ఎపిసోడ్ ప్రారంభంలో జ్యోత్స్న కార్తిక్కి “ఇదే నీ పెళ్లిరోజుకి నేను ఇచ్చే కానుక” అని చెప్పి, తన మెడలో తాళి కట్టమని అడుగుతుంది. “నన్నే బహుమతిగా తీసుకో” అని చెబుతూ, ఈ రోజు తనకు రెండో పెళ్లి అవుతుందని, కార్తిక్ జీవితంలో ఒకే భార్య ఉండాలి, అది తానే కావాలని చెబుతుంది. తాను ముందుగానే ప్లాన్ చేసుకుని ఇలా ప్రవర్తిస్తుంది.
కార్తిక్ “అయిపోయిందా? ఇంకా ఉందా?” అని ప్రశ్నిస్తాడు. జ్యోత్స్న ఇది డ్రామా కాదని అంటుంది. కార్తిక్ మాత్రం ఇది డ్రామా లేదా నాటకం లాంటిదని చెప్పి, తాళి తీసుకుని ఇంటికి వెళ్లిపోవాలని చెబుతాడు. తాను ఇంటికి వెళ్తానని అంటాడు.
జ్యోత్స్న “నేను కమెడియన్ కాదు, విలన్ని” అని చెబుతుంది. అనుకున్నది సాధించకపోతే చస్తాను అని అంటుంది. ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడే తెచ్చుకున్న గన్తో బెదిరించినట్టు మాట్లాడుతుంది. కార్తిక్ ఆమెను ఆపడానికి ప్రయత్నిస్తాడు.
ఇక మరోవైపు కాశీ స్వప్నతో మాట్లాడుతాడు. “ఏం చదువుతున్నావ్?” అని అడుగుతాడు. స్వప్న “జీవితాన్ని” అని చెబుతుంది. ఒక స్త్రీ జీవితాన్ని గురించి చెబుతూ, పగిలిన మనసు, చిరిగిన కాగితాల్లా ఉందని వివరిస్తుంది. కాశీ “ప్రతి కథకు సుఖాంతం కావాలి” అంటాడు. స్వప్న “న్యాయం జరిగితేనే సుఖాంతం” అని చెబుతుంది.
ఇద్దరి మధ్య జీవితం, కథలు, ప్రేమ గురించి చర్చ జరుగుతుంది. కాశీ “జీవితంలో తప్పులు క్షమించుకోవాలి” అని చెబుతాడు. స్వప్న “తప్పులు క్షమించొచ్చు కానీ మోసాలు క్షమించలేం” అని చెబుతుంది. చివరికి “నాకు స్వేచ్ఛ కావాలి, నీది ప్రేమ కాదు, స్వార్థం” అని కాశీకి చెబుతుంది.
దశరథ్ మనసులో జ్యోత్స్న ఏదైనా ప్లాన్ చేస్తుందేమో అని అనుమానం పడుతాడు. శివన్నారాయణ “జ్యోత్స్నకి ఫోన్ చేశావా?” అని అడుగుతాడు. కాల్ కలవకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తారు. శివన్నారాయణ కూడా జ్యోత్స్నా మీద అనుమానం వ్యక్తం చేయడంతో సుమిత్ర జ్యోత్స్నా వచ్చాక అడుగుదాం అని “ఏదైనా తప్పు చేస్తే నేను కూడా క్షమించను” అని చెబుతుంది.
మరోవైపు కాశీ వసంత్ని తీసుకు వస్తాడు. వసంత్ వస్తూ కాశీ సలహా మీదనే వచ్చాను అని చెప్పి స్వప్నకి మట్టి గాజులు తీసుకొస్తాడు. కాశీ “స్వప్నకి నచ్చినవి చేయాలి” అని చెబుతాడు. వసంత్ గాజులు వేసుకోవాలని అడుగుతాడు. స్వప్న మొదట ఒప్పుకోదు కానీ తరువాత ఒప్పుకుంటుంది.
వసంత్ గాజులు తానే వేయాలని అంటాడు. అప్పుడు స్వప్నకి గతం గుర్తుకు వస్తుంది—కాశీతో గాజులు వేయించుకున్న సందర్భం. తరువాత స్వప్న “ఇప్పుడు వద్దు నేను తర్వాత వేసుకుంటాను” అని చెబుతుంది. వసంత్ అక్కడి నుంచి వెళ్తాడు.
ఇంకా కాంచన కార్తీక ఏమైనా జ్యోత్స్నకి బానిస అంటూ తన కొడుకు ఎక్కడున్నాడో తెలుసుకోమని కోపంగా దీపతో చెబుతుంది. వెంటనే ఫోన్ చేయమని అంటుంది.
మళ్లీ కార్తిక్, జ్యోత్స్న సీన్లో—కార్తిక్ “నీకు మతిపోయిందా?” అని అంటాడు. ఒక క్షణం ఆలస్యమైతే ప్రమాదం జరిగేదని చెబుతాడు. జ్యోత్స్న “అయితే చనిపోతాను” అని అంటుంది. కార్తిక్ “ఒక ప్రాణం అంత తేలిక కాదు” అని చెబుతూ, సుమిత్ర, దశరథ ఇంకా దాసు కూడా ఆమెని ప్రేమిస్తున్నారని గుర్తుచేస్తాడు.
జ్యోత్స్న “అందరూ నన్ను ప్రేమించినట్టే నేను నిన్ను ప్రేమిస్తున్నాను” అని చెబుతుంది. “వాళ్లు నా కోసం చస్తే, నేను నీ కోసం చస్తాను” అని అంటుంది. కార్తిక్ ఆమె మాటలను అంగీకరించడు.
చివరగా జ్యోత్స్న మళ్లీ “తాళి కడతావా? కట్టవా?” అని అడుగుతుంది. కార్తిక్ స్పష్టంగా స్పందించకుండా ఉండగా, ఆమె అదే ప్రశ్నను మళ్లీ అడుగుతుంది. అంతలో దీప ఫోన్ చేస్తుంది.
ఇది అండి ఇవాళ ఎపిసోడ్ హైలైట్స్. ఈ ఎపిసోడ్లో జ్యోత్స్న వేసే వేషాలు చూస్తే చిరాకు వస్తుంది. కార్తిక్ ఎందుకు అంత ఓపికగా ఉంటున్నాడో, నిజం బయట పెడితేనే బాగుంటుంది. అప్పుడే జ్యోత్స్నకి బుద్ధి వస్తుంది. మరో వైపు స్వప్న, కాశీల మధ్య దూరం ఎంతవరకు వెళ్తుందో చూడాలి. కాశీ మాత్రం స్వప్న మనసు మారుతుందని ఎదురు చూస్తూ ఉండటం తప్ప ఇంకా ఏం చేయడం లేదు. శివన్నారాయణకి కూడా జ్యోత్స్న మీద కొంచెం అనుమానం వస్తుంది. ఆయనకి అయినా నిజం తెలిసితే బాగుంటుంది కొంచం ఐన రసవత్తరంగా ఉంటుంది. చూడాలి రేపు ఏమవుతుందో.
