కార్తీక దీపం Nov 3rd, 2025 సోమవారం ఎపిసోడ్ : జ్యోత్స్నకి షాక్ ఇచ్చిన సుమిత్ర మాటలు…!!! దీప మీద సుమిత్ర కోపం పోయినట్టేనా … ???
తాజా ఎపిసోడ్లో కార్తీక్ మనసులో తన అత్త మీద ఉన్న కృతజ్ఞతా భావం గురించి అందరికి చెప్తూ తనకి కన్నతల్లి లాంటి ప్రేమను పంచిన అత్తకు రుణపడి ఉన్నానని, అది ఈ జన్మలో కొంత అయినా తీర్చుకోగలిగితే చాలు అని అంటాడు. ఆ మాట విన్న పారిజాతం ఆశ్చర్యపడి “ఇదంతా నీకు ఎవరు చెప్పారు?” అని అడుగుతుంది. దాంతో కార్తీక్ “తాత చెప్పాడు” అంటాడు. అన్నీ మానవడికే చెప్తాడు అని పారిజాతం అంటుంది. వెంటనే శివన్నారాయణ చమత్కారంగా “మనవడికే కాదు, మనవరాలికీ చాలానే చెప్పాను, కానీ ఎవరికీ కావాల్సినవి వాళ్ళు వింటారు” అంటూ సెటైర్లు వేస్తాడు. అందరూ నవ్వుతారు. ఆ క్షణంలో జ్యోత్స్న మాత్రం భయంతో ఉంటుంది — బావకి, దీపకి ఎక్కడ నిజం తెలిసిపోయిందోనని అనుమానం ఆమెను కుదిపేస్తుంది.
అంతలో కార్తీక్ కేక్ కట్ చేయడానికి ముందు మరో చిన్న సెలబ్రేషన్ ఉందని ప్రకటిస్తాడు. దశరథ, సుమిత్రలకు దండలు మార్చుకునే వేడుక ఏర్పాటు చేస్తాడు. పారిజాతం ఆశ్చర్యపడి “అన్నంత పనీ చేశావు” అని అంటుంది. దీప కూడా మద్దతుగా “మా బావ చెప్పినది తప్పకుండ చేస్తాడు” అంటుంది. జ్యోత్స్న మాత్రం టెన్షన్‌తో ఏదో మాట్లాడుతుంటే, పారిజాతం ఆమెను కవర్ చేస్తూ “నాలుగు రోజులుగా టెన్షన్లో ఉందే, అందుకే అలా మాట్లాడింది” అంటుంది.

దండలు మార్చుకునే ముందు కార్తీక్ “ముందుగా మీ ఇద్దరూ మనసులోని మాట చెప్పండి” అని కోరతాడు. కార్తీక్ సరదాగా “పెళ్లి పాట పాడతావా?” అని పారిజాతాన్ని అడుగుతాడు. వెంటనే శివన్నారాయణ “ఇప్పుడు కావాలి అని ప్రమాదాన్ని ఆహ్వానించొద్దు” అని సెటైర్లు వేస్తాడు.
ఇదిలా ఉండగా సుమిత్ర మాట్లాడుతూ “మనిషి శరీరంలో ప్రాణం గుండెలో ఉందని అంటారు, కానీ నిజానికి ఊపిరిలోనే ప్రాణం ఉంటుంది. భార్యకు భర్తే ఊపిరి. అలంటి భర్త ఒక్క కఠినమైన మాట అంటే చాలు ఆ ఒప్పిరి ఆగిపోతుంది” అని చెప్పి దశరథ మెడలో దండ వేస్తుంది. దానికి ప్రతిస్పందనగా దశరథ “మాటలతో కానీ, చేతలతో కానీ ఇక మళ్లీ నిన్ను బాధపెట్టను. కన్నీళ్ల బరువు ఏడ్చేవారికే కాదు, మోసేవారికీ తెలుసు. ఆ బరువును ఈ రెండ్రోజులుగా మోశాను” అని తన మనసు విప్పి చెబుతాడు. చివరగా “నా భార్య, నా మేనల్లుడు దగ్గర నా బాధ దించుకున్నాను” అని చెబుతూ తన భార్య మెడలో దండ వేస్తాడు. అపుడే శ్రీధర్ “ఒక్క మాటతో చెల్లెలి మనసు గెలిచేశావు” అని దశరథను అభినందిస్తాడు.
దాంతో కార్తీక్ వారిద్దరితో కేక్ కట్ చేయిస్తాడు. ఆ సందర్భంలో జ్యోత్స్న మాత్రం దూరంగా నిలుస్తుంది. పారిజాతం “ఇలా ఎందుకు పరాయి దానిలా దూరంగా ఉన్నావు?” అని అడిగితే, జ్యోత్స్న “పరాయి దానినేగా దూరంగానే ఉంటాను” అని చిరాగ్గా సమాధానం ఇస్తుంది.
కార్తీక్ సుమిత్ర, దశరథ లను ఒకరికి ఒకరు కేక్ తినిపించుకోవాలని కోరతాడు. దానికి దశరథ ప్రేమతో “మమ్మల్ని మళ్లీ కలిపింది మీరే, కాబట్టి మీకు ముందుగా కేక్ తినిపించాలని అనుకుంటున్నాను” అంటాడు. కానీ దీప “ముందు జ్యోత్స్నకి పెట్టండి” అని చెబుతుంది. దశరథ సంతోషంగా “ఆమె నా కూతురే కావచ్చు కానీ కొన్ని సార్లు రక్తబంధం కాదు, ప్రేమబంధమే నిజమైన అర్హతను నిర్ణయిస్తుంది. నువ్వు, కార్తీక్ బాధ్యత తీసుకుని ఈ ఇంటి బాధని పోగొట్టారు, ఈ రోజు మా పెళ్లి రోజు జరుపుకుంటున్నాం అంటే కారణం మీరే” అని దీప, కార్తీక్ లకి కేక్ తినిపిస్తారు. ఆ మాటలు జ్యోత్స్నను కుదిపేస్తాయి.

