కార్తీక దీపం Nov 4th, 2025 మంగళవారం ఎపిసోడ్ : సుమిత్ర, దశరథ ల కూతురు స్థానంలో దీపకు దక్కిన ఆనందం… !!!!
పారిజాతం జ్యోత్స్నతో కొంచెం వెటకారంగా — “జ్యోత్స్నా, నేను ఇప్పటి వరకు నువ్వు ఈ ఇంటి వారసురాలిగా ఈ ఆస్తి మొత్తం పొందుతావు అనుకున్నాను. సుమిత్ర మాటలు విన్న తర్వాత నేను నిన్ను తిట్టడం మానేసి ఒక సలహా ఇవ్వాలి అనుకుంటున్నా త్వరలో అందరికీ నువ్వు ఈ ఇంటి నిజమైన వారసురాలు కాదన్న విషయం తెలిసిపోతుంది. పుట్టినప్పుడు పిల్లలను మార్చింది నేనే కాబట్టి ఆ విషయం బయటపడితే నన్ను ఇంటి నుండి పంపిస్తారో, లేక కేసు వేస్తారో నాకు తెలియదు. ఈ ఇంట్లో ఉన్నది అసలు వారసులు కాదు. అందుకే దాసును పిలిచి నీ కూతుర్ని తీసుకెళ్లమంటాను. కానీ అలా జరిగితే నీకు ఈ ఆస్తితో ఎలాంటి సంబంధం ఉండదు. పాత సినిమాల్లోలాగా ఇంటినుంచి పారిపోయిన అమ్మాయిని సంవత్సరాల తర్వాత తీసుకువచ్చి మొత్తం ఆస్తీ ఆమెకే ఇచ్చినట్టు, దాసు నిజం చెబితే, అందరూ ఆ నిజమైన వారసురాలి కోసం వెతకడం మొదలుపెడతారు. అదృష్టం బాగుంటే ఆస్తంతా ఆమెకే వెళ్తుంది, వంటింట్లో పాత పాత్రలు మాత్రం మనవి అవుతాయి. ఇక నువ్వు ఏసీ కార్లలో తిరగలేవు, నీ సర్టిఫికెట్లు పట్టుకుని సిటీ అంత ఉద్యోగం కోసం తిరగాల్సి వస్తుంది. ఎందుకంటే దాసుకి నాలుగు జుబ్బాలు తప్ప డబ్బులుండవు.”
జ్యోత్స్న కాస్త ఆవేశంగా, “చిన్నగా మాట్లాడు గ్రానీ” అని అంటుంది. పారిజాతం “ఇక నేను మాట్లాడేది లేదు. నా మాట విను, త్వరగా పెళ్లి చేసుకో. కొంచం అయినా సేఫ్ గా ఉంటావు” అని చెప్తుంది. జ్యోత్స్న “నాకు తెలుసు ఏమి చేయాలో” అని సమాధానమిచ్చి వెళ్ళిపోతుంది.

అంతలో శ్రీధర్ దశరథతో , “బావగారు కార్తిక్ మీకు నచ్చే వంటలన్నీ తెప్పించాడు,” అని అంటాడు. దీప తన మనసులో, “ఎన్నాళ్లైంది అమ్మానాన్నలు పక్కపక్కన కూర్చొని భోజనం చేసి” అని అనుకుంటుంది. కార్తిక్‌కి జ్యోత్స్న మాటలు గుర్తుకు చేసుకుంటాడు — “నువ్వూ నీ తల్లిదండ్రులు కలసి ఉండాలని కోరుకోలేదా”. జ్యోత్స్న మాటలు విన్నాక అమ్మ ఎంతో బాధపడి ఉంటుంది అని తనలో తానే అనుకుంటాడు.
దీపా కార్తిక్‌ను ఏం ఆలోచిస్తున్నావ్ అని అడగగా కార్తిక్ సమాధానంగా, “నా తల్లిదండ్రులు కలిసి భోజనం చేశారు గాని ఎప్పుడూ పక్కపక్కన కూర్చోలేదు,” అని అంటాడు. దీప “మన మనసులు ఎప్పుడు ఒక్కటిగా ఆలోచిస్తాయి” అని చెప్తుంది.
అప్పుడే శివన్నారాయణ పక్కన కూర్చోవాలి అనుకున్న పారిజాతంతో శివన్నారాయణ “జ్యోత్స్నా, పక్కన కూర్చో,” అంటాడు. పారిజాతం ఆశ్చర్యంగా “ఎందుకు?” అని అడుగుతుంది. శివన్నారాయణ “నువ్వు ఎప్పుడూ అక్కడే కూర్చుంటావు కదా. నీ అలవాటుకు నేను అడ్డు ఎందుకు?” అంటాడు. పారిజాతం “కాంచన, దశరథులు వాళ్ళ జంటలతో కూర్చున్నారు, నేను కూడా మీతో కూర్చుంటాను,” అని అంటుంది. శివన్నారాయణ “పోమ్మన్నానా?” అని కాసురుకుంటాడు. దాంతో పారిజాతం జ్యోత్స్న పక్కన కూర్చుంటుంది.
శివన్నారాయణ కార్తిక్, దీపలను ఉద్దేశించి, “మీరు కూడా కూర్చోండి,” అని అంటాడు. కార్తిక్ “మేము తర్వాత తింటాం తాతయ్య,” అని చెప్తాడు. శివన్నారాయణ మాత్రం “పెట్టె వ్యక్తి ఎప్పుడూ పైనే ఉంటాడు అలానే కారణం ఐన వాళ్ళు ఎపుడు ముందే ఉండాలి. ఈ ఇల్లు నిన్నటి వరకు ఎలా ఉందో అందరికీ తెలుసు. ఇవాళ మీ వల్లనే ఇంత సంతోషంగా ఉన్నాము. కాబట్టి మీరు ఇద్దరూ కూర్చుంటే అది నాకు విందుగా మారుతుంది,” అని సంతోషంగా అంటాడు.

