ఇంటింటి రామాయణం Nov 12th, 2025 బుధవారం ఎపిసోడ్: పల్లవితో మీనాక్షికి క్షమాపణ చెప్పించిన రాజేశ్వరి, చక్రధర్ ….. !!!! అవమానంతో పల్లవి …. !!!
ఎపిసోడ్ ప్రారంభంలో ఉదయాన్నే అవని ఆఫీసుకి బయలుదేరుతుండగా ఇంటి గుమ్మం దగ్గర కార్ ఆగుతుంది. అందులోంచి చక్రధర్, రాజేశ్వరి, పల్లవి దిగుతారు. వీరిని చూసిన వెంటనే మీనాక్షి ఒక్కసారిగా స్థంభించి పోతుంది — ముఖ్యంగా చక్రధర్‌ని చూసి కోపంగా ఉంటుంది.
పార్వతి వాళ్ళని చూసి “రండి వదినా, ఏంటి చెప్పకుండా సడన్ గా వచ్చారు.” అంటూ లోపలికి ఆహ్వానిస్తుంది. కానీ కమల్ పక్కనుండి చూసి “ఇవ్వాళ వీళ్లు చుట్టం చూపులకు రాలేదు అమ్మ… గొడవపడటానికే మీ చిన్న కోడలు వెంట తీసుకుని వచ్చింది” అని అంటాడు.

అది విన్న పల్లవి వెంటనే “కరెక్ట్‌గా చెప్పావ్ బావా, నన్ను కొట్టిన వాళ్లకు బుద్ధి చెప్పడానికే మా అమ్మ నాన్న ని తీసుకుని వచ్చాను” అని కోపంగా చెబుతుంది.
ఇంతలో రాజేశ్వరి మీనాక్షిని చూసి “అవని అమ్మ గారూ మీరేనా?” అని అడుగుతుంది. మీనాక్షి ప్రశాంతంగా “అవును, నేనే” అని సమాధానం ఇస్తుంది. వెంటనే రాజేశ్వరి ముందుకు వచ్చి అందరూ చూస్తుండగా “మీకేం హక్కు ఉందని నా కూతుర్ని కొట్టారని అడగడానికి రాలేదు. ఒక తల్లిగా నా కూతురు చేసిన తప్పుని సరిదిద్దడానికి వచ్చాను” అని చెబుతుంది.
అందరూ ఆశ్చర్యపోతారు. రాజేశ్వరి మీనాక్షి చేతులు పట్టుకొని మాట్లాడుతూ “నా కూతురు తరఫున నేను క్షమాపణ అడగడానికి వచ్చాను. నా కూతురు చేసిన పని తప్పే. మీరు ఆమెను కొట్టడంలో తప్పులేదు. నేను తల్లిగా చేయలేని పని మీరు చేశారు. నా కూతురికి బుద్ధి చెప్పి మంచిపని చేసారు” అని చెప్పి తల వంచుకుంటుంది.

మీనాక్షి కాసేపు మౌనంగా ఆమెను చూస్తూ ఉంటుంది. మనసులో “ఇంత పెద్ద మనసున్న మహిళలు చాలా అరుదు. నా భర్త నన్ను మోసం చేసినట్టుగా ఈమెని మోసం చేయలేదు, కనీసం ఈమె అయినా అదృష్టవంతురాలు” అని అనుకుంటుంది.
రాజేశ్వరి ఆత్మీయంగా “మీరు అవని తల్లి కదా, అంటే నాకు సొంత అక్కలాంటివారు. నన్ను క్షమించండి” అని చెబుతుంది.
అది విన్న పల్లవి గట్టిగ అరుస్తూ “మామ్, ఏం చేస్తున్నావ్? నన్ను కొట్టిన వాళ్లకు బుద్ధి చెప్పాలని వచ్చి, సిగ్గులేకుండా క్షమాపణ అడుగుతున్నారా?” అని అంటుంది. అప్పుడే రాజేశ్వరి తిరిగి పల్లవిపై కోపంగా చూస్తూ “నోరు మూయ్! ఇంకా ఒక్క మాట మాట్లాడితే మీనాక్షి చేసిన పని నేనే చేయాల్సి వస్తుంది” అని గట్టిగా అంటుంది.

