కార్తీక దీపం Nov 20th, 2025 గురువారం ఎపిసోడ్: కావేరిని అవమానించిన జ్యోత్స్న …!!! క్షమాపణ చెప్పించిన కార్తీక్ …!!!
ఎపిసోడ్ ప్రారంభంలో దశరథ ఇంటిని హోమం కోసం అలంకరిస్తూ ఉంటాడు. శివన్నారాయణ వచ్చి, “ఇవి నీ పనులా? కార్తీక్ చూసుకునేవాడు కదా?” అని అడుగుతాడు. దశరథ, “ఈరోజు కార్తీక్‌కి ఎలాంటి పని చెప్పొద్దు నాన్న. వాడు ఇవాళ కుటుంబంతో మనింటికి వస్తున్నాడు” అని చెబుతాడు. అప్పుడే శివన్నారాయణ గర్వంగా, “ఎవరి గౌరవానికి లోటు రానివ్వను” అంటాడు. ఇంట్లో హోమం సిద్ధం చేస్తూ సుమిత్ర చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఈ సందడి ఎక్కువసేపు ఉండకపోవచ్చని జ్యోత్స్నకు పారిజాతం చెబుతుంది. ఇంతలో కార్తీక్, శ్రీధర్ తమ కుటుంబాలతో కలిసి ఇంటికి వస్తారు.

శౌర్య పరుగెత్తుకుంటూ వచ్చి హడావుడి చేస్తుంది. సుమిత్ర ప్రేమగా “ఇంత మంది ఉన్న ఇంట్లో పిల్లలు ఉంటే వచ్చే సందడి రాదు” అని అంటుంది. వెంటనే పారిజాతం, “నీకు కూడా మనవళ్లు వస్తారులే” అని చెప్తుంది. దాంతో సుమిత్ర, “శౌర్య కూడా నా మనవరాలే” అని గర్వంగా చెబుతుంది. పారు నవ్వుతూ, “అలా అనుకోవడం, అవ్వడం వేరు సుమిత్ర” అని అంటుంది. అందుకు కార్తీక్ సెటైర్‌గా, “ముందు జ్యోత్స్న పెళ్లి అవ్వని పారు. అపుడే మనవళ్లు గురించి ఎందుకు మాట్లాడుతున్నావు?” అని అంటాడు.
అప్పుడే సుమిత్ర కావేరి దగ్గరకు వెళ్లి, “వదినా…” అని పిలుస్తుంది. ఆ ఒక్క మాటతోనే కావేరి కళ్లలో నీళ్లు తిరుగుతాయి. శివన్నారాయణ ముందుకు వచ్చి, “గతంలో ఏం జరిగింది అని మర్చిపోండి. ఈ క్షణం మనమంతా కలిసాం. ఇకపై ఎప్పటికీ కలిసే ఉంటాం” అని చెప్పి అందరికీ మంచిగా చెబుతాడు. దశరథ కూడా, “మా ఇంటికి ఇపుడు మీరు వచ్చారు కదా, అలానే మేము కూడా మీ ఇంటి కార్యక్రమానికి వస్తాం, ” అని చెబుతాడు. శివన్నారాయణ గట్టిగా, “ఇకపై మనం అంతా ఒకటే కుటుంబం. ఇది అంతా శివన్నారాయణ పరివారమే” అని ప్రకటిస్తాడు.

కావేరి నమస్కరిస్తూ, “మమ్మల్ని మీ కుటుంబంలో కలుపుకున్నారు మాకు అదే చాలు” అని అంటుంది. శివన్నారాయణ, “శౌర్యని ప్రాణాలతో బతికించింది నువ్వే. నీ రుణం మేమెప్పుడు తీర్చలేం” అని చెప్తూ “ఇకపై ఈ ఇంట్లో కన్నీళ్లు ఉండవు. అవమానాలు ఉండవు” అని స్పష్టం చేస్తాడు.
ఇంతలో శివన్నారాయణ, “అందరూ వచ్చారు. దాసు ఎక్కడ?” అని అడుగుతాడు. కాసేపట్లో వస్తాడు అని శ్రీధర్ చెప్తాడు. తరువాత స్వప్న దగ్గరకు వెళ్లి, “ఎందుకు సైలెంట్‌గా ఉన్నావమ్మా?” అని అడుగుతాడు. స్వప్న ఆనందంతో మాటలు రావడం లేదని చెబుతుంది. పక్కన ఉన్న జ్యోత్స్న కావాలనే కాంచనతో “మీ నాన్ననే గానీ మమ్మల్ని పట్టించుకోవా అత్త?” అని అడిగి సరదగా అన్నాను అని చెప్తుంది.

