ఇల్లు ఇల్లాలు పిల్లలు Nov 1st, 2025 శనివారం ఎపిసోడ్ : రామరాజు ఇంట్లో దీపావళి కాంతులు …!!!! ప్రేమ, ధీరజ్ ల మధ్య చిగురిస్తున్న ప్రేమ … !!!
పోలీస్ స్టేషన్ నుండి విడుదలైన ధీరజ్ బయటకు రాగానే రామరాజు, ప్రేమ ఇంకా కుటుంబ సభ్యులు అందరు అతన్ని చూసి కంటతడి పెట్టుకుని అతన్ని హత్తుకుంటారు. అంతలో “నువ్వు లేకపోతే నా జీవితం నాశనం అయ్యేది. నువ్వు నా ప్రాణాలను కాపాడావు” అని చెబుతుంది శోభ. ఆమె తండ్రి కూడా రామరాజు ముందుకు వచ్చి, “నిజం తెలియక నీ కొడుకుపై కేసు పెట్టాను, క్షమించండి” అని చెబుతాడు. ధీరజ్ కూడా వినయంగా, “ఫర్వాలేదు సార్” అని సమాధానం ఇస్తాడు.

అప్పుడే రామరాజు SI వైపు తిరిగి, “నా కొడుకులు చెడు చేయరు. వాళ్లకు సంస్కారం నేర్పాం. కానీ మీరు నిజం తెలుసుకోకుండా తప్పుగా ఆరోపించారు” అని గర్వంగా అంటాడు. SI కూడా నమ్రంగా, “సార్, విచారణలో భాగంగానే అలా చేయాల్సి వచ్చింది. కిడ్నాప్ అయిన అమ్మాయి తండ్రే ఫిర్యాదు చేశాడు” అని సమాధానం ఇస్తాడు. దాంతో రామరాజు ధీరజ్ని తీసుకుని ఇంటికి బయల్దేరుతాడు.
మరోవైపు రామరాజు కుటుంబం కష్టాల్లో ఉంది అని వేదవతి కుటుంబ సభ్యులు సంతోషంతో టపాసులు కాలుస్తూ 25 ఏళ్ల తర్వాత మా ఇంట్లో దీపావళి కాంతులు నిజంగా వచ్చాయి అని మాట్లాడుకుంటారు. మొదటిసారి ఆ రామరాజు ఇంట్లో చీకటి అలుముకుంది అని సంతోషపడతారు.

అదే సమయంలో ఇంటికి చేరిన తర్వాత రామరాజు కుటుంబం ఆనందంలో మునిగిపోతుంది. ఇల్లు అంతా దీపాలతో కళకళలాడుతుంది. ఆ ఆనందాన్ని చూసి రామరాజు గర్వంగా, “నా కోడళ్లు నా ఇంటికి వెలుగు తెచ్చారు. నా కొడుకు తప్పు చేయడు అనేది నా నమ్మకం. నా కొడుకుని తప్పు పట్టారు కదా ఆడ పిల్ల జీవితం నాశనం చేసాడు అని కానీ నా కొడుకు అమ్మాయి జీవితం కాపాడు అని ఈరోజు బయట పడింది. నా కుటుంబం నా బలం, మేము కలిసి ఉన్నంత వరకు ఎవరు ఏమి చేయలేరు” అని భద్రావతి కుటుంబానికి గట్టిగా తగిలేలా చెప్తాడు. అందరు కలిసి మోత మోగిపోయేలా టపాసులు కాలుస్తారు.
ఇక మరోవైపు, ఈ ఆనందం వేదవతి కుటుంబానికి అసహనం కలిగిస్తుంది. భద్రావతి, సేనాపతి, విశ్వలు రామరాజు ఇంటి పండుగను చూసి కోపంతో మండిపోతారు. భద్రావతి కోపంగా, “ఇప్పుడు రామరాజు కుటుంబం పతనం మొదలవ్వాలి. వాళ్ళ నవ్వులు వారి జీవితం నుండి దూరం అవ్వాలి. వారి కుటుంబం ఒకటిగా ఉన్నంతకాలం వాళ్లను జయించలేం. కాబట్టి వాళ్ల మధ్య చిచ్చు పెట్టాలి. నువ్వు అమూల్యని పెళ్లి చేసుకుంటేనే మనం వాళ్ళని దెబ్బ తీయొచ్చు” అని చెబుతుంది.

విశ్వ వెంటనే — “ఆ అమూల్యను నా ప్రేమలో పడేస్తాను. రేపు నా ప్లాన్ తో అమూల్య నా ప్రేమని నిజం అని నమ్మేలా చేస్తాను. అమూల్య ని పెళ్లి చేసుకుని ఆ రామరాజుని ఆటాడిస్తా” అని అంటాడు. భద్రావతి సంతోషంగా ఆ ప్లాన్‌కి ఒప్పుకుంటుంది.
ఇదిలా ఉండగా, ధీరజ్ ప్రేమతో “నువ్వు లేకపోతే నేను జీవితాంతం నేరస్థుడిగా మిగిలేవాడిని” అని చెబుతాడు. కానీ అమూల్య నవ్వుతూ, “నేను కేవలం నీకు సహాయం చేశాను, ఇది ఎవరికైనా చేసేదాన్ని ఎందుకు అంటే నాకు జాలి ఎక్కువ ” అని చెబుతుంది. ఇద్దరి మధ్య చిలిపి మాటలు, నవ్వులు, సరదా క్షణాలు గడుస్తాయి. ఆ క్షణాల్లో ధీరజ్ మనసులో ఆమెపై ప్రేమ మరింత బలపడుతుంది. ధీరజ్ ప్రేమతో మనం ఫ్రెండ్స్ గా ఉందాము అని అంటాడు ప్రేమ కూడా లోపల సంతోషంతో సరే అంటుంది.

ఇద్దరి మధ్య సరదా సంభాషణలు మొదలవుతాయి. ప్రేమ చిన్నప్పటి కల — పోలీస్ ఆఫీసర్ కావడం అని అంటుంది. ధీరజ్ సరదాగా, “నీకు అది సాధ్యం కాదు” అని చెబుతాడు. కానీ ప్రేమ గొప్పగా, “నువ్వు చూడు, నేను ఫిజికల్ టెస్ట్ కూడా పాస్ అవుతాను” అని సవాలు విసురుతుంది.ఇద్దరూ నవ్వుతూ “రేపు ఉదయం పరిగెత్తుకుందాం, ఎవరు గెలుస్తారో చూద్దాం!” అని సవాలు పెట్టుకుంటారు.
మరోవైపు సాగర్ కుటుంబంలో ఎలాంటి సమస్య వచ్చిన ముందు ఉంటుంది అని ధీరజ్ ప్రాబ్లెమ్ సాల్వ్ చేసింది అని నర్మదని పొగడ్తలతో ముంచెత్తుతాడు.
అంతటితో ఆ ఎపిసోడ్ ముగుస్తుంది.
మరుసటి ఎపిసోడ్ ప్రోమోలో ఉదయాన్నే ప్రేమ ధీరజ్ ని నిద్ర లేపి సవులుని గుర్తు చేస్తుంది. ఇద్దరు కలిసి పొలం గట్ల మీద తిరుగు ఉంటారు.
ఇక తర్వాతి రోజుల్లో ధీరజ్, ప్రేమ ల మధ్య అనుబంధం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.
Source inspiration: Original story from “ఇల్లు ఇల్లాలు పిల్లలు” (JioHotstar). This is a personal written recap and interpretation.

