కార్తీక దీపం Nov 1st, 2025 శనివారం ఎపిసోడ్ : సుమిత్ర చెప్పిన నిజం ….శివన్నారాయణ కుటుంబంలో సెలెబ్రేషన్స్ … !!!
ఈ రోజు ఎపిసోడ్ పారిజాతం, జ్యోత్స్న మధ్య సన్నివేశంతో మొదలవుతుంది. పారిజాతం తనకు సపోర్ట్ ఇవ్వలేదని జ్యోత్స్న అసహనం వ్యక్తం చేస్తుంది. ఆమెకు ముందే చెప్పి ఉంటే ఏదైనా చేయగలిగేదాన్ని అని చెబుతుంది. అందుకు పారిజాతం — మనకు కావలసిన స్థానం పొందాలంటే మంచిదానిలా కనిపించాలనేది అర్థం చేసుకోవాలి అని చెబుతుంది. ఇంటి వారసురాలిగా గుర్తింపు కావాలంటే అందరికీ నచ్చేలా మెలగాలని చెప్తుంది.
పారిజాతం తరువాత జ్యోత్స్నకు చెబుతుంది — మీ అమ్మ ఇక్కడకు రావడం అంటే ఆమె మనసు మార్చుకుందని అర్థం. నీ తల్లిదండ్రులు మళ్లీ కలిశారు. కానీ ఆమె వెళ్ళేటపుడు నువ్వు చూసావు అన్న విషయం మీ అమ్మకు తెలియదు. అది సుమిత్రకి వాళ్ళు చెప్పే లోపు నువ్వు వెళ్లి నీలోని బాధను చూపించాలి. నువ్వు ఎంత బాధ పెద్దవో మీ అమ్మకి తెలియాలి. అప్పుడు నువ్వు చేసిన తప్పులు కొంత అయినా తగ్గుతాయి. వెళ్లి మీ అమ్మను కౌగిలించుకో అని చెబుతుంది.

ఇంతలో కార్తీక్, సుమిత్ర ఇంటికి వచ్చిన విషయం స్వప్నకు సందేశంగా పంపుతాడు. ఆ వార్త తెలుసుకున్న కాశీ ఆనందపడతాడు, మనం కూడా అక్కడికి వెళ్దాం అని అడుగుతాడు. కానీ కావేరి అడ్డుకుంటూ — అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదని చెబుతుంది. కాశీ అంగీకరించి బయటికి వెళ్తాడు.
అప్పుడే స్వప్న కావేరిని అడుగుతుంది — “ఎందుకు అలా అన్నావ్? నాన్నతోపాటు అందరూ అక్కడే ఉన్నారు కదా. నాన్నను నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత మనం ఎప్పుడూ అజ్ఞాతంలోనే ఉన్నాము, ఆయన మనకంటే ఆ కుటుంబానికి ప్రాధాన్యం ఇచ్చారు కదా ” అని.
దానికి కావేరి స్వప్నతో — మీ నాన్నకు అప్పటికే కొడుకు ఉన్నాడని తెలిసినా నేను మీ నాన్నని పెళ్లి చేసుకున్నాను. కాంచన అక్క నా గురించి తెలిసినపుడు తన భర్తను నాకు ఇచ్చేసింది. ఎన్నో మాటలు , అవమానాలు పడింది అని చెబుతుంది. ఏ పరిస్థితుల్లోనైనా ఈ ఇంట్లో పెద్ద అక్క కుటుంబానికి మొదటి ప్రాధాన్యం ఉంటుంది. అది మీ నాన్న ఇవ్వకపోయినా నేను ఇస్తాను అని అంటుంది. కానీ నాకు కూడా ఒక ఆశ ఉంది — వాళ్లతోపాటు నేను నిలబడే చోటు లభిస్తే చాలు. అయితే నేను ముందుకు వస్తే అక్క గౌరవం తగ్గిపోతుంది కాబట్టి అలా చేయలేకపోతున్నాను అని చెబుతుంది. స్వప్న ఆమె మాటలు విని కదిలిపోతుంది, ఆమెను హత్తుకుని ధైర్యం చెబుతుంది.

