కార్తీక దీపం: Oct 29th wednesday episode: దీపని అరెస్ట్ చేయించిన జ్యోత్స్నా !!!!!
గత ఎపిసోడ్లో పారిజాతం జ్యోత్స్నకి “మీ అమ్మని వెతికి, నీ నాన్న తాతల దగ్గర మంచి పేరు తెచ్చుకో” అని చెబుతుంది. కానీ జ్యోత్స్న మాత్రం మమ్మీ ఎక్కడుందో బావకి తెలిసి ఉండొచ్చని, తాత ప్రవర్తన కూడా మారిందని అనుమానం వ్యక్తం చేస్తూనే “ఇంకా ఆలస్యం చేస్తే కార్తీక్ దీప మల్లి ఇంట్లో అందరి దగ్గర గొప్ప అయిపోతారు అని మా అమ్మని నేనే వెతికి తెస్తా” అని సీరియస్‌గా చెబుతుంది. తాత మనవళ్లు కలిసి సైగ చేసుకోవడం పారిజాతం చూస్తుంది. ఇక కాశీ విషయానికి వస్తే, జాబ్ లేకపోయినా పనిచేస్తున్నట్లు నటించడం శ్రీధర్‌ను కోపగించేస్తుంది. నిజం చెప్పేసిన కాశీ, స్వప్న ముందు అవమానం తప్పించుకోవాలని ప్రయత్నిస్తాడు. ఇదే సమయంలో సుమిత్ర కనిపించకపోవడంతో జ్యోత్స్న పోలీసులను తీసుకుని దీప ఇంటికి చేరి, “మా మమ్మీని కిడ్నాప్ చేసింది” అంటూ ఫిర్యాదు చేస్తుంది. గుడికి వెళ్లిన సుమిత్ర అక్కడ దశరథ, కార్తీక్‌లను చూసి ఆశ్చర్యపోతుంది.
ఇక అక్టోబర్ 29న ప్రసారమైన 501వ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే చూద్దాం.
దీప ఇంట్లో సుమిత్ర కనపడకపోవడంతో జ్యోత్స్న కోపంతో ఉడికిపోతుంది. “మా మమ్మీని ఎక్కడ దాచావు? నిజం చెప్పు” అని అరుస్తుంది. దీప కూడా వెనక్కి తగ్గకుండా, “కళ్ల ముందు వెళ్లిపోయిన తల్లిని ఇప్పుడు ఎక్కడ వెతుకుతావు?” అంటూ కౌంటర్ ఇస్తుంది. జ్యోత్స్న బెదిరిస్తే, “నేను నీ ఇంటి పనిమనిషిని కాదు” అని దీప సూటిగా చెబుతుంది. జ్యోత్స్న కోపంతో చెయ్యెత్తగానే, కాంచన ఆపుతూ “నా కోడలే నాకు ఎక్కువ” అని గట్టిగా చెబుతుంది.
అత్తగా ఉన్న గౌరవం ఉంటే పోలీసులతో రాలేదని కాంచన తేల్చి చెబుతుంది. “నేను నిన్ను చూసిపోవడానికి రాలేదు, నీ కోడల్ని తీసుకుపోవడానికి వచ్చాను” అని జ్యోత్స్న అంటుంది. దీప కిడ్నాప్ చేసిందని, ఈ ఇంట్లోనే ఎక్కడో దాచిందని పోలీసుల ముందే చెబుతుంది. “కార్తీక్‌కి ఫోన్ చేయి, వెంటనే ఇంటికి రావాలని చెప్పు” అని జ్యోత్స్న దీపను డిమాండ్ చేస్తుంది. కానీ కార్తీక్ ఫోన్ ఎత్తకపోవడంతో కాంచన, దీప ఇద్దరూ ఆందోళన చెందుతారు.

“మా మమ్మీ కనిపించకపోవడానికి దీపే కారణం, నేను పోలీసులకు కంప్లయింట్ ఇచ్చా” అని జ్యోత్స్న చెప్పగానే, దీపతో పాటు కాంచనకూ షాక్ తగులుతుంది. జ్యోత్స్న పోలీసులకు చెబుతుంది — “దీప మా డాడీని గన్‌తో షూట్ చేసింది, మా మమ్మీతో తగవు పెట్టుకుంది, ఇంకా కోర్టులో కేసు నడుస్తోంది” అని.
