కార్తీక దీపం Nov 15th, 2025 శనివారం ఎపిసోడ్: దీప ఐడియాని ప్రశంసించి ప్రోత్సహించిన కుటుంబ సభ్యులు …. !!!
ఎపిసోడ్ ప్రారంభంలో ఉదయాన్నే శ్రీధర్ కాంచనకు గుడ్ మార్నింగ్ అని మెసేజ్ చేస్తాడు. ఆ మెసేజ్ చూసిన కాంచన ఒక్కసారిగా కొంచం కోపంతో వెంటనే అతనికి కాల్ చేస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసిన శ్రీధర్, తనకు ఇవాళ జ్యోత్స్న రెస్టారెంట్స్ సీఈవోగా మొదటి రోజు అని చెప్పుకుంటాడు. కాంచన మాత్రం కఠినంగా మాట్లాడుతూ, “అయితే మీ ఆవిడకి చెప్పి వెళ్లండి” అని అంటుంది.
అలానే మాట్లాడుతుండగా కార్తీక్ అక్కడికి వస్తాడు. ఫోన్ లో మాస్టారా అని అడగగా రాంగ్ నెంబర్ అని చెప్పి పూలు దీపకి ఇవ్వు అని కార్తీక్ కి ఇచ్చేసి ఫోన్ కట్ చేయకుండా పక్కన పెట్టేసి కాంచన లోపలికి వెళ్తుంది. వెంటనే దీప వచ్చాక కార్తీక్ ఆమె జుట్టులో పువ్వులు పెట్టి మాట్లాడుతాడు. తమ కొడుకు–కోడలు మాటలు వినడం తప్పు అని అనుకుంటూనే, మరోవైపు ఏం జరుగుతుందో తెలిసికోవాలనే ఆసక్తితో శ్రీధర్ ఫోన్ పెట్టకుండా వింటూ ఉంటాడు.

అదే సమయంలో దీప రోడ్డుపై వచ్చిన టిఫిన్ బండి అతని ఇడ్లీ, వడ అనే అరుపులు విని తన పాత రోజుల్ని గుర్తు చేసుకుంటుంది. అప్పుడే ఆమె మనసులో ఒక ఐడియా వస్తుంది. జ్యోత్స్న రెస్టారెంట్స్‌కు కొత్తగా చిన్న మొబైల్ బండ్లు మొదలు పెట్టి, అదే బ్రాండ్ టేస్ట్‌ను తక్కువ ధరకే అందిస్తే జనం బాగా స్పందిస్తారని చెప్తుంది. ఇది ఫుడ్‌ను ఇళ్లకి ఆర్డర్ చేసే వారికి కూడా ఉపయోగపడుతుందని చెబుతుంది.
కార్తీక్ కూడా ఐడియా బాగుందని అంగీకరిస్తాడు. కానీ నిర్ణయాలు తీసుకునేది మా నాన్న అని అంటాడు. దీప అయితే విశ్వాసంతో “మావయ్యగారికి ఈ ఐడియా నచ్చుతుంది” అని చెబుతుంది. అది అంత విన్న శ్రీధర్ ఐడియా బాగుంది అనుకుంటూ కాంచన తనని ఎపుడు క్షమిస్తుందో అనుకుని ఫోన్ కట్ చేస్తాడు.

ఇక ఇదిలా ఉండగా స్వప్న కాశీ షర్ట్ ఇస్త్రీ చేస్తూ ఉంటుంది. కాశీ స్నానానికి వెళ్లిన తర్వాత అతని ఫోన్ పదేపదే మోగుతుంటే మొదట లిఫ్ట్ చేయదు. కానీ మళ్లీ మోగడంతో ఎత్తుతుంది. అవతల నుంచి కాశీ స్నేహితుడు విష్ణు, చాలా స్వేచ్ఛగా కాశీతో మాట్లాడినట్లే “రేయ్ ఇంతసేపు లిఫ్ట్ చెయ్యడానికి ఏంట్రా… పడుకుని దొర్లుతున్నావా?” అని అంటాడు. వెంటనే విష్ణు అలానే కొనసాగిస్తూ, “మనిద్దరికీ జాబ్ లేదు కదా? ఇంట్లో ఏదో మేనేజ్ చేస్తున్నాం… అర్జెంట్‌గా జాబ్ వెతుక్కోవాలిరా” అని చెప్పేస్తాడు. ఇది విని స్వప్న షాక్ అవుతుంది. కాశీ జాబ్ ఉన్నట్లుగా నటిస్తున్నాడు అని ఆమెకు స్పష్టమవుతుంది.
కాశీ బయటకు రాగానే స్వప్న ఆ కంగారులోనే “ఈరోజు ఎందుకు ఆఫీస్‌కి వెళ్లలేదు?” అని అడుగుతుంది. కాశీ అబద్ధం చెప్పడానికి ప్రయత్నిస్తూ, “సిస్టమ్స్ వర్క్ అవడం లేదు. అందుకే పోలేదు” అని చెబుతాడు. ఆమె వెంటనే “అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావ్?” అని ప్రశ్నిస్తుంది.