పారిజాతం సంతోషంగా, “మీ అందరినీ ఇలా చూడటం నాకు చెప్పలేనంత ఆనందంగా ఉంది. జ్యోత్స్న ఒక్కటే ఒంటరగా ఉంది, ఆమెకు ఒక సంబంధం చూడాలి,” అంటుంది.అంతలో శివన్నారాయణ “ఇది తర్వాత మాట్లాడుకుందాం పారిజాతం, ముందుగా అందరూ భోజనం చేయండి,” అని అంటాడు.
దశరథ ఒక్కసారిగా నాన్న, ఒక చిన్న కోరిక ఉంది అని అంటూ “దీపా, నువ్వు మా ఇద్దరి మధ్య కూర్చో,” అని అంటాడు. పారిజాతం వెంటనే, “దశరథా, మీ కూతురు దీప కాదు, జ్యోత్స్న,” అని అంటుంది. దశరథ ప్రశాంతంగా, “ఎందుకు దీప కూతురు కాకూడదు?” అని అడుగుతాడు. కార్తిక్ ఆశ్చర్యంగా, “ఏమన్నారు మామయ్య?” అని అడుగుతాడు. దశరథ మళ్లీ, “దీపా ఎందుకు కూతురు కాకూడదు అని అడిగాను,” అని సమాధానమిస్తాడు .
జ్యోత్స్న తనలో తానే అనుకుంటుంది – “ఈసారి నాన్న మీద అనుమానం వస్తోంది. అతనికి దీప తన కూతురని తెలిసిపోయిందా?” అని.
దశరథ ప్రశాంతంగా — “ఒక్క వ్యక్తికి గౌరవం, ప్రేమ ఇవ్వాలంటే రక్త సంబంధం అవసరం లేదు. దీపా నా భార్య ప్రాణాన్ని కాపాడింది.” అని చెప్పడంతో పరిజాతం గుర్తు చేస్తుంది “దశరథ సుమిత్ర గూండాల నుంచి దీపను కాపాడింది,” అని. దశరథుడు సమాధానంగా, “నువ్వు గాయం గురించే మాట్లాడుతున్నావు పిన్ని, నేను జీవితం గురించి మాట్లాడుతున్నాను,” అని అంటాడు.

అతను కొనసాగిస్తూ, “నా చెల్లి చెప్పింది, ఈ మూడు రోజులు దీప సుమిత్రకు అమ్మలా చూసుకుందట. ధన్యవాదాలు చెప్పడం సరిపోదు నాకు. ఈ క్షణం జీవితాంతం గుర్తుండాలి. మా పెళ్లి గుర్తుగా, దీపా, ఈరోజు నువ్వే ఈ ఇంటి అతిథి. నీ సంతోషమే నా సంతోషం. కూర్చోని తిను” అని చెప్తాడు.
కార్తిక్ నవ్వుతూ, “ఇంకెక్కడ తింటుంది? మీ ప్రేమకి ఆమె కడుపు నిండిపోయింది,” అన్నాడు.
జ్యోత్స్న తనలో తానే అనుకుంటుంది — “దీప ఈ కుటుంబానికి దగ్గరవుతోంది. ఇవన్నీ బావ ప్లాన్ ప్రకారమా? లేక నేను అలా అనుకుంటున్నానా?”
శ్రీధర్ శివన్నారాయణతో మాట్లాడుతూ, “ఈ వంట చాలా బాగుంది, కాస్త వేసుకోండి,” అంటాడు. కాంచన “వద్దు, ఎందుకంటే నువ్వులు వేసారు, అలా వేస్తే నాన్న తినరు,” అంటుంది. శివన్నారాయణ చిరునవ్వుతో “చూశావా కార్తిక్, నా కూతురు నాకున్న అలవాట్లన్నీ గుర్తు పెట్టుకుంది,” అంటాడు. కార్తిక్ “మీరూ మర్చిపోలేదు తాతయ్య, మనసులో పెట్టుకున్నారు అంతే,” అని చెప్తాడు.తరువాత పారిజాతం తన డైట్‌ను మరిచి బాగా తింటుంది. శివన్నారాయణ ఆమెపై సరదాగా కామెంట్లు చేస్తాడు.