ఈ మాటలన్నీ బయట నుండి కాశీ వింటాడు. మన మధ్య దూరాలు ఉన్నా వాళ్లు మనవాళ్లే, వాళ్లు సంతోషంగా ఉంటే మనం కూడా సంతోషంగా ఉన్నట్టే అని అంటాడు.
ఇంకొవైపు, పారిజాతం జ్యోత్స్న బాధను చూపిస్తూ చిన్న నాటకం ఆడుతుంది. కార్తీక్ పంచులు వేస్తుంటాడు . శ్రీధర్ జ్యోత్స్నతో మాట్లాడుతూ — “నువ్వు కేసులు వేస్తేనే ప్రేమ చూపిస్తున్నట్టు ఉందే” అని చెబుతాడు. జ్యోత్స్న మాత్రం — తన బాధను ఎవరూ అర్థం చేసుకోకపోయినా అమ్మకు అర్థమైతే చాలు అని సమాధానం ఇస్తుంది. శ్రీధర్ తరువాత సుమిత్రని అడుగుతాడు — “ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావ్? కార్తీక్ ని, బావను ఎలా కలిశావ్?” అని. సుమిత్ర అప్పుడు నిజం చెబుతుంది — ఇంటి నుంచి వెళ్ళిపోయినప్పుడు చనిపోవాలి అనే ఆలోచనతో బయలుదేరానని, జీవించడానికి కారణం లేకపోయిందని చెబుతుంది. ఆ సమయంలో దీప తనను రక్షించిందని, ఆమె లేకపోతే తన ప్రాణం పోయేదని చెబుతుంది. జరిగింది చెప్తూ స్పృహ కోల్పోయిన సుమిత్రని దీప మా ఇంటికి తీసుకు వచ్చింది అని కార్తీక్ అంటాడు.
దానికి శ్రీధర్ — “అందుకేనా ఆ రోజున నన్ను ఇంటి నుంచి పంపించావ్?” అని అడుగుతాడు.
జ్యోత్స్న కోపంగా తాతతో వాళ్ళ ఇంట్లోనే అమ్మ ఉన్నా తాము వెతుకుతున్నట్టు నటించడం మోసం కాదా అని ప్రశ్నిస్తుంది. బయట దాన్ని కిడ్నాప్ అంటారు కదా అని అంటుంది. అందుకే వాళ్ళ ఇంటికి పోలీసులను తీసుకు వెళ్ళాను అని చెప్తుంది. దానికి సుమిత్ర సమాధానంగా — “నిన్ను ఎవరు తీసుకెళ్లమన్నారు? నేను చెప్పానా?” అని అడుగుతుంది. దానికి జ్యోత్స్న మరి ఎందుకు నువ్వు వాళ్ళ దగ్గరే ఉన్న విషయం దాచిపెట్టారు అని అడుగుతుంది. సుమిత్ర చెబుతుంది — “నేనే వాళ్లకు చెప్పొద్దని మాట తీసుకున్నాను.”
తర్వాత సుమిత్ర చెప్పిన నిజం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఆమె చెబుతుంది — దీపను నేనే నిజం దాచి పెట్టమని చెప్పాను, ఎవరికి చెప్పొద్దు అని ఒట్టు వేయించుకున్నాను అని. నిజానికి ఆమె మంచి పని చేసిందని, తానే ఈ పరిస్థితులకు కారణమని అంగీకరిస్తుంది. దీపని ఎవరు ఏమీ అనొద్దని చెప్తుంది. అందరూ సైలెంట్ అవుతారు.
శ్రీధర్ జ్యోత్స్నను చూస్తూ — “ఇప్పుడు అర్థమైందా మేనకోడలా? నా భార్యకు క్షమాపణ చెప్పు. మామూలుగా అయితే నిన్ను అరెస్ట్ చేయించేవాడిని, కానీ కుటుంబం గౌరవం కోసం వదిలేస్తున్నాను” అని చెబుతాడు. జ్యోత్స్న సైలెంట్‌గా తలవంచుతుంది.

కార్తీక్ చెబుతాడు — “సుమిత్ర, దీప ఇద్దరూ ఒకరినొకరు కాపాడుకున్నారు, వాళ్ళ మధ్య తీర్చుకోవాల్సిన ఋణం అది అని అంటాడు. ఇపుడు అంత బాగానే ఉంది కదా అది చాలు సారీ చెప్పే అవసరం లేదు” అని. అందరూ సంతోషంగా చూస్తారు.
తర్వాత ఇంట్లో చిన్న వెడ్డింగ్ సెలబ్రేషన్ వాతావరణం ఉంటుంది. కార్తీక్ కేక్ తీసుకొచ్చి వేడుక జరుపుతాడు. దశరథ్ నవ్వుతూ — “ఇదంతా అత్త మీద ప్రేమే” అని అంటాడు.
కార్తీక్ కూడా — “చిన్నప్పుడు అమ్మ నాన్న 2 – 3 నెలలు ఊరు వెళ్తే సుమిత్ర అత్త నన్ను అమ్మలా చూసుకుంది. అమ్మ వచ్చాక కూడా నేను అత్త దగ్గరే ఉంటాను అంటే తాత నాతో వాళ్ళు జ్యోత్న్స అమ్మ నాన్న, వీళ్ళు మీ అమ్మ నాన్న అని చెప్పాడు. అలాంటి అత్త ఉన్నందుకు నేను చాలా రుణపడి ఉన్నాను” అని అంటాడు.
అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.
Source inspiration: Original story from “కార్తీక దీపం” (JioHotstar). This is a personal written recap and interpretation.