కాశీ భయంతో అటు ఇటు ఆలోచిస్తూ “ఫ్రెండ్ వద్దకు వెళ్తున్నాను” అని చెప్పేస్తాడు. అప్పుడు విష్ణు మళ్లీ కాల్ చేస్తాడు. స్వప్న పక్కకు వెళ్లి కాశీ మాట్లాడేదంతా వినడానికి ప్రయత్నిస్తుంది. విష్ణు “ఎందుకు కాల్ కట్ చేశావ్?” అని అడుగుతుంటే కాశీ అయోమయంతో “నేను కట్ చేశానా?” అని అంటాడు. ఇంకా ఏదో నిజం చెప్పబోయే సమయంలో కాశీ త్వరగా కాల్ కట్ చేసి, స్వప్నకు ఏమీ తెలియనీయకుండా బయటకు బయలుదేరిపోతాడు.
స్వప్న మాత్రం మనసులో సందేహంతో ఉంటుంది — “ఇంట్లో జాబ్ ఉన్నట్లు నటించడం ఏంటి? ఏదో పెద్ద విషయం దాచి పెడుతున్నాడు…” అని అనుమానం పెరుగుతుంది.
ఇంతలో శ్రీధర్ శివన్నారాయణ ఇంటికి చేరుకుంటాడు. అదే సమయంలో కార్తీక్, దీప కూడా వస్తారు. పారిజాతం ఇపుడు వరకు ఇద్దరు వచ్చేవారు ఇంక నుండి ముగ్గురు వస్తారు అని వ్యంగ్యంగా అంటుంది. దానికి కార్తీక్ పెట్రోల్ బిల్ ఏమైనా ఎక్కువ వస్తుందా అని అడుగుతాడు. వచ్చినా మీరు కంపెనీ లెక్కల్లో కలిపేస్తారులే అని అంటుంది పారు. అంతలో దశరథ వచ్చి కంపెనీ సీఈఓ కి కార్ ఇస్తుంది అని చెప్తాడు. కానీ శ్రీధర్ నాకు వద్దు మీరు కార్ ఇవ్వాలి అనుకుంటే కంపెనీకి లాభాలు వచ్చాక ఇవ్వండి అని అంటాడు . అపుడే ఇంట్లో అందరు అక్కడికి చేరతారు.

అంతలో జ్యోత్స్న “లాభాలు రావాలి అంటే కష్టపడాలి మామయ్య. ఐడియాస్ మీద వర్క్ చేయాలి” అని అంటుంది. దీప జ్యోత్స్నని “మీ దగ్గర ఐడియా ఉందా?” అని అడుగుతుంది. జ్యోత్స్న వ్యంగ్యంగా “వంట చేసినంత ఈజీ కాదు ఐడియాస్ రావడం ” అని అంటుంది. దానికి కార్తీక్ కౌంటర్ ఇవ్వడంతో పారు కలగజేసుకుని “ఇపుడు మీ నాన్నే కదా సీఈఓ ఇవ్వమను ఐడియా” అని అంటుంది.
శ్రీధర్ పారుతో “సవాల్ ఆ? లేదంటే సలహా నా? ” అని అంటూ రెస్టారెంట్ అభివృద్ధికి ఒక ఐడియా ఉందని చెబుతాడు. శ్రీధర్, రెస్టారెంట్లను షార్ట్ టైంలో డెవలప్ చేయడానికి మొబైల్ ఫుడ్ కోర్ట్స్ పెట్టటం ఉత్తమమని చెప్పుతాడు. పబ్లిక్ దగ్గరకు బ్రాండ్ వెళ్లినట్టు అవుతుందని వివరంగా చెబుతాడు. అందరికీ ఐడియా నచ్చుతుంది. స్పష్టంగా చెప్పమని అడుగుతారు.

