ఇల్లు ఇల్లాలు పిల్లలు Nov 6th, 2025 గురువారం ఎపిసోడ్ : వృత్తి కోసం వేదవతి మాట లెక్క చేయని నర్మద …. !!!!
పుట్టింటి వారి గురించి నర్మదని హెచ్చరించిన వేదవతి
వేదవతి జరిగింది మర్చిపోలేక అదే గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఆమె మనసులో సేనాపతి చెప్పిన మాటలు తిరుగుతుంటాయి. ఆ మాటలు ఆమె చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయి. ఇంతలో గదిలోకి నర్మద వస్తుంది. “ఇంత టైమ్ అయ్యింది, ఇంకా పడుకోలేదు ఎందుకు?” అని అడుగుతుంది. వేదవతి ఆమెను కూర్చోబెట్టి, “నీతో కొంచెం మాట్లాడాలి” అని మొదలు పెడుతుంది.
వేదవతి నెమ్మదిగా నర్మదతో “నీకు మా వాళ్లు ఎనిమిది నెలలుగా మాత్రమే తెలుసు. కానీ నాకు వాళ్లు చిన్నప్పటి నుంచీ తెలుసు. పరువు కోసం వారు ఏ స్థాయికైనా వెళ్తారు. నేను ఇరవై ఐదు సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నప్పటి నుండి చూస్తూనే ఉన్నాను. వాళ్లు గౌరవం కోసం బతుకుతారు, పరువు కోసం ప్రాణాలు ఇస్తారు…అవసరమైతే ప్రాణాలు తీస్తారు కూడా. అందుకే నువ్వు వాళ్ల జోలికి వెళ్లొద్దు. వాళ్ల పనులలో జోక్యం చేసుకోకు.”

ఆమె మరింతగా వివరిస్తూ చెబుతుంది “వాళ్ల దగ్గర తప్పులు ఉండొచ్చు, ఒప్పులు ఉండొచ్చు. కానీ నువ్వు చూసీ చూడనట్టు వదిలేయి. దాని గురించి ఏదీ పట్టించుకోకు.” నర్మద కంగారుపడకుండా ధైర్యంగా మాట్లాడుతుంది “అత్తయ్యా, ఇది నా విధికి సంబంధించిన విషయం. నేను నా డ్యూటీలో తప్పు జరిగిందని తెలిసినా పట్టించుకోకపోతే, నా వృత్తికి ద్రోహం చేసినట్టవుతుంది. రాజీ పడి వెనక్కి తగ్గితే, నన్ను నేనే మోసం చేసినట్టవుతుంది. నా వృత్తికి నేను ద్రోహం చేయలేను. నన్ను నేనే మోసం చేసుకోలేను.”
వృత్తి కోసం అత్త మాట కి ఎదురు చెప్పిన నర్మద
వేదవతి నిట్టూర్చుతూ, “నీ మంచి కోసమే చెబుతున్నాను నర్మదా. నా మాట విను. మా వాళ్లు పంతానికి దిగితే నీకు, మన కుటుంబానికి కూడా ఇబ్బందులు వస్తాయి. ఇప్పటికే రెండు కుటుంబాల మధ్య పగలు చాలా ఉన్నాయి. ఇక కొత్త గొడవలు వద్దు” అని కోరుతుంది.
కానీ నర్మద తల ఊపుతూ “మీ అన్న మాటలకు మీరు భయపడుతున్నారు. నేను అలాంటి బెదిరింపులకు భయపడను. ఏ సమస్య వచ్చినా నేను చూసుకుంటాను” అని చెబుతుంది.
వేదవతి నిరాశగా “నీ వల్ల మనందరం సమస్యల్లో పడతాం. నువ్వు నమ్మకం అంటావు, కానీ నా భయం నిజమవుతుంది. ఈ రెండు కుటుంబాల మధ్య పాత పగలు నాకు తెలుసు. ఇరవై ఐదు సంవత్సరాలుగా చూస్తున్నాను. కాబట్టి నేను చెప్పేది ప్రేమతోనో హెచ్చరికతోనో అనుకో — కానీ వాళ్ల విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోవద్దు” అని తేల్చి చెబుతుంది.

