కార్తీక దీపం ఎపిసోడ్ మే 01 , 2026 గురువారం ఎపిసోడ్: దీపకి క్షమాపణ చెప్పిన సుమిత్ర … !!! ప్రాణాపాయంలో శ్రీధర్ …!!!
ఇవాళ ఎపిసోడ్లో ముందుగా జ్యోత్స్న చేసిన విషయంపై ఇంట్లో పెద్ద చర్చ జరుగుతుంది. శివన్నారాయణ కోపంగా స్పందిస్తూ, ఇంత జరుగుతున్నా దశరథ్ ఎందుకు మౌనంగా ఉన్నాడని ప్రశ్నిస్తాడు. దశరథ్ మాత్రం తాను చేసిన తప్పుల వల్ల ఇప్పుడు గట్టిగా మాట్లాడే హక్కు లేదని చెప్పి, జ్యోత్స్నే నిజాన్ని అర్థం చేసుకోవాల్సిందని అంటాడు. ఈ సమయంలో కూడా జ్యోత్స్న తన నిర్ణయాన్ని మార్చకుండా, “నాకు బావ కావాలి, బావనే పెళ్లి చేసుకుంటాను” అని మళ్లీ చెబుతుంది.
ఇక్కడ పారిజాతం ఒక ముఖ్యమైన విషయం బయటపెడుతుంది. కార్తిక్ చాలా కాలం క్రితమే జ్యోత్స్నని పెళ్లి చేసుకోనని తనకు చెప్పాడని వెల్లడిస్తుంది. ఆ విషయాన్ని అప్పట్లో కుటుంబానికి చెప్పకపోవడానికి కారణాలు కూడా చెబుతుంది—ఇది బయటపడితే కుటుంబాలు విడిపోతాయని, జ్యోత్స్న ఏదైనా తప్పు నిర్ణయం తీసుకుంటుందేమోనని భయపడ్డానని అంటుంది. దీంతో అందరికీ అసలు విషయం స్పష్టంగా అవుతుంది.
అయినా కూడా జ్యోత్స్న తన ఆలోచన మార్చదు. తనకు న్యాయం జరగాలంటే కార్తిక్ తన మెడలో తాళి కట్టాలని మళ్లీ చెబుతుంది. ఈసారి సుమిత్ర చాలా గట్టిగా స్పందిస్తూ, ఇకపై కార్తిక్ గురించి అలా మాట్లాడితే తాను కూతురని కూడా చూడనని, ఇంటి నుంచి బయటికి పంపిస్తానని హెచ్చరిస్తుంది. తల్లిగా తన బాధ్యతను స్పష్టంగా చెప్పి, దీప స్థానం గురించి కూడా గుర్తు చేస్తుంది.
ఈ ఘటనతో ఇంట్లో పరిస్థితి కొంత క్లియర్ అవుతుంది. కార్తిక్ చేసిన ప్లాన్ వల్ల అందరికీ జ్యోత్స్న మనసు పూర్తిగా అర్థమవుతుంది. శివన్నారాయణ, సుమిత్ర ఇద్దరూ కార్తిక్, పారిజాతం చేసిన పనిని మెచ్చుకుంటారు. కానీ కార్తిక్ మాత్రం ఇది ముగింపు కాదని, ఇప్పుడు అసలు పని మొదలైందని చెబుతాడు—జ్యోత్స్నని పెళ్లికి ఒప్పించి, ఒక నెలలో పెళ్లి జరిపించడం.
ఇదిలా ఉండగా, మరోవైపు శ్రీధర్ ఇంట్లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంటుంది. స్వప్న టూర్‌కు వెళ్లాలని పట్టుబడుతుంది. కానీ శ్రీధర్ మాత్రం బయట పరిస్థితులు సరిగా లేవని, ఆమెను ఆపడానికి ప్రయత్నిస్తాడు. ఇద్దరి మధ్య వాదన జరుగుతుంది. చివరికి స్వప్న తన నిర్ణయంపై నిలబడుతుండగా, శ్రీధర్ తీవ్రంగా స్పందించి తన మనసులో ఉన్న భయాన్ని బయటపెడతాడు.
ఈ సంఘటన తర్వాత శ్రీధర్ డ్రైవ్ చేస్తూ ఆలోచనల్లో మునిగిపోతాడు. అకస్మాత్తుగా ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చి కారు ఆపేస్తాడు. అక్కడున్నవాళ్లతో కలిసి ఒక అపరిచితుడు సాయం చేసి అతన్ని వెంటనే హాస్పిటల్‌కు చేర్పిస్తాడు.
ఇక కార్తిక్‌కు ఈ విషయం తెలిసి వెంటనే హాస్పిటల్‌కి వెళ్తాడు. డాక్టర్ ఆయనను లోపలికి పంపుతాడు. కార్తిక్ లోపలికి వెళ్లి శ్రీధర్‌తో మాట్లాడుతాడు. అతన్ని కాపాడిన వ్యక్తి గురించి తెలుసుకోవాలని కూడా అనుకుంటాడు.
ఇదిలా ఉండగా, ఇంట్లో సుమిత్ర – దీప మధ్య జరిగిన సంభాషణలో, సుమిత్ర తన కూతురు ప్రవర్తన గురించి బాధపడుతుంది. జ్యోత్స్నను ఇలా పెంచడం తన తప్పే అని ఒప్పుకుంటుంది. దీప కూడా పరిస్థితిని అర్థం చేసుకుని, జ్యోత్స్నని ఎలా సరిదిద్దుకోవాలి అని మాట్లాడుతుంది.
ఈ ఎపిసోడ్ చూస్తే కథ ఒక్కసారిగా భావోద్వేగంగా మారిపోయింది. జ్యోత్స్న విషయం ఒకవైపు క్లియర్ అయినా, ఆమె మారేలా కనిపించడం లేదు. మరోవైపు స్వప్న ట్రాక్ కూడా సీరియస్‌గా మారింది. ముఖ్యంగా శ్రీధర్‌కు జరిగిన విషయం తర్వాత కథ ఇంకో దిశలోకి వెళ్తున్నట్టు ఉంది. ఇప్పుడు జ్యోత్స్నని ఎలా ఒప్పిస్తారు, అలాగే శ్రీధర్ ఆరోగ్యం ఎలా ఉంటుంది స్వప్న ఇప్పుడు ఐన తన నిర్ణయం మార్చుకుంటుందా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో కీలకం అవుతుంది.
