక్షి కూడా “మరి మీది ఎం ప్రశ్న. ఎవరైనా కొత్తగా పెళ్లి అయినా వాళ్ళని బాగున్నారా కాపురం బాగుందా అని అడుగుతారు. మీరు ఏంటో కొత్తగా పలకరిస్తున్నారు” అని చురక వేస్తుంది. సుశీలమ్మ కూడా “ఎపుడు నువ్వే వస్తావు అంట . మీ ఇళ్లలో మగవాళ్లను వదిలేసి ఆడవాళ్లు ఇంత స్వేచ్ఛగా తిరుగుతారా?” అని అనగానే శ్రుతి తల్లి నిశ్శబ్దంగా కూర్చుంటుంది.
ఇంతలో సుమతి సరదాగా రవి చెవి దగ్గర బెలూన్ పేలుస్తుంది. పెద్ద శబ్ధం రావడంతో రవి ఉలిక్కిపోతాడు. వెంటనే “నిన్నెవడు పెళ్లి చేసుకుంటాడో కానీ వాడే బెలూన్ లా పేలిపోతాడు” అని రవి నవ్వుతూ చెబుతాడు. దానికి సుమతి “ఏమన్నావ్ నన్ను?” అని రవి వెంట పడుతుంది సరదాగా కొట్టడానికి. శ్రుతి తల్లి పక్కనుండి చిరాకు చూపుతుంది. ప్రభావతి కూడా “ఇది ఏ పద్ధతి? పెళ్లి కావాల్సిన అమ్మాయి ఇలా ప్రవర్తిస్తుందా?” అని కామాక్షితో అంటుంది. అంతలా శృతి అక్కడికి వచ్చి ఏమైంది అని అడుగుతుంది. అది చూసి ప్రభావతి శృతి సుమతిని తిడుతుంది అనుకుంటుంది.

కానీ శ్రుతి విషయం తెలుసుకుని సుమతికి సపోర్ట్ చేసి రవిని కొట్టడానికి హెల్ప్ చేస్తుంది. అందరు నవ్వుతారు. శృతి రవితో “ఇందాక మీ అమ్మ ఇపుడు నువ్వు సుమతి పెళ్లి గురించి అలా మాట్లాడతారు ఏంటి” అని అంటుంది. మీనా శృతిని సపోర్ట్ చేస్తూ “సంస్కారం అంటే ఇది, మనసు విశాలంగా ఉండటం అంటే ఇదే. ఎప్పుడూ బురద జల్లే వాళ్లకు ఇదే సమాధానం” అని వ్యంగ్యంగా చెబుతుంది.
ఇలా అందరూ నవ్వుతూ మాట్లాడుతుంటే శ్రుతి తల్లి మాత్రం లోపల రగిలిపోతుంది. “మంచి అవకాశం పోయింది” అని మనసులో అనుకుంటుంది. అప్పుడు మీనాను గమనించి “దొరికింది” అని తనలో తానే అనుకుని ఆమె అడుగుతుంది “ఏంటి మీనా, రోల్డ్ గోల్డ్ నగలు వేసుకున్నావ్? నీ భర్త నగలు చేయించేవరకు బంగారం వేసుకోను అన్నావ్ కదా, ఇంకా కొనలేదా? అందుకే గిల్ట్ నగలు వేసుకున్నావా” అని.

వెంటనే ప్రభావతి దొరికిపోయాను అనే భయంతో “అవి బంగారు నగలే వదిన” అంటుంది. సుశీలమ్మ కూడా “నేనే చేయించాను, అవన్నీ అసలైన బంగారమే” అని చెబుతుంది. శోభన మాత్రం బలంగా “అంత బంగారం ఉన్న నాకు ఏవి నిజం ఏవి గిల్ట్ అని తెలీదా” అని అంటుంది. రోహిణి కూడా “మీనాకి నగల మీద మోజులేదు, కావాలి అంటే పసుపుతాడుతో ఉంటుంది కానీ గిల్టువి వేసుకోదు” అని సమాధానం ఇస్తుంది. కానీ శ్రుతి తల్లి “అవన్నీ గిల్టు నగలే కదా? చెప్పాలి కాబట్టి చెప్పాను. ఎవరు ఎం దాస్తున్నారో” అని వ్యంగ్యంగా అంటుంది.
అందరూ ఒక్కసారిగా సైలెంట్ అవుతారు. మనోజ్, ప్రభావతి ఇద్దరూ ఒకరినొకరు చూసి ఆందోళన చెందుతారు. పార్వతి “బీరువాలో ఉన్న బంగారం బయటకి వచ్చేసరికి గిల్డ్‌గా మారుతుందా?” అని అడుగుతుంది.
సుశీలమ్మ మాత్రం శాంతంగా “అవి నిజమైన బంగారం. ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు” అని చెబుతుంది. కామాక్షి “నువ్వు బర్త్‌డే విషెస్ చెప్పడానికి వచ్చావ్, చెప్పావ్ కదా, ఇక పోదాం” అని చెబుతుంది.