ఆ తరువాత ఆమె గట్టిగా “జరిగిన విషయానికి ఈవిడ దగ్గరికి సారీ చెప్పడానికే వస్తానంటే, నువ్వు నన్ను ఇక్కడికి తీసుకు రావు. అందుకే నీ తరఫున నేనే మాట్లాడతానని వచ్చాను. కానీ నువ్వు మాత్రం తల్లికి అవమానం తెచ్చావ్. సిగ్గు లేకుండా గొడవపెట్టుకోవడానికే వచ్చావ్. నీకు అసలు బుద్ధి లేదా? ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదా” అని గట్టిగా తిట్టేస్తుంది.
అలానే మాట్లాడుతూ “ఒక ఆడది తన భర్త గురించి మాట్లాడలేకపోయింది అంటే, ఆ భర్త మంచివాడు అయ్యి ఉండదు. ఆ భర్త మోసగాడో, నీచుడో, పనికిమాలిన వాడో అయితే భార్య ఎందుకు చెప్పాలనుకుంటుంది? కనీసం అది అయినా ఆలోచించావా? చదువుకున్నావ్ కదా ఆ మాత్రం సంస్కారం కూడా లేదా” అని ప్రశ్నిస్తుంది.
చివరగా ఆమె స్పష్టంగా “ఇప్పుడు నువ్వు చేయాల్సిందే ఒకటి. నువ్వు చేసిన తప్పుకు మీనాక్షి గారిని క్షమాపణ అడుగు.” అని చెప్తుంది. పల్లవి తల ఎత్తి గర్వంగా చూస్తూ సైలెంట్‌గా ఉంటుంది. రాజేశ్వరి మరలా గట్టిగా “ఏయ్, నీకే చెబుతున్నాను! చెప్పు సారీ!” అని అంటుంది.

కమల్ కూడా “మీరు చాల బాగా మాట్లాడారు అత్త నాకు బాగా నచ్చారు ” అని అంటూ పల్లవితో “ఏయ్, తెలుగు అర్థం కావడం లేదా? చెప్పు క్షమాపణ” అని అంటాడు.
పల్లవి కోపంతో, అవమానంతో “పేరంటానికి పిలిస్తే పిండం పెట్టినట్టుంది మీ వరస. మీరు చెప్పమంటే నేనెందుకు చెప్పాలి క్షమాపణ? నన్ను సపోర్ట్ చేయడానికి వచ్చి, ఇప్పుడు నన్నే సారీ చెప్పమంటున్నారు చూశారా డాడ్?” అని చక్రధర్ వైపు చూస్తుంది.
అప్పుడే అవని ముందుకు వచ్చి, “బాబాయ్ గారూ, మీరు కూడా మా అమ్మకి క్షమాపణ చెప్పిస్తే బాగుంటుంది. సారీతో ముగుస్తుంది. లేని పక్షంలో ఏం జరిగిపోతుందో ఎవరికీ తెలియదు కదా. ఇంకా ఏం ఏం విషయాలు బయటికి వస్తాయో” అని అంటుంది.

అది విన్న చక్రధర్ మనసులో “ఇపుడు నేను పల్లవిని సపోర్ట్ చేస్తే నాకే నష్టం. అందరి ముందు నిజం బయట పడొచ్చు ” అని భయపడతాడు. చక్రధర్ వెంటనే పల్లవితో సీరియస్‌గా “పెద్ద వాళ్లతో ఇలా మాట్లాడటం చాలా తప్పు. మీనాక్షి భర్త గురించి అలా మాట్లాడటం ఇంకా పెద్ద తప్పు. వెంటనే వెళ్లి సారీ చెప్పు!” అని గట్టిగా అంటాడు.
అతని గంభీర స్వరం విన్న పల్లవి ఒక్కసారిగా షాక్ అవుతుంది. “మీరు ఈ మాట చెప్పడానికే వచ్చారా? నేను చెప్పను” అని అంటుంది. దాంతో చక్రధర్ కోపంతో “నీకు నా మాట అంటే లెక్కలేదా? మర్యాదగా క్షమాపణ చెప్పకపోతే ఈవిడ నిన్ను కొట్టడం కాదు, అందరి ముందే నేను నిన్ను కొడతాను” అని హెచ్చరిస్తాడు.
ఇక చేసేది ఎం లేక చచ్చినట్టుగా పల్లవి ముందుకు వచ్చి, అందరి ముందు మీనాక్షికి క్షమాపణ అడుగుతుంది. మీనాక్షి సైలెంట్‌గా తల ఊపుతుంది. పల్లవి అవమానంగా ఫీలై అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