దాంతో పోలీసులు దీపను అరెస్ట్ చేయబోతుండగా, కాంచన ముందుకు వచ్చి “ముందు నన్నే అరెస్ట్ చేయండి. ఇది నా ఇల్లు, నా కొడుకు అందుబాటులో లేడు, కాబట్టి బాధ్యత నా మీదే” అని చెబుతుంది. “జ్యోత్స్న తన పరపతి చూపించింది, ఇప్పుడు నా నిజాయితీ చూపించాలి” అని అంటుంది కాంచన. వెంటనే పోలీసులు దీపను అరెస్ట్ చేస్తారు.
ఇక ఆఫీస్‌లో కాశీ హడావుడిగా తిరుగుతుంటాడు. స్వప్న అనుమానం వ్యక్తం చేస్తూ “నువ్వు ఏదో దాచేస్తున్నావు, నిన్న మా నాన్న కాళ్లు ఎందుకు పట్టుకున్నావు?” అని అడుగుతుంది. కాశీ వెంటనే “ఆఫీస్‌లో అందరూ మెచ్చుకున్నారు, అందుకే మావయ్య ఆశీర్వాదం తీసుకున్నా” అంటూ అబద్ధాన్ని కప్పేస్తాడు. “అది ముందే చెప్పొచ్చు కదా” అని స్వప్న సర్దుకుంటుంది. కానీ కాశీ మాత్రం మనసులో బాధతో, “నిజం తెలిసేలోపు ఉద్యోగం దొరకాలి” అని బాత్రూమ్లో బాధపడతాడు.
ఇక గుడి సన్నివేశంలో — దశరథ బాధతో కూర్చుంటాడు. “నీ అత్తయ్యతో నాకు పెళ్లయినప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ గుడికే వచ్చేవాళ్లం” అని కార్తీక్‌కి చెబుతాడు. “ఆ ఆలోచనతోనే ఈసారి నేనొచ్చాను, కనీసం ఆ జ్ఞాపకంతో ఆమె కూడా వస్తుందేమో” అని ఆశతో చెబుతాడు.
కార్తీక్ చెబుతాడు — “మీ అత్తయ్య నీ మీద ప్రేమతో ఖచ్చితంగా వస్తుంది” అని. దశరథ మాత్రం బాధతో “అంత ప్రేమ ఉంటే వదిలి వెళ్లేది కాదు” అని అంటాడు. “తప్పును క్షమించకపోవడం మూర్ఖత్వం, నేను ఆ మూర్ఖుడినే” అని ఒప్పుకుంటాడు. “దీప మీద కోపంతో అత్త తాళి తీసింది కానీ గౌరవం మాత్రం తగ్గలేదు” అని కార్తీక్ చెబుతాడు. దశరథ స్పందిస్తూ, “నా భార్య నన్ను అర్థం చేసుకోలేదనే బాధే ఎక్కువ” అని అంటాడు.
గుడిలో వెలుగుతున్న దీపాల్ని చూసి, “బతుకు అంతా భార్యాభర్తలు కలిసి బతకడమే” అని అంటాడు దశరథ. ఆ సమయాన రెండు ఒత్తుల్లో ఒకటి ఆరిపోతే, ఆయన గబగబా “సుమిత్రకు ఏం కాలేదా?” అని ఆందోళన చెందుతాడు. “మీ అత్తయ్యకి ఏమైనా అయితే నేను బ్రతకలేను” అని చెబుతాడు. వెంటనే రెండు దీపాలు మళ్లీ వెలగడంతో ఆనందపడతాడు. “ఒక జ్యోతి ఆరిపోతే, రెండో జ్యోతి ఓపికగా ఎదురుచూసింది — అదే మీ ప్రేమ” అని కార్తీక్ చెబుతాడు. ఇడి అంతా సుమిత్ర గుడిలోకి పక్కన దాగి చూస్తూ ఉంటుంది. సుమిత్ర ని కార్తీక్ చూడటంతో ఎపిసోడ్ అయిపోతుంది.
సుమిత్ర దశరథ కలుస్తారా లేదా తర్వాత ఎపిసోడ్ లో చూడాలి.

