కార్తీక దీపం ఎపిసోడ్ ఏప్రిల్ 29, 2026 బుధవారం ఎపిసోడ్: జ్యోత్స్నకి షాక్ ఇచ్చిన పారు, కార్తీక్ …!!!
ఇవాళ ఎపిసోడ్లో ముందుగా కార్తిక్ – దీప – పారిజాతం కలిసి జ్యోత్స్నని ఆపడానికి ఒక ప్లాన్ సిద్ధం చేసుకుంటారు. జ్యోత్స్న ఇలానే ఉంటే బయట వాళ్లకు కూడా ఆమె కోరికలో న్యాయం ఉన్నట్టు అనిపించే ప్రమాదం ఉందని కార్తిక్ చెబుతాడు. అందుకే ఆమె అసలు ఉద్దేశం అందరికీ బయటపడేలా చేయాలని నిర్ణయిస్తారు. దీప కోసం కార్తిక్ ఒక చీర కొనాలని, ఆ చీరను జ్యోత్స్న చేతిలో పడేలా చేసి, ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో అందరికీ చూపించాలని ప్లాన్ చేస్తారు. పారిజాతం కూడా దీనికి అంగీకరిస్తూ, ఈ ఆటకు ముగింపు పెట్టాలని అంటుంది.
ఇదిలా ఉండగా, మరోవైపు జ్యోత్స్న బయట ఒక షాప్‌కి వెళ్తుంది. అక్కడ ఒక గిఫ్ట్ నచ్చి కొనాలని చూస్తుంది. కానీ అదే గిఫ్ట్‌ను ఇంకొక కస్టమర్ తీసుకున్నాడని తెలుసుకుంటుంది. అతనితో మాట్లాడి, డబ్బు ఎక్కువ ఇస్తానని చెప్పి కూడా ఆ గిఫ్ట్ తీసుకోవాలని ప్రయత్నిస్తుంది. అయితే ఆ వ్యక్తి మాత్రం “నచ్చినది డబ్బుతో కొనలేం” అని చెప్పి తిరస్కరిస్తాడు. ఎంత ఒత్తిడి చేసినా, ఎంత డబ్బు ఆఫర్ చేసినా ఇవ్వకుండా వెళ్లిపోతాడు. జ్యోత్స్న మాత్రం కోపంతో అక్కడి నుంచి వెళ్తుంది.
ఇక ఇంట్లో పారిజాతం ఆ చీరను తీసుకుని చూస్తూ ఉండగా, జ్యోత్స్న అక్కడికి వస్తుంది. ఇద్దరి మధ్య మళ్లీ మాటల తగవు మొదలవుతుంది. ఆ చీర దీప కోసం తీసుకున్నదని పారిజాతం చెప్పడంతో, జ్యోత్స్న దానిని లాక్కుంటుంది. “ఎవరికోసం తెచ్చినా, చివరికి అది నాదే అవుతుంది” అని చెప్పి, అదే చీర కట్టుకుని కార్తిక్ ముందుకెళ్తానని అంటుంది. పారిజాతం మాత్రం ఇది వాళ్ల ప్లాన్‌లో భాగమే అని ఆనందపడుతుంది.
ఇదిలా జరుగుతుండగా, కార్తిక్ ఇంట్లో పెళ్లి చూపుల ఏర్పాట్లు చేస్తాడు. జ్యోత్స్నకి సంబంధం చూసి, అబ్బాయి ఇంటికే వచ్చేటట్లు ఏర్పాట్లు చేస్తాడు. కుటుంబ సభ్యులందరికీ ఇది ఒక్కసారిగా జరిగినట్టు అనిపించినా, కార్తిక్ మాత్రం ముందుగానే అన్నీ ప్లాన్ చేసినట్టుగా మాట్లాడుతాడు. అబ్బాయి వినోద్ వచ్చి అందరితో మాట్లాడుతాడు. అతని ప్రవర్తన చూసి ఇంట్లో వాళ్లు కూడా గమనిస్తారు.
ఇక చివరగా జ్యోత్స్న ఆ చీర కట్టుకుని కిందికి వస్తుంది. అక్కడ పెళ్లి కొడుకు కూర్చున్నాడని చూసి ఆశ్చర్యపోతుంది. కార్తిక్ మాత్రం ఆమె ముందే స్పష్టంగా చెబుతాడు—తనకు ఇచ్చిన బాధ్యత ప్రకారం, ఆమె కోసం మంచి సంబంధం చూసి తీసుకువచ్చానని. దీప కూడా అదే విషయాన్ని గుర్తు చేస్తుంది. జ్యోత్స్నకి ఇది అర్థం కావడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోతుంది.
ఈ ఎపిసోడ్ చూస్తే కార్తిక్ ఈసారి పూర్తిగా ప్లాన్ చేసి ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తోంది. జ్యోత్స్నను ఆపడానికి సింపుల్‌గా కాకుండా, అందరి ముందే నిజం బయటపడేలా చేసే ప్రయత్నం చేస్తున్నాడు. జ్యోత్స్న మాత్రం ఎక్కడైనా తనదైన స్టైల్లోనే రియాక్ట్ అవుతోంది. షాప్ సీన్లో కూడా అదే కనిపించింది. ఇప్పుడు పెళ్లి చూపుల దగ్గర ఆమె ఎలా స్పందిస్తుందో చూడాలి. ఈ ప్లాన్ నిజంగా వర్కౌట్ అవుతుందా లేక మళ్లీ ఏదైనా తిప్పి కొడుతుందా అనేది రేపటి ఎపిసోడ్లో క్లారిటీ వచ్చేలా ఉంది.