రాజేశ్వరి ఆ సమయంలో మీనాక్షిని చూసి, “నా కూతురు కూడా మీ కూతురు లాంటిదే. పెద్ద మనసుతో ఆమె చేసిన తప్పుని క్షమించండి” అని చెబుతుంది. మీనాక్షి సైలెంట్‌గా తల ఊపుతుంది.
అంతలా చక్రధర్ బయటికి వెళ్లడంతో అతని వెనకనే వెళ్లిన అవని చక్రధర్ తో “పల్లవితో క్షమాపణ చెప్పించి మంచి పని చేసారు. ఇపుడు ఎలా అయితే పల్లవితో క్షమాపణ చెప్పించావో ఎదో ఒక రోజు నువ్వు కూడా అలానే క్షమాపణ చెప్పే రోజు వస్తుంది. ఆరోజు నువ్వు మా అమ్మ కాళ్ళ మీద పడి అందరి ముందు నీ తప్పు ఒప్పుకుంటావు. అందుకే ఇపుడే ఒప్పుకుంటే నీకే మంచిది” అని హెచ్చరిస్తుంది. చక్రధర్ కూడా నీకు భయపడే మనిషిని కాదు నేను అని బెదిరిస్తాడు. అంతలోనే రాజేశ్వరి రావడంతో మాట మారుస్తారు. రాజేశ్వరి వచ్చి ఏం మాట్లాడుతున్నారు అని అడగ్గా చక్రధర్ “మన అమ్మాయి తప్పులను క్షమించి సరిదిద్దమని చెప్తున్నా” అని అంటాడు. రాజేశ్వరి కూడా నీ చెల్లి అనుకుని సరిదిద్దు అని అవనికి చెప్పి ఇద్దరు బయల్దేరుతారు.

ఇక బయటకి వెళ్లిన పల్లవి మాత్రం కోపంతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది. “నా తండ్రే నన్ను అవమానించాడు. నన్ను కొట్టిన వాళ్లకి క్షమాపణ చెప్పించాడు . ఎందుకు ఇలా మారిపోయాడు?” అని ఆలోచిస్తుంది.
అప్పుడు శ్రియ వచ్చి పక్కన నిలబడి “మీ డాడ్ నీ మీద అంత కోపంగా మాట్లాడాడు. నీతో క్షమాపణ చెప్పించాడు. ఈవిడ మీ డాడ్‌ని చూసిన తీరు కూడా వింతగా ఉంది. నాకు అనుమానం ఉంది — మీ డాడ్‌కి ఆ మీనాక్షితో ఏదైనా పాత సంబంధం ఉన్నట్టుంది. లేదంటే ఎవరో తెలియని మనిషికి నిన్ను ఎందుకు సారీ చెప్పమంటారు” అని చెబుతుంది.
పల్లవి కోపంగా “ఏయ్, పిచ్చి మాటలు మాట్లాడకు” అని అంటుంది. కానీ శ్రియ నవ్వుతూ “నాకేం పట్టింది. నువ్వే ఆలోచించుకో” అని వెళ్తుంది. ఆమె మాటలు పల్లవిని ఆలోచనలో పడేస్తాయి. “డాడ్‌కి మీనాక్షితో ఏదైనా సంబంధం ఉందా?” అని మనసులో అనుమానం మొదలవుతుంది.

ఇంకా చక్రధర్ ఇంటి దగ్గర రాజేశ్వరి భోజనం వడ్డిస్తూ చక్రధర్ పల్లవికి అలా బుద్ధి చెప్పడం గురించి సంతోషంగా ఫీల్ అవుతుంది. చక్రధర్ ని మెచ్చుకుంటుంది. చక్రధర్ మాత్రం మనసులో “అవనికి భయపడి పల్లవితో క్షమాపణ చెప్పించాను. ఈ మీనాక్షి గురించి ఎదో ఒకటి చేయాలి” అని అనుకుంటాడు.
అంతటితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది.
మరుసటి రోజు ఎపిసోడ్ ప్రోమో లో చక్రధర్ మీనాక్షిని రహస్యంగా కలుస్తాడు. ఆమెకు కొంత డబ్బు ఇచ్చి ఎవరికీ చెప్పకుండా అక్కడ నుండి వెళ్లిపొమ్మని చెప్తాడు. అదే సమయంలో అవని అక్కడికి వచ్చి ఇంకో 500 ఆ డబ్బు మీద పెట్టి వెళ్లిపొమ్మని చెప్తుంది. ఆటోలో వెళ్తున్న పల్లవి ఆ దృశ్యం చూస్తుంది. చక్రధర్ మరియు మీనాక్షి మధ్య ఉన్న సంబంధం మీద అనుమానంతో ఇంటికి వెళ్లి చక్రధర్ ని అడుగుతుంది
Source inspiration: Original story from “ఇంటింటి రామాయణం” (JioHotstar). This is a personal written recap and interpretation.

