కార్తీక దీపం Nov 17th, 2025 సోమవారం ఎపిసోడ్: శ్రీధర్ ని అవమానించిన పారు, జ్యోత్స్న … !!! కాశీని నిలదీసిన స్వప్న … !!!
ఎపిసోడ్ ప్రారంభంలో కాశీ ఆఫీస్‌కి ఆలస్యం అవుతుందనే టెన్షన్‌తో హడావిడి చేస్తుంటాడు. బూట్లు కూడా వేసుకోకముందే పరుగులు పెడతాడు. స్వప్న అతడిని ఆపి “నేను కూడా నీతో ఆఫీస్ వరకు వస్తాను,” అని అంటుంది. కాశీ ఒక్కసారిగా కంగారు పడతాడు. “నువ్వెందుకు మా ఆఫీస్‌కి? అవుట్‌సైడ్ వాళ్లను రానివ్వరు. నాకు చాలా ప్రెజర్ ఉంది నేను వెళ్లాలి,” అని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు.
అప్పుడు స్వప్న అనుమాన పడుతుంది. “ఉద్యోగం చేసే వాళ్లకే ప్రెజర్ ఉండాలి… నీకెందుకు కాశీ?” అని ప్రశ్నిస్తుంది. కాశీ షాక్ అవుతాడు. అప్పుడే స్వప్న చెబుతుంది “నీకు జాబ్ లేదనే విషయం నాకు తెలిసిపోయింది. నన్ను మోసం చేశావు,” అని ఏడుస్తూ లోపలకి వెళ్లిపోతుంది. స్వప్న ఆఫీస్‌కి కాల్ చేసి కాశీ పేరుతో ఎలాంటి ఎంప్లాయీ లేడని తెలుసుకుంది అని చెబుతుంది. ఒట్టు వేసి నిజం చెప్పమని ఒత్తిడి పెట్టడంతో, కాశీ “నాకు జాబ్ లేదు,” అని ఒప్పుకుంటాడు. స్వప్న కోపంగా “నిన్న సాయంత్రమే నాకు విషయం తెలిసింది. నువ్వే చెబుతావని వెయిట్ చేశాను,” అని ఏడుస్తూ బయటకు వెళ్లిపోతుంది.

ఇంతలో కావేరి లోపలికి వచ్చి, “ఎందుకు ఏడుస్తుంది? నువ్వేమైనా కొట్టావా?” అని కాశీని నిలదీస్తుంది.
కాశీ అవమానంతో, బాధతో “ఆమె నా ప్రాణం. నేను ఎందుకు కొడతాను?” అంటాడు. అపుడు స్వప్న ఉక్రోషంగా “ఆమెను నేను మోసం చేశాను. తనతో అబద్ధం చెప్పాను, అందుకే ఏడుస్తుంది అని చెప్పు” అని అంటుంది.
స్వప్న వెంటనే కావేరితో “మీ అల్లుడికి జాబ్ వచ్చిందని చెప్పింది అబద్ధం. ఆయన నన్ను మోసం చేశారు,” అని ఏడుస్తూ “డాడీకి కాల్ చెయ్ మమ్మీ. డాడీతో మాట్లాడతాను ఈయన మోసం గురించి” అని అంటుంది. అంతలో “ఈ విషయం మామయ్యకు ముందే తెలుసు,” అని కాశీ చెబుతాడు. స్వప్న జరిగింది గుర్తు చేసుకుంటూ “అందుకేనా నువ్వు మా డాడీ కాళ్ళు పట్టుకుంది ఆరోజు” అని అడుగుతుంది. కాశీ అవును అని చెప్తాడు.

స్వప్న గుండె పగిలిపోతుంది. “నా దగ్గర ఏమీ దాచడని అనుకున్నాను… కానీ నన్నే మోసం చేశాడు,” అని విలపిస్తుంది. కావేరి కాశీతో “మామయ్య వచ్చిన తర్వాత మాట్లాడుదాం, ఇపుడు మీరు ఇక్కడ నుండి వెళ్ళండి అల్లుడు గారు” అని గట్టిగా చెబుతుంది.
మరోవైపు శివన్నారాయణ ఇంటికి గురువుగారు వచ్చి అందరి జాతకాలు చూస్తారు. “ఈ ఇంటికి ఒక మంచి… ఒక పెద్ద చెడు రాబోతోంది,” అని చెబుతారు. అందరూ టెన్షన్ పడతారు. జాతకం ఎవరిదో చెప్పమని అడిగితే గురువు గారు చెబుతారు “ఎవరిదో చెప్పడం సాధ్యం కాదు. కానీ ఈ ఇంటి వారసురాలికి మంచి జరుగుతుంది.” అందరి చూపు జ్యోత్స్న మీద పడుతుంది.
తర్వాత “చాలా పెద్ద ప్రమాదం ఈ ఇంటిని తాకబోతోంది. దీనికి పరిష్కారం హోమం. ఈ ఇంటి రక్తానికి సంబంధించిన ముత్తయిదువులు అందరు హోమానికి రావాలి” అని చెప్తారు. శివన్నారాయణ తన కూతురు జాతకం గురించి చెప్పమని గురువు గారిని అడుగుతాడు. గురువు గారు అది హోమం అయ్యాక చెప్తాను అని చెప్తారు.