శ్రుతి తల్లి బయటకు వెళ్ళేటప్పుడు కామాక్షి ప్రభావతితో “నీ పని అయిపోయింది అనుకున్నా. బ్రతికిపోయావ్” అని అంటుంది. దానికి ఆమె “అవును, బ్రతికిపోయాను కదా” అని చిన్నగా సమాధానం ఇస్తుంది.
తర్వాత బయటకి వెళ్ళగానే తల్లి మీద శ్రుతి కోపపడుతుంది. “నువ్వు ఎప్పుడూ ఏదో గొడవ చేయకుండా ఉండలేవా?” అని అడుగుతుంది. ఆమె “వాళ్లు గిల్డ్ నగలు వేసుకుంటున్నారు, నీ బంగారం మాయం చేయరని నువ్వు నమ్మగలవా?” అని అంటుంది.
శ్రుతి కోపంగా “నాకు నీ బంగారం అవసరం లేదు, మా ఇంటికి నువ్వు రావద్దు, ఇంకోసారి మా కుటుంబంలో గొడవలు పెట్టొద్దు” అని చెబుతుంది. శ్రుతి తల్లి “వేళ్ళని భరించలేక నువ్వే వస్తావ్” అనుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది.
ఇదిలా జరుగుతుండగా, మరోవైపు సంజయ్ మౌనికకు ఫోన్ చేస్తూనే ఉంటాడు. ఆమె కాల్ లిఫ్ట్ చేయదు. “ఇది గుడికి వెళ్లి ఉండదు” అని అనుకుంటూ తల్లిని ప్రశ్నిస్తాడు. ఆమె “మౌనికకు దేవుడిపై భక్తి ఎక్కువ, కాబట్టి కాసేపు ఆగి వస్తుందిలే ” అని చెబుతుంది.
సంజయ్ “ఏ గుడి చెప్పు, నేను వెళ్తాను” అని అంటాడు. తల్లి “వస్తుందిలే” అని సమాధానం ఇస్తుంది. కానీ సంజయ్ “నేను గుడి బయటే ఉంటాను, అడ్రెస్ చెప్పు” అని పట్టుబడతాడు. తల్లి “ముందు భోజనం చేయి. మౌనికనే వస్తుంది. అపుడు అపుడు అయినా నా మాట విను” అని చెప్పినా, అతను నమ్మకుండా అక్కడ నుండి వెళ్తాడు.

ఇక ఇంట్లో మౌనిక “ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోతాను” అని అంటుంది. అందరూ కేక్ కట్ చేసేవరకు ఆగమని అడుగుతారు. ఆమె “నేను వడ్డిస్తే తప్ప ఆయన అన్నం తినరు” అని చెబుతుంది. ప్రభావతి “పర్లేదు, అల్లుడికి నేనే చెబుతాను” అని అంటుంది. మీనా “కాసేపు ఉండు మీ అన్నయ్య కూడా వస్తాడు” అని చెబుతుంది. ప్రభావతి “వాడు తాగి తూగుతూ వస్తాడు” అని అంటుంది. దానికి మనోజ్ “తాగడానికి కాకుండా ఇంకా ఎక్కడికి వెళ్తాడు?” అని అంటాడు. మీనా “ఎక్కువ మాట్లాడకండి” అని గట్టిగా ఆపుతుంది.
ఇంతలో కేక్ కటింగ్ ఏర్పాట్లు జరుగుతుంటాయి. సుశీలమ్మ “బాలు వస్తేనే కేక్ కట్ చేస్తాను” అని అంటుంది. అందరూ “మేమున్నాం కదా” అంటారు కానీ ఆమె “బాలు కూడా ఉండాలి లేకపోతే నేను అసలు కేక్ కట్ చేయను” అని చెబుతుంది.
అంతటితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది.
మరుసటి రోజు ఎపిసోడ్ ప్రోమోలో బాలు అక్కడికి చేరుకుంటాడు. సుశీలమ్మ మీనాతో పంచుకున్న కోరికని నిజం చేస్తాడు. సుశీలమ్మ చాలా ఆనందపడుతుంది.
Source inspiration: Original story from “గుండె నిండా గుడి గంటలు” (JioHotstar). This is a personal written recap and interpretation.