కానీ నర్మద మాత్రం ప్రశాంతంగా “క్షమించండి అత్తయ్యా. నా డ్యూటీ విషయంలో నేను ప్రభుత్వ నిబంధనల ప్రకారం మాత్రమే నడుస్తాను. కుటుంబ ఒత్తిళ్లకు తలొగ్గను” అని సమాధానం ఇస్తుంది. వేదవతి కాస్త కోపంగా “అంటే నా మాట వినవా?” అని అడుగుతుంది. నర్మద స్పష్టంగా “ఈ ఇంటి విషయమైతే మీ మాట వింటాను. కానీ నా విధి విషయమైతే ఎవరి మాట వినను” అని చెబుతుంది.
దాంతో వేదవతి కఠినంగా “సరే, నువ్వు నీ నిర్ణయం చెప్పావ్. నేను నా నిర్ణయం చెబుతున్నా. నువ్వు వాళ్ల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు” అని చెబుతుంది. నర్మద తలెత్తి “క్షమించండి అత్తయ్యా. నేను రూల్స్‌కి తగ్గట్టే ఉంటాను. ఇంకెవరూ నన్ను ప్రభావితం చేయలేరు” అని చెబుతుంది. అలా చెప్పి వెనక్కి తిరిగి వెళ్తుంది.
వేదవతి “ఏయ్! నా మాటకే ఎదురు చెబుతావా?” అని అరుస్తుంది కానీ, నర్మద పట్టించుకోకుండా బయటికి వెళ్లిపోతుంది.
వీళ్ల సంభాషణను చాటుగా విన్న శ్రీవల్లి ఆనందంతో చిందులు తొక్కుతూ “ఇది నేనెప్పుడో చూడాలని అనుకున్నాను. అత్తా, కోడళ్ల మధ్య మొదలైన ఈ మంట ఇప్పుడు ఆరిపోకూడదు. దీని మీద నేను పెట్రోలు పోస్తూనే ఉంటా. ఇదే నా ఆశయం” అని తనలో తాను అనుకుంటుంది.
ధీరజ్ – ప్రేమ మధ్య చిలిపి తగవు

మరోవైపు ధీరజ్ ప్రేమ తనని గట్టిగా కొరికినందుకు తిట్టుకుంటూ తన కోసం వెతుకుతూ బయటికి వచ్చి ప్రేమను చూసి “ఏంటి దెయ్యం, ఇక్కడే మకాం పెట్టావా?” అని అడుగుతాడు. ప్రేమ నవ్వుతూ “అవును. వాస్తు బావుంది” అని సమాధానం ఇస్తుంది.
ధీరజ్ “అవునా నేను ఇంకా నువ్వు వాచ్మెన్ డ్యూటీ చేస్తున్నావని అనుకున్నా. లోపలికి రా” అని చెబుతాడు. ప్రేమ “ఏందుకు?” అని అడుగుతుంది. ధీరజ్ నవ్వుతూ “ఇంకో చెయ్యి కూడా కొరుకుతావని” అని అంటాడు.
ప్రేమ “నేను రాను, ఇక్కడే ఉంటా” అని సమాధానం ఇస్తుంది. ధీరజ్ “జలుబు చేస్తుంది, లోపలికి రా” అని అంటే ప్రేమ “జలుబు చేస్తే నీకేంటి” అని అంటుంది. ధీరజ్ “కొరికినందుకు నేను ఏం అనను. భయపడకుండా లోపలికి రా” అని అంటాడు. కానీ ప్రేమ “నీకు ఎవరు భయపడతారు? నేను ఇక్కడే ఉంటా” అని తిరస్కరిస్తుంది.
ధీరజ్ “పిచ్చి పట్టిందా నీకు? అయినా నన్నూ కొరికి నువ్వు పగుట్టవ్ ఏంటి ” అని అడుగుతాడు. ప్రేమ నవ్వుతూ “అవును, నీ ప్రేమ చూసి పిచ్చి పట్టింది” అని చెబుతుంది. ధీరజ్ వెళ్ళిపోతాడు కానీ కొన్ని క్షణాల తరువాత చాపా దిండు పట్టుకుని తిరిగి వస్తాడు.