దశరథ, సుమిత్ర దీప దగ్గుతుంటే నీళ్లు తాగించి నెమ్మదిగా తినమని అంటారు. అది చూసి జ్యోత్స్నకి కోపం వస్తుంది. తనలో తానే “ఇవాళ ఒక్క రోజులో అందరూ ఎందుకు ఇలా మారిపోయారు? బావ ఎదో చెప్పి ఉంటాడు అమ్మకి ” అని అనుకుంటుంది. కార్తిక్ దీపనని చూస్తూ తనలో తానే నేను నిన్ను ఎలా చూడాలనుకున్నానో అలా చూశా. ఇంకా ఆలస్యం చేయకుండా, అత్త మామయ్యలకు దీప వాళ్ళ కూతురు అని నిజమైన వారసురాలు అని చెప్పాలి అనుకుంటాడు.
భోజనం తర్వాత శివన్నారాయణ శ్రీధర్ కాంచన లకు, దీప కార్తీక్ లకు బట్టలు పెట్టి ఆశీర్వదిస్తాడు. శ్రీధర్ శివన్నారాయణ ఒకరి గురించి ఒకరు గొప్పగా చెప్తారు. దశరథ కాంచనని ఉద్దేశించి దేవుడు నాకు చెల్లిని తల్లిని ఒక మనిషిలోనే ఇచ్చాడు అంటాడు. దానికి కాంచన మల్లి జన్మ అంటూ ఉంటె ఇదే బంధాలతో పుట్టాలి అని కోరుకుంటుంది. మల్లి సుమిత్ర నే వదినగా రావాలి అంటుంది. సుమిత్ర తాను ఇంట్లో నుండి వెళ్ళిపోయి బాధ పెట్టినందుకు సారీ చెవుతుంది. కార్తీక్ అది అంత మర్చిపోయాము ఇంకా ఆలోచించొద్దు అంటాడు. శివన్నారాయణ దీప కార్తీక్ లను పిల్ల పాపలతో చల్లగా ఉండాలి అని దీవిస్తుంటే వాళ్ళకి ఒకటే కూతురు కదా అని పారిజాతం గుర్తు చేస్తుంది. అపుడు దశరథ నాన్న దీవెనలు ఫలిస్తాయి అని అంటాడు. జ్యోత్స్న, పేరు షాక్ అవుతారు.

చివరగా, శ్రీధర్ ఇంకా వెళ్తాము అని అంటాడు. జ్యోత్స్న మీరు ఉండండి మామయ్య. మీకు అత్త ఇంట్లో స్థానం లేకపోయినా మా ఇంట్లో ఉంది అని అంటుంది. దశరథ జ్యోత్స్నతో మా బావకి నీ పర్మిషన్ అవసరం లేదు. నువ్వు పుట్టాక ముందు నుండే ఆయన ఈ ఇంటికి అల్లుడు అని అంటాడు. ఎపుడు ఇక్కడే ఉండేవారు. ఇపుడు ఆ పరిస్థితి లేకపోవచ్చు. మూడు కుటుంబాలుగా ఉండొచ్చు కానీ మా మధ్య బంధాలు, ప్రేమలు, పిలుపులు ఎపుడు అలానే ఉంటాయి. ఏం మారవు అని అంటాడు. అపుడే శివన్నారాయణ మంచి మాట చెప్పావు అంటూ తాను త్వరలోనే ఆ ఇంట్లో పెద్ద పార్టీ ఏర్పాటు చేయాలని చెప్తాడు. “అందరూ రావాలి, దాసు, కాశీ, స్వప్న, కావేరి అందరికీ చెప్పు,” అని శ్రీధర్‌తో అంటాడు. శ్రీధర్ “సరే మావయ్యగారు,” అని సమాధానమిస్తాడు. ఆ మాటతో అందరు సంతోషిస్తారు. పేరు, జ్యోత్స్న మాత్రం ఆ సంతోషాన్ని చూసి బాధ పడతారు అందరు కలిసిపోతున్నారు అని.
అంతటితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది.
Source inspiration: Original story from “కార్తీక దీపం” (JioHotstar). This is a personal written recap and interpretation.