అంతలోనే జ్యోత్స్న మళ్లీ “ఇప్పుడంతా బంధువులం కదా. స్వప్న నా ఆడపడుచు అయితే, వాళ్ల అమ్మని నేను ఏమని పిలవాలి?” అని అడుగుతుంది. పారిజాతం సమాధానం చెప్తూ “నీ మేనత్త నీకు ఏమవుంతుందో కావేరి కూడా అదే అవుతుంది. నువ్వు అత్త అని పిలవచ్చు” అని చెప్తుంది.
సుమిత్ర ముందుకు వచ్చి, “ముందు ముత్తయిదువల కాళ్లకు పసుపు రాయి” అని చెబుతుంది. జ్యోత్స్న నేను రాయాలా అని అడుగుతుంది. సుమిత్ర “ఐదుగురు ముతైదువల కాళ్ళకి నీతో పసుపు రాయిస్తా అని అమ్మవారికి మొక్కుకున్నాను. నేను లోపల వాళ్ళకి రాసేసాను. నువ్వు మీ నానమ్మ, దీప, కాంచన, కావేరి ఇంకా స్వప్న లకి రాస్తే సరిపోతుంది” అని అంటుంది. జ్యోత్స్న ఒక్క నిమిషం అలోచించి సరే అని పసుపు రాయడానికి ముందుకు వస్తుండగా, పారిజాతం అనుమానంగా “నువ్వు పసుపు రాయడమేంటే?” అని అడుగుతుంది. జ్యోత్స్న తేలిగ్గా, “జరగబోయేది చూడు గ్రానీ” అని ముందుకు వస్తుంది.

జ్యోత్స్న ముందు కాంచనకి రాయబోతూ “ముందుగా అత్తకి రాస్తాను. కానీ ఒక డౌట్ మమ్మీ. డాడీ మీతో ఉన్నాడు. దీప, స్వప్నల భర్తలు వాళ్లతోనే ఉన్నారు. తాత కూడా గ్రానీతో ఉన్నారు కాబట్టి మీరు అంతా కూడా ముత్తయిదువులే” అని ఆగుతుంది. సుమిత్ర సమాధానంగా “పసుపు కుంకుమలు ఉన్న ప్రతి ఆడపిల్లా ముత్తయిదువే” అని చెబుతుంది. వెంటనే జ్యోత్స్న అంటే నేను సౌర్య కూడా ముతైదువలమా అని అడుగుతోంది.
సుమిత్ర వెంటనే “ఐదోతనం ఉన్న ప్రతి ఆడది ముత్తయిదువే” అని సమాధానమిస్తుంది. మళ్లీ జ్యోత్స్న మాట్లాడబోతుండగా కాంచన “నువ్వు ఏమి అడగాలి అనుకుంటున్నావో అడుగు” అని సూటిగా చెప్తుంది. జ్యోత్స్న ఈమాత్రం ఆలోచించకుండా “అయితే అత్తతో భర్త లేడుగా?” అని అంటుంది. ఆ మాటతో కాంచన షాక్ అవుతుంది.

వెంటనే “నన్ను అవమానించడానికి అంటున్నావా?” అని గట్టిగా అడుగుతుంది. జ్యోత్స్న మెత్తగా “నువ్వు ఈ ఇంటి ఆడపడుచువి. నిన్ను అవమానిస్తే మేం మమ్మల్ని అవమానించుకున్నట్టే అత్త. నేను అత్తకి భర్త లేడని మాట్లాడడం లేదు. అత్తకు భర్త లేరని అంటే ఆయన ఇంట్లో లేరని చెబుతున్నా” అని వివరిస్తుంది.
మళ్లీ తానే మాట్లాడుతూ “మావయ్య, అత్తయ్య పెళ్లి పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఏ గుడిలోనో, బడిలోనో దొంగపెళ్లిలా కాదు కొంత మందిలా” అని కావేరిని, స్వప్నని ఉద్దేశించి హేళన చేస్తుంది. తర్వాత మరింత ఘాటుగా “శ్రీధర్ ఎవరంటే కాంచన భర్త అంటారు, కానీ కావేరి భర్త అనరు కదా? కార్తీక్ తండ్రి అంటారు, కానీ స్వప్న తండ్రి అనరు కదా?” అని అవమానకరంగా మాట్లాడుతుంది.
ఆ మాటలు విని స్వప్న మండిపడుతుంది. “నువ్వూ శ్రీధర్ని మామయ్యని నా తండ్రి అని చెప్పుకోలేవు. అప్పుడు నీ తల్లిదండ్రుల పెళ్లి ఎలా జరిగిందని అడిగితే నువ్వు మీ అమ్మ సమాధానం చెప్పగలరా?” అని గట్టిగా నిలదీస్తుంది. పారిజాతం కూడా జ్యోత్స్న కి మద్దతుగా మాట్లాడుతుంది.