ప్రేమ ఆశ్చర్యంగా “మళ్లీ ఎందుకు వచ్చావు?” అని అడుగుతుంది. ధీరజ్ “నీ ఫ్యామిలీ అసలే రాక్షస జాతి. వాళ్లు చూశారంటే పెళ్లి చేసుకుని నా కూతురిని టార్చర్ చేస్తున్నావా అని అంటారు. కానీ నువ్వే టార్చ్ లైట్ వేసుకుని మరి నన్ను టార్చర్ చేస్తున్నావని ఎవరికీ తెలియదు కదా. నువ్వు ఇలా బయట ఉంటే నీకు ఏమైనా అయితే నాదే కదా బాధ్యత. అందుకే నీకు కాపలాగా ఇక్కడే పడుకుంటా ” అని చాప వేసుకుని పడుకుంటాడు.
నేను బయట ఉంటే బాధ లేదు కానీ మళ్లీ బాధ్యత అంటూ మొదటికి వచ్చాడు అని కోపంతో ప్రేమ ధీరజ్ పక్కకి వచ్చి తనని పక్కకి జరుగు జరుగు అని అని తోసేస్తుంది. ధీరజ్ “అంత నువ్వే పడుకుంటే నేను ఎక్కడ పడుకోవాలి ” అని అడుగుతాడు. దానికి ప్రేమ “నువ్వు పడుకోకూడదు. నాకు కాపలా కాయడానికి వచ్చాను అన్నావు కదా. పడుకోకుండా రాత్రి అంత మేలుకుని కాపలా కాయి. నీ బాధ్యత కదా ” అని వెటకారంగా అంటుంది. ధీరజ్ ప్రేమని రాక్షసి శాడిస్ట్ అని తిట్టుకుంటూ ముడుచుకుని పడుకుంటాడు. ప్రేమ దుప్పటి కప్పుకుని హాయిగా నిద్రలోకి వెళ్తుంది.
అప్పుల వాళ్ళ నుండి పారిపోయిన వల్లి తల్లిదండ్రులు

తర్వాతి ఉదయం భాగ్యం, ఆనందరావులు అప్పుల వాళ్ల చేతికి చిక్కకుండా పారిపోతూ ఉంటారు. రోడ్లపై పరిగెడుతుంటారు. “ఇక ఈ బాధలన్నీ తప్పాలంటే మనకు రామరాజు గారే దిక్కు. మొన్న ఆయన దగ్గర డబ్బు అడిగేటప్పుడు తప్పు జరిగిందీ. కానీ ఇప్పుడు వెళ్లి అడగక తప్పదు” అని భాగ్యం చెబుతుంది.
వీళ్లు రిహార్సల్ చేసి, రామరాజు ఇంటికి వస్తారు. బయట శ్రీవల్లి వారిని గమనిస్తుంది. “ఇప్పుడు మీరెందుకు వచ్చారు?” అని అడుగుతుంది. భాగ్యం “ఏం లేదమ్మా, అప్పులు వసూలు చేసేందుకు అప్పులవాళ్ళు వెంబడిస్తున్నారు. మీ మామయ్యని బురిడీ కొట్టించి రెండు మూడు లక్షలు లాగేయాలని వచ్చాం” అని చెబుతుంది.
శ్రీవల్లి “మామయ్య ఊరికి వెళ్లారు” అని చెబుతుంది. దాంతో భాగ్యం “ఇప్పుడు బయటకి వెళితే వాళ్ల చేతిలో చస్తాం. రామరాజు గారు వచ్చే వరకు ఇక్కడే ఉంటాం” అని అంటుంది. శ్రీవల్లి కాసేపు ఆలోచించి “సరే, లోపలికి రండి” అని వారిని తీసుకుపోతుంది.

ఇదిలా ఉండగా నర్మద వేదవతిని చూస్తూ చిలిపిగా “మా గడుసరి అత్తగారు ఉదయాన్నే గరిటె తిప్పేస్తున్నారా? నా కోసం టీ చేస్తున్నారా?” అని ఆటపట్టిస్తుంది. వేదవతి మాత్రం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటుంది. నర్మద “ఏంటి అత్తయ్య అంత కోపం. మీరే కదా ఫ్రెండ్స్ గా ఉందాము అన్నారు. ఆలా అంటారు కానీ ఉండరు. ” అని అంటుంది. అయినా కూడా వేదవతి ఒక్క మాట కూడా మాట్లాడాడు.
అంతటితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది.
Source inspiration: Original story from “ఇల్లు ఇల్లాలు పిల్లలు” (JioHotstar). This is a personal written recap and interpretation.