ఆ సమయంలో దీప ఎమోషన్ చూసి తనలో తాను “దీపకి అసలు విషయం తెలిసిపోయిందా?” అని జ్యోత్స్న కలవరపడుతుంది. అందరు దీప, కార్తీక్ లను అభినందించి, సుమిత్ర, దశరథ లకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియచేస్తారు. జ్యోత్స్న వెంటనే “భార్యాభర్తల్ని కలిపేంత సమర్థత ఉంటే, అత్త మామయ్యల్ని ఎందుకు కలపలేకపోయారు?, కనీసం ప్రయత్నం అయినా చేశాడా ” అని అడగటంతో అందరూ షాక్ అవుతారు.
శివన్నారాయణ కోపంతో “నీకు వాళ్ళు కలిసి లేరు అని ఎవరు చెప్పారు?” అని నిలదీస్తాడు. కానీ జ్యోత్స్న తడబడకుండా “వాళ్లు కలసి లేరు కదా?” అని ప్రశ్నిస్తుంది. దాంతో శివన్నారాయణ జ్యోత్స్న వైపు తిరిగి “పెళ్లికి, సత్యనారాయణ వ్రతానికి నీ మామయ్య అత్తతోనే వచ్చాడా లేదా? ఇప్పుడు ఇక్కడ కలిసి ఉనాన్ర లేదా ? ” అని అడుగుతాడు. జ్యోత్స్న “ఇద్దరూ కలిసే వచ్చారు” అని చెప్తుంది. అప్పుడు శ్రీధర్ స్పష్టంగా “నేను, కాంచన వేరు అని ఎప్పుడూ అనుకోలేదు. మేమంతా ఒకటే” అని తేల్చి చెబుతాడు. ఆ మాట విన్న కాంచన ఎమోషనల్ అవుతుంది.
శివన్నారాయణ జ్యోత్స్నపై మండిపడి “ఇదంతా నీ వల్లే కదా జరిగిందంతా. మాట్లాడే ముందు అలోచించి మాట్లాడితే నీ అజ్ఞానంతో ఇలాంటి ప్రశ్నలు వేయకుండా untavu ” అని గట్టిగా బుద్ది చెప్తాడు. అందరు అక్కడ నుండి వెళ్ళగానే జ్యోత్స్న తల్లి సుమిత్రతో నువ్వు కూడా దీప చేసిన తప్పుని మర్చిపోయావా అని అడుగుతుంది. దానికి సుమిత్ర “నీ ప్రవర్తన వల్లే నీ నాన్నతో దూరం పెరిగింది. బోర్డ్ మీటింగ్ తర్వాత నువ్వు చేసిన గొడవ వల్లే నీ డాడీ రియాక్ట్ అయ్యాడు.” అని చెబుతుంది. జ్యోత్స్న నేను మిమ్మల్ని కలపడానికి ఒక ప్రయత్నం చేశాను డాడీ ఆలా రియాక్ట్ అవుతాడు అని నాకు అసలు తెలీదు అని అంటుంది. దానికి సుమిత్ర “నువ్వు ఏమి చిన్న పిల్లవి కాదు ఇలా మాట్లాడటానికి. నీ వల్లే మేము దూరం అయ్యాము అని నీకు తెలిసిన కూడా తప్పు అంత దీపదే అని అంటున్నావు. నేను ఇంటి నుండి వెళ్లడం నువ్వు చూసి కూడా నన్ను ఆపలేదు. ” అని అంటుంది.

దానికి జ్యోత్స్న సమర్ధించుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ సుమిత్ర వినకుండా “ఒకప్పుడు దీప ప్రాణాలు పణంగా పెట్టి నన్ను కాపాడింది, ఇప్పుడు కూడా ఆమే నన్ను కాపాడింది. నువ్వు నన్ను వదిలేశావు కానీ దీప నేను తనని అసహ్యించుకుంటున్న కూడా నన్ను వదల్లేదు” అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ మాటలతో జ్యోత్స్నకు గట్టి షాక్ తగులుతుంది.
ఇంతలో పారిజాతం అక్కడికి వచ్చి వ్యంగ్యంగా “ నీకు ఒక సలహా ఇస్తున్న. నువ్వు యువరాణిలా ఆస్తి మొత్తం సొంతం చేసుకుంటావనుకున్నాను. కానీ మీ అమ్మ మాటలు విన్న తర్వాత నువ్వు ఈ ఇంటి వారసురాలు కాదని తెలిసే రోజు దగ్గర్లోనే ఉంది అనిపిస్తుంది” అని చెబుతుంది. ఆ మాట విన్న జ్యోత్స్న భయంతో వణికిపోతుంది.
అంతటితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది.
Source inspiration: Original story from “కార్తీక దీపం” (JioHotstar). This is a personal written recap and interpretation.