దానికి శ్రీధర్ “ఈ ఐడియా నాది కాదు… దీపది.” అని అంటాడు. అందరూ షాక్ అవుతారు. దీప మీకు ఎలా తెలుసు అని అడగ్గా పొద్దున్నే మీరు మాట్లాడుతుండగా నేను విన్నాను అని అసలు విషయం చెప్తాడు. కార్తీక్, దీప ఇంట్లో కూడా కంపెనీ గురించే ఆలోచిస్తున్నారు అని అంటాడు శ్రీధర్. దానికి జ్యోత్స్న వాళ్ళకి ఎపుడు మా ఆస్థి మీదనే ఉంటుంది అని అంటుంది. కార్తీక్ వెంటనే మాకు విశ్వాసం ఎక్కువ, అన్నం పెట్టే వాళ్ళు ఆశీర్వాదం ఇచ్చే వాళ్ళ గురించి మంచి జరగాలి అని కోరుకుంటాము అని అంటాడు.
దీప ఐడియా గురించి అందరు మెచ్చుకుంటూ వివరంగా చెప్పమని అడగడంతో కార్తీక్ ఐడియా గురించి చెప్తాడు. మనం జనాల్లోకి వెళ్లడం వాళ్ళ గుర్తింపు ఎక్కువ వస్తుంది, షేర్ వాల్యూస్ పెరుగుతాయి అని చెప్తాడు. అందరు మెచ్చుకోవడంతో అది నాది కాదు దీప ఐడియా అని చెప్తాడు. అందరు దీపని మెచ్చుకుంటారు. శివన్నారాయణ కూడా దీపతో నీ మీద కార్తీక్ కి నమ్మకం ఉంది కాబట్టే నిన్ను సీఈఓ చేయాలి అనుకున్నాడు అని చెప్తాడు. జ్యోత్స్న, పారు అసూయతో రగిలిపోతారు. కార్తీక్ గర్వంతో మురిసిపోతాడు. తాత గారు కూడా ప్రశంసిస్తూ “ఈ ఐడియాని వెంటనే మొదలు పెట్టండి” అని ఆదేశిస్తాడు.
పారిజాతం, జ్యోత్స్న మాత్రం అసహనంతో అక్కడినుండి వెళ్లిపోతారు. ఇంక అందరు అక్కడ నుండి వెళ్ళిపోతారు.

శివన్నారాయణ కార్తీక్ ని ఆపి “మీ అమ్మ ఎలా ఉంది? శ్రీధర్ సీఈఓ అయ్యాడు అని చెప్పావా? ఏమన్నదీ? మీ నాన్న ని క్షమించిందా? కలిసిపోయారా? నా గురించి అడిగిందా? ” అని వరసగా ప్రశ్నలు అడుగుతాడు. కార్తీక్ మనసులో అమ్మతో మాట్లాడింది చెప్తే తాత బాధ పడతాడు ఏమో అని అనుకుంటూ బయటికి “అమ్మ హ్యాపీగానే ఉంది, నాన్నను జస్ట్ విష్ చేసింది. నువ్వు సీఈఓ చేయడం గురించి సర్ప్రైజ్ అయింది. ఇంక వాళ్ళు కలవడం గురించి ఇపుడే ఎం చెప్పలేను” అని చెప్తాడు.
ఇందుకు శివన్నారాయణ కూడా అందుకే జాతకాలు చూపించడానికి గురువు గారిని పిలిపిస్తున్నాను అని చెప్తాడు. మీ జాతకాలు కూడా ఇవ్వు అని కార్తీక్ తో చెప్తాడు. ఇంటి మొత్తం కలిసి నిలబడాలి అన్నదే తన కోరిక అని అంటాడు.
ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.
Source inspiration: Original story from “కార్తీక దీపం” (JioHotstar). This is a personal written recap and interpretation.