పారిజాతపై కాంచన గట్టిగా, “ఇంత అడ్డదిడ్డంగా మాట్లాడుతుంటే నువ్వు నోరు మూయించకుండా వత్తాసు పలుకుతున్నావా పిన్ని. నీకు అసలు బుద్ధి ఉందా” అని అరుస్తుంది. జ్యోత్స్న తిరిగి “నువ్వు చేసిన త్యాగాలు చేస్తేనే వాళ్ళకి గుర్తింపు వస్తుంది అనుకోకు అత్త” అని మరింత తక్కువ చేసి మాట్లాడుతుంది. తర్వాత కావేరిని ఉద్దేశించి, “కరెక్టుగా చెప్పాలి అంటే నిన్ను భార్య అని కాదు ఉంపుడుగత్తె అంటారు” అని చెప్పి అవమానిస్తుంది.
సుమిత్ర ఇక ఆగలేకపోయి జ్యోత్స్నని కొట్టడానికి ముందుకు వస్తుంది. కావేరి వెంటనే అడ్డుకుంటూ “నా కూతురి కోసం నీ కూతురిని కొట్టడం నాకు ఇష్టం లేదు” అని చెప్పి ఆపేస్తుంది. కావేరి బాధగా, “తప్పు నాదే. పిలవగానే రాను అనాల్సింది. నా పెళ్లి, నా జీవితం సక్రమంగా లేదు” అని బాధపడుతుంది. అంతలో స్వప్న కూడా “ఇక్కడ మనకున్న గౌరవం ఏంటో అర్థమైంది. ఆ ఇంటికి వచ్చి పిలిచింది ఈ ఇంటి వాకిట్లో అవమానించడానికేనేమో. ఇంకా ఇక్కడ ఉండొద్దు అమ్మ మనం వెళ్దాం” అని బాధతో తల్లి చెయ్యి పట్టుకుని తీసుకు వెళ్తుంది.

అప్పుడే అక్కడికి కార్తీక్, శివన్నారాయణ వస్తారు. స్వప్న ఏడుస్తూ ఉండటం చూసి కార్తీక్ “ఏం అయ్యింది?” అని అడుగుతాడు. స్వప్న, “ఏం కాలేదు. ఇంటికి వెళ్తున్నాం. మేం ఉంటే నీకే అవమానం ” అని చెప్తుంది. కాని కార్తీక్ ఆగమంటాడు. “ముందు ఎవరు ఏమన్నారో చెప్పు” అని అడుగుతాడు. స్వప్న “జ్యోత్స్న మా అమ్మ గురించి, పెళ్లి గురించి, చాలా నీచంగా మాట్లాడింది” అని నిజం చెబుతుంది.
కార్తీక్ కోపంతో జ్యోత్స్న వైపు తిరిగి “మా చిన్నమ్మ గురించి ఏం అన్నావు?” అని ప్రశ్నిస్తాడు. దశరథ శ్రీధర్ కూడా అక్కడికి వస్తారు. దశరథ సుమిత్రతో “జ్యోత్స్న మాట్లాడుతుంటే నువ్వు ఎం చేస్తున్నావు” అని అడుగుతాడు. దానికి సుమిత్ర “కోపం వచ్చి కొట్టబోయాను అంది కానీ కావేరి ఆపింది. లేదంటే చెంప మిగిలేది” అని చెప్తుంది.
కార్తీక్ గట్టిగా, “అత్త కొట్టాలి అనుకుంది అంటే నువ్వు ఎంత పెద్ద మాట అన్నావో నేను ఊహించగలను. అంటే అవమానించడానికే పిలిపించారా? మనం ఒక కుటుంబం. నచ్చితే మాట్లాడు, నచ్చకపోతే మాట్లాడకుండా పక్కన ఉండు” అని హెచ్చరిస్తాడు. “ముందు మా చిన్నమ్మకి క్షమాపణ చెప్పు” అని ఆదేశిస్తాడు. పారిజాతం జ్యోత్స్నని వెనకేసుకు రాబోతుంటే కార్తిక్ మాట్లాడొద్దు అని గట్టిగా చెప్తాడు.

అలానే శివన్నారాయణతో మాట్లాడుతూ, “తాత అందరం కలిసే ఉండాలన్న మీ మాటకు మేము తలవంచుతాం. కానీ జ్యోత్స్న చిన్నమ్మకి సారీ చెప్పాలి” అని అంటాడు. చివరకు జ్యోత్స్న కావేరి ఎదుటకి వచ్చి, “తెలియకుండా మాట్లాడేసాను. క్షమించండి అత్త” అని క్షమాపణ చెబుతుంది. సుమిత్ర జ్యోత్స్నాతో పసుపు తీసుకుని కావేరి కాళ్ళకి రాయమని చెప్తుంది.
అంతటితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది.
Source inspiration: Original story from “కార్తీక దీపం” (JioHotstar). This is a personal written recap and interpretation.