గురువు గారు హోమం ఏర్పాట్లు చేయమని దీపతో చెబుతారు. జ్యోత్స్న మండిపడుతూ “అది దీపకి ఎందుకు చెప్పడం?” అని అడుగుతుంది. వెంటనే పారు అలంటి పనులు పనిమనిషికి కదా చెప్తారు అంటుంది. జ్యోత్స్న మనసులో “ఇది పనిమనిషి కాదు వారసురాలు. గురువుగారు చెప్పిన మంచి దీనికే నా?” అని అనుకుంటుంది. అప్పుడు కార్తీక్ మనసులో, “నిజం ఎక్కడ బయట పడుతుందోనని ఈ చిన్న మరదలే భయపడుతోంది,” అని అనుకుంటాడు.
కార్తీక్ హోమం కోసం పిలవాల్సిన పేర్ల లిస్ట్ రాస్తున్నప్పుడు శ్రీధర్ ఇంటికి వస్తాడు. శ్రీధర్ వస్తూనే “ఏంటి ఏదయినా ఫంక్షన్ ఉందా” అని అడుగుతాడు. దానికి శివన్నారాయణ “అందరికి మంచి జరగాలి అని ఇంట్లో హోమం చేస్తున్నాము” అని బదులిస్తాడు. శివన్నారాయణ కార్తీక్ తో “కావేరి, స్వప్న, కాశీ, దాసు పేర్లు కూడా లిస్ట్ లో రాయి” అని చెప్తాడు .

అది విన్న వెంటనే పారు, జ్యోత్స్న షాక్ అవుతారు. మిగిలిన అందరు కూడా కొంచం ఆశ్చర్యపోతారు. కార్తీక్, దీప ఆనందపడతారు. వెంటనే పారు “లాస్ట్ ఇద్దరి పేర్లు సరే ముందు పేర్లు ఎందుకు” అంటుంది. సుమిత్ర పారుని అడ్డుకోగా “నువ్వు అడగాల్సింది పోయి నన్ను ఆగమంటున్నావా” అని అంటుంది. శివన్నారాయణ “నాకు సంబంధించిన బంధువులు అందరు వస్తారు కాబట్టి శ్రీధర్ కుటుంబం కూడా వస్తారు” అని గట్టిగ చెప్తాడు.
పారు తగ్గకుండా “అలాంటి వాళ్ళని పిలిస్తే మన పరువు ఏం అవ్వాలి? ఈ ఇంట్లో ఇంకా పెళ్లి కావాల్సిన పిల్ల ఉంది. అలా వచ్చిన వాళ్ల గురించి నలుగురు ఏం మాట్లాడతారో తెలుసా? కావేరి ఈ ఇంట్లో అడుగుపెట్టడానికి వీల్లేదు,” అని అరిచి చెబుతుంది. జ్యోత్స్న కూడా పారు కి మద్దతుగా ” వాళ్ళని పిలిస్తే ఆవిడ నాకు ఏం అవుతుంది అంటే నేను ఏం చెప్పాలి” అని అడుగుతుంది. కార్తీక్ గట్టిగా జ్యోత్స్న అని అరుస్తాడు. జ్యోత్స్న పొగరుగా “ఇది మా ఇంటి విషయం నువ్వు కలగచేసుకోవద్దు బావ ” అని అంటుంది.
దీప వెంటనే “మా ఆయన మీ మేనత్త కొడుకు. మా అత్త లేకుండా ఈ ఇంట్లో ఏ శుభకార్యం కూడా జరగదు. అలాంటి వాళ్ళని పట్టుకుని ఏం మాట్లాడుతున్నావో అర్ధం అవుతుందా” అని గట్టి కౌంటర్ ఇస్తుంది. వెంటనే శ్రీధర్ “నా కోసం ఈ గొడవలు అన్ని వద్దు మామయ్యగారు. నా ఫామిలీని హోమానికి పిలవొద్దు. మీరు కాంచనతో రమ్మంటే వస్తాను. వద్దు అంటే చెప్పండి నేను అసలు రాను ” అని చెప్పి బాధతో అక్కడ నుండి వెళ్ళిపోతాడు.

దీప తట్టుకోలేక “మనుషుల్ని సంతోషపెట్టడం కష్టం బాధపెట్టడం ఈజీ. మీరు ఈ రోజు చేసింది అదే,” అని చెప్తుంది. జ్యోత్స్న ఈ ఇంట్లో పనిమనిషులతో కూడా నీతులు చెప్పించుకోవాల్సి వస్తుంది అని ఆగ్రహంతో లోపలికి వెళ్లిపోతుంది.
ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది
Source inspiration: Original story from “కార్తీక దీపం” (JioHotstar). This is a personal written recap and interpretation.
